Friday, August 24, 2007
గోనె ప్రకాశరావుపై విద్యార్థుల దాడి Eenadu
హైదరాబాద్: బీసీలకు, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశరావుపై కొంతమంది ఓయూ విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ఫతేమైదాన్‌లో మీడియా సమావేశం జరుగుతుండగా విద్యార్థులు దూసుకువచి ప్రకాశరావుపై చేయి చేసుకున్నారు. దీంతో గోనెకు, విద్యార్థులకు మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. ప్రకాశరావు కూడా విద్యార్థులపై ఎదురుదాడికి దిగారు. మధుయాష్కీ తెలుగుదేశం పార్టీ ఏజెంటు అంటూ నిన్న ప్రకాశరావు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ దాడి జరిగిందని తెలుస్తోంది. తనపై దాడి వెనుక కారకులెవరో తెలుసునని గోనె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఉన్న మధుయాష్కీ దీనిపై స్పందిస్తూ, తనకు గోనె ప్రకాశరావుకు మధ్య ఎలాంటి విబేధాలు లేవని అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment