Thursday, October 4, 2007

వాషింగ్టన్‌లో ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు Eenadu

వాషింగ్టన్‌: అమెరికా రాజధాని వాషింగ్టన్‌ నగరంలో తెలంగాణ ప్రజలు బతుకమ్మ పండగను ఎంతో భక్తిప్రపత్తులతో జరుపుకున్నారు. తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో దాదాపు 400మందికి పైగా తెలంగాణవాసులు పాల్గొనడం విశేషం. రాజేశ్‌ బాదం స్వాగతోపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమయింది. అనంతరం తెలంగాణ సంప్రదాయ రుచులతో కూడిన భోజనాన్ని అతిథులకు వడ్డించారు. తరువాత జరిగిన ఆటపాటల్లో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
రంగురంగుల బతుకమ్మలు...
మహిళలు సంప్రదాయ వస్త్రధారణతో తమతో తీసుకు వచ్చిన బతుకమ్మలపై రంగురంగుల పూలను దానిపై ఉంచి సంప్రదాయబద్ధంగా గానం చేశారు. దాదాపు రెండు గంటల సేపు జరిగిన ఈ వేడుక తెలంగాణ పల్లె జీవితాన్ని అమెరికాలో సాక్షాత్కరించింది. త్రిశ సంకినేని భరతనాట్యపదర్శన అందర్ని ఆకర్షించింది. సూర్యాస్తమయం సమయంలో బతుకమ్మలను నిమజ్జనం చేసి సత్తుపిండిని అందరికి పంచారు. ఆచార్య సవితానంద అవథూత ధ్యానంపై ఉపన్యాసమిచ్చారు. టీడీఎఫ్‌ చేపడుతున్న కార్యక్రమాల గురించి సంస్థ సమన్వయకర్త రాజేశ్‌ మాదిరెడ్డి సభికులకు వివరించారు. రవి పులి వందనసమర్పణతో కార్యక్రమం ముగిసింది. కళ్యాన్‌ ముద్దసాని, రమాకాంత్‌ పీచర, రాజేశ్‌ బాదం, సతీష్‌ మేదవరపు. అమర్‌ జన్నుపురెడ్డి. చంద్ర కంచర్ల, వెంకట్‌ రెడ్డి, అచ్యుత్‌ చుక్క, దీపక్‌ దేశ్‌పాండే, రాజేశ్‌ మాదిరెడ్డి, విష్ణు యాచమనేని, గీతా మేదవరపు, అరవింద ఎడ, శ్వేత, సుశీల... తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

కేసీఆర్‌ చరిత్రలో కలిసిపోతావ్‌ : పీసీసీ Andhra Jyothy

హైదరాబాద్‌, అక్టోబర్‌ 4(ఆన్‌లైన్‌): కాంగ్రెస్‌ పార్టీని.. ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని నోటికి వచ్చినట్లు విమర్శిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు చరిత్రలో కలసిపోవడం ఖాయమని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ జోస్యం చెప్పింది. గాంధీభవన్‌లో గురువారం పీసీసీ అధికార ప్రతినిధి ఎన్‌.తులసిరెడ్డి, కిసాన్‌సెల్‌ అధ్యక్షుడు ఎం.కోదండ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ప్రతిసారి కాంగ్రెస్‌పార్టీని, వై ఎస్‌ను కేసీఆర్‌ దుర్భాషలాడడం గర్హనీయమని కోదండ రెడ్డి పేర్కొన్నారు. వాపును చూసి బలుపుగా టీఆర్‌ఎస్‌ భావిస్తోందని.. కరీంనగర్‌ పార్లమెంటు ఉప ఎన్నికను తెలంగాణ ఏకాభిప్రాయంగా భావించడానికి వీల్లేదని.. ఇదే ఎన్నికల్లో జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్‌లో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు మొదటి రెండు స్థానాల్లో నిలిస్తే.. టీఆర్‌ఎస్‌ మూడో స్థానంలో ఎందుకు నిలిచిందని కోదండ రెడ్డి ప్రశ్నించారు.
టీఆర్‌ఎస్‌ పార్టీ కుటుంబ పాలనగా మారిందని.. ఎక్కడ చూసినా కేసీఆర్‌, ఆయన కుమారుడు, అల్లుడుల ఫోటోలే కన్పిస్తున్నాయి తప్పితే.. మరో నాయకుడికి తగిన గుర్తింపే లేదని చెప్పారు. గోధమతో సమానంగా.. లేదా.. అంతకంటే ఎక్కువ మద్ధతు ధరను వరికి ప్రకటించాలని తులసిరెడ్డి కేంద్రాన్ని కోరారు. వ్యవసాయం దండగ మారిదని భావించిన చంద్రబాబు పాలనలో వరికీ, గోధమకు మధ్య మద్ధతు ధరలో వ్యత్యాసం నెలకొందని చెప్పారు. 1994-95లో ఈరెండింటికీ మద్ధతు ధర 360 రూపాయలుంటే.. 2003-04లో గోధుమకు 630 రూపాయలు లభిస్తే.. వరికి మాత్రం 580 దక్కిందని చెప్పారు. ఈ వ్యత్యాసంపై ఆనాడే నిరసన తెలిపి ఉంటే.. ఈ రోజు ఈ విధానం కొనసాగేది కాదని ఆయన పేర్కొన్నారు.

Wednesday, October 3, 2007

దుబాయి.. ముంబయి.. బొగ్గుబావే! Eenadu

సమైక్యాంధ్రలో తెలంగాణ ప్రజల బతుకులు..

దుబాయి.. ముంబయి.. బొగ్గుబావే!

వైఎస్‌, చంద్రబాబు రాజకీయ బేహారులు

పొత్తులుండవ్‌, ఒంటరిగానే పోటీచేస్తాం

తెలంగాణ వస్తే ఉపముఖ్యమంత్రి ముస్లిమే:

కేసీఆర్‌

'స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశంలో అధికశాతం రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతే తెలంగాణా (హైదరాబాద్‌ రాష్ట్రం) రూ.63కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉంది. సమైక్యాంధ్ర ఏర్పడ్డాక, వలస పాలకుల దోపిడీతో తెలంగాణా సంక్షోభంలో కూరుకుపోయింది. అంటే తెలంగాణా వెనుకబడ్డది కాదు.. వెనకవేయబడ్డది'. 'తెలంగాణా రాష్ట్రం ఏర్పాటయ్యాక ముస్లింలకు డిప్యూటీ సీఎంతోపాటూ.. నాలుగు మంత్రి పదవులు ఇస్తాం. ఒక లోక్‌సభ, మరొక రాజ్యసభ స్థానాలను కేటాయిస్తాం. విద్యా, ఉద్యోగాల్లో 12శాతం రిజర్వేషన్లను కల్పిస్తాం'.
- కేసీఆర్‌

కరీంనగర్‌ - న్యూస్‌టుడే
మధ్యంతర ఎన్నికల ఉరిమిపాటుతో ప్రజల వద్దకు వెళ్లేందుకు మొహం చెల్లక సీఎం వైఎస్‌, తెదేపా అధినేత చంద్రబాబులు జనాకర్షక మంత్రాలను జపిస్తున్నారని తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు విమర్శించారు. కరీంనగర్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 'తెలంగాణా ద్రోహుల పార్టీకి అధ్యక్షుడు చంద్రబాబు.. నమ్మక ద్రోహులపార్టీకి చెందిన సీఎం వైఎస్‌లకు తెలంగాణాలో తిరిగే హక్కే లేద'ని పేర్కొన్నారు. వీరిద్దరూ రాజకీయ వ్యాపారులని ఆరోపించారు. 'రూ.రెండుకే కిలో బియ్యం ఇస్తామని వైఎస్‌ చెబుతున్నారు. మూడున్నరేళ్లుగా ఆయన ఏం చేశారు. పేదలు ఇప్పుడే గుర్తుకొచ్చారా. ఇది ఎన్నికల గిమ్మిక్కుకాదా'ని కేసీఆర్‌నిలదీశారు. వైఎస్‌ ముఖ్యమంత్రిగా పగ్గాలు స్వీకరించాక ఉచితవిద్యుత్తు ఫైలుపై సంతకం పెడితే..అది ఉత్త విద్యుత్తుగానే మిగిలిపోయిందని విమర్శించారు. 'తొమ్మిదేళ్లు సీఎంగా ఊరేగిన చంద్రబాబు.. సేద్యమే దండగన్నడు. విద్యుత్తు బిల్లులు కట్టని రైతులపై కేసులు పెట్టి.. జైళ్లలో తోయించిండ'ని మండిపడ్డారు. 'వైఎస్‌.. చంద్రబాబులు దొందూ దొందే. ఫార్ములావన్‌, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌కు తెలంగాణా భూములను చంద్రబాబు అప్పగిస్తే.. ల్యాంకో, టాటా, బిర్లా, అంబానీలకు వైఎస్‌ తెగనమ్ముతున్నరు' అని దుయ్యబట్టారు. 'చంద్రబాబు, వైఎస్‌ల పాలనలో తెలంగాణ ప్రజల బతుకులు, దుబాయి ముంబయి బొగ్గుబాయిగా మారాయ'ని ఆవేదన వ్యక్తంచేశారు. 'స్వంత పాలనలో తెలంగాణాలో బతుకులు బంగారం అవుతాయి. తెలంగాణా ప్రజలు దీన్ని గుర్తించాల'ని సూచించారు.
బోగస్‌ యజ్ఞం: 'వైఎస్‌ చేస్తున్న జలయజ్ఞం.. ఒట్టి బోగస్‌. తెలంగాణాలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ ఎత్తిపోతల పథకాలే. వాటిని నడపడానికి 2500 మెగావాట్ల విద్యుత్తు అవసరం. ఇప్పుడు సేద్యానికి ఏడు గంటలని చెప్పి.. ఐదుగంటలు కూడా ఇస్తలేరు. ఇక ఎత్తిపోతల పథకాలకు విద్యుత్తును ఎక్కడనుంచి తెస్తారు? ఈ ప్రాజెక్టులు చేపట్టింది తెలంగాణాకు నీళ్లిచ్చేందుకుకాదు. కాంట్రాక్టర్ల నుంచి పర్శంటేజీలు దండుకునేందుకే' అని కేసీఆర్‌ విమర్శించారు. 'మధ్యంతర ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవు.. తెరాస ఒంటరిగానే పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. వారి అభీష్టం మేరకే ఒంటరిగానే బరిలోకి దిగుతామ'ని చెప్పారు.


నల్లగొండ వర్సిటీ పేరు మార్చాలని Andhra Jyothy

ఓయులో తెలంగాణ విద్యార్థుల ర్యాలీ
హైదరాబాద్‌, అక్టోబర్‌ 3 (ఆన్‌లైన్‌) : తెలంగాణ ప్రాంతాల్లో అనేక పోరా టాల ద్వారా సాధించుకున్న నల్గొండ యూనివర్సిటీకి తెలంగాణ మేధావుల, కవుల, నాయకుల పేర్లు పెట్టకుండా ఈ ప్రాంత వాసులను అవమానపరుస్తు న్నారంటూ తెలంగాణ విద్యార్థి సంఘం, తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభా గం నాయకులు బుధవారం ఉస్మానియా యూనివర్సిటీలో తరగతులను బహి ష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఇది మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానపర్చడమేనని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అంతర్జా తీయంగా ఎంతో ఖ్యాతి గతించిన మహాత్మా గాంధీపేరు అంతర్జాతీయ, జాతీ య సంస్థలకు పెడితే తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఒక స్థానిక యూనివర్సి టీకి ఆయన పేరు పెట్టడం సమంజసమేనా అని విద్యార్థి సంఘాలు ప్రశ్నించా యి. ఇటీవల ఆంధ్రా, సీమ ప్రాంతాల్లోని వర్సిటీలకు అక్కడి కవుల, రాజుల పేర్లను పెట్టిన పాలకులు తెలంగాణ విషయం వచ్చేసరికి ఆ ఆనవాయితీని విస్మరిస్తున్నారని వారు పేర్కొన్నారు.ప్రభుత్వం స్పందించి యూనివర్సిటీ పేరు మార్చకుంటే పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు.

Monday, October 1, 2007

చికాగోలో ఘనంగా 'బతుకమ్మ' Andhra Jyothy

చికాగో, సెప్టెంబర్‌ 29: సంప్రదాయ 'బతుకమ్మ' పండగను తెలంగాణా ఎన్నారైలు చికాగోలో ఇటీవల ఘనంగా జరుపుకున్నారు. ఉత్తర అమెరికా బతుకమ్మ పండగ ఐదవ వార్షికోత్సవాలను పురస్కరించుకుని వారు ఈ పండుగను జరుపుకున్నారు. సాంప్రదాయబద్ధంగా జరిగిన ఈ ఉత్సవానికి తెలంగాణా ప్రవాసులు అధిక సంఖ్యలో హజరయ్యారు. చిన్నాపెద్ద భేదం లేకుండా అన్ని వయస్సుల వారు బ్లూమింగ్టన్‌, విస్‌కాన్‌సిన్‌, ఇండియానా తదితర ప్రాతాలనుంచి విచ్చేసి బతుకమ్మ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.


ఆ రోజు ఉదయాన్నే లేచి బతుకమ్మ పండగకు సహజసిద్దమైన గునుగు పూలు, తంగేడు పూలు, బీర పూలు సేకరించారు. బతుకమ్మ పూలు అందుబాటులో లేనివారు స్థానికంగా లభించే పూలుతో బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఉదయం పది గంటల సమయంలో ప్రారంభమైన బతుకమ్మ విహారయాత్రలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ నిరంజన్‌ అల్లంనేని స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరూ తామకు తాము పరిచయం చేసుకున్నారు. తర్వాత వారంతా శ్రీనివాస్‌ రెడ్డి సిరికొండ, ప్రదీప్‌ దమిడిలు నిర్వహించిన వివిధ ఆటల్లో పాలుపంచుకున్నారు.

సంప్రదాయ తెలంగాణ వంటకాలతో మధ్యాహ్న భోజనం ఆరగించారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆడారు. రకరకాలైన పూలతో అలంకరించిన బతుకమ్మలను మధ్యలో ఉంచి వాటి చుట్టూ చేరి నాట్యం చే స్తూ 'బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో' వంటి పాటలు పాడుతూ భక్తిపారవశ్యంలో తేలియాడారు. అనంతరం బతుకమ్మలను సమీపంలోని సరస్సులో నిమజ్జనం చేశారు.
బతుకమ్మ ఉత్సవాలు పూర్తయిన తర్వాత అందరూ సద్దులు పంచుకున్నారు. ఆటల్లో గెలుపొందిన వారికి వెంకట్‌ ఆర్‌ తుడి బహుమతులు అందజేశారు. ఎంపిక చేసిన 'ఉత్తమ బతుకమ్మ'కు శ్రీధర్‌ లోకా ప్రత్యేక బహుమతిని అందజేశారు. బతురమ్మను ఘనంగా నిర్వహించడంలో శ్రీనివాస్‌ రెడ్డి సిరికొండ, అశోక్‌ ముద్రకోళ్ల, ఉష ముద్రకోళ్ల, ప్రదీప్‌ దమిడి తమ వంతు సాయం చేశారు. నిరంజన్‌ అల్లంనేని ధన్యవాదాలు తెల్పుతూ వందన సమర్ఫణ చేయడంతో కార్యక్రమం ముగిసింది.

Sunday, September 30, 2007

తెలంగాణకు లిఫ్ట్‌లంటే... ఆంధ్రకు నీళ్లు దోచిపెట్టడమే Eenadu

వైఎస్‌ది బిత్తిరి సేద్యం నేను కాపలా కుక్కను: కేసీఆర్‌
''తెలంగాణలో తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులన్నీ లిఫ్టులే (ఎత్తిపోతలు). తెలంగాణకు లిఫ్టంటే నీళ్లన్నీ ఆంధ్రకు తెఫ్టే (దోచెయ్యడమే)! అదీ లోగుట్టు. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గజదొంగల్లా కృష్ణా జలాలను ఆంధ్రకు తరలిస్తున్నరు. తెలంగాణకు తుంపర సేద్యమంటూ వైఎస్‌ కొత్తపాట పాడుతున్నడు. ఇక నుంచి ప్రతి నీటిచుక్కా డ్యాం నుంచి నేరుగా మొక్క మొదట్లో పడతదట! అట్ల తెలంగాణలో 50 లక్షల ఎకరాలకు నీరిస్తడట. ఇదీ వైఎస్‌ బిత్తిరి సేద్యం!'' తెరాస అధినేత కేసీఆర్‌ వ్యాఖ్యలివి. ఆదివారం ఇక్కడి తెలంగాణ భవన్లో 22వ విద్యార్థుల శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా కేసీఆర్‌ ప్రసంగించారు. కేసీఆర్‌ ప్రసంగం ఆద్యంతం వారి కేకలు, నినాదాలు, చప్పట్లతో మార్మోగిపోయింది. తెలంగాణలోని అన్ని ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను గెలుచుకుని, తెరాస మద్దతు లేకుండా ప్రభుత్వాలు ఏర్పడలేని రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలని వారికి కేసీఆర్‌ ఉద్బోధించారు. కుక్కకు ఎముకేసినట్టు తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులందరికీ వైఎస్‌ మంత్రి పదవులు, ప్రాజెక్టులు కట్టబెట్టారని కేసీఆర్‌ ఎద్దేవాచేశారు. ''మీ ఊళ్లలో కాంగ్రెస్‌, తెదేపా జెండాలు పట్టుకున్నోళ్లను నిలదియ్యండి. కరెంటు, నీళ్లు ఇవ్వని జెండాలను ఎందుకు మోస్తున్నరని అడగండి. మనం తెలంగాణ అనంగనె జై ఆంధ్ర, జై రాయలసీమ అని బొబ్బలు పెడతరు. శ్రీశైలం ప్రాజెక్టును సీమకు వదిలితేనే హైదరాబాద్‌ను తెలంగాణకు ఇస్తామని రాయలసీమ హక్కుల వేదిక నేత టీజీ వెంకటేశ్‌ అంటున్నడు. హైదరాబాద్‌ను నెత్తిల పెట్టుకుని తెలంగాణకు వచ్చినట్టు మాట్లాడుతున్నడు. ఎన్నికల్లో ఓట్ల యావతో చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నడు. పథకాలు ప్రకటిస్తున్నడు. వీటిని నమ్మొద్దు. తెలంగాణ వ్యాప్తంగా ఆరు లక్షల విద్యార్థులు బలీయశక్తిగా తయారైతే ప్రత్యేక రాష్ట్రాన్ని ఆపడం బ్రహ్మతరం కూడా కాదు'' అని వారికి సూచించారు. చదువులను పాడుచేసుకోకుండా శాంతియుతంగా తెలంగాణ భావవ్యాప్తి చేయాలన్నారు. తెలంగాణ వచ్చాక ఏ పదవీ తీసుకోకుండా తాను కాపలా కుక్కలా ఉంటానన్నారు.
తెరాస గ్రేటర్‌ హైదరాబాద్‌ జిల్లా కమిటీని పార్టీ ఎమ్మెల్యే నాయిని నర్సింహారెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే పద్మారావు అధ్యక్షతన 135 మందితో కమిటీ ఏర్పాటైంది.

TCA Telangana libaration Day in California


Monday, September 24, 2007

టీడీఎఫ్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ Eenadu

డల్లాస్‌: తెలంగాణ అభివృద్ధి ఫోరం(టీడీఎఫ్‌) ఆధ్వర్యంలో డల్లాస్‌లోని తెలంగాణ కుటుంబాలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని, బతుకమ్మ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. లేక్‌ లెవిస్‌విల్లే పార్కులో సెప్టెంబరు 22న జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 100 కుటుంబాలు పాల్గొన్నాయి. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. బతుకమ్మలతో పార్కు పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. కార్యక్రమాన్ని భారీ స్థాయిలో చేయడానికి ఇందిరా జానకిరాం, ఉమా కరుణాకర్‌, స్వప్న శ్రీనివాస్‌ సహకరించారు. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా అధిక సంఖ్యలో పెద్దలు, చిన్నారులు హాజరయ్యారు. పురుషులు రెండు టీమ్‌లుగా విడిపోయి క్రికెట్‌ ఆడారు. కుతూరు సత్యవతి ఆధ్వర్యంలో మహిళలు బతుకమ్మ పాటలను పాడారు. చిన్నారులకు ఆటల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం సభ్యులు బతుకమ్మలను చెరువులో వదిలారు.
కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి శ్రీనివాస్‌ కుతూరు, స్వరూప్‌ కుండూరు, కరుణాకర్‌ దాసరి, రామ్‌రెడ్డి, మహేందర్‌, శ్రీకాంత్‌ తదితరులు సహకరించారు. కారక్రమాన్ని జయప్రదం చేసిన వాలంటీర్లకు, స్పాన్సరర్లకు, ఆహుతులకు టీడీఎఫ్‌ కోఆర్డినేటర్లు కృతజ్ఞతలు తెలిపారు.



Wednesday, September 19, 2007

అభివృద్ధి అవినీతిలోనే పార్టీపై 'సమాల్‌' ప్రభావం

గోనె ఆరోపణలు సీఎల్‌పీ కార్యాలయ కుట్ర

రెండో ఎస్సార్సీకి పార్టీ కట్టుబడి లేదు టీఆర్‌సీసీసీలో పదవుల యావ
'న్యూస్‌టుడే' ఇంటర్య్వూలో మధుయాష్కీ


నిజామాబాద్‌, న్యూస్‌టుడే: తెలంగాణ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానానికి రాష్ట్ర నాయకత్వం తప్పుడు సమాచారాన్ని అందిస్తోందని నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు మధుగౌడ్‌ యాష్కీ ఆరోపించారు. తెలంగాణపై కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులను నిలదీయాలని పిలుపునిచ్చిన యాష్కీతో 'న్యూస్‌టుడే' ముఖాముఖి...

ప్రశ్న: సమాల్‌ నివేదిక ప్రభావం ఎలా ఉంటుందంటారు?

జవాబు: ప్రభుత్వంలో పనిచేసిన సీనియర్‌ ఉన్నతాధికారి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రభుత్వం పైన ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉంది. ఈ ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గు తేల్చాలి. ఎదురు దాడి సరి కాదు. సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షిస్తే ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడుతుంది. ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్ళా. పార్టీపైనా దీని ప్రభావం ఉండదనుకోవడం సరికాదు.

ప్ర: పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు?
జ: తెలంగాణపై మాట్లాడితే పార్టీని వ్యతిరేకించినట్లు కాదు. తెలంగాణ విషయంలో రాష్ట్ర నాయకత్వం వాస్తవాలను దాస్తోంది. అధిష్ఠానానికి తప్పుడు సమాచారం ఇస్తోంది. ఇది సరికాదు.

ప్ర: మీ వ్యవహారశైలి పార్టీలో కొంత గందరగోళాన్ని సృష్టిస్తోంది. అసలు మీ వ్యూహం ఏమిటి?

జ: నాకు ఏ వ్యాపారాలూ లేవు. వృత్తిపరంగా నైపుణ్యం చాటుకొన్న తర్వాత ఒక నిబద్ధతతో, నా సామాజిక బాధ్యత గుర్తిస్తూ రాజకీయాల్లోకి వచ్చాను. ఆనాడు నాకు తెరాస, తెదేపా, భాజపాలు టికెట్టు ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. సోనియా స్ఫూర్తితో కాంగ్రెస్‌లో చేరా. ప్రజలను మోసంచేయడం, పార్టీకి వెన్నుపోటు పొడవడం లాంటివి నేను చేయడంలేదు. ప్రజల నిజమైన అభిప్రాయాల్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళుతున్నా.

ప్ర: పార్టీని వీడిపోతారనే ప్రచారం?

జ: కాంగ్రెస్‌లోనే కొనసాగుతా.

ప్ర: ఈసారి మీకు టికెట్టు రాదని, అందుకే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చర్చ?

జ: కుహనా విధేయుల వ్యాఖ్యలివి. పార్టీ క్రమశిక్షణకు లోబడే ఉంటున్నా. నా పనితీరు గుర్తించిన అధిష్ఠానం ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో కీలక బాధ్యతలు అప్పగించింది.

ప్ర: తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ రెండో ఎస్సార్సీకి కట్టుబడి ఉంది. మీరు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు?

జ: రెండో ఎస్సార్సీకి కట్టుబడి లేదు. కనీస ఉమ్మడి ప్రణాళిక(సి.ఎం.పి)లో చేర్చారు. రాష్ట్రపతి ప్రసంగంలో ఈ అంశాన్ని చేర్చారు. రెండో ఎస్సార్సీ అంటే ఎలా? ప్రైవేటుగా తెలంగాణా కావాలనే వారు అధిష్ఠానం దగ్గరికి వెళ్లినపుడు మాత్రం తప్పుడు సమాచారం ఇస్తున్నారు. తద్వారా ప్రధానికి తప్పుడు సంకేతాలు అందిస్తున్నారు.
ప్ర: టీఆర్‌సీసీసీ ఉన్నా ఇతర వేదికల్లో పాల్గొనడం ఎందుకు?
జ: తెరాస కన్నా ముందే టీఆర్‌సీసీ ఏర్పడింది. ఎన్నికల తర్వాత సీనియర్‌ నాయకులు తెలంగాణ అంశాన్ని విస్మరించారు. పదవుల కోసం, వ్యక్తిగత లాభాలకోసం దీన్ని పక్కన పెట్టారు. గతంలో సీఎంను తీవ్ర పదజాలంతో విమర్శించిన వారే అభివృద్ధి పేరుతో తప్పుదోవ పట్టించారు. తెలంగాణా సాధన కోసం ఏ వేదిక అయినా సరే. కలిసి పోరాడాల్సిందే.
ప్ర: తెలంగాణలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదన్న వాదన వచ్చింది కదా?
జ: అభివృద్ధి ఎక్కడ జరిగింది? అవినీతి అక్రమాల్లోనా? అధిష్ఠానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారు. నిధులెక్కడ ఇస్తున్నారు? తెలంగాణా విశ్వ విద్యాలయమే దీనికి ఉదాహరణ. అభివృద్ధి పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలకువెళ్ళాం. నిజామాబాద్‌ జిల్లాలో తెదేపా కన్నా 10 వేల ఓట్లు తక్కువగా వచ్చాయి. గతం కంటే కొంత మెరుగై ఉండవచ్చు.
ప్ర: ఆర్టీసీ మాజీ ఛైర్మన్‌ గోనె ప్రకాశ్‌రావు మీపై వ్యక్తిగత విమర్శలకు దిగారు?
జ: దీని వెనకాల తెలంగాణను వ్యతిరేకించే లాబీ ఉంది. కాంగ్రెస్‌లోని పెద్దలు, సీఎల్‌పీ కార్యాలయం, మీడియా కో-ఆర్డినేటర్‌ కుట్ర ఉంది. నా నోరు మూయించేందుకు బెదిరింపు ఇది. నా జీవితం తెరచిన పుస్తకమే. మొత్తం వెబ్‌సైట్‌లో ఉంది. దీనిపైనా అధిష్ఠానానికి మొత్తం వివరించాను.
ప్ర: ప్రజాప్రతినిధులను నిలదీయాలని పిలుపునివ్వడం పార్టీ నేతలకు ఆగ్రహం తెప్పించింది కదా?
జ: గత ఎన్నికల్లో ప్రత్యేక రాష్ట్ర అంశంతోనే గెలుపొందాం. ఏ పార్టీ వారైనా తెలంగాణాను ఏమి చేశారని ప్రశ్నించాలని చెప్పా. సామరస్యంగా శాంతియుతంగానే నిలదీయాలని పిలుపునిచ్చా. కేవలం కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులే కాదు, అందరినీ.

Tuesday, September 18, 2007

ఎన్ని ఆటంకాలొచ్చినా భూముల అమ్మకాన్ని ఆపొద్దు Eenadu

హైదరాబాద్‌ అభివృద్ధికే అధిక నిధులు ప్రతిపక్షాల వాదనను తిప్పి కొట్టాలి వనరుల సమీకరణ సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశం
ఆందోళనలు, ఇతరత్రా కార్యక్రమాలద్వారా ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా హైదరాబాద్‌లో భూముల అమ్మకాన్ని ఆపొద్దని, ఈ ప్రక్రియ సత్వరమే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి అధికారులను ఆదేశించారు. భూముల అమ్మకం ద్వారా వచ్చే నిధులను హైదరాబాద్‌ అభివృద్ధికే వెచ్చిస్తున్నామంటూ విస్తృత ప్రచారం చేయడంద్వారా ప్రతిపక్షాల వాదనను తిప్పి కొట్టాలని సూచించారు. ఆర్థిక వనరుల సమీకరణపై ఆయన మంగళవారమిక్కడి సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ఆర్థిక మంత్రి రోశయ్య, పురపాలకశాఖ మంత్రి కోనేరు రంగారావు, వాణిజ్య పన్నులశాఖ మంత్రి కొణతాల రామకృష్ణ, అధికారులు ఇందులో పాల్గొన్నారు. హుడా భూముల అమ్మకాన్ని అడ్డుకునేందుకు తెరాస, ఇతర పార్టీలు చేసిన ఆందోళనను ముఖ్యమంత్రి తప్పుపట్టారు. భూముల అమ్మకంద్వారా వచ్చే ఆదాయాన్నంతా హైదరాబాద్‌కే వెచ్చిస్తున్న విషయాన్ని ఆయా పార్టీలు మరిచిపోతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. మెట్రో రైలుకు రూ.8,500 కోట్లు, ఔటర్‌ రింగ్‌రోడ్డుకు రూ.6,500 కోట్లు, హైదరాబాద్‌లో మురుగునీటి పారుదల వ్యవస్థకు రూ.2,500 కోట్లు, కృష్ణా నీటి సరఫరా రెండోదశకు రూ.వేయి కోట్లు, రేడియల్‌ రోడ్లకు రూ.2,500 కోట్లు, పీవీ నర్సింహారావు ఎలివేటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రహదారికి రూ.500 కోట్లు, బలహీనవర్గాల గృహ నిర్మాణానికి రూ.6వేల కోట్ల చొప్పున వచ్చే మూడేళ్లలో రూ.27,500 కోట్లు హైదరాబాద్‌ అభివృద్ధికి వెచ్చిస్తున్నామనే విషయాన్ని ప్రజలకు వివరించాలని అధికారులకు వైఎస్‌ సూచించారు. పదేళ్ల క్రితంతో పోలిస్తే హైదరాబాద్‌ విస్తృతంగా అభివృద్ధి చెందినందువల్లే స్థలాల ధరలు పెరిగాయనే విషయాన్ని ప్రతిపక్ష పార్టీలకు చెప్పాలని ఆదేశించారు. స్థలాల అమ్మకం ప్రక్రియను ముమ్మరం చేసి సకాలంలో లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని సూచించారు.
పన్నులు పెంచం.. కొత్తగా వేయం: రోశయ్య
బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా అభివృద్ధి పనులను చేపట్టేందుకు పన్నులు పెంచడం, కొత్తగా పన్నులు విధించడం వంటి ఆలోచనేదీ సర్కారుకు లేదని ఆర్థిక మంత్రి రోశయ్య తెలిపారు. వనరుల సమీకరణ ఆశించిన స్థాయిలో లేకున్నా... ఈనెల కాకున్నా వచ్చే నెలలోనైనా లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. సమీక్ష అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి పనులకు లోటు లేకుండా పూర్తి స్థాయిలో చేపట్టాలంటే నిధులు కావాలని, బడ్జెట్‌లో నిర్దేశించిన పన్నుల వసూలుతోపాటు కేంద్రం నుంచి వచ్చే సాయంద్వారా వనరుల సమీకరణకు ప్రయత్నిస్తున్నామని రోశయ్య వెల్లడించారు.

Sunday, September 9, 2007

ఎస్సార్సీ వద్దు వేస్తే స్వయంకృతాపరాధమే! తెలంగాణ సెంటిమెంటే బలం

ఎన్నికల్లోపు తేల్చకుంటే మునిగిపోతాం
సోనియాను కలిసి చెబుదాం
టీఆర్‌సీసీసీలో ఏకాభిప్రాయం
హైదరాబాద్‌ భూముల ఆదాయం ఇక్కడే ఖర్చుపెట్టాలని తీర్మానం
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
రెండో ఎస్సార్సీ వద్దుగాక వద్దు.. రాష్ట్రమే కావాలి.. గడువు మించిపోతోంది.. ఇంకా ఆలస్యం చేస్తే పార్టీ తీవ్రంగా నష్టపోతుంది.. ప్రజల్లో తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉంది.. దీన్ని తక్కువ అంచనా వేసినా, ఉదాసీనంగా వ్యవహరించినా మునిగిపోవడం ఖాయం.

తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ సమన్వయ సంఘం (టీఆర్‌సీసీసీ) సమావేశంలో వెల్లడైన ఏకాభిప్రాయమిది. కాంగ్రెస్‌ అధిష్ఠానం రెండో ఎస్సార్సీకే కట్టుబడి ఉన్నామని విస్పష్టంగా ప్రకటించిన అనంతరం శనివారం జరిగిన టీఆర్‌సీసీసీ సమావేశం ఆద్యంతం వాడివేడిగా సాగింది. ఎస్సార్సీ వేయడం స్వయంకృతాపరాధమే అవుతుందని ఒకరిద్దరు మినహా దాదాపు సభ్యులంతా అభిప్రాయపడినట్లు తెలిసింది. ఎన్నికలు సమీపిస్తున్నా తెలంగాణపై తేల్చకుండా నాన్చితే ఎన్నికలను ఎలా ఎదుర్కొంటామని పలువురు సభ్యులు ప్రశ్నించారు. ఎస్సార్సీ, అభివృద్ధి అంశాలను కొందరు ప్రస్తావించినా ఇప్పుడు వాటి గురించి చర్చించడం వల్ల ప్రయోజనం లేదని, తెలంగాణ ఇవ్వాలని కోరడమే శ్రేయస్కరమని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. రెండో ఎస్సార్సీని బహిరంగంగా వ్యతిరేకిస్తే అధిష్ఠానం నిర్ణయాన్ని, వర్కింగ్‌ కమిటీ తీర్మానాన్ని వ్యతిరేకించినట్లు అవుతుందని, దీనిపై బహిరంగంగా మాట్లాడకుండా టీఆర్‌సీసీసీ సభ్యులు బృందంగా వెళ్లి సోనియా దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. నిర్ణయాన్ని మాత్రం ఆమెకే వదిలిపెట్టాలని నిశ్చయించారు.
2009 ఎన్నికల్లో తెలంగాణపై నిర్ణయం తీసుకోకుంటే పార్టీకి తీవ్ర ఇబ్బందులు తప్పవని టీఆర్‌సీసీసీ మెజారిటీ సభ్యులు తేల్చి చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా అధిష్ఠానం నిర్ణయం తీసుకుని విస్పష్టమైన ప్రకటన చేయాలని, లేకుంటే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉండదని అభిప్రాయపడ్డారు. సమావేశంలో ఇద్దరు సభ్యులు మినహా హాజరైనవారంతా ఎస్సార్సీతో నిమిత్తం లేకుండా తెలంగాణ ఇవ్వాల్సిందిగా అధిష్ఠానాన్ని కోరాలని ప్రతిపాదించారు.
సుమారు నాలుగు గంటల పాటు జరిగిన సమావేశంలో తెలంగాణకు సంబంధించి ఇతర కీలకాంశాలను చర్చించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలో భూముల అమ్మకంపై ప్రభుత్వ వైఖరిని పలువురు సభ్యులు తప్పుపట్టారు. నిజాం షుగర్స్‌ను స్వాధీనం చేసుకోవడం, తెలంగాణ అభివృద్ధి, 610 జీవో అమలు, పదివేల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ వంటి అంశాలపైనా చర్చించినా.. అధిక సమయం తెలంగాణకే కేటాయించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం రెండో ఎస్సార్సీ వేస్తే తెలంగాణ రాష్ట్రం కోసం రాజ్యాంగబద్ధమైన ప్రక్రియను ప్రారంభించినట్లవుతుందని, అధిష్ఠానం నిర్ణయం కూడా ఇదే అయినపుడు వ్యతిరేకించడం భావ్యం కాదని పీసీసీ కిసాన్‌ సెల్‌ ఛైర్మన్‌ కోదండరెడ్డి ప్రతిపాదించారు. మెజారిటీ సభ్యులు ఆయనతో విభేదించారు. రెండో
ఎస్సార్సీ వూసే ఇప్పుడొద్దని స్పష్టంచేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో యూపీఏ ఎస్సార్సీ వేసే అవకాశాలే లేవని, బీఎస్పీ నాయకురాలు మాయావతి అసలే ఒప్పుకోరని మధు యాష్కీ వ్యాఖ్యానించారు. తెలంగాణ అంశాన్ని తేల్చకుండా ఎన్నికలకు వెళ్తే గత ఎన్నికల నాటి ఫలితాలు తారుమారవుతాయని ఎక్కువ మంది సభ్యులు అన్నారు.

అభివృద్ధితో ఓట్లు సాధిద్దాం: జీవన్‌రెడ్డి

'రెండో ఎస్సార్సీతో నిమిత్తం లేకుండా తెలంగాణ ఇవ్వాలని కోరుతున్నాం.. అధిష్ఠానం తిరస్కరిస్తే మరిన్ని చిక్కుల్లో పడతాం' అని మంత్రి జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. మరేదైనా ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తే మంచిదని సూచించారు. దాని గురించి ఆలోచిస్తే ముందుకు వెళ్లలేమని, ఎలాగైనా తెలంగాణ అంశంపై అధిష్ఠానం నుంచి ప్రకటన వచ్చేందుకు కృషి చేద్దామని సభ్యులు అన్నారు. అభివృద్ధితో ఓట్లు సాధిద్దామని జీవన్‌రెడ్డి అనగా.. కరీంనగర్‌ ఉప ఎన్నికలో అభివృద్ధి ఏమైందని సభ్యులు ప్రశ్నించారు (ఈ ఉపఎన్నికలో జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌ తరపున పోటీచేసి తెరాస అధినేత కేసీఆర్‌ చేతిలో ఓడిపోయారు). అభివృద్ధి కంటే సెంటిమెంటు బలంగా ఉందని పలువురు అన్నారు. అభివృద్ధి అంశం చర్చకు వచ్చినపుడు జీవన్‌రెడ్డి, సీనియర్‌ ఎమ్మెల్యే పీజేఆర్‌ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. 'అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు... ఎక్కడుంది అభివృద్ధి' అని పీజేఆర్‌ అనగా.. తాను కరీంనగర్‌ గురించి మాట్లాడుతున్నానని మంత్రి సమాధానమిచ్చారు.

సెంటిమెంటును కాదంటే అంతే!

కరీంనగర్‌ ఉప ఎన్నిక, సింగరేణి కార్మిక సంఘ ఎన్నికలు, శాసనమండలి ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉన్న విషయాన్ని స్పష్టంగా చూశామని, దీన్ని విస్మరిస్తే ఇబ్బందుల్లో పడతామని వీహెచ్‌, మధు యాష్కీ సహా మరి కొందరు సభ్యులు అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆంధ్రలోను కాంగ్రెస్‌ గెలుస్తుందని, కేంద్రంలో సోనియాగాంధీ నేతృత్వంలో ప్రభుత్వం రావడానికి తోడ్పడుతుందని వీహెచ్‌ అన్నారు. తెలంగాణను కాదంటే ఈ ప్రాంతంలో గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు తారుమారై తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరుతుందన్నది గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్‌రెడ్డి, పులివీరన్న తదితరులు వ్యాఖ్యానించారు. టీఆర్‌సీసీసీలో ఉన్న మంత్రులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేరని, ఈ నేపథ్యంలో టీఆర్‌సీసీసీని పునర్‌వ్యవస్థీకరించాలని ఎంపీ సర్వే సత్యనారాయణ అన్నారు. భూముల విక్రయాల అంశాన్ని తెలంగాణ ప్రణాళిక, అభివృద్ది మండలి ఛైర్మన్‌ ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి లేవనెత్తగా.. ఈ అంశంపై వీహెచ్‌, పీజేఆర్‌ మాట్లాడారు. దీంతో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో భూముల విక్రయాల ద్వారా వచ్చే రాబడిని ఇతర ప్రాంతాల అభివృద్ధికి వినియోగించకుండా ఇక్కడే వ్యయం చేయాలని అత్యధిక సభ్యులు అభిప్రాయపడ్డారు. 'అసలు డబ్బులెక్కడ వస్తున్నాయి.. ఎకరం భూమిని ఒక రూపాయికి ఇస్తుంటే' అని పీజేఆర్‌ విమర్శించారు.

అందరి కంటే ముందుంటా: మీరు రాష్ట్రం మొత్తానికి పీసీసీ అధ్యక్షుడు కావడం వల్ల మీకు కొన్ని ఇబ్బందులుంటాయి అని కేశవరావును ఉద్దేశించి సర్వే సత్యనారాయణ అన్నారు. కొందరు తనను శంకిస్తుంటారని, అందరికంటే ఎక్కువగా తెలంగాణ రాష్ట్రం కావాలని కోరేవాడిని తానేనంటూ కేకే స్పందించారు. నేను కొట్లాడినపుడు మీరంతా లేరని వ్యాఖ్యానించి.. తెలంగాణ రాష్ట్రం కోసం అందరికంటే తానే ముందుంటానని చెప్పారు.

Tuesday, September 4, 2007

ఉద్యమానికి పునరంకితమవుదాం Eenadu

కేసీఆర్‌ పిలుపు 'గో బ్యాక్‌' అమర వీరులకు శ్రద్ధాంజలి

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: త్యాగాల పునాదిపై జరిగిన ఆనాటి పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పునరంకితమవ్వాలని తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు. 'ఇడ్లీ సాంబర్‌ గో బ్యాక్‌.. నాన్‌

ముల్కీ గో బ్యాక్‌' ఉద్యమంలో అసువులు బాసిన వారి సంస్మరణార్థం హైదరాబాద్‌లోని గన్‌పార్కులో గల అమరవీరుల స్థూపం వద్ద మంగళవారం తెరాస ఏడు భారీ కొవ్వొత్తులను వెలిగించి శ్రద్ధాంజలి ఘటించింది. నాన్‌ ముల్కీ గో బ్యాక్‌.. జై తెలంగాణ లాంటి నినాదాలు ఈ సందర్భంగా మిన్నంటాయి. కేసీఆర్‌ ప్రసంగిస్తూ.. ఆంధ్ర ప్రాంతం మద్రాసులో అంతర్భాగంగా ఉన్నప్పటి నుంచి తెలంగాణపై వలసవాదుల దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. తెలంగాణను హేళన చేస్తూ అప్పటి మద్రాసు ప్రభుత్వ నేతలు చేసిన ప్రకటనలపై తెలంగాణ విద్యార్థులు 1949లో 'ఇడ్లీ సాంబార్‌ గో బ్యాక్‌.. నాన్‌ ముల్కీ గో బ్యాక్‌' నినాదంతో ఆందోళన ఉద్ధృతం చేశారన్నారు. ఈ సమయంలో సిటీ కాలేజీ వద్ద పోలీసులు కాల్పులు జరిపి ఏడుగురు విద్యార్థులను పొట్టన పెట్టుకున్నారని గుర్తుచేశారు. తెలంగాణ వాదులపై, ఉద్యమకారులపై అవి తొలి పోలీసు కాల్పులన్నారు. ఆ దమననీతి, మోసం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్‌ జోహారులు.. జోహారులు.. అమవీరులకు జోహారులంటూ గీతాలను ఆలపించి అందరి కర్తవ్యాన్నీ గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో తెరాస ఎమ్మెల్యేలు నాయిని నర్సింహ్మారెడ్డి, పద్మా దేవేందర్‌రెడ్డి, రామలింగారెడ్డి, పార్లమెంట్‌ సభ్యులు రవీంద్రనాథ్‌, ఎమ్మెల్సీలు దిలీప్‌, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Monday, September 3, 2007

తెలంగాణ కోసమే ఎస్సార్సీ వేయాలి Eenadu

ఉప్పునూతల స్పష్టీకరణ తేలిగ్గా చూస్తే ద్రోహం చేసినట్లే: మధు యాష్కీ
తెలంగాణ అంశాన్ని పక్కనబడేసినా, దాని ప్రభావం ఎన్నికలపై ఉండదని తేలిగ్గా తీసేసినా తెలంగాణకు ద్రోహం చేసినట్లేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి, నిజామాబాద్‌ ఎంపీ మధు యాష్కీ అన్నారు. వారు సోమవారం వేర్వేరుగా న్యూస్‌టుడేతో మాట్లాడారు. తెలంగాణ అంశాన్ని రెండో ఎస్సార్సీ ద్వారానే పరిష్కరించాలనుకుంటే ప్రత్యేకంగా దాని కోసమే వేయాలని తెలంగాణ ప్రాంతీయ ప్రణాళిక, అభివృద్ధి బోర్డు ఛైర్మన్‌ అయిన ఉప్పునూతల స్పష్టంచేశారు.



కాలయాపన చేయడం కన్నా.. ఎన్నికలకు ముందే తెలంగాణపై పార్టీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాలన్నారు. తెలంగాణ ప్రభావం ఉండదని తేలిగ్గా తీసిపడేస్తే మాత్రం తెలంగాణకు ద్రోహం చేసినట్లని అన్నారు. టీఆర్‌సీసీసీ సమావేశంలో ఈ అంశాలపై మాట్లాడతానని తెలిపారు. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని, 2009 ఎన్నికల్లోపు కాంగ్రెస్‌ దీనిపై నిర్ణయం తీసుకోవాలని మధు యాష్కీ చెప్పారు. రెండో ఎస్సార్సీ కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఉన్న అంశమే అయినా ఇప్పుడు ఎస్సార్సీ ద్వారా ఫలితాలు రావడం కష్టమని తెలిపారు. ఏకాభిప్రాయం ద్వారా తెలంగాణ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని ప్రకటించిన అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. తెలంగాణ అంశాన్ని తేలిగ్గా తీసేస్తే ద్రోహం చేసిన వాళ్లవుతారని హెచ్చరించారు. టీఆర్‌సీసీసీ విశ్వసనీయత కోల్పోయిందన్నారు. 2004 ఎన్నికలకు ముందు ఏర్పాటైన టీఆర్‌సీసీసీ ఇంకా అప్పటి సభ్యులతోనే కొనసాగుతోందని ఆక్షేపించారు. ఎంపీలుగా ఆహ్వానిస్తే టీఆర్‌సీసీసీ సమావేశానికి వెళ్తానన్నారు.




Monday, August 27, 2007

పాఠశాల విద్యాశాఖలో స్థానికేతరుల గుర్తింపు పూర్తి Eenadu

హైదరాబాద్‌, ఆగస్టు 27 : 610 జీఓ అమలుపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘంతో ముఖ్యమంత్రి ఈరోజు భేటీ అయ్యారు. అనంతరం వివరాలను మంత్రివర్గ ఉప సంఘం అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ తెలిపారు. పాఠశాల విద్యాశాఖలో స్థానికేతరుల గుర్తింపు పూర్తయిందని అయితే వారి పూర్తి వివరాలు పొందుపరచవలసి ఉందని చెప్పారు. 1975 నుంచి నియామకాల పరిశీలన పూర్తయితే స్థానికేతరుల సంఖ్య మరో రెండు వేలవరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మిగతా శాఖల్లో 610 జీఓకు సంబంధించి స్థానికేతరుల గుర్తింపు ఈ నెలాఖరుకు పూర్తవుతుందని తెలిపారు.

Friday, August 24, 2007

గోనెపై విద్యార్థుల దాడి గాజులు, పసుపు కుంకుమలు జల్లి నిరసన Eenadu

యాష్కీపై ఆరోపణలకు ఖండన

ఎదుగుదల చూసి ఓర్వలేకపోతున్నారని ధ్వజం

ప్రతిఘటించిన ప్రకాశరావు; ఎదురుదాడి

న్యూస్‌టుడే


ఆర్టీసీ మాజీ ఛైర్మన్‌, మాజీ శాసనసభ్యుడు గోనె ప్రకాశరావుపై ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. శుక్రవారం స్థానిక ఫతేమైదాన్‌ క్లబ్‌లో విలేకరుల సమావేశంలో గోనె మాట్లాడుతున్నప్పుడు ఈ దాడి జరిగింది. తెలంగాణకు, తెలంగాణ బీసీ నేతలకు ఆయన వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ ఆ విద్యార్థులు ధ్వజమెత్తారు. దాడి సందర్భంగా గోనె, ఆయనతో ఉన్న కాంగ్రెస్‌ నేతలు గట్టిగానే ప్రతిఘటించారు. దీంతో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. ఒకరిపై మరొకరు చేయిచేసుకున్నారు. మొత్తానికి నిజామాబాద్‌ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌పై గోనె చేసిన ఆరోపణలు ఈ దాడికి కారణమైనట్లు స్పష్టమవుతోంది. శుక్రవారం కూడా మధుయాష్కీపై ఆయన సరికొత్త ఆరోపణలు చేస్తున్న తరుణంలోనే విద్యార్థుల దాడి జరిగింది. విలేకరుల సమావేశం ముగుస్తున్న తరుణంలో వట్టికూటి రామారావు అనే విద్యార్థి వేదికపైకి వెళ్లి మొదట గోనెపై దాడికి పాల్పడ్డారు. ఈ హఠాత్‌పరిమాణం నుంచి వెంటనే తేరుకున్న గోనె, ఆయన పక్కనే ఉన్న ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌, ఎస్సీ, ఎస్టీ సెల్‌ కన్వీనర్‌ రవిబాబు, పీసీసీ కార్యదర్శి నిరంజన్‌లు ప్రతిఘటించారు. రామారావుపై ప్రతి దాడి చేశారు. ఇంతలోనే గాజుల శ్రీధర్‌ అనే మరో విద్యార్థి పసుపు, కుంకుమ, గాజులను తీసుకొచ్చి గోనెపై వేశారు. మూడో విద్యార్థి నాగరాజూ వారితో జతకలిశారు. తెలంగాణ బీసీ నాయకులను ఎదగనీయకుండా అడ్డుకుంటున్నారని వారు గోనెపై ఆరోపణలు చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సహించేది లేదని పెద్దఎత్తున నినాదాలు చేశారు.

ఎవరికైనా ఇదే శాస్తి యాష్కీ ఎదుగుతున్న బీసీ నాయకుడు కావడంతో ఓర్వలేకే ఆయనపై ఆరోపణల దాడికి పాల్పడుతున్నారని రామారావు ఆరోపించారు. అవకతవకలుంటే సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేయాలని.. అలా కాకుండా ఓర్వలేనితనంతో ఇలా కుట్ర పన్నడం తగదంటూ మండిపడ్డారు. బీసీ వ్యతిరేకుల దాడుల్ని ప్రతిఘటిస్తామన్నారు. మధుయాష్కీ తెలంగాణ అడుగుతుండటం కొందరికి ఆగ్రహం తెప్పిస్తోందంటూ.. ముఖ్యమంత్రికి గోనె తొత్తుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బీసీలకు, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని ఎక్కడైనా ఇలాగే ప్రతిఘటిస్తామన్నారు.

విద్యార్థుల అరెస్టు దాడికి పాల్పడిన ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి సైఫాబాద్‌ స్టేషన్‌కు తరలించారు. ఈలోగా యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్‌బాబు, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు కెం.ఎం.ప్రతాప్‌ అక్కడికి చేరుకొని గోనెను పరామర్శించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు మధు యాష్కీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ముగ్గురు విద్యార్థులపైనా, వారితోపాటు వచ్చిన మరికొందరు విద్యార్థులపైనా కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. వారిపై ఐపీసీ 143, 323, 341 సెక్షన్ల కింద కేసులు నమోదుచేసినట్లు వివరించారు. మరోవైపు నిందితుల్లో ఒకరైన రామారావు గోనెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై ఐపీసీ 506, 323 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇంటిపేరు మార్చి 2 పాస్‌పోర్టులు: గోనె ఇంటి పేరు మార్చి మధుయాష్కీ నిబంధనలకు విరుద్ధంగా రెండు పాస్‌పోర్టులు పొందినట్లు గోనె అంతకుముందు ఆరోపించారు. మొదట మధుసూదన్‌ యాష్కీ అనే పేరుతో పొందిన పాస్‌పోర్టుకు వీసా రాకపోవడంతో.. ఇంటి పేరు మార్చి మరో పాస్‌పోర్టు పొందినట్లు తెలిపారు. ఆయన సోదరులిద్దరు, సోదరి, బావమరిది కూడా నకిలీ సర్టిఫికెట్లతో హెచ్‌-1 వీసా పొంది, గ్రీన్‌కార్డు కూడా పొందినట్లు ఆరోపించారు. గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి పొందినట్లు చెబుతున్న ఇంజినీరింగ్‌ డిగ్రీలు నకిలీవని తేలాయన్నారు. వీటన్నిటిపై అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

వైఎస్‌కు యాష్కీని పరిచయం చేసిందే నేను దాడి ఘటన అనంతరం కూడా గోనె విలేకరులతో మాట్లాడారు. తాను బీసీలకు వ్యతిరేకం కాదని స్పష్టంచేశారు. దాడులకు భయపడబోనని, మధుయాష్కీకి సంబంధించి తాను వెలుగులోకి తీసుకొస్తున్న అంశాలను ఆపబోనని తేల్చిచెప్పారు. వైఎస్‌కు మధుయాష్కీని పరిచయం చేసిందే తానని ఆయన పేర్కొన్నారు. టికెట్‌ తనవల్లే వచ్చిందని యాష్కీనే స్వయంగా చెప్పారని తెలిపారు.

వ్యక్తిగత విమర్శలు తప్పే: కేకే గోనె మీద జరిగిన దాడిపై స్పందించేందుకు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దిగ్విజయ్‌ సింగ్‌ నిరాకరించారు. మీడియా ప్రతినిధులు ఢిల్లీలో ఆయన స్పందన కోరగా.. ''నేనెందుకు పీసీసీ అధ్యక్షుడు కె.కేశవరావు ఇక్కడే ఉన్నారుగా.. ఆయనే స్పందిస్తారని'' చెప్పారు. కేకే మాట్లాడుతూ.. ఆ విషయం ఇంకా తన దృష్టికి రాలేదన్నారు. అన్ని విషయాలనూ తాను పరిశీలిస్తానని చెప్పారు. మరి మధుయాష్కీపై గోనె చేసిన ఆరోపణల సంగతేమిటని అడగ్గా.. అలా వ్యక్తిగత విమర్శలకు దిగడం తప్పేనన్నారు.

గోనె ప్రకాశరావుపై విద్యార్థుల దాడి Eenadu

హైదరాబాద్‌: బీసీలకు, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ ఆర్టీసీ మాజీ ఛైర్మన్‌ గోనె ప్రకాశరావుపై కొంతమంది ఓయూ విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ఫతేమైదాన్‌లో మీడియా సమావేశం జరుగుతుండగా విద్యార్థులు దూసుకువచి ప్రకాశరావుపై చేయి చేసుకున్నారు. దీంతో గోనెకు, విద్యార్థులకు మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. ప్రకాశరావు కూడా విద్యార్థులపై ఎదురుదాడికి దిగారు. మధుయాష్కీ తెలుగుదేశం పార్టీ ఏజెంటు అంటూ నిన్న ప్రకాశరావు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ దాడి జరిగిందని తెలుస్తోంది. తనపై దాడి వెనుక కారకులెవరో తెలుసునని గోనె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఉన్న మధుయాష్కీ దీనిపై స్పందిస్తూ, తనకు గోనె ప్రకాశరావుకు మధ్య ఎలాంటి విబేధాలు లేవని అన్నారు.

Monday, August 13, 2007

త్వరలో మరికొందరు కానిస్టేబుళ్ళ బదిలీ

కొత్త గడువు సెప్టెంబరు: జానారెడ్డి
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: పోలీసుశాఖలో 610 జీవో అమలులో భాగంగా త్వరలో మరికొందరు కానిస్టేబుళ్ళను స్వస్థలాలకు పంపుతున్నట్లు హోంమంత్రి జానారెడ్డి తెలిపారు. కొత్తగా ఎంపికైన సుమారు 2700 మంది కానిస్టేబుళ్ళను ఈ నెలఖారులోపు నియమించే అవకాశం ఉన్నందున ఆమేరకు స్థానికేతరులను బదిలీ చేస్తామన్నారు. 610 జీవోపై సోమవారం ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. ఇందులో జానారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నిశాఖల్లో కలిపి 8718 మంది స్థానికేతరులు ఉన్నట్లు గుర్తించగా వారిలో 958 మందిని ఇప్పటికే స్వస్థలాలకు పంపామని చెప్పారు. సెప్టెంబరు చివరినాటికి అన్నిశాఖల్లోనూ స్థానికేతరుల బదిలీ ప్రక్రియ పూర్తిచేస్తామని తెలిపారు. ముందు బదిలీ చేసి అవసరమైతే మళ్ళీ డిప్యూటేషన్లపై తీసుకుంటామని, కొత్తవారు చేరగానే ఈ డిప్యుటేషన్లు రద్దు చేస్తామని హోంమంత్రి జానారెడ్డి వివరించారు

Saturday, August 11, 2007

నాలుగు లక్షల మంది విద్యార్థులతో ఉద్యమం

తెలంగాణ వచ్చేదాకా పోరు ఆగదు శిక్షణ శిబిరంలో కేసీఆర్‌ ఉద్ఘాటన
నాలుగు లక్షల మంది విద్యార్థులతో పటిష్టమైన విద్యార్థి విభాగాన్ని రూపొందించుకుని ప్రత్యేక తెలంగాణ సాధన కోసం పోరాడతామని తెరాస అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. శనివారం ఇక్కడి తెలంగాణ భవన్లో తెరాస విద్యార్థి విభాగం సభ్యుల తొలిదశ శిక్షణ శిబిరంలో ఆయన ప్రసంగించారు. ఇప్పటికే 15,000 మంది విద్యార్థులు తమ విభాగంలో చేరారని, వీరికి ఆర్నెల్ల పాటు శిక్షణ ఇస్తామని చెప్పారు. అనంతరం మరో 15,000 మంది విద్యార్థినులకు డివిజన్‌ స్థాయిలో శిక్షణ ఇస్తామన్నారు. హింసకు దిగడమే ఉద్యమం కాదని, ప్రజాస్వామ్యయుతంగా బలీయమైన రాజకీయ శక్తిగా ఎదిగి తెలంగాణను సాధించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. 'ఈ దఫా తెలంగాణ వచ్చేదాకా పోరు జరిగి తీరుతుంది. తెలంగాణకు అనాదిగా అన్యాయం జరుగుతోంది. నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఇచ్చిన 36 జీవోకు వ్యతిరేకంగా మంత్రి దామోదరం సంజీవయ్యే కోర్టుకెక్కారు. ఇప్పుడు 610పై కాంగ్రెస్‌ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య కోర్టుకు వెళ్లారు. అనాదిగా తెలంగాణకు ఇదే అన్యాయం జరుగుతోంది. వీటినుంచి బయట పడాలంటే ప్రత్యేక రాష్ట్రమే శరణ్యం. ఈ విద్యార్థులు ఏడాదికి 15 రోజుల పాటు ముఖ్యమైన రోజుల్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు' అని కేసీఆర్‌ వివరించారు. ఈ శిబిరంలో సూర్యాపేట (నల్గొండ), గద్వాల (మహబూబ్‌నగర్‌), కమలాపురం (కరీంనగర్‌) నియోజకవర్గాల నుంచి 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సాగునీటి రంగంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గురించి వారికి కేసీఆర్‌ వివరించారు. అనంతరం దేశిపతి శ్రీనివాస్‌, విద్యాసాగరరావు, ప్రకాశ్‌, ఇతర తెలంగాణ మేధావులు వివిధ రంగాల్లో తెలంగాణ పట్ల ప్రభుత్వం చూపుతున్న వివక్ష గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ విభాగాల నేతలు పాల్గొన్నారు.

Thursday, July 26, 2007

'610'పై ఆంధ్ర ఎమ్మెల్యేల ఆందోళన? Andhra Jyothy

హైదరాబాద్‌, జూలై 26 (ఆన్‌లైన్‌): 610 ఉత్తర్వును అమలు చేయాలంటూ ఇప్పటివరకూ తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తూ వస్తే.. ఇప్పుడు ఆంధ్ర-రాయలసీమ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళనకు సమయాత్తమవుతున్నారు. ఈ జీవో విషయంలో ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలపై పార్లమెంటు సభ్యుడు చేగొండి హరిరామజోగయ్య, సీనియర్‌ శాసనసభ్యుడు గాదె వెంకటరెడ్డి, తదితర నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతానికి చెందిన 60 మంది ఎమ్మెల్యేల సంతకాలను వీరు సేకరించారు. మరికొందరి సంతకాలను సేకరిస్తున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఈ ప్రాంత ఎమ్మెల్యేలు సమావేశమై ఈ జీవో విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై చర్చించి, తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి తెలపనున్నారు.

నష్టపోయేది తెలంగాణ ఒక్కటేనా...!
నష్టపోయేది తెలంగాణ ఒక్కటేనా...!ప్రభుత్వం ఇప్పటి వరకూ తెలంగాణ ప్రాంతానికే ప్రా ధాన్యతను ఇస్తోందని.. ఆంధ్ర, రాయలసీమ నేతల వాదనలు వినేందుకు సముఖతను వ్యక్తం చేయడం లేదన్న ఆగ్రహం ఆ నేతల్లో వ్యక్తమవుతోంది. ఈ ఉత్తర్వును అమ లు చేస్తున్నప్పుడు కేవలం తెలంగాణ ప్రాంతానికే అన్యా యం జరుగుతోందన్న భావం ప్రభుత్వంలోనూ, అధికారుల్లోనూ కన్పిస్తోందే తప్ప.. ఇతర ప్రాంతాలకు జరిగే నష్టాన్ని గురించి ఆలోచించడం లేదని వారంటున్నారు. 610పై తాము మాట్లాడిన ప్రతిసారీ, ఈ ఉత్తర్వు అమలుకు తాము వ్యతిరేకమన్న ప్రచారాన్ని తెలంగాణ నేతలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు.. దీన్ని అమలు చేయాలని కోరుకుంటున్నదే తా మని, అయితే.. రాష్ట్రపతి ఆదేశాలు, ఆరు సూత్రాల కార్యక్రమానికి లోబడి మాత్రమే ఇది జరగాలని వారు స్పష్టం చేస్తున్నారు.