- ధర్మవరపు సీతారాం
ప్రభుత్వ ఉత్తర్వులు స్పష్టంగా ఉండాలి. తక్షణమే అమలు కావాలి. అప్పుడే పాలనా వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. అలా కానప్పుడు పాలనా పరంగానేకాకా రాజకీయంగా కూడా సమస్యలు ఉత్పన్న మవుతాయి. జీ.వో 610 విషయంలో వై. ఎస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు అలాంటి చిక్కులనే ఎదుర్కొం టోంది. అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ ఉద్యోగుల విమ ర్శల నెదుర్కోంటోంది. ఉద్యోగరంగంలో అన్ని ప్రాంతాల వారికి సమాన హక్కులు, అవకాశాలు కల్పించిన రాష్ట్రప తి ఆదేశాలను అమలుపరచడంలో పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా ఏర్పడిన అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్ద డానికి రెండు దశాబ్దాల క్రితమే జీ.వో.610ని జారీచేయ డం జరిగింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ సచివాల యం లోను, వివిధ శాఖల ప్రధాన కార్యాలయాలలోనూ ఇప్పటికీ ఆంధ్రప్రాంతపు ఉద్యోగులే అత్యధిక సంఖ్యలో ఉండటం జరుగుతోంది. ఎట్టకేలకు వై. ఎస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఆ ఉత్తర్వును అమలుపరచడానికి పూనుకొంది.
ఈ క్రమంలో వరుసగా మరో రెండు జీ.వో. లను జారీ చేయడంతో అమలు ప్రక్రియ పూర్తిగా గందరగోళంలో పడింది. ఈ పరిస్థితి ప్రభుత్వంపై నిరసననే కాదు, ఉద్యో గుల మధ్య తీవ్ర విభేదాలను కూడా పురిగొల్పింది. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోను ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ ప్రాంత ఉద్యోగుల మధ్య తీవ్ర పొరపొచ్చాలు నెలకొనివు న్నాయని చెప్పడం సత్యదూరం కాదు. జీవో 610ను చిత్త శుద్ధితో అమలుపరిస్తే ఆంధ్రప్రదేశ్ విభజన సాఫీగా జరిగి పోవడానికి దారి సుగమమవుతుందని తెలంగాణ రాష్ట్రస మితి (తెరాస) ఇతర వేర్పాటువాదులు విశ్వసిస్తున్నారు. ఆంధ్రప్రాంతంలో కూడా ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ పెరిగిపోతున్నందున సాధ్యమైనంత త్వరలో సామరస్య పూర్వకంగా విడిపోవడం మేలని తెలంగాణ వాదులు అభిప్రాయపడుతున్నారు.
రాజశేఖర్ ప్రభుత్వం పరిస్థితి 'కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం'గా తయారయింది. 'ఆపరేషన్ షిఫ్టింగ్' (ఉద్యోగులను ఎవరి ప్రాంతాలకు వా రిని పంపించివేయడం)అనూహ్య పరిణామాలకు దారితీ యవచ్చని ఉద్యోగుల వ్యవహారాల లోతుపాతులు బాగా తెలిసిన వారు అభిప్రాయపడుతున్నారు. కాగా జీవో 610 ప్రభావానికి ఎంతమంది ఉద్యోగులు లోనయ్యేది కచ్చి తంగా తెలియదు. హీనపక్షం 6000 మందిని బదిలీ చేయ వలసివుంటుందని కొందరు భావిస్తుండగా సదరు ఉద్యో గుల సంఖ్య లక్షల్లో ఉండవచ్చని తెరాస అంచనా. కొంత మంది ఉద్యోగులు తమ పోస్టులలోనే కాక, భాగ్యనగరం లో కూడా దశాబ్దాల నుంచి ఉన్నందున తాము 'స్థానికు లు'గా పరిగణింపబడడానికి పూర్తిగా అర్హులమని భావి స్తున్నారు.
స్థానికులు కాని ఉద్యోగుల జాబితాలను తయా రుచేయమని వివిధ శాఖల ప్రధానాధికారులకు ప్రభు త్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఒక్క పోలీస్ శాఖ లోనే బదిలీ చేయాల్సిన ఉద్యోగులు 3000 మంది దాకా ఉన్నట్టు అంచనా. సచివాలయం, వివిధ శాఖల ప్రధాన కార్యాలయాలలో సిబ్బందిని పరిశీలించండి. వాస్తవానికి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలవారు 60:40 నిష్పత్తిలో ఉం డవలసివుండగా ఆంధ్ర ప్రాంతానికే చెందిన వారు 80 నుంచి 90 శాతం మేరకు ఉంటున్నారు! జీవో 610ను చిత్తశుద్ధితో కచ్చితంగా అమలుపరిస్తే పరిపాలనకు తీరని విఘాతం కలుగుతుంది. పాలనా వ్యవస్థలో తీరని వెలితి చోటుచేసుకోవడం ఖాయం. ఈ పరిస్థితి నుంచి రాజశేఖర్ ప్రభుత్వం ఎలా బయటపడనున్నది? ఇది కోటిరూకల ప్రశ్న. ఈ సంక్లిష్ట సమస్య పాక్షికంగా గత ప్రభుత్వాల- కాంగ్రెస్, తెలుగుదేశం-నుంచి సంక్రమించిందే కాక ప్రస్తు త ప్రభుత్వం తాను స్వయంగా కొనితెచ్చుకున్నదే.
తెలం గాణ ఏర్పాటుకు డిమాండ్ చేస్తున్న తెలంగాణ రాష్ట్రస మితికి ప్రత్యేక రాష్ట్రానికి సానుకూలంగా ఉన్న కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు లోపాయికారీగా మద్దతునిస్తున్నా రు. పరిస్థితి మరింతగా దిగజారకుండా ఉండాలంటే రాష్ట్ర విభజన ప్రక్రియను ప్రారంభించడం శ్రేయస్కరమని పలువురు భావిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు వేలాది ఉద్యోగులే కాక , న్యాయవాదులు కూడా పెద్ద సం ఖ్యలో కొత్త రాష్ట్రానికి తరలివెళ్ళవలసిరావడం అనివా ర్యం. అప్పుడా వలసలు సాఫీగా జరగడానికి ఇప్పుడు జీ.వో.610ని అమలుపరచడం ఎంతైనా అవసరం. ఇంకే మాత్రం జాప్యంచేసినా పరిస్థితిని మరింత సంక్లిష్టం చేయ డానికి సంకుచిత రాజకీయవేత్తలకు అవకాశం కల్పించి నట్టే అవుతుంది. ప్రజలమధ్య విభేదాలు రెచ్చగొట్టి పరస్ప ర వైషమ్యాలను పెంచే స్వార్థ రాజకీయ క్రీడలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆంధ్రఉద్యోగులకు కౌన్సెలింగ్ పేరి ట తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కొద్ది రోజల క్రితం వివిధ ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించారు.
ఆ సం దర్భంగా ఆంధ్రులకు వ్యతిరేకంగా 'ఆంధ్రాస్ గో బ్యాక్', అని నినాదాలు చేశారు. ఆంధ్రఉద్యోగులను భయపెట్టడా నికి ఇదొక పరోక్ష ప్రయత్నం. అయితే తెరాస, దాని మద్దతుదారులు ఒక వాస్తవాన్ని గుర్తించి తీరాలి. ప్రత్యేక తెలంగాణకై తాము తగవు పడు తుంది మౌలికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోనే కాని, ఆం ధ్రప్రాంత ఉద్యోగులతో కాదుకదా. రాష్ట్ర విభజనకు వ్యతి రేకంగా ఉన్న వారితోనే వారు వివాద పడవలసివుంది. ఈ ప్రాథమిక సత్యాన్ని విస్మరిస్తే ఎలా? యుడిసిలు, ఎల్‌డిసి లు, డ్రైవర్లు, ఫ్యూన్లపై తమ ప్రతాపాన్ని చూపిస్తే ఎలా? హైదరాబాద్‌కు గాని, తెలంగాణకు గాని వారు వచ్చింది బతుకుతెరువు కోసమే కదా. వారు సామాన్యులు మాత్ర మే. భూకబ్జాదారులు కాదు. పన్ను ఎగవేతదారులు కానే కాదు.
