రెచ్చగొట్టే వ్యాఖ్యలొద్దు
తెరాస నేతలు వినోద్‌కుమార్, హరీశ్ ధ్వజం
610పై చర్చకు రావాలని సవాల్
న్యూఢిల్లీ, హైదరాబాద్, న్యూస్‌టుడే: కేసీఆర్‌ను తెలంగాణ ఉద్యోగులే అక్కణ్నుంచి తరిమికొడతారన్న కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యలపై తెరాస ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే హరీశ్‌లు మండిపడ్డారు. నోటిని అదుపుచేసుకోవాలని సలహా ఇచ్చారు. ఢిల్లీ, హైదరాబాద్‌లలో వేర్వేరు విలేకరుల సమావేశాల్లో వారు మాట్లాడారు. 610 జీవో అమలుపై హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో బహిరంగచర్చకు రావాలని లగడపాటి రాజగోపాల్‌కు వినోద్ కుమార్ సవాల్ విసిరారు. ''610 జీవోకు లోబడి స్వస్థలాలకు వెళ్లడానికి సుముఖంగా ఉన్నట్లు ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు, టీచర్లు తెరాస ఆఫీసుకొచ్చి చెప్పారు. కానీ ఆ ప్రాంత రాజకీయ నాయకులు, ఉద్యోగసంఘాల ప్రతినిధులు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారు. లగడపాటి రాజగోపాల్‌కు 610 అమలుపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో చర్చకు రావాలి. 610వెనుకున్న స్ఫూర్తి ఏమిటో... రాజ్యాంగం తెలంగాణ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హక్కులేమిటో సవివరంగా చర్చిద్దాం. 610 జీవో అమలుచేస్తే తెలంగాణ నాయకులనే తరమికొడతారన్నట్లు లగడపాటి మాట్లాడుతున్నారు. ఈయన తెలంగాణ అంశంపై చరిత్రను వక్రీకరిస్తూ గతంలో ఎంపీలకు లేఖలు రాశారు. ఫజల్‌అలీ కమిషన్ తెలంగాణ వద్దని చెప్పినట్లు వాదన లేవనెత్తారు. అంటే తెలంగాణ వాళ్లకు భాషరాదనా ఆయన ఉద్దేశం. లేదంటే వెర్రివాళ్లనుకున్నారా. దానిపైన కూడా చర్చిద్దాం రండి. లేదంటే ఇలాంటి పనికిమాలిన మాటలు ఇంకెప్పుడూ మాట్లాడకుండా రాజకీయ నాయకుడిలా సొంత నియోజకవర్గం కోసం పనిచేసుకుంటే బాగుంటుంది'' అని వినోద్‌కుమార్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న 610 అమలును లగడపాటి ఎందుకు అడ్డుకుంటున్నారని తెరాస ఎమ్మెల్యే హరీశ్ హైదరాబాద్‌లో ప్రశ్నించారు. హైదరాబాద్‌లో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ ముందు జరిగిన పరాభవాన్ని లగడపాటి మర్చిపోయినట్టుందంటూ ఎద్దేవా చేశారు. 'ఆరోజు తిన్న తన్నులూ దెబ్బలూ గుర్తు లేవా? ఈ పిచ్చి ప్రేలాపనలు మానుకో' అని తీవ్రంగా హెచ్చరించారు. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి అటు ఎన్డీయేకానీ, ఇటు యూపీఏ కానీ అధికారికంగా ఎవ్వరూ తమను సంప్రదించలేదని వినోద్‌కుమార్ తెలిపారు.610 నీటిపారుదల శాఖకే
610 జీవో కేవలం నీటిపారుదల (ఇరిగేషన్) శాఖలోని ఉద్యోగులకోసం ఉద్దేశించింది మాత్రమేనని తెరాస ఎంపీ వినోద్‌కుమార్ పేర్కొన్నారు. అది చాలా చిన్న అంశమని, అయితే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రపతి ఉత్తర్వులు అమలుచేయాలని తాము కోరుతున్నట్లు చెప్పారు. ఏ జోన్లో ఆ ప్రాంత ఉద్యోగులుండాలని రాష్ట్రపతి ఉత్తర్వులు చెబుతున్నాయని, 610 జీవో స్ఫూర్తిని మిగతా శాఖల్లోనూ అమలుచేయాలని ఆయన డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment