వినోద్‌కు లగడపాటి సవాల్
హైదరాబాద్, జూలై 1 (ఆన్‌లైన్): ప్రభుత్వోద్యోగులకు సంబంధించిన సమస్యను ప్రాంతీయ విభేదాలుగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ప్రయత్నిస్తున్నారని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ఆదేశాలూ, 610 ఉత్తర్వులోని అంశాలపై బహిరంగంగా చర్చించేందుకు తాను సిద్ధమేనని టి ఆర్ ఎస్ ఎంపీ వినోద్‌కు మరోసారి స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వు అమలును రాజకీయం చేయవద్దని తాను మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి నేతలను కోరుతున్నానని ఆదివారం 'ఆన్‌లైన్'తో మాట్లాడుతూ చెప్పారు.
610 ఉత్తర్వులను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు .. ఈ ఉత్తర్వులను తూ.చ తప్పకుండా అమలు చేస్తే ఎవరికి నష్టం జరుగుతుందో గ్రహించాలని సూచించారు. రాష్ట్రపతి ఆదేశాలు, ఆరు సూత్రాల కార్యక్రమం ప్రకారం జోనల్ విధానాన్ని అనుసరించాలని, అదేవిధంగా.. పోలీసు, ఉపాధ్యాయ నియామకాలు జిల్లా యూనిట్‌గా ఉంటున్నందున.. వీటిలో 610 అమలు చేస్తే స్థానభ్రమసం జరిగేది తెలంగాణ ప్రాంత ఉద్యోగులకేనని గుర్తెరగాలని పేర్కొన్నారు.
పైగా.. ఈ సమస్య కేవలం ఉద్యోగులకు మాత్రమే సంబంధించినదని.. దానిని రాజకీయ రాద్ధాంతం చేసేందుకు టిఆర్‌ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఈ అంశాలపై బహిరంగంగా చర్చించేందుకు రావాలని తాను ఎంపీ వినోద్‌ను కోరానని అన్నారు. అయితే.. ఆయన వరంగల్‌లో ఉన్నట్లు చెప్పారని వివరించారు. ఈ అంశంపై ఐదో తేదీన బహిరంగంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని.. అయితే.. ఇంకా సమావేశ స్థలాన్ని ఖరారు చేయలేదని ఆయన చెప్పారు. వాటిని త్వరలోనే వెల్లడిస్తానని అన్నారు.

No comments:
Post a Comment