Sunday, October 21, 2007
ఢిల్లీని అలరించనున్న బతుకమ్మ Andhra Jyothy
న్యూఢిల్లీ, అక్టోబర్ 20 (ఆన్‌లైన్): ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూ ర్తిని ప్రతిబింబిస్తూ, ఆ ప్రాంత ప్రజలు తొలిసారి దేశ రాజధానిలో ఆదివారం పెద్దఎత్తున బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. న్యా యవాది నిరూప్ రెడ్డి నేతృత్వాన ఇక్కడ ఏర్పాటైన 'ఢిల్లీ తెలంగాణ సంఘం' తమవైన ఇతర కళారూపాలను కూడా ప్రదర్శించనుంది. 'మా భూమి' ఫేమ్ సంధ్యతోబాటు గట్టయ్య, దర్రోజు శ్రీనివాస్, ప్రహ్లాద్ తదితర కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నకిరేకల్, కరీంనగర్‌ల నుంచి ఒగ్గు కళాకారులు, పాశం యాదగిరి నేతృత్వంలో తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి ప్రతినిధులు ఢిల్లీ చేరుకున్నారు. అమెరికాలోని తెలంగాణ వాసులు అక్కడ తమ సంస్కృతిని చాటుతున్నప్పుడు ఢిల్లీలో మాత్రం ఎందుకు నిర్వహించకూడదని భావించామని నిరూప్ చెప్పారు.
తెలంగాణకు ప్రత్యేక పీసీసీ అవసరం: కేకే Eenadu
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకంగా పీసీసీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పీసీసీ మాజీ అధ్యక్షుడు కేశవరావు అభిప్రాయపడ్డారు. ఈ నెల 24న రాష్ట్రానికి రానున్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్ప మొయిలీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని ఆయన చెప్పారు. ఈ విషయంపై చర్చించడానికి టీఆర్‌సీసీ నేతలు కె.ఆర్.ఆమోస్; పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, నరసారెడ్డి, కమలాకర్ తదితరులు ఈరోజు కేకేను కలిశారు. రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీలు తెలంగాణ విషయంలో అనుసరిస్తున్న వైఖరి గురించి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఇటీవలే ఢిల్లీలో కలిసి వివరించినట్లు ఆమోస్ తెలిపారు. రెండో ఎస్సార్సీతో సంబంధం లేకుండా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. ప్రత్యేక పీసీసీ విషయంలో ఇన్‌ఛార్జి అధ్యక్షుడు జీఎస్ రావు చేసిన వ్యాఖ్యలను ఆమోస్ తప్పుబట్టారు.
Subscribe to:
Posts (Atom)