Thursday, July 26, 2007

'610'పై ఆంధ్ర ఎమ్మెల్యేల ఆందోళన? Andhra Jyothy

హైదరాబాద్‌, జూలై 26 (ఆన్‌లైన్‌): 610 ఉత్తర్వును అమలు చేయాలంటూ ఇప్పటివరకూ తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తూ వస్తే.. ఇప్పుడు ఆంధ్ర-రాయలసీమ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళనకు సమయాత్తమవుతున్నారు. ఈ జీవో విషయంలో ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలపై పార్లమెంటు సభ్యుడు చేగొండి హరిరామజోగయ్య, సీనియర్‌ శాసనసభ్యుడు గాదె వెంకటరెడ్డి, తదితర నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతానికి చెందిన 60 మంది ఎమ్మెల్యేల సంతకాలను వీరు సేకరించారు. మరికొందరి సంతకాలను సేకరిస్తున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఈ ప్రాంత ఎమ్మెల్యేలు సమావేశమై ఈ జీవో విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై చర్చించి, తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి తెలపనున్నారు.

నష్టపోయేది తెలంగాణ ఒక్కటేనా...!
నష్టపోయేది తెలంగాణ ఒక్కటేనా...!ప్రభుత్వం ఇప్పటి వరకూ తెలంగాణ ప్రాంతానికే ప్రా ధాన్యతను ఇస్తోందని.. ఆంధ్ర, రాయలసీమ నేతల వాదనలు వినేందుకు సముఖతను వ్యక్తం చేయడం లేదన్న ఆగ్రహం ఆ నేతల్లో వ్యక్తమవుతోంది. ఈ ఉత్తర్వును అమ లు చేస్తున్నప్పుడు కేవలం తెలంగాణ ప్రాంతానికే అన్యా యం జరుగుతోందన్న భావం ప్రభుత్వంలోనూ, అధికారుల్లోనూ కన్పిస్తోందే తప్ప.. ఇతర ప్రాంతాలకు జరిగే నష్టాన్ని గురించి ఆలోచించడం లేదని వారంటున్నారు. 610పై తాము మాట్లాడిన ప్రతిసారీ, ఈ ఉత్తర్వు అమలుకు తాము వ్యతిరేకమన్న ప్రచారాన్ని తెలంగాణ నేతలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు.. దీన్ని అమలు చేయాలని కోరుకుంటున్నదే తా మని, అయితే.. రాష్ట్రపతి ఆదేశాలు, ఆరు సూత్రాల కార్యక్రమానికి లోబడి మాత్రమే ఇది జరగాలని వారు స్పష్టం చేస్తున్నారు.

No comments: