అంతర్‌జిల్లా బదిలీతో కొందరికి...
జీవో ముప్పు పోతోందని ఇంకొందరికి...
నగరానికి వస్తున్నామని మరికొందరికి...
విద్యాశాఖలో ఎన్ని సంతోషాలో!
మాకూ అది కావాలి: జైళ్ల సిబ్బంది
రాజధానిలో స్థానికేతరులు కొందరు స్వచ్ఛందంగా స్వస్థలాలకు వెళ్తున్నారు. ఇన్నాళ్లూ ఎంత పైరవీ చేసినా కాని అంతర్ జిల్లా బదిలీ ఇప్పుడు అనుకోకుండా జరుగుతోందనీ, సీనియారిటీ కూడా నష్టపోవడం లేదనీ వారి ఆనందం! *వెళ్లేవారు వెళ్లిపోతే, ఇక మిగిలే వారిలో చాలామంది 'అనుమతించ దగిన 20 శాతం కోటా'లో ఉండిపోతారు. నిర్బంధ బదిలీ ప్రమాదం ఎదుర్కొంటున్న వారికీ, స్వచ్ఛంద బదిలీ ఎంచుకున్న వారివల్ల ఆ భయం తప్పిపోతోంది. అంటే ఇక 610 భయం లేకుండా, వారు నిక్షేపంగా ఇక్కడే ఉండిపోవచ్చు. ఇదేమో వీరి సంతోషం! *పేరుకు రంగారెడ్డి జిల్లావారే అయినా అనేకమంది ఇన్నాళ్లూ నగరానికి దూరదూరంగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు స్వచ్ఛంద బదిలీతో వారూ రాజధానిలోకి వస్తున్నారు. ఇది తమకు అనుకోని అదృష్టమనేది వారి సంబరం! *రాజకీయంగా, ఇతరత్రా సాగుతున్న రగడ 610కి ఒక కోణం కాగా, పాఠశాల విద్యాశాఖలో ఇలా ఆనందం కలిగించే కోణాలూ కనిపిస్తున్నాయి. అంతేకాదు; 610 అమలు వద్దని కొందరు ఉద్యోగ నాయకులు, ప్రజా ప్రతినిధులు గళమెత్తుతుండగా, మా శాఖలోనూ దీన్ని అమలు చేయరూ అంటూ జైళ్ల సిబ్బంది కోరడం మరో విశేషం.
హైదరాబాద్ - న్యూస్‌టుడే
హైదరాబాద్ జిల్లా నుంచి 20 మంది, రంగారెడ్డి నుంచి 360 మంది స్థానికేతర ఉపాధ్యాయులు తమంతటతామే స్వస్థలాలకు వెళ్లేందుకు దరఖాస్తులు చేసుకున్నారు. వీరి బదిలీ ఉత్తర్వులు సిద్ధమయ్యాయి. ప్రభుత్వం ఆమోదముద్ర వేయగానే, శుక్రవారం ఈ ఉత్తర్వులు జారీ చేస్తారు. నిజానికి పాఠశాల విద్యాశాఖ చేసిన కసరత్తు ప్రకారం 1000 పైచిలుకు మంది స్థానికేతర ఉపాధ్యాయులు 20 శాతం గరిష్ఠ పరిమితి దాటి ఈ రెండు జిల్లాల్లో పనిచేస్తున్నారు. కానీ సాధారణ పరిపాలన విభాగం ఏ ప్రాతిపదికలను ఎంచుకుందో తెలియదు గానీ... కేవలం 596 మందిని మాత్రమే వెనక్కి వెళ్లాల్సిన స్థానికేతరులుగా గుర్తించింది. రంగారెడ్డిలో 99 మంది స్కూల్ అసిస్టెంట్లు, 261 మంది ఎస్‌జీటీలు, హైదరాబాద్‌లో 89 మంది స్కూల్ అసిస్టెంట్లు, 86 మంది ఎస్‌జీటీలు ఉన్నారనేది వారి లెక్క. నిజానికి 'అనుమతించతగిన 20 శాతం కోటా' అనేది స్థానికేతరుల రిజర్వ్ కోటా కాదనీ, అందులోనూ మెరిట్ ప్రకారం లెక్కలు చూసి, అనర్హులైన స్థానికేతరులను గుర్తించి వెనక్కి పంపాలనే డిమాండ్లను ఒకసారి పక్కకు పెట్టినా... ఈ గుర్తించిన స్థానికేతరుల లెక్కల్లోనూ అన్నీ గందరగోళాలే! 'హైదరాబాద్ జిల్లాలో స్థానికేతరుల జాబితా ప్రచురించారు. కానీ స్థానికుల జాబితాలు దాచిపెడుతున్నారు. ఈ జాబితాల్లోనే స్థానికేతరుల పేర్లూ ఉన్నాయని మా నమ్మకం. అదెందుకు బయటికి వెల్లడించరు?' అని ఏపీటీఎఫ్ హైదరాబాద్ శాఖ ప్రశ్నించింది. ఇవన్నీ తరువాత చూద్దామని, ముందైతే తమంతటతాము వెళ్లాలనే వారిని పంపించేద్దామని అధికారులు చెబుతున్నారు. ఇలా వెళ్లేవారినీ గరిష్ఠ పరిమితికి మించి పంపించబోమనీ అంటున్నారు. దీనితో చాలామందికి అనుకోకుండా అదృష్టం కలిసొస్తోంది. అదెలాగంటే...
ఇప్పుడు అంతర్ జిల్లా బదిలీలు జరగడం లేదు. అందుకని తమ స్వస్థలాలకు వెళ్లాలనుకున్నా చాలామందికి సాధ్యం కావడం లేదు. ఇప్పుడు ఎంచక్కా స్వచ్ఛంద బదిలీ పేరిట సీనియారిటీ కోల్పోకుండానే బదిలీ అవుతున్నారు. గతంలో సీనియారిటీ కోల్పోయి మరీ స్వస్థలాలకు బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకంటే ఇప్పుడు వెళ్లేవారే సీనియర్లు అవుతారు.
స్వచ్ఛందంగా కొందరు వెళ్లిపోవడం వల్ల, తప్పనిసరిగా వెళ్లాల్సిన వారికి కొంత వెసులుబాటు లభిస్తోంది. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లాలో 360 మంది పరిమితికి మించిన స్థానికేతరులు ఉన్నట్లు సాధారణ పరిపాలన విభాగం లెక్క. ఇప్పుడు అదే సంఖ్యలో స్వచ్ఛందంగా వెళ్లిపోతున్నారు. అందువల్ల ఇక 610 వల్ల నిర్బంధంగా వెళ్లిపోవాల్సిన వారికి బదిలీ భయం ఇక లేనట్లే!
610ని తు.చ. తప్పకుండా అమలు చేస్తే, ఆరో జోన్ అయిన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి చాలామంది తెలంగాణా జిల్లాల (ఐదో జోన్)వారు వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఇప్పుడు స్థానికేతరులు (తెలంగాణేతరులు) అధిక సంఖ్యలోనే వెళ్లిపోతున్నందున ఇక మిగతావారిని పంపించాలనే ఆందోళన పెద్దగా ఉండకపోవచ్చు. అందుకని ఆ తెలంగాణ జిల్లాల వారూ కొంత సంతోషపడుతున్నారు. అన్నింటికీ మించి రంగారెడ్డి జిల్లా నుంచి 156 మంది హైదరాబాద్ నగరానికి వస్తున్నారు. ఇన్నాళ్లూ జిల్లాలో ఏ మూలకో వెళ్లివచ్చేవారు ఇప్పుడిక హాయిగా నగర నడిబొడ్డున కొలువులు చేసుకోవచ్చు. వెరసి అందరికీ ఆనందమే!!
మేమూ ఆ జీవో పరిధిలోకి! 610 అమలు వద్దంటే వద్దని, దాంతో తాము అన్యాయమైపోతామని కొన్ని ఉద్యోగ సంఘాలు వాపోతుండగా, జైళ్ల శాఖ సిబ్బంది మాత్రం తమకు 610ని వర్తింపజేయాలని కోరుతున్నారు. జైళ్లశాఖలో ప్రస్తుతం 8వేల మంది వరకూ సిబ్బంది ఉండగా వారిలోదాదాపు సగం మంది వార్డర్లే. వీరి వేతనం కానిస్టేబుళ్ల కంటే తక్కువ. సాధారణంగా మిగతా శాఖల్లో నాన్‌గెజిటెడ్ ఉద్యోగుల నియామకం ప్రాంతాల వారీగా జరుగుతుంది. కాని జైళ్ల శాఖలో మాత్రం రాష్ట్రం ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. ఇతర శాఖల్లో గెజిటెడ్ అధికార్లను మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికైనా బదిలీ చేస్తుండగా, జైళ్ల శాఖలో కిందిస్థాయి సిబ్బందికి కూడా ఇదే పద్ధతి! శాఖ ఏర్పడినప్పటి నుంచి ఇవే నిబంధనలు! దీనివల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిబ్బంది వాపోతున్నారు. తమ శాఖలోనూ 610 అమలు చేస్తే ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతానికి వెళ్లేందుకు అవకాశం చిక్కుతుందని వారు వివరిస్తున్నారు. ''అదీగాక జైల్లో ఏమి జరిగినా కిందిస్థాయి సిబ్బందిపైనే చర్య తీసుకోవడం పరిపాటిగా మారింది. సస్పెన్షన్‌తోపాటు శిక్ష కింద దూర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారు. ఆదిలాబాద్‌లో పనిచేసే ఉద్యోగిని అనంతపురం, కాదంటే శ్రీకాకుళం కూడా పంపిస్తున్నారు. కానిస్టేబుళ్ల కంటే తక్కువ జీతంతో రోజులు వెళ్లబుచ్చుతున్న తమను ఇలా సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. 610 అమలు చేస్తే బదిలీలు కూడా మా ప్రాంతానికే పరిమితమవుతాయి'' అని వారు వివరిస్తున్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఇకనైనా తమను 610 పరిధిలోకి తేవాలని జైళ్ల శాఖ కాపలా బలగం సంఘం అధ్యక్షుడు కె.వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

No comments:
Post a Comment