నాలుక తెగ్గోస్తాం
టీజేకు నరేంద్ర హెచ్చరిక
హైదరాబాద్, జూలై 2 (ఆన్‌లైన్) తెలంగాణను పూర్తిగా వ్యతిరేకిస్తున్న చంద్రబాబు, ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిలు రాహు, కేతువులు అయితే.. తెలంగాణకు అడ్డుపడుతున్న సైంధవుడు కేసీఆర్ అని టీఆర్‌ఎస్(ఎన్) అధ్యక్షుడు నరేంద్ర అభి వర్ణించారు.. తెలంగాణను కాంక్షించే వారంతా ఒక వేదికపైకి రావాలని ఆయన సోమవారంనాడిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పిలుపుని చ్చారు.
610 జీవో అమలు కోసం సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చి.. ఆ కార్యక్రమంలో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదని నిలదీశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా వలస వాద ఉన్నతా ధికారులు ఉన్నంత వరకు జీవో అమలు కాదని పేర్కొన్నారు. సీమ ఉద్యోగులపై చెయ్యేస్తే.. తీసేస్తామంటూ పిచ్చివాగుడు వాగుతున్న వారి నాలిక తెగ్గోస్తామని నరేంద్ర హెచ్చరించారు.
కాంగ్రెస్ ఎంపీ లగడపాటి, రాయలసీమ హక్కుల వేదిక నాయకుడు టీజీ వెంకటేశ్ సభ్యత, సంస్కారం లేకుండా గూండాలుగా, ఫ్యాక్షనిస్టులుగా, వీధి రౌడీ లుగా మాట్లాడుతున్నారని నరేంద్ర ఆక్షేపించారు. 610 జీవో అమలు చేయాలని అందరూ కొరుతుంటే పీసీసీ అధ్యక్షునికి మాత్రం అరుపులు, కేకలు, రాద్ధాంతంలా కనిపిస్తోందా అని ప్రశ్నించారు. కేశవరావుకు ఏ భాషలో చెప్పాలో ఆ భాషలోనే చెప్పేకాలం త్వరలోనే వస్తుందన్నారు. ఈనెల ఆరవ తేదీన జిల్లా కలెక్టరేట్ల వరకు ప్రదర్శనలు నిర్వహించి.. అక్కడ ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని తమ పార్టీ నిర్ణయించిందని పేర్కొన్నారు. దీనిలో టీఎన్‌జీవో లు, విద్యావంతులు, నిరుద్యోగులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే తెలంగాణ ఐక్య వేదిక ఏర్పాటు అవుతుందని నరేంద్ర చెప్పారు.
Tuesday, July 3, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment