Sunday, July 8, 2007
పోలీసులు పక్షపాతధోరణితో వ్యవహరిస్తున్నారు: పీజేఆర్ eenadu
హైదరాబాద్, జులై 9: పీజేఆర్ ఇంకా జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్నారు. రవీంద్రరెడ్డి వర్గంపై కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన అక్కడే భీష్మించుకు కూర్చున్నారు. రవీంద్రరెడ్డి, సుమధుర్‌రెడ్డిలపై పోలీసులు 143, 144, 341, 506 సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. వారిపై 307 కేసు కూడా నమోదు చేయాలని పీజేఆర్ స్టేషన్‌లోనే బైఠాయించారు. వివాదంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును పీజేఆర్ తప్పుబట్టారు. వైఎస్ సోదరుడు రవీంద్రరెడ్డి ఇంటికి వెళ్లి కమీషనర్ పరామర్శించడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేనైన తనను పోలీసు స్టేషన్‌లో నిర్భందిచారన్నారు. రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోందని ఆయన విమర్శించారు. తెదేపా హయాంలో కూడా తనను పోలీసు స్టేషన్‌లో నిర్భందించలేదని పీజేఆర్ చెప్పారు. పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. రవీంద్రరెడ్డి వర్గాన్ని అరెస్టు చేసేంతవరకు ఠాణా నుంచి కదిలేది లేదని ఆయన తెలిపారు. పీజేఆర్‌తో డీసీపీలు మధుసూదన్‌రెడ్డి, కమల్‌హాసన్ రెడ్డి మంతనాలు జరుపుతున్నారు. పీజేఆర్‌కు మద్దతుగా భారీ ఎత్తున అనుచరులు జూబ్లీహిల్స్ స్టేషన్ వద్దకు వచ్చారు. పోలీసులు వారిని అరెస్టు చేసి తరలించారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లే అన్ని రోడ్లని పోలీసులు మూసేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment