ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడులు తెలంగాణను విడిచి పెట్టాలి. అప్పుడే మా నీళ్లు,మా భూమి, మా నిధులు, మా ఉద్యోగాలు అన్నింటికంటే ముఖ్యంగా మా హక్కులు మాకు దక్కుతాయి. తెలంగాణేతరుల పాలనలో ఈ ప్రాంతం రక్తాన్ని చిందించి ఉద్యమాల బాట పట్టింది. ఇకనైనా మా తెలంగాణను మాకు వదిలేసి మీ ప్రాం తానికి బయల్ధేరండి' అంటూ ప్రజా గాయకుడు గద్దర్ నిప్పులు కక్కారు. ఆదివారం నల్లగొండ పట్టణంలో తెలంగాణ ఐక్య కార్యచరణ కమిటీ ఏర్పాటుచేసిన సమరభేరి ఆటాపాట కార్య క్రమానికి గద్దర్ ముఖ్యఅతిధిగా విచ్చేసి మాట్లాడారు. వై.ఎస్ ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయాన్ని చేస్తుందని గద్దర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బూర్జువా పాలకులు తెలంగాణా ప్రజలను మోసం చేయడానికే జి.ఓలు, కమిషన్‌లు, పధ కాలను ప్రవేశపెడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ మోసాలు మాకొద్దుమా తెలంగాణ మాకు కావాలి అని గద్దర్ డిమాండ్ చేశారు. ఎన్నికలలో ఇచ్చిన హమీలను విస్మరిస్తేనే ప్రభుత్వాలకు, ప్రజా ప్రతినిధులకు వ్యతిరేకంగా ఉద్యమాలు పుట్టు కొస్తాయని చెప్పారు. దగాకోరు వైఎస్ ప్రభుత్వాన్ని భూ స్థాపితం చేయాలంటే ఉద్య మాలకే సాధ్యమని అన్నారు. పోతిరెడ్డిపాడు,పులిచింతల ప్రాజెక్టులు కట్టి తెలంగాణ ప్రజలను ముంచిన నీళ్లతో ఆంధ్ర, రాయలసీమ రైతులకు అన్నం పెట్టడానికి వైఎస్ కుట్రపన్నుతున్నాడని గద్దర్ ఆరోపించారు. తెలంగాణ వాదులు తిరుగుబాటుకు సిద్దమై 'క్విట్ తెలంగాణ' నినాదంతో ఉద్యమాలను బలోపేతం చేయాలని ఏవిధంగానూ స్థానికే తరులకు సాయపడద్దని గద్దర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐక్యకార్యచరణ కమిటీ కన్వీనర్ పాశం యాదగిరి పాల్గొన్నారు.
Sunday, July 1, 2007
వై.ఎస్, బాబు తెలంగాణ వదిలిపోవాలి: గద్దర్ Vaartha
నల్లగొండ, జూలై 1, ప్రభాతవార్త'
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment