(ఆన్‌లైన్, సిటీబ్యూరో) మహా నగరపాలక సంస్థలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న 61 మంది అధి కారులను మాతృసంస్థలకు పంపారు. ప్రజారోగ్యం, పంచాయ తీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, నీటి పారుదల, సాంఘిక సంక్షేమశాఖలకు చెందిన 59 మంది ఇంజనీర్లను, ఇద్దరు డిప్యూటీ ప్రాజెక్టు అధికా రులను వెనక్కి పంపుతూ గ్రేటర్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. 610జీవో కింద స్థానికేతరులుగా గుర్తించిన ఇంజనీర్లను మాతృ శాఖలకు అప్పగించారు. కాగా 610 ప్రభావంతో వెనక్కివెళుతున్న ఇంజనీర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించి 'స్టే' పొందారు. 40 మంది ఇంజనీర్లు బదిలీని వ్యతిరేకిస్తూ కోర్టుకెక్కడంతో న్యాయస్థానం స్టే మంజూరు చేసింది.
ఇదిలావుండగా 610 జీవో కింద వెనక్కి వెళ్లిన వారంతా బల్దియాలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న వారే. డిప్యుటేషన్ కాలం పూర్తయినా 143 మంది ఇంజనీర్లు ఇంకా నగరపాలక సంస్థ లోనే తిష్ట వేశారని గత మే 27న 'జీతమెందుకు.. గీతం ఉందిగా!' శీర్షికన 'ఆంధ్రజ్యోతి' వార్తను ప్రచురించింది. దీనికి స్పందించిన ప్రభుత్వం వీరిలో ఎంతమంది 610 జీవోకు భిన్నంగా బల్దియాలో పనిచేస్తున్నారో నివేదిక సమర్పించాలని ఆయా శాఖలను ఆదేశిం చింది. ఈ మేరకు డిప్యుటేషన్‌పై జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్న 59 మంది అసిస్టెంట్ ఇంజనీర్లను స్థానికేత రులుగా గుర్తించింది. వీరిని సొంత శాఖలకు తిప్పి పంపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
బల్దియాలో మరో 101 మంది...11 610 జీవో ప్రభావం 101 మంది ఉద్యోగులపై చూపనుంది. జీవోను కార్యరూపంలోకి తెస్తుండ టంతో ఈ ఉద్యోగులు దిక్కుతోచని స్థితిలో పడ్డా రు. బల్దియాలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న స్థానికేతరులను ఈ జీవో అనుసరించి మాతృసం స్థలకు తిప్పి పంపే అవకాశం ఉంది. ఇటీవల గ్రే టర్‌లో విలీనమైన 12 మున్సిపాలిటీల పరిధిలో 84 మంది, పూర్వపు ఎంసిహెచ్ పరిధిలో 17 ఇ తర శాఖలకు చెందిన ఉద్యోగులు పనిచేస్త్తున్నా రు. వీరిని బదిలీచేసే అంశంపై జీహెచ్‌ఎంసీ ఇం కా తుది నిర్ణయం తీసుకోలేదు. ఒకేసారి ఇంతమంది ఇంజనీర్లు పోతే పనుల పర్యవేక్షణ ఇబ్బ ందవుతుందని ఉన్నతాధికారులు అంటున్నారు.
Wednesday, July 25, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment