జిఎడి కార్యదర్శిని ప్రశ్నించిన టిజెఎసి హైదరాబాద్, జూన్ 27, ప్రభాతవార్త రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా 610 జీవోను అమలు చేస్తామని చెపుతున్న ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వులకు భిన్నంగా పనిచేస్తుందని తెలంగాణ జెఎసి సెక్రెటరీ జనరల్ సి.విఠల్, కో-ఛైర్మన్ ప్రభాకర్, కార్యదర్శులు శ్రీధర్ దేశ్‌పాండే, గోపాల్‌రెడ్డి,శ్రీనివాసరావు, పద్మాచారి,శ్రీనివాస్‌గౌడ్‌లు విమర్శించారు. బుధవారం జిఎడి కార్యదర్శితో వారు సమావేశమయ్యారు.399,415 జీవోలను రద్దు చేసినా కూడా అందులో ఉన్న విధంగానే బదిలీలు చేస్తున్నారని వారు పేర్కొన్నారు. దీనిపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశారు. 1975 నుంచి స్థానికేతరులను గుర్తించకుండా సీలింగ్ విధించడాన్ని వారు ప్రశ్నించారు.బదిలీకోసం రూపొందించిన లిస్టులో కూడా తెలంగాణవారినేచేర్చి, ఆంధ్రవారిని ఇక్కడే ఉంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు విమర్శించారు. సచివాలయంలో ఫేర్‌షేర్ ఇవ్వాలని 42 శాతం తెలంగాణ ప్రాంత ఉద్యోగులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై జిఎడి కార్యదర్శి సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వం జీవో అమలుకు చిత్తశుద్దితో ఉందన్నారు. ఇప్పుడు గుర్తించిన వారిని బదిలీచేసిన తరువాత 1975 నుంచి వివరాలు సేకరిస్తుందని చెప్పారు. మేము అంగీకరించం : ఎపిఎన్జీఓలుప్రభుత్వం ప్రస్థుతం జారీచేయాలను కుంటున్న బదిలీ ఉత్తర్వులను అంగీకరించబోమని ఎపి ఎన్జీఓల సంఘం నాయకులు పేర్కొంటున్నారు. స్థానికేతరులను గుర్తించి ముందుగా వారి జాబితాను అందజేస్తామని చెప్పిన ప్రభుత్వం జాబితా ఇవ్వకుండానే బదిలీ ఉత్తర్వులు ఇస్తామని చెప్పడం సరికాదని వారంటున్నారు. అలాగే ఎపిఎన్జీఓల నాయకులపై టిఆర్‌ఎస్ పార్టీ చేస్తున్న విమర్శలపై కూడా వారు మండిపడుతున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా 610ని అమలు చేయాలనే తాము కోరుతున్నామని వారు పేర్కొంటున్నారు.
Thursday, June 28, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment