Monday, September 24, 2007

టీడీఎఫ్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ Eenadu

డల్లాస్‌: తెలంగాణ అభివృద్ధి ఫోరం(టీడీఎఫ్‌) ఆధ్వర్యంలో డల్లాస్‌లోని తెలంగాణ కుటుంబాలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని, బతుకమ్మ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. లేక్‌ లెవిస్‌విల్లే పార్కులో సెప్టెంబరు 22న జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 100 కుటుంబాలు పాల్గొన్నాయి. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. బతుకమ్మలతో పార్కు పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. కార్యక్రమాన్ని భారీ స్థాయిలో చేయడానికి ఇందిరా జానకిరాం, ఉమా కరుణాకర్‌, స్వప్న శ్రీనివాస్‌ సహకరించారు. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా అధిక సంఖ్యలో పెద్దలు, చిన్నారులు హాజరయ్యారు. పురుషులు రెండు టీమ్‌లుగా విడిపోయి క్రికెట్‌ ఆడారు. కుతూరు సత్యవతి ఆధ్వర్యంలో మహిళలు బతుకమ్మ పాటలను పాడారు. చిన్నారులకు ఆటల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం సభ్యులు బతుకమ్మలను చెరువులో వదిలారు.
కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి శ్రీనివాస్‌ కుతూరు, స్వరూప్‌ కుండూరు, కరుణాకర్‌ దాసరి, రామ్‌రెడ్డి, మహేందర్‌, శ్రీకాంత్‌ తదితరులు సహకరించారు. కారక్రమాన్ని జయప్రదం చేసిన వాలంటీర్లకు, స్పాన్సరర్లకు, ఆహుతులకు టీడీఎఫ్‌ కోఆర్డినేటర్లు కృతజ్ఞతలు తెలిపారు.



No comments: