పాలకొల్లు, న్యూస్‌టుడే:
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వల్ల ఆంధ్ర ప్రాంత ప్రయోజనాలకు విఘాతమేర్పడుతోందని ప్రత్యేకాంధ్ర ఉద్యమనేత, నరసాపురం ఎంపీ చేగొండి వెంకటహరరామజోగయ్య వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సమితి చెప్పినదానికి ప్రభుత్వం తలూపుతోందని, రాష్ట్రపతి ఉత్తర్వుల్లో లేని అంశాలను 610 జీవో ద్వారా అమలు చేయటానికి ప్రయత్నిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. దీనిపై రెండు మూడు రోజుల్లో హైకోర్టులో రిట్ వేస్తానని చెప్పారు. అసలీ జీవోలో రాష్ట్రపతి ఉత్తర్వుల్లో లేని అంశాలను చేర్చవద్దని, ఆంధ్రలో సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లేకుండా చేయవద్దని పదే పదే కోరుతున్నా ప్రభుత్వం స్పందించలేదన్నారు. దీనికి ఆంధ్రప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎం.ఎల్.సి.ల అసమర్థతే కారణమన్నారు.
Tuesday, July 3, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment