Monday, August 27, 2007
పాఠశాల విద్యాశాఖలో స్థానికేతరుల గుర్తింపు పూర్తి Eenadu
హైదరాబాద్, ఆగస్టు 27 : 610 జీఓ అమలుపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘంతో ముఖ్యమంత్రి ఈరోజు భేటీ అయ్యారు. అనంతరం వివరాలను మంత్రివర్గ ఉప సంఘం అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తెలిపారు. పాఠశాల విద్యాశాఖలో స్థానికేతరుల గుర్తింపు పూర్తయిందని అయితే వారి పూర్తి వివరాలు పొందుపరచవలసి ఉందని చెప్పారు. 1975 నుంచి నియామకాల పరిశీలన పూర్తయితే స్థానికేతరుల సంఖ్య మరో రెండు వేలవరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మిగతా శాఖల్లో 610 జీఓకు సంబంధించి స్థానికేతరుల గుర్తింపు ఈ నెలాఖరుకు పూర్తవుతుందని తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment