కేసీఆర్‌పై విరుచుకుపడ్డ ఏపీ ఎన్జీవో నేతలు
హైదరాబాద్, జూన్ 28 (ఆన్‌లైన్) : 'మూడుమాసాల్లో తె లంగాణ ప్రత్యేక రాష్ట్రమే వచ్చేస్తోంది. అపుడు జీవో 610 అ మలు అన్నది చాలా చిన్న విషయమని ఆరేళ్లుగా తెలంగాణ ప్రజల చెవిలో పువ్వులు పెట్టిన టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పుడు తన రాజకీయ స్వార్థం కోసం కలి సిమెలిసి పనిచేస్తున్న ఉద్యోగుల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారు. జీవో 610పై చెవిలో పువ్వుపెట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. మీకు పువ్వులు సరిపోవు, ఇదిగో కాలిఫ్లవర్ పెట్టుకోండి. ఆంధ్రాఉద్యోగుల పంచెలు, లుంగీలు ఊడగొడతాం అంటున్నారు. ఒక ప్రజాప్రతినిధిగా ఇదేనా మీ సంస్కృతి, సంస్కారం?' అని ఆంధ్రప్రదేశ్ నాన్‌గెజిటెడ్ ఆఫీసర్స్ (ఏపీఎన్జీవో) సంఘం నేతలు తెరాస అధినేతపై విరుచుకుపడ్డారు.
తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు సైతం తమతో ఐక్యంగా ఉన్నారని, వారు కూడా ఉద్యోగులెవరినీ వారి సొంత ప్రాం తాలకు పంపాలని కోరుకోవడంలేదని పేర్కొన్నారు. కోస్తాం ధ్ర విద్యావంతుల వేదిక అధ్యక్షుడు చదలవాడ శ్రీనివాస్‌తో కలిసి ఎన్జీవోసంఘం అధ్యక్షుడు వి.గోపాల్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి సి.సుబ్బరాయన్, పీవీవీ సత్యనారాయణ, సతీష్‌కుమార్ తదితరులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన లుంగీ గుంజితే ఎక్కడ నకిలీ పాస్‌పోర్టులు బయటపడతాయో అన్న భయంతో ఉద్యోగులపై విరుచుకుపడుతున్నారని విమర్శలు గుప్పించారు. 30 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు ఇ క్కడే సూపర్‌న్యూమరీ పోస్టులు సృష్టించి ఉద్యోగవిరమణ చేసేంత వరకు కొనసాగనివ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో భర్తీకి నోచుకోకుండా ఖాళీగా ఉన్న రెండున్నర లక్షల ఉద్యోగాలను భర్తీ చేయమని ఉమ్మడి పోరాటం చేద్దామని, అ ప్పుడు తెలంగాణ నిరుద్యోగులకు 50వేలు కాదు లక్ష ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. జీవో 610 ఆంధ్ర, రాయలసీమ ఉద్యోగులకే కాకుండా తెలంగాణ ప్రాంతానికి చెందిన 5, 6వ జోన్లలోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ ధర్నాలకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులెవరూ జీవో 610 రద్దు చేయాలని కోరలేదని తెలిపారు. విలేకరుల సమావేశంలో సంఘం నేతలు ఎస్‌ఎ బషీర్, విజయవాణి తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment