హైదరాబాద్, జులై 9: పీజేఆర్, వైఎస్ వర్గాల ఘర్షణ కారణంగా తలెత్తిన ఉద్ధ్రిక్తత కొనసాగుతూనేఉంది. వైఎస్ సోదరుడు రవీంద్రరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి, అల్లుడు సంతోష్‌లపై ఐదు సెక్షన్ల కింద నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. సెక్షన్ 147, 307, 427, 506, 149ల కింద వారిపై కేసులు నమోదు చేశారు. వారిద్దరిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు తరలించారు. వైఎస్ సోదరుడు రవీంద్రరెడ్డి, ఆయన కుమారుడు అపోలో ఆసుపత్రిలో ఉన్నారు. మరోవైపు తనపై ఎటువంటి ఫిర్యాదు లేకున్నా పీజేఆర్ ఇంకా పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్నారు. తామిచ్చిన ఫిర్యాదు ఆధారంగా అవతలి వారిపై ఎందుకు చర్య తీసుకోలేదని ఆయన పోలీసులను ప్రశ్నిస్తున్నారు. రవీంద్రరెడ్డి వర్గంపై కూడా నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని పీజేఆర్ పోలీస్‌స్టేషన్‌లోనే కూర్చున్నారు. పీజేఆర్ అనుచరులు భారీ ఎత్తున స్టేషన్ వద్దకు చేరుతుండటంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Sunday, July 8, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment