హైదరాబాద్, జూలై 1 (ఆన్‌లైన్) : ఆంధ్రా అధికారులతో 610 ఉత్తర్వు అమలు సాధ్యం కాదని శాసనమండలి సభ్యుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి భావిస్తున్నట్టుగా ఈ ఉత్తర్వును చిత్తశుద్ధితో అమలు చేయాలంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉత్తరాదికి చెందిన అధికారిని నియమించాలని పేర్కొన్నారు. అదేవిధంగా సాధారణ పరిపాలనా విభాగం కార్యదర్శిగానూ, హోం శాఖ కార్యదర్శిగానూ ఆంధ్రా ప్రాంతానికి చెందిన అధికారులకు బదులు ఇతర ప్రాంతాలకు చెందినవారే ఉండడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
స్థానికేతర ఉద్యోగులు లక్షల్లో ఉంటే.. కేవలం నాలుగువేల మంది మాత్రమేనని అధికారులు పేర్కొనడంతోనే.. ఆంధ్రా ప్రాంత అధికారులతో 610 అమలు సాధ్యం కాదని తేలిపోయిందని పేర్కొన్నారు. ఏయే విభాగాల్లో ఎందరెందరున్నారన్న సమాచారాన్ని 1975 నుంచి వెలికి తీస్తే.. స్థానికేతరుల అసలు సంఖ్య బయట పడుతుందని అన్నారు. 610 ఉత్తర్వులను ఆరుసూత్రాల కార్యక్రమం స్ఫూర్తితో అమలు చేయాలని ఆయన కోరారు.
Sunday, July 1, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment