Friday, December 28, 2007
పీజేఆర్‌కు నేతల నివాళులు
హైదరాబాద్, డిసెంబర్ 28 : పీజేఆర్ మృతికి పలువురు నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన హఠాన్మరణం పార్టీకి, కార్యకర్తలకు తీవ్ర విషాదాన్ని కలిగించిందని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అన్నారు. పీజేఆర్ కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్థన్‌రెడ్డి, మంత్రి రఘువీరారెడ్డి, గీతారెడ్డి, షబ్బీర్‌అలీ, ఎంపీ వీహెచ్‌తదితరులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి నగరానికి తీరని లోటని సీపీఎం, సీపీఐ ప్రకటించాయి. తెలంగాణా సంస్కృతికి పీఏఆర్ ప్రతీక అని కాంగ్రెస్‌లో ఉన్నా తెలంగాణా ఉద్యమానికి మద్దతు తెలిపారని గద్దర్ అన్నారు. అట్టడుగుస్థాయినుంచి ప్రజానాయకుడిగా ఎదిగారని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారని లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణ అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment