Tuesday, December 11, 2007
'జై తెలంగాణ' అంటేనే 'జై చిరంజీవ' Andhra Jyothy
హైదరాబాద్, డిసెంబర్ 11 (ఆన్‌లైన్): సినీ నటుడు చిరంజీవి రాజకీయ ఆరంగ్రేటంపై టీఆర్‌ఎస్‌లోనూ తర్జనభర్జన సాగుతోంది. తెలంగాణ సెంటిమెంట్ ఆయుధంగా పనిచేస్తోన్న తమకు.. చిరంజీవి పార్టీ ఏర్పాటు వల్ల ఎలాంటి నష్టం వాటిల్లగలదన్న అంశంపై పలువురు ముఖ్య నాయకులతో టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు మంగళవారం సుదీర్ఘంగా చర్చించారు. లాభనష్టాలపై ఒక అంచనాకు వచ్చిన ఆయన.. ప్రత్యేక తెలంగాణపై విధానపరంగా చిరంజీవి సానుకూల నిర్ణయం తీసుకున్నట్లయితే కలిసి పనిచేద్దామన్న అభిప్రాయం వ్యక్తంచేసి నట్లు తెలిసింది. తెలంగాణపై సానుకూలంగా స్పం దించకుండా చిరంజీవి కూడా ముందుకు వెళ్లలేరన్నది టీఆర్‌ఎస్ వర్గాల అభిప్రాయం.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సుముఖంగా ఉండి, ఆయనతో కలిసి పనిచేసినట్లయితే ఇరుపక్షాలకు మేలు జరుగుతుందన్నది ఆ వర్గాల అంచనా. తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ను కాదని ఏకపక్షంగా ముందుకెళితే.. తెలంగాణ ప్రాంతంలో చిరంజీవి పార్టీకి ఆయన అభిమానుల నుంచి కొంత ఆదరణ లభించినా, మిగతా అన్ని వర్గాల ప్రజల నుంచి పెద్ద ఆదరణ లభించకపోవచ్చని నేతలతో కేసీఆర్ అన్నట్టు తెలిసింది. 'మనతో కలిస్తే తప్ప.. తెలంగాణలో ఆయనకు ఆశించిన ఫలితం దక్కదు. మనతో కలిస్తే ఆంధ్రా, తెలంగాణల్లో ఒక వెలుగువెలిగిపోవచ్చు. ఈ విషయాన్ని నేను రెండు మాసాల క్రితమే బహిరంగంగా చెప్పాను' అని ఆయన నేతలతో అన్నారు.
మాయాకు ఆంధ్రలో సీన్ లేదు!
చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా ఉన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతిని కలుసుకోవడానికి ఢిల్లీ వెళ్లి వచ్చిన కేసీఆర్.. తాజాగా ఆ బంధం తమకు అంతగా లాభించదన్న అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఆమెతో జత కడితే జాతీయ రాజకీయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించవచ్చ ని భావించిన ఆయన.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మాయావతి ప్రయోగం పనిచేయదని అంటున్నారు. టీఆర్‌ఎస్ నుంచి బహిష్కృతుడైన ఆలె నరేంద్ర బీ ఎస్పీలో చేరడానికి మాయావతి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలోనే.. ఆమెకు దూరంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
Thursday, October 25, 2007
మొయిలీకి వీర తెలంగాణ దెబ్బ చూపిస్తం కేసీఆర్ Eenadu
'50 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల ఉసురు పోసుకుంటున్నరు. నెహ్రూ చెప్పినట్లు భార్యాభర్తల్లా విడిపోదామంటే కాంగ్రెస్ అడ్డుపడుతోంది. కాంగ్రెస్, తెదేపా రెండూ తెలంగాణను నాశనం చేశాయి. వైఎస్‌ఆర్ పాలన స్వర్ణయుగమంటూ మొయిలీ కితాబిచ్చిండు. ఏది స్వర్ణయుగం? దుబాయ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు జ్వరాలతో పిట్టల్లా రాలుతున్నరు. 2004 ఎన్నికల్లో నమ్మినం. నమ్మక ద్రోహం చేసిండ్రని వారే చెప్పుకొంటున్నరు. రాష్ట్రంలో ప్రాజెక్టులను ఆధునీకరించి కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తామంటున్నారు. లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టును ఎందుకు తెరపైకి తేలేదు. 22 ఏళ్ళుగా ఊసులేని మందాకినీ కాలువ ఏమైంది? ఉచిత కరెంట్, రూ. 2కే కిలో బియ్యం.. వీటికి మోసపోతే.. భవిష్యత్తులో గోసపడతాం. తెలుగుదేశం, కాంగ్రెస్‌లను భూస్థాపితం చేద్దం' అని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
ఉత్తర కరోలినాలో వైభవంగా దసరా, బతుకమ్మ ఉత్సవాలు Andhra Jyothy
రలీగ్, అక్టోబర్ 25: దసరా, బతుకమ్మ పండుగలను నార్త్ కరోలినా ప్రవాస తెలుగువారు ఘనంగా నిర్వహించుకున్నారు. కార్బ్‌ట్రీ పార్క్‌లో జరిగిన ఈ వేడుకలకు రలీగ్, డుర్హమ్, కారీ ప్రాంతాల నుంచి వ ందల సంఖ్యలో తెలుగువారు తరలివచ్చారు. ఉదయం మొదలయిన వేడుకలు సూర్యాస్తమయంలోపు ముగిశాయి. ఈ సందర్భంగా పలువురు తెలుగువారు పండుగలతో తమకున్న తియ్యటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.మన సంప్రదాయాలను భవిష్యత్ తరాలు మర్చిపోకుండా ఉండేందుకు ఇటువంటి ఉత్సవాలు దోహదపడతాయని కడారు శ్రీలక్ష్మి, రామ్‌ప్రసాద్ అన్నారు. ఈ వేడుకల్లో పాల్గొన డం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. తనకు తానుగా బతుకమ్మ తయారుచేయడానికి తమ కుమార్తె యుక్తి శ్రీని ప్రోత్సహిస్తామని వారు తెలిపారు. బతుకమ్మ పేరు వింటేనే తాను పులకించిపోతానని మంచినేని రూప అన్నారు.

తమ చిన్నతనంలో బతుకమ్మ ఉత్సవాలను ఉత్సాహంగా నిర్వహించుకునే వారమని, తమ ఇంటిలోనే కాకుండా పొరుగు ఇళ్ళకు కూడా వెళ్ళి బతుకమ్మలను అలంకరించడం మర్చిపోలేమని జలగం లతా నితిన్, శుంకు జ్యోతి రవీందర్ చెప్పారు. బతుకమ్మ గురించి చెప్పే కథలు ఆశక్తికరంగా వినేవారమని పొదిల సంధ్యా లక్షీనారాయణ అన్నారు. తమ సోదరీమణులు, వారిపిల్లలు అంతా ఒక చోటికి చేరుకుని బతుకమ్మను ఘనంగా నిర్వహించుకునే వారమన్నారు. ఆప్యాయతానుబంధాలు తమ మధ్య వెల్లివిరిస్తుండేవని తెలిపారు. కొత్తబట్టలు ధరించి ఆ తొమ్మిది రోజులూ ఉత్సాహంగా ఉండేవారమని గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
దివ్యశ్రీ వేమారెడ్డి దంపతులు, గోపి, స్వాతి బిరిచెట్టి, రాము, నరేందర్, విస్సు శ్రీధర్ తదితరులు వేడుకలో నవ్వులు పూయించారు. తెలంగాణా అభివృద్ది సంఘం , ట్రైయాంగిల్ ఎన్‌ఆర్‌ఐ తెలుగు అసోసియేషన్ తరపున ఆహూతులకు పొదిల లక్షీనారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ ప్రవాసులేకాక రాయలసీయ, కోస్తాంధ్ర, కేరళ, తమిళనాడు రాష్ట్రాల ప్రవాస భారతీయులు ఈ వేడుక ల్లో పాలుపంచుకున్నారు. కడారు రామ్‌ప్రసాద్ వందన సమర్పణతో వేడుకలు ముగిశాయి.
తెలంగాణపై ఆచి తూచి... Andhra Jyothi
హైదరాబాద్, అక్టోబర్ 24 (ఆన్‌లైన్): రెండో ఎస్సార్సీ ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమని ప్రకటించి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్పమొయిలీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆశలపై నీళ్లు చల్లారు. గతంలో ఇదే విధంగా వ్యాఖ్యానించిన దిగ్విజయ్‌సింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన టీఆర్‌సీసీ నేతలు ఆ స్థాయిలో మొయిలీపై విరుచుకు పడలేకపోయారు. ఆచితూచి మాట్లాడారు. సిద్ధిపేట ఎంపీ సర్వే సత్యనారాయణ ఒక్కరే కాస్త గట్టి స్పందించారు. రెండో ఎస్సార్సీ వేయడం కంటే తెలంగాణ ఇవ్వలేమని చెప్పడమే సమంజసమని ప్ర జలు భావించే అవకాశాలున్నాయని అన్నారు. మొదటి ఎస్సార్సీ వే సేందుకు 23 నెలలు పట్టిందని, రెండో ఎస్సార్సీ వేసేందుకు మరో మూడు సంవత్సరాలు పడుతుందని పేర్కొన్నారు. దీనిని ప్రజలు వి శ్వసించరని అభిప్రాయపడ్డారు.
సీఎల్పీ సమావేశం తర్వాత పలువురు నేతలు విలేకరులతో ఇలా పేర్కొన్నారు. 'ప్రత్యేక తెలంగాణ ఏర్పా టును నేతలే కోరుకుంటున్నారా.... ప్రజలే కావాలంటున్నారా తెలి యాలంటే ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి. రెండో ఎస్సార్సీనో... ప్రత్యేక కమిషనో ఏదో ఒకటి వేయాల్సిన అవసరమైతే ఉంది' అని కాంగ్రెస్ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య అన్నారు. 'తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నారు తప్ప ప్రత్యేక పీసీసీ కాదని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్ అభిప్రాయపడ్డారు. అయితే, ప్రత్యేక తెలంగాణ అంశం 2009 ఎన్నికల్లోగా తేల్చాలని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ కోసం అయితేనే రెండో ఎస్సార్సీ ఆమోదయోగ్యమన్నారు.
Sunday, October 21, 2007
ఢిల్లీని అలరించనున్న బతుకమ్మ Andhra Jyothy
తెలంగాణకు ప్రత్యేక పీసీసీ అవసరం: కేకే Eenadu
Monday, October 15, 2007
ఎన్నికలే అంతిమయుద్ధం: కేసీఆర్ Eenadu
నల్గొండ, భువనగిరి, న్యూస్‌టుడే: తెలంగాణ సమస్యలకు ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారం. రాబోయే ఎన్నికలే అంతిమయుద్ధం కావాలి.. జైలుకు వెళ్లద్దు.. లాఠీ దెబ్బలు తినొద్దు.. వ్యాపారాలు, ఉద్యోగాలు మానుకోవద్దు. ఎన్నికలనే వేదికగా చేసుకుందాం. రాజకీయశక్తిగా మనం ఎదగాలని తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా భువనగిరిలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. 100 మంది ఎమ్మెల్యేలు, 15 మంది ఎంపీలు గెలిపిస్తే.. వారే వచ్చి కాళ్లు మొక్కి తెలంగాణ రాసిస్తారు. జార్ఖండ్ బాటలో రాష్ట్రాన్ని సాధించుకుందాం. జెండా రాజకీయాలు, కాంట్రాక్టులతో గొడవలు పెడుతున్నారు. జెండాలు ఏం ఇచ్చాయి. అంతా మోసం చేస్తున్నాయి. ఎందుకు.. ఎవరికోసం జెండాలు మోస్తారని ప్రశ్నించారు. పోతిరెడ్డి పాడు తరలించారు. మూసీ ప్రక్షాళన మరిచిపోయారు. నిధుల ఊసులేదు. నిమ్స్ యూనివర్సిటీ రాలేదు. ఫ్లోరైడ్ భూతం 2 లక్షల మందిని వృద్ధులుగా మార్చేసింది. ఈ జెండాలు, పార్టీల మత్తు వదలి.. మన జెండా పట్టండి. మళ్లీ ఎన్నికల వలలో పడి మోసపోకండని హితవు పలికారు. చంద్రబాబు 9గంటల ఉచితవిద్యుత్తు, వై.ఎస్. రెండు రూపాయల కిలోబియ్యం పథకం అంటూ మళ్లీ మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. సింగరేణి బొగ్గు మనది.. గోదావరి నీళ్లు మనవి. ఎన్‌టీపీసీకి ఇచ్చే నీరు, బొగ్గుతో 12 గంటలు ఉచిత విద్యుత్తు మనమే ఇచ్చుకుందాం. ఓట్లు మందికేసి బతకొద్దు. యాచించే స్థితిని నుంచి శాసించే స్థాయికి ఎదగాలని కోరారు. తెదేపా, కాంగ్రెస్ దొందు దొందేనని.. జెండాలు వేరైనా ఇద్దరి ఎజెండా ఒకటే. తెలంగాణకు అభివృద్ధిలో పెద్దపీటని మరోసారి మోసం చేస్తున్నారన్నారు. 610 జీవో అమలు విషయంలో ఇద్దరూ నాటకాలాడుతున్నారు. ఏ పార్టీ కూడా చేయదు. జీవో 34తో నీరివ్వమని చెప్పేశారు. కాలువ తవ్వి ఎకరాకు నీరిస్తే రూ.1300 ఖర్చయితే.. తుంపర సేద్యానికి రూ.53వేలు అవుతాయి. 50లక్షల ఎకరాల నీరిస్తామని చెప్పేవి మాటలే. చంద్రబాబు, వై.ఎస్.లకు దగ్గరి పోలికలున్నాయని.. రైతు ఆత్మహత్యలు, బూటకపు ఎన్‌కౌంటర్లు, చేనేత కూలీల ఆకలిచావులు, మహబూబ్‌నగర్ వలసలు ఆగడం లేదు. సాగునీరు అందదు. ఫ్లోరైడ్ భూతం వదిలించరు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు నోరు విప్పడంలేదు. సీఎం మెడలు వంచండని డిమాండ్ చేశారు.
Thursday, October 4, 2007
వాషింగ్టన్‌లో ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు Eenadu
రంగురంగుల బతుకమ్మలు...
మహిళలు సంప్రదాయ వస్త్రధారణతో తమతో తీసుకు వచ్చిన బతుకమ్మలపై రంగురంగుల పూలను దానిపై ఉంచి సంప్రదాయబద్ధంగా గానం చేశారు. దాదాపు రెండు గంటల సేపు జరిగిన ఈ వేడుక తెలంగాణ పల్లె జీవితాన్ని అమెరికాలో సాక్షాత్కరించింది. త్రిశ సంకినేని భరతనాట్యపదర్శన అందర్ని ఆకర్షించింది. సూర్యాస్తమయం సమయంలో బతుకమ్మలను నిమజ్జనం చేసి సత్తుపిండిని అందరికి పంచారు. ఆచార్య సవితానంద అవథూత ధ్యానంపై ఉపన్యాసమిచ్చారు. టీడీఎఫ్ చేపడుతున్న కార్యక్రమాల గురించి సంస్థ సమన్వయకర్త రాజేశ్ మాదిరెడ్డి సభికులకు వివరించారు. రవి పులి వందనసమర్పణతో కార్యక్రమం ముగిసింది. కళ్యాన్ ముద్దసాని, రమాకాంత్ పీచర, రాజేశ్ బాదం, సతీష్ మేదవరపు. అమర్ జన్నుపురెడ్డి. చంద్ర కంచర్ల, వెంకట్ రెడ్డి, అచ్యుత్ చుక్క, దీపక్ దేశ్‌పాండే, రాజేశ్ మాదిరెడ్డి, విష్ణు యాచమనేని, గీతా మేదవరపు, అరవింద ఎడ, శ్వేత, సుశీల... తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
కేసీఆర్ చరిత్రలో కలిసిపోతావ్ : పీసీసీ Andhra Jyothy
టీఆర్‌ఎస్ పార్టీ కుటుంబ పాలనగా మారిందని.. ఎక్కడ చూసినా కేసీఆర్, ఆయన కుమారుడు, అల్లుడుల ఫోటోలే కన్పిస్తున్నాయి తప్పితే.. మరో నాయకుడికి తగిన గుర్తింపే లేదని చెప్పారు. గోధమతో సమానంగా.. లేదా.. అంతకంటే ఎక్కువ మద్ధతు ధరను వరికి ప్రకటించాలని తులసిరెడ్డి కేంద్రాన్ని కోరారు. వ్యవసాయం దండగ మారిదని భావించిన చంద్రబాబు పాలనలో వరికీ, గోధమకు మధ్య మద్ధతు ధరలో వ్యత్యాసం నెలకొందని చెప్పారు. 1994-95లో ఈరెండింటికీ మద్ధతు ధర 360 రూపాయలుంటే.. 2003-04లో గోధుమకు 630 రూపాయలు లభిస్తే.. వరికి మాత్రం 580 దక్కిందని చెప్పారు. ఈ వ్యత్యాసంపై ఆనాడే నిరసన తెలిపి ఉంటే.. ఈ రోజు ఈ విధానం కొనసాగేది కాదని ఆయన పేర్కొన్నారు.
Wednesday, October 3, 2007
దుబాయి.. ముంబయి.. బొగ్గుబావే! Eenadu
- కేసీఆర్
మధ్యంతర ఎన్నికల ఉరిమిపాటుతో ప్రజల వద్దకు వెళ్లేందుకు మొహం చెల్లక సీఎం వైఎస్, తెదేపా అధినేత చంద్రబాబులు జనాకర్షక మంత్రాలను జపిస్తున్నారని తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు విమర్శించారు. కరీంనగర్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 'తెలంగాణా ద్రోహుల పార్టీకి అధ్యక్షుడు చంద్రబాబు.. నమ్మక ద్రోహులపార్టీకి చెందిన సీఎం వైఎస్‌లకు తెలంగాణాలో తిరిగే హక్కే లేద'ని పేర్కొన్నారు. వీరిద్దరూ రాజకీయ వ్యాపారులని ఆరోపించారు. 'రూ.రెండుకే కిలో బియ్యం ఇస్తామని వైఎస్ చెబుతున్నారు. మూడున్నరేళ్లుగా ఆయన ఏం చేశారు. పేదలు ఇప్పుడే గుర్తుకొచ్చారా. ఇది ఎన్నికల గిమ్మిక్కుకాదా'ని కేసీఆర్‌నిలదీశారు. వైఎస్ ముఖ్యమంత్రిగా పగ్గాలు స్వీకరించాక ఉచితవిద్యుత్తు ఫైలుపై సంతకం పెడితే..అది ఉత్త విద్యుత్తుగానే మిగిలిపోయిందని విమర్శించారు. 'తొమ్మిదేళ్లు సీఎంగా ఊరేగిన చంద్రబాబు.. సేద్యమే దండగన్నడు. విద్యుత్తు బిల్లులు కట్టని రైతులపై కేసులు పెట్టి.. జైళ్లలో తోయించిండ'ని మండిపడ్డారు. 'వైఎస్.. చంద్రబాబులు దొందూ దొందే. ఫార్ములావన్, ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు తెలంగాణా భూములను చంద్రబాబు అప్పగిస్తే.. ల్యాంకో, టాటా, బిర్లా, అంబానీలకు వైఎస్ తెగనమ్ముతున్నరు' అని దుయ్యబట్టారు. 'చంద్రబాబు, వైఎస్‌ల పాలనలో తెలంగాణ ప్రజల బతుకులు, దుబాయి ముంబయి బొగ్గుబాయిగా మారాయ'ని ఆవేదన వ్యక్తంచేశారు. 'స్వంత పాలనలో తెలంగాణాలో బతుకులు బంగారం అవుతాయి. తెలంగాణా ప్రజలు దీన్ని గుర్తించాల'ని సూచించారు.
బోగస్ యజ్ఞం: 'వైఎస్ చేస్తున్న జలయజ్ఞం.. ఒట్టి బోగస్. తెలంగాణాలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ ఎత్తిపోతల పథకాలే. వాటిని నడపడానికి 2500 మెగావాట్ల విద్యుత్తు అవసరం. ఇప్పుడు సేద్యానికి ఏడు గంటలని చెప్పి.. ఐదుగంటలు కూడా ఇస్తలేరు. ఇక ఎత్తిపోతల పథకాలకు విద్యుత్తును ఎక్కడనుంచి తెస్తారు? ఈ ప్రాజెక్టులు చేపట్టింది తెలంగాణాకు నీళ్లిచ్చేందుకుకాదు. కాంట్రాక్టర్ల నుంచి పర్శంటేజీలు దండుకునేందుకే' అని కేసీఆర్ విమర్శించారు. 'మధ్యంతర ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవు.. తెరాస ఒంటరిగానే పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. వారి అభీష్టం మేరకే ఒంటరిగానే బరిలోకి దిగుతామ'ని చెప్పారు.
నల్లగొండ వర్సిటీ పేరు మార్చాలని Andhra Jyothy
హైదరాబాద్, అక్టోబర్ 3 (ఆన్‌లైన్) : తెలంగాణ ప్రాంతాల్లో అనేక పోరా టాల ద్వారా సాధించుకున్న నల్గొండ యూనివర్సిటీకి తెలంగాణ మేధావుల, కవుల, నాయకుల పేర్లు పెట్టకుండా ఈ ప్రాంత వాసులను అవమానపరుస్తు న్నారంటూ తెలంగాణ విద్యార్థి సంఘం, తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభా గం నాయకులు బుధవారం ఉస్మానియా యూనివర్సిటీలో తరగతులను బహి ష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఇది మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానపర్చడమేనని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అంతర్జా తీయంగా ఎంతో ఖ్యాతి గతించిన మహాత్మా గాంధీపేరు అంతర్జాతీయ, జాతీ య సంస్థలకు పెడితే తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఒక స్థానిక యూనివర్సి టీకి ఆయన పేరు పెట్టడం సమంజసమేనా అని విద్యార్థి సంఘాలు ప్రశ్నించా యి. ఇటీవల ఆంధ్రా, సీమ ప్రాంతాల్లోని వర్సిటీలకు అక్కడి కవుల, రాజుల పేర్లను పెట్టిన పాలకులు తెలంగాణ విషయం వచ్చేసరికి ఆ ఆనవాయితీని విస్మరిస్తున్నారని వారు పేర్కొన్నారు.ప్రభుత్వం స్పందించి యూనివర్సిటీ పేరు మార్చకుంటే పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు.
Monday, October 1, 2007
చికాగోలో ఘనంగా 'బతుకమ్మ' Andhra Jyothy
చికాగో, సెప్టెంబర్ 29: సంప్రదాయ 'బతుకమ్మ' పండగను తెలంగాణా ఎన్నారైలు చికాగోలో ఇటీవల ఘనంగా జరుపుకున్నారు. ఉత్తర అమెరికా బతుకమ్మ పండగ ఐదవ వార్షికోత్సవాలను పురస్కరించుకుని వారు ఈ పండుగను జరుపుకున్నారు. సాంప్రదాయబద్ధంగా జరిగిన ఈ ఉత్సవానికి తెలంగాణా ప్రవాసులు అధిక సంఖ్యలో హజరయ్యారు. చిన్నాపెద్ద భేదం లేకుండా అన్ని వయస్సుల వారు బ్లూమింగ్టన్, విస్‌కాన్‌సిన్, ఇండియానా తదితర ప్రాతాలనుంచి విచ్చేసి బతుకమ్మ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఆ రోజు ఉదయాన్నే లేచి బతుకమ్మ పండగకు సహజసిద్దమైన గునుగు పూలు, తంగేడు పూలు, బీర పూలు సేకరించారు. బతుకమ్మ పూలు అందుబాటులో లేనివారు స్థానికంగా లభించే పూలుతో బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఉదయం పది గంటల సమయంలో ప్రారంభమైన బతుకమ్మ విహారయాత్రలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ నిరంజన్ అల్లంనేని స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరూ తామకు తాము పరిచయం చేసుకున్నారు. తర్వాత వారంతా శ్రీనివాస్ రెడ్డి సిరికొండ, ప్రదీప్ దమిడిలు నిర్వహించిన వివిధ ఆటల్లో పాలుపంచుకున్నారు. 
బతుకమ్మ ఉత్సవాలు పూర్తయిన తర్వాత అందరూ సద్దులు పంచుకున్నారు. ఆటల్లో గెలుపొందిన వారికి వెంకట్ ఆర్ తుడి బహుమతులు అందజేశారు. ఎంపిక చేసిన 'ఉత్తమ బతుకమ్మ'కు శ్రీధర్ లోకా ప్రత్యేక బహుమతిని అందజేశారు. బతురమ్మను ఘనంగా నిర్వహించడంలో శ్రీనివాస్ రెడ్డి సిరికొండ, అశోక్ ముద్రకోళ్ల, ఉష ముద్రకోళ్ల, ప్రదీప్ దమిడి తమ వంతు సాయం చేశారు. నిరంజన్ అల్లంనేని ధన్యవాదాలు తెల్పుతూ వందన సమర్ఫణ చేయడంతో కార్యక్రమం ముగిసింది.
Sunday, September 30, 2007
తెలంగాణకు లిఫ్ట్‌లంటే... ఆంధ్రకు నీళ్లు దోచిపెట్టడమే Eenadu
Monday, September 24, 2007
టీడీఎఫ్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ Eenadu
డల్లాస్: తెలంగాణ అభివృద్ధి ఫోరం(టీడీఎఫ్) ఆధ్వర్యంలో డల్లాస్‌లోని తెలంగాణ కుటుంబాలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని, బతుకమ్మ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. లేక్ లెవిస్‌విల్లే పార్కులో సెప్టెంబరు 22న జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 100 కుటుంబాలు పాల్గొన్నాయి. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. బతుకమ్మలతో పార్కు పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. కార్యక్రమాన్ని భారీ స్థాయిలో చేయడానికి ఇందిరా జానకిరాం, ఉమా కరుణాకర్, స్వప్న శ్రీనివాస్ సహకరించారు. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా అధిక సంఖ్యలో పెద్దలు, చిన్నారులు హాజరయ్యారు. పురుషులు రెండు టీమ్‌లుగా విడిపోయి క్రికెట్ ఆడారు. కుతూరు సత్యవతి ఆధ్వర్యంలో మహిళలు బతుకమ్మ పాటలను పాడారు. చిన్నారులకు ఆటల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం సభ్యులు బతుకమ్మలను చెరువులో వదిలారు.
కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి శ్రీనివాస్ కుతూరు, స్వరూప్ కుండూరు, కరుణాకర్ దాసరి, రామ్‌రెడ్డి, మహేందర్, శ్రీకాంత్ తదితరులు సహకరించారు. కారక్రమాన్ని జయప్రదం చేసిన వాలంటీర్లకు, స్పాన్సరర్లకు, ఆహుతులకు టీడీఎఫ్ కోఆర్డినేటర్లు కృతజ్ఞతలు తెలిపారు.Wednesday, September 19, 2007
అభివృద్ధి అవినీతిలోనే పార్టీపై 'సమాల్' ప్రభావం
Tuesday, September 18, 2007
ఎన్ని ఆటంకాలొచ్చినా భూముల అమ్మకాన్ని ఆపొద్దు Eenadu
ఆందోళనలు, ఇతరత్రా కార్యక్రమాలద్వారా ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా హైదరాబాద్‌లో భూముల అమ్మకాన్ని ఆపొద్దని, ఈ ప్రక్రియ సత్వరమే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అధికారులను ఆదేశించారు. భూముల అమ్మకం ద్వారా వచ్చే నిధులను హైదరాబాద్ అభివృద్ధికే వెచ్చిస్తున్నామంటూ విస్తృత ప్రచారం చేయడంద్వారా ప్రతిపక్షాల వాదనను తిప్పి కొట్టాలని సూచించారు. ఆర్థిక వనరుల సమీకరణపై ఆయన మంగళవారమిక్కడి సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ఆర్థిక మంత్రి రోశయ్య, పురపాలకశాఖ మంత్రి కోనేరు రంగారావు, వాణిజ్య పన్నులశాఖ మంత్రి కొణతాల రామకృష్ణ, అధికారులు ఇందులో పాల్గొన్నారు. హుడా భూముల అమ్మకాన్ని అడ్డుకునేందుకు తెరాస, ఇతర పార్టీలు చేసిన ఆందోళనను ముఖ్యమంత్రి తప్పుపట్టారు. భూముల అమ్మకంద్వారా వచ్చే ఆదాయాన్నంతా హైదరాబాద్‌కే వెచ్చిస్తున్న విషయాన్ని ఆయా పార్టీలు మరిచిపోతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. మెట్రో రైలుకు రూ.8,500 కోట్లు, ఔటర్ రింగ్‌రోడ్డుకు రూ.6,500 కోట్లు, హైదరాబాద్‌లో మురుగునీటి పారుదల వ్యవస్థకు రూ.2,500 కోట్లు, కృష్ణా నీటి సరఫరా రెండోదశకు రూ.వేయి కోట్లు, రేడియల్ రోడ్లకు రూ.2,500 కోట్లు, పీవీ నర్సింహారావు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ రహదారికి రూ.500 కోట్లు, బలహీనవర్గాల గృహ నిర్మాణానికి రూ.6వేల కోట్ల చొప్పున వచ్చే మూడేళ్లలో రూ.27,500 కోట్లు హైదరాబాద్ అభివృద్ధికి వెచ్చిస్తున్నామనే విషయాన్ని ప్రజలకు వివరించాలని అధికారులకు వైఎస్ సూచించారు. పదేళ్ల క్రితంతో పోలిస్తే హైదరాబాద్ విస్తృతంగా అభివృద్ధి చెందినందువల్లే స్థలాల ధరలు పెరిగాయనే విషయాన్ని ప్రతిపక్ష పార్టీలకు చెప్పాలని ఆదేశించారు. స్థలాల అమ్మకం ప్రక్రియను ముమ్మరం చేసి సకాలంలో లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని సూచించారు.
పన్నులు పెంచం.. కొత్తగా వేయం: రోశయ్య
బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా అభివృద్ధి పనులను చేపట్టేందుకు పన్నులు పెంచడం, కొత్తగా పన్నులు విధించడం వంటి ఆలోచనేదీ సర్కారుకు లేదని ఆర్థిక మంత్రి రోశయ్య తెలిపారు. వనరుల సమీకరణ ఆశించిన స్థాయిలో లేకున్నా... ఈనెల కాకున్నా వచ్చే నెలలోనైనా లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. సమీక్ష అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి పనులకు లోటు లేకుండా పూర్తి స్థాయిలో చేపట్టాలంటే నిధులు కావాలని, బడ్జెట్‌లో నిర్దేశించిన పన్నుల వసూలుతోపాటు కేంద్రం నుంచి వచ్చే సాయంద్వారా వనరుల సమీకరణకు ప్రయత్నిస్తున్నామని రోశయ్య వెల్లడించారు.
Sunday, September 9, 2007
ఎస్సార్సీ వద్దు వేస్తే స్వయంకృతాపరాధమే! తెలంగాణ సెంటిమెంటే బలం
రెండో ఎస్సార్సీ వద్దుగాక వద్దు.. రాష్ట్రమే కావాలి.. గడువు మించిపోతోంది.. ఇంకా ఆలస్యం చేస్తే పార్టీ తీవ్రంగా నష్టపోతుంది.. ప్రజల్లో తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉంది.. దీన్ని తక్కువ అంచనా వేసినా, ఉదాసీనంగా వ్యవహరించినా మునిగిపోవడం ఖాయం.
తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ సమన్వయ సంఘం (టీఆర్‌సీసీసీ) సమావేశంలో వెల్లడైన ఏకాభిప్రాయమిది. కాంగ్రెస్ అధిష్ఠానం రెండో ఎస్సార్సీకే కట్టుబడి ఉన్నామని విస్పష్టంగా ప్రకటించిన అనంతరం శనివారం జరిగిన టీఆర్‌సీసీసీ సమావేశం ఆద్యంతం వాడివేడిగా సాగింది. ఎస్సార్సీ వేయడం స్వయంకృతాపరాధమే అవుతుందని ఒకరిద్దరు మినహా దాదాపు సభ్యులంతా అభిప్రాయపడినట్లు తెలిసింది. ఎన్నికలు సమీపిస్తున్నా తెలంగాణపై తేల్చకుండా నాన్చితే ఎన్నికలను ఎలా ఎదుర్కొంటామని పలువురు సభ్యులు ప్రశ్నించారు. ఎస్సార్సీ, అభివృద్ధి అంశాలను కొందరు ప్రస్తావించినా ఇప్పుడు వాటి గురించి చర్చించడం వల్ల ప్రయోజనం లేదని, తెలంగాణ ఇవ్వాలని కోరడమే శ్రేయస్కరమని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. రెండో ఎస్సార్సీని బహిరంగంగా వ్యతిరేకిస్తే అధిష్ఠానం నిర్ణయాన్ని, వర్కింగ్ కమిటీ తీర్మానాన్ని వ్యతిరేకించినట్లు అవుతుందని, దీనిపై బహిరంగంగా మాట్లాడకుండా టీఆర్‌సీసీసీ సభ్యులు బృందంగా వెళ్లి సోనియా దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. నిర్ణయాన్ని మాత్రం ఆమెకే వదిలిపెట్టాలని నిశ్చయించారు.
2009 ఎన్నికల్లో తెలంగాణపై నిర్ణయం తీసుకోకుంటే పార్టీకి తీవ్ర ఇబ్బందులు తప్పవని టీఆర్‌సీసీసీ మెజారిటీ సభ్యులు తేల్చి చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా అధిష్ఠానం నిర్ణయం తీసుకుని విస్పష్టమైన ప్రకటన చేయాలని, లేకుంటే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉండదని అభిప్రాయపడ్డారు. సమావేశంలో ఇద్దరు సభ్యులు మినహా హాజరైనవారంతా ఎస్సార్సీతో నిమిత్తం లేకుండా తెలంగాణ ఇవ్వాల్సిందిగా అధిష్ఠానాన్ని కోరాలని ప్రతిపాదించారు.
సుమారు నాలుగు గంటల పాటు జరిగిన సమావేశంలో తెలంగాణకు సంబంధించి ఇతర కీలకాంశాలను చర్చించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో భూముల అమ్మకంపై ప్రభుత్వ వైఖరిని పలువురు సభ్యులు తప్పుపట్టారు. నిజాం షుగర్స్‌ను స్వాధీనం చేసుకోవడం, తెలంగాణ అభివృద్ధి, 610 జీవో అమలు, పదివేల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ వంటి అంశాలపైనా చర్చించినా.. అధిక సమయం తెలంగాణకే కేటాయించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం రెండో ఎస్సార్సీ వేస్తే తెలంగాణ రాష్ట్రం కోసం రాజ్యాంగబద్ధమైన ప్రక్రియను ప్రారంభించినట్లవుతుందని, అధిష్ఠానం నిర్ణయం కూడా ఇదే అయినపుడు వ్యతిరేకించడం భావ్యం కాదని పీసీసీ కిసాన్ సెల్ ఛైర్మన్ కోదండరెడ్డి ప్రతిపాదించారు. మెజారిటీ సభ్యులు ఆయనతో విభేదించారు. రెండో
ఎస్సార్సీ వూసే ఇప్పుడొద్దని స్పష్టంచేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో యూపీఏ ఎస్సార్సీ వేసే అవకాశాలే లేవని, బీఎస్పీ నాయకురాలు మాయావతి అసలే ఒప్పుకోరని మధు యాష్కీ వ్యాఖ్యానించారు. తెలంగాణ అంశాన్ని తేల్చకుండా ఎన్నికలకు వెళ్తే గత ఎన్నికల నాటి ఫలితాలు తారుమారవుతాయని ఎక్కువ మంది సభ్యులు అన్నారు.
అభివృద్ధితో ఓట్లు సాధిద్దాం: జీవన్‌రెడ్డి
'రెండో ఎస్సార్సీతో నిమిత్తం లేకుండా తెలంగాణ ఇవ్వాలని కోరుతున్నాం.. అధిష్ఠానం తిరస్కరిస్తే మరిన్ని చిక్కుల్లో పడతాం' అని మంత్రి జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. మరేదైనా ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తే మంచిదని సూచించారు. దాని గురించి ఆలోచిస్తే ముందుకు వెళ్లలేమని, ఎలాగైనా తెలంగాణ అంశంపై అధిష్ఠానం నుంచి ప్రకటన వచ్చేందుకు కృషి చేద్దామని సభ్యులు అన్నారు. అభివృద్ధితో ఓట్లు సాధిద్దామని జీవన్‌రెడ్డి అనగా.. కరీంనగర్ ఉప ఎన్నికలో అభివృద్ధి ఏమైందని సభ్యులు ప్రశ్నించారు (ఈ ఉపఎన్నికలో జీవన్‌రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీచేసి తెరాస అధినేత కేసీఆర్ చేతిలో ఓడిపోయారు). అభివృద్ధి కంటే సెంటిమెంటు బలంగా ఉందని పలువురు అన్నారు. అభివృద్ధి అంశం చర్చకు వచ్చినపుడు జీవన్‌రెడ్డి, సీనియర్ ఎమ్మెల్యే పీజేఆర్ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. 'అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు... ఎక్కడుంది అభివృద్ధి' అని పీజేఆర్ అనగా.. తాను కరీంనగర్ గురించి మాట్లాడుతున్నానని మంత్రి సమాధానమిచ్చారు.
సెంటిమెంటును కాదంటే అంతే!
కరీంనగర్ ఉప ఎన్నిక, సింగరేణి కార్మిక సంఘ ఎన్నికలు, శాసనమండలి ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉన్న విషయాన్ని స్పష్టంగా చూశామని, దీన్ని విస్మరిస్తే ఇబ్బందుల్లో పడతామని వీహెచ్, మధు యాష్కీ సహా మరి కొందరు సభ్యులు అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆంధ్రలోను కాంగ్రెస్ గెలుస్తుందని, కేంద్రంలో సోనియాగాంధీ నేతృత్వంలో ప్రభుత్వం రావడానికి తోడ్పడుతుందని వీహెచ్ అన్నారు. తెలంగాణను కాదంటే ఈ ప్రాంతంలో గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు తారుమారై తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరుతుందన్నది గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్‌రెడ్డి, పులివీరన్న తదితరులు వ్యాఖ్యానించారు. టీఆర్‌సీసీసీలో ఉన్న మంత్రులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేరని, ఈ నేపథ్యంలో టీఆర్‌సీసీసీని పునర్‌వ్యవస్థీకరించాలని ఎంపీ సర్వే సత్యనారాయణ అన్నారు. భూముల విక్రయాల అంశాన్ని తెలంగాణ ప్రణాళిక, అభివృద్ది మండలి ఛైర్మన్ ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి లేవనెత్తగా.. ఈ అంశంపై వీహెచ్, పీజేఆర్ మాట్లాడారు. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భూముల విక్రయాల ద్వారా వచ్చే రాబడిని ఇతర ప్రాంతాల అభివృద్ధికి వినియోగించకుండా ఇక్కడే వ్యయం చేయాలని అత్యధిక సభ్యులు అభిప్రాయపడ్డారు. 'అసలు డబ్బులెక్కడ వస్తున్నాయి.. ఎకరం భూమిని ఒక రూపాయికి ఇస్తుంటే' అని పీజేఆర్ విమర్శించారు.
అందరి కంటే ముందుంటా: మీరు రాష్ట్రం మొత్తానికి పీసీసీ అధ్యక్షుడు కావడం వల్ల మీకు కొన్ని ఇబ్బందులుంటాయి అని కేశవరావును ఉద్దేశించి సర్వే సత్యనారాయణ అన్నారు. కొందరు తనను శంకిస్తుంటారని, అందరికంటే ఎక్కువగా తెలంగాణ రాష్ట్రం కావాలని కోరేవాడిని తానేనంటూ కేకే స్పందించారు. నేను కొట్లాడినపుడు మీరంతా లేరని వ్యాఖ్యానించి.. తెలంగాణ రాష్ట్రం కోసం అందరికంటే తానే ముందుంటానని చెప్పారు.
Tuesday, September 4, 2007
ఉద్యమానికి పునరంకితమవుదాం Eenadu

హైదరాబాద్, న్యూస్‌టుడే: త్యాగాల పునాదిపై జరిగిన ఆనాటి పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పునరంకితమవ్వాలని తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు. 'ఇడ్లీ సాంబర్ గో బ్యాక్.. నాన్
ముల్కీ గో బ్యాక్' ఉద్యమంలో అసువులు బాసిన వారి సంస్మరణార్థం హైదరాబాద్‌లోని గన్‌పార్కులో గల అమరవీరుల స్థూపం వద్ద మంగళవారం తెరాస ఏడు భారీ కొవ్వొత్తులను వెలిగించి శ్రద్ధాంజలి ఘటించింది. నాన్ ముల్కీ గో బ్యాక్.. జై తెలంగాణ లాంటి నినాదాలు ఈ సందర్భంగా మిన్నంటాయి. కేసీఆర్ ప్రసంగిస్తూ.. ఆంధ్ర ప్రాంతం మద్రాసులో అంతర్భాగంగా ఉన్నప్పటి నుంచి తెలంగాణపై వలసవాదుల దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. తెలంగాణను హేళన చేస్తూ అప్పటి మద్రాసు ప్రభుత్వ నేతలు చేసిన ప్రకటనలపై తెలంగాణ విద్యార్థులు 1949లో 'ఇడ్లీ సాంబార్ గో బ్యాక్.. నాన్ ముల్కీ గో బ్యాక్' నినాదంతో ఆందోళన ఉద్ధృతం చేశారన్నారు. ఈ సమయంలో సిటీ కాలేజీ వద్ద పోలీసులు కాల్పులు జరిపి ఏడుగురు విద్యార్థులను పొట్టన పెట్టుకున్నారని గుర్తుచేశారు. తెలంగాణ వాదులపై, ఉద్యమకారులపై అవి తొలి పోలీసు కాల్పులన్నారు. ఆ దమననీతి, మోసం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్ జోహారులు.. జోహారులు.. అమవీరులకు జోహారులంటూ గీతాలను ఆలపించి అందరి కర్తవ్యాన్నీ గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో తెరాస ఎమ్మెల్యేలు నాయిని నర్సింహ్మారెడ్డి, పద్మా దేవేందర్‌రెడ్డి, రామలింగారెడ్డి, పార్లమెంట్ సభ్యులు రవీంద్రనాథ్, ఎమ్మెల్సీలు దిలీప్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Monday, September 3, 2007
తెలంగాణ కోసమే ఎస్సార్సీ వేయాలి Eenadu