రాజకీయ దళారీలు అంతకన్నా కాదు. అలాంటివా రిని వెనక్కి వెళ్ళిపొమ్మనే హక్కు ఎవరికైనా ఎలా ఉంది? ఈ సువిశాల దేశంలో ఎక్కడ పుట్టినప్పటికీ తన ఇష్టం వచ్చిన చోట నివశించడానికి, తనకు నచ్చిన వృత్తిని ఆచ రించడానికి ప్రతి భారతీయుడికీ హక్కు ఉంది. భారత రాజ్యాంగం ప్రతి పౌరునికీ కల్పించిన హక్కు ఇది. ఈ హక్కును కాలరాచి వేయడానికి ఎవరికీ అధికారం లేదు. కనుక 'గో బ్యాక్' అని గొంతు చించుకొంటున్నవారు తమ ప్రవర్తన మన జాతీయతను విచ్ఛిన్నం చేసేదిగా ఉందన్న సత్యాన్ని గుర్తించాలి. అదే విధంగా ప్రవర్తించడం కొనసా గిస్తే వారిని జాతి వ్యతిరేకులుగా పరిగణించాల్సివస్తుంది. జాతి సమైక్యతకు విఘాతం కలిగించేవారితో ఎటువంటి రాజీ పడకూడదు. వారు ఎంతటి శక్తివంతులైనప్పటికీ దేశ ద్రోహ నేరం కింద వారిపై చర్య చేపట్టాలి. మన దేశంలో ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలకుచెందిన వారు నివసిస్తున్న, ఉద్యోగం లేదా వ్యాపారం చేసుకొంటున్న నగరంగాని, రాష్ట్రంగాని లేనే లేదు.
సంపూర్ణ అక్షరాస్యత ఉన్న కేరళనే తీసుకోండి. మళయాళీల (కేరళ ప్రజలు) లో మూడింట రెండు వంతులమంది తమ రాష్ట్రానికి వెలుపలనే నివసి స్తున్నారు. ముంబయి, హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ తదితర నగరాల ప్రాభవ వైభవాలకు మళయాళీల సేవ అద్వితీయమైనది. ముంబయిలో మహరాష్ట్రేతరులే అధికం. యావద్భారత ప్రజల హృదయాలను ఏకరీతిలో స్పందింపచేసే బాలీవుడ్‌లో పంజాబీలదే ఆధిక్యత కదా. ఇక వాణిజ్య వ్యాపారాలు, ఉన్నత విద్యా సంస్థలలో అన్ని టా దక్షిణాది ప్రజలదే అగ్రస్థానం. మన రాష్ట్రంలో కూడా తెలుగేతరులు వ్యాపార వాణిజ్యాలలో ప్రముఖ స్థానంలో ఉన్నారు.
మనవారు ఇతర రాష్ట్రాల్లో వివిధ రంగాలలో కీలక పాత్ర వహిస్తున్నారు. ఇప్పుడు ఉత్తర అమెరికాలో ఉన్న తెలుగు వారి సంఖ్య తక్కువేమీకాదు. వాస్తవానికి అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశించడానికి కూడా మనవారు సంసిధ్దమవుతున్నారు. మరి అమెరికా వారు తెలుగువారి ని 'గో బ్యాక్' అంటే? కనుక వైమనస్యతలను ఒక పరిధి లో ఉంచుకోవాలి. సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి. ప్రాంతీయాభిమానాలకు మితిమీరి పోకుండా వ్యక్తుల ప్రావీణ్యాలను ఉపయోగించుకోవడా నికి ప్రాధాన్యమివ్వాలి. భాగ్యనగరంలో సామాన్య ప్రజల శ్రమశక్తిని నిజంగా దోపిడీ చేస్తుందో ఎవరో తెరాస గుర్తిం చాలి. ఆ దోపిడీదారులకు వ్యతిరేకంగా ఉద్యమించాలి.

No comments:
Post a Comment