Friday, May 9, 2008
తెలంగాణా పోరాట యోధుడు భీంరెడ్డి కన్నుమూత.. (Eenadu, 9-5-2008)
హైదరాబాద్, మే 9 : తెలంగాణా పోరాటయోధుడు ఎంసీపీఐ నేత భీంరెడ్డి నర్సింహారెడ్డి నేడు హైదరాబాద్‌లో కన్నుమూశారు. 1925లో నల్గొండ జిల్లా కొత్తగూడెంలో జన్మించిన భీంరెడ్డి 1940లో సీపీఎంలో చేరారు. అనంతరం నిజాం వ్యతిరేక పోరాటంలో కీలకపాత్ర వహించారు. వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా పోరు సాగించారు. రెండుసార్లు మిర్యాలగూడ ఎమ్మెల్యేగా, మూడు సార్లు ఎంపీగా సేవలందించారు. 1996లో పార్టీ నుంచి బయటకు వచ్చి ఎంసీపీఐలో చేరారు.అప్పటినుంచి అదే పార్టీలో కొనసాగుతున్నారు. గత కొద్దికాలంగా వూపిరితిత్తుల సమస్యతో బాధ పడుతున్న ఆయన ఈరోజు తెల్లవారుజామున మృతిచెందారు. ఆయనకు పలువురు వామపక్ష నేతలు, ఇతర పార్టీల ప్రముఖలు నివాళులు అర్పించారు. భీంరెడ్డి మృతదేహానికి ఈరోజు సాయంత్రం అంబర్‌పేట స్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment