Friday, December 28, 2007
జనార్దనరెడ్డి అంతిమయాత్ర ప్రారంభం, Andhra Jyothi, 29th Dec, 07
హైదరాబాద్, డిసెంబర్ 29 : గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే జనార్దన రెడ్డి అంతిమయాత్ర శనివారం ఉదయం పది గంటలకు ప్రారంభమయింది. దోమల్‌గూడలోని పిజెఆర్ స్వగృహం నుండి పిజెఆర్ భౌతికకాయాన్ని లక్డీకపూల్ మీదుగా గాంధీభవన్‌కు ఊరేగింపుగా తరలిస్తున్నారు. గాంధీభవన్‌లో రెండు గంటల పాటు పిజెఆర్ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్దనార్దం ఉంచుతారు. అనంతరం అబిడ్స్, కోఠి, చాదర్‌ఘాట్‌ల మీదుగా పిజెఆర్ భౌతిక కాయాన్ని తరలించి అంబర్‌పేట స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అంబర్‌పేట స్మశాన వాటికలో నిర్వహిస్తున్న అంత్యక్రియలకు పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు పిజెఆర్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు హాజరుకానున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment