హైదరాబాద్, డిసెంబర్ 28 : ఖైరతాబాద్ ఎమ్మెల్యే పి.జనార్థనరెడ్డి హఠాన్మరణం చెందారు. అకస్మాత్తుగా తీవ్రమైన గుండెపోటు రావటంతో ఆయన మృతి చెందారు. సికింద్రాబాద్‌లోని జ్యువెల్ గార్డెన్స్‌లో ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ఏర్పాటుచేశారు. ఇందులో పాల్గొనేందుకు ఆయన కారులో వచ్చారు. గేటు దిగుతుండగా ఆయనకు చెమటలు పట్టి ఒళ్లు చల్లబడి స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే ఆయనను సమీపంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ఆయన తీవ్రమైన గుండెపోటుతో అప్పటికే మరణించినట్లు తెలిపారు. ఉదయం 11.40 గంటలకు ఆయన మరణించినట్లు ధృవీకరించారు. ఈ వార్త తెలియగానే పార్టీలో విషాదం అలముకొంది. జనార్థనరెడ్డికి 59 సంవత్సరాలు. 1948లో జన్మించారు. 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై హైదరాబాద్‌లో కాంగ్రెస్‌పార్టీకి గుండెకాయగా మారారు.
Friday, December 28, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment