రంగారెడ్డి జిల్లా: 610 జీవోకు అనుగుణంగా సొంత జిల్లాలకు వెళ్లిపోవడానికి దరఖాస్తు చేసుకొన్న రంగారెడ్డి జిల్లాలోని 372 మంది ఉపాధ్యాయుల్లో 214 మందికి బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. శనివారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా తమ తమ జిల్లాలకు వెళ్లిపోవడానికి దరఖాస్తు చేసుకొన్నారు. ఆ మేరకు వారికి ఆదివారం అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. జిల్లాలో పనిచేస్తున్న వివిధ ప్రాంతాలకు చెందిన స్థానికేతర ఉపాధ్యాయులు.. కుటుంబ సభ్యులతో సహా కలెక్టరేట్‌కు వచ్చారు. కలెక్టరేట్‌లో ఉత్తర్వులు తీసుకుని అక్కడి నుంచే నేరుగా సొంత జిల్లాలకు వెళ్లేందుకు వారు ఇలా పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు, సామగ్రితో సహా వచ్చారు. దీంతో అక్కడ సందడిగా కనిపించింది. ప్రస్తుతం 610 జీవో అమలు తొలి దశలో భాగంగా స్వచ్ఛంద బదిలీలు జరుగుతున్నాయి.
Sunday, July 1, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment