హైదరాబాద్, జూన్ 28 (ఆన్‌లైన్) : తెలంగాణ, 610 ఉత్తర్వు అమలు పై పత్రికల్లో రోజూ మాట్లాడితేనే తె లంగాణా త్యాగధనులవుతామన్న భ్రమలు మంచివికావని పార్టీ నేతలకు పీసీసీ కిసాన్‌సెల్ అధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి సూచించారు. రా ష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయాలని చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్న ము ఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని అభినందించాల్సిన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రతిరోజూ వీధికెక్కడం విచారకరమని గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగాఉన్న సమయంలో రాష్ట్ర ఉద్యోగుల అభ్యర్థన మేరకు, తెలంగాణ ప్రాంత ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు తీసుకువచ్చిన 610 ఉత్తర్వు అమలుకాకపోవడానికి తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ఆ పార్టీ ప్రభుత్వంలో కీలకపదవులు చేపట్టినంత కాలం 610 ఉత్తర్వును గురించి ఒక్కసారి కూడా ప్రస్తావించని కె.చంద్రశేఖరరావు పదవులు దక్కకపోవడంతో సొంత పార్టీ పెట్టుకుని రాజకీయలాభాపేక్షతో ఈ ఉత్తర్వును పదేపదే ప్రస్తావిస్తున్నారని విమర్శించారు. ఇంతకంటే రాజకీయ దిగజారుడుతనమేముంటుందని ఆయన ప్రశ్నించారు.
Thursday, June 28, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment