అంబర్‌పేట/బర్కత్‌పుర, మే 9 (ఆన్‌లైన్) ః తెలంగాణ పోరాట యోధుడు, మాజీ ఎంపీ ఎంసిపిఐయు పొలిట్ బ్యూరో సభ్యుడు భీంరెడ్డి నర్సింహారెడ్డి (88) హైదరాబాద్‌లో శుక్రవారం తెల్లవారుజామున కన్ను మూశారు. ఈ సందర్భంగా అంబర్ పేట శ్మశానవాటికలో ఏర్పాటు చేసిన సంతాపసభలో రాష్ట్ర హోంమంత్రి జానారెడ్డి పాల్గొని మాట్లాడుతూ భీంరెడ్డి కొనసాగించిన పోరాట స్ఫూర్తిని భావితరాలకు ఆదర్శవంతం చేసేందుకు ప్రభుత్వం తనవంతుగా పూర్తి సహకారాన్ని అందజేస్తుందని తెలిపారు..
ప్రముఖుల సందర్శన భీంరెడ్డి మృతదేహాన్ని ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలు, సీనియర్ పాత్రికేయులు సందర్శించి నివాళులు అర్పించారు. కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు కె.జానా రెడ్డి, ఆర్.దామోదర్‌రెడ్డి, మాజీ మంత్రు లు దేవేందర్‌గౌడ్, కె.విజయరామా రావు, సీపీఎం శాసనసభ్యుడు నోముల నర్సింహయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బివి.రాఘవులు, సురవరం సుధాకర్ రెడ్డి, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్, ఐజెయు కార్యదర్శి శ్రీని వాస్‌రెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవుల పల్లి అమర్,ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, బీజేపీ జాతీయ కార్యదర్శి ఇంద్రసేనా రెడ్డి, కిషన్‌రెడ్డి తదితరులు బిఎన్.రెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. స్వతంత్య్ర సమర యోధురాలు బిఎన్.రెడ్డి సోదరి మల్లు స్వరాజ్యం ఉన్నారు..
కన్నీటి వీడ్కోలుభీంరెడ్డికి ఘనంగా చివరి వీడ్కోలు పలికారు. అభిమానులు, వామపక్షాల నేతలు, సహచర మిత్రులు, ప్రజా సంఘాల నేతలు, ప్రజా ప్రతినిధులు వేలాదిగా తరలి వచ్చి ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు. శుక్రవారం 4గంట లకు గోల్నాకలోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైన అంతిమ యాత్ర అంబర్‌పేట శ్మశానవాటిక వరకు ఊరేగింపుగా కొనసాగింది. అంత్యక్రియలు స్థానిక శ్మశానవాటిక లో అధికార లాంచనాలతో జరి గాయి. పోలీసులు సంతాప సూచి కంగా గాలిలో మూడు రౌండ్లు కాల్పలు జరపగా ఆయన కుమా రుడు ప్రభాకర్‌రెడ్డి బీఎన్ చితికి నిప్పంటించారు..పోరాట యోధున్ని కోల్పోయాం -ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‌బిఎన్.రెడ్డి మృతి ప్రజా ఉద్యమా లకు తీరని లోటని ఆంధ్రజ్యోతి ప్రధాన సంపాదకులు కె.శ్రీనివాస్ అన్నారు. ఆయన మృతి తెలంగాణ ఉద్యమానికి, శ్రమజీవుల పోరాటానికి తీరని లోట న్నారు. బిఎన్.రెడ్డి మృతదేహంపై పుష్ప గుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాను భూతిని తెలిపారు..
కమ్యూనిస్టులు ఏకంకావాలి -ప్రజా గాయకుడు గద్దర్ అమెరికా సామ్రాజ్యవాదం కమ్యూ నిజాన్ని రూపుమాపేందుకు కుట్ర పన్నుతోందని, భీంరెడ్డి ఉద్యమాలను స్ఫూర్తిగా తీసుకుని దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలు ఏకం కావాల్సిన తరుణం ఆసన్నమైందని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. ఈ సంద ర్భంగా భీంరెడ్డి కొనసాగించిన పోరాటా లపై తనదైన శైలిలో విప్లవ గీతాలను ఆలపించారు.
缓PAN class="heading">పలువురి సంతాపాలుహైదరాబాద్, మే9( ఆన్‌లైన్-సిటీబ్యూరో): భీంరెడ్డి మరణానికి వేర్వేరు ప్రకటనల్లో పలువురు ప్రగాఢ సంతాపాలను తెలిపారు. సంతాపాలను తెలియజేసిన వారిలో తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జూకంటి జగన్నాథం, కార్యదర్శి జూలూరు గౌరీశంకర్, సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.సుధాభాస్కర్, ప్రధాన కార్యదర్శి ఎస్.వీరయ్య, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య, తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండ్రగడ్డ విజయకుమార్, కొలిమి కృష్ణయ్య, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఎస్.సుగుణమ్మ ఉన్నారు. సీనియర్ శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు సీహెచ్ రాజేశ్వరరావు భీంరెడ్డి పోరాటాన్ని కొనియాడి నివాళి అర్పించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment