వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్ నగరంలో తెలంగాణ ప్రజలు బతుకమ్మ పండగను ఎంతో భక్తిప్రపత్తులతో జరుపుకున్నారు. తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో దాదాపు 400మందికి పైగా తెలంగాణవాసులు పాల్గొనడం విశేషం. రాజేశ్ బాదం స్వాగతోపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమయింది. అనంతరం తెలంగాణ సంప్రదాయ రుచులతో కూడిన భోజనాన్ని అతిథులకు వడ్డించారు. తరువాత జరిగిన ఆటపాటల్లో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
రంగురంగుల బతుకమ్మలు...
మహిళలు సంప్రదాయ వస్త్రధారణతో తమతో తీసుకు వచ్చిన బతుకమ్మలపై రంగురంగుల పూలను దానిపై ఉంచి సంప్రదాయబద్ధంగా గానం చేశారు. దాదాపు రెండు గంటల సేపు జరిగిన ఈ వేడుక తెలంగాణ పల్లె జీవితాన్ని అమెరికాలో సాక్షాత్కరించింది. త్రిశ సంకినేని భరతనాట్యపదర్శన అందర్ని ఆకర్షించింది. సూర్యాస్తమయం సమయంలో బతుకమ్మలను నిమజ్జనం చేసి సత్తుపిండిని అందరికి పంచారు. ఆచార్య సవితానంద అవథూత ధ్యానంపై ఉపన్యాసమిచ్చారు. టీడీఎఫ్ చేపడుతున్న కార్యక్రమాల గురించి సంస్థ సమన్వయకర్త రాజేశ్ మాదిరెడ్డి సభికులకు వివరించారు. రవి పులి వందనసమర్పణతో కార్యక్రమం ముగిసింది. కళ్యాన్ ముద్దసాని, రమాకాంత్ పీచర, రాజేశ్ బాదం, సతీష్ మేదవరపు. అమర్ జన్నుపురెడ్డి. చంద్ర కంచర్ల, వెంకట్ రెడ్డి, అచ్యుత్ చుక్క, దీపక్ దేశ్‌పాండే, రాజేశ్ మాదిరెడ్డి, విష్ణు యాచమనేని, గీతా మేదవరపు, అరవింద ఎడ, శ్వేత, సుశీల... తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
Thursday, October 4, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment