పరిపాలన ట్రైబ్యునల్ ఆదేశం
610 జీవో అమలులో భాగంగా పోలీసుల బదిలీకి జారీచేసిన ఉత్తర్వుల అమలుకు పరిపాలన ట్రైబ్యునల్ బ్రేకులు వేసింది. వారి బదిలీలపై యథాతథ స్థితిని మరో రెండు వారాలపాటు కొనసాగించాలని ఆదేశించింది. పోలీసు శాఖ ఉత్తర్వులను సవాలు చేస్తూ గత వారం సుమారు 60 మంది దాకా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా, యథాతథ స్థితిని అమలు చేయాలని ఆదేశించిన విషయం విదితమే. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి కౌంటరూ దాఖలు చేయలేదు. మంగళవారం ఆ శాఖ ఉత్తర్వులపై మరో 800 మంది దాకా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. వీటిపై కూడా యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
Tuesday, July 3, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment