కోవర్ట్ ఆపరేషన్00 టిఆర్‌ఎస్ కార్యకర్తలు, నేతలను అరెస్టు చేయడానికి పోలీసులు పకడ్బందీ వ్యూహం రచించారు. కోవర్ట్ ఆపరేషన్ కూడా చేశారు. ముందుగా పోలీసులు కొంత మందిని సివిల్ డ్రస్సులో టిఆర్‌ఎస్ కార్యకర్తల్లో కలిపేశారు. పోలీ సు అధికారులు వెళ్లి టిఆర్‌ఎస్ నాయకులతో మాట్లాడుతుం డగానే తిన్నగా అక్కడకు వాహనాలు వచ్చాయి. ఆ వెంటనే వెనకాల టిఆర్‌ఎస్ కార్యకర్తల్లో ఉన్న పోలీసులే వారిని తోసి వాహనాల్లోకి ఎక్కించారు. మధ్యాహ్నం 12.40 గం టలకు మొదలైన అరెస్టుల కార్యక్రమం రెండు గంటల పాటు ఏకధాటిగా సాగింది. మధాహ్నం 2.40 గంటలకు దర్నా చౌక్‌లో టిఆర్‌ఎస్ కార్యకర్తలు ఉన్న ప్రాంతాన్ని ఖాళీ చేసి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో యూనివర్సిటీ విద్యార్థులు, కొందరు టిఆర్‌ఎస్ కార్యకర్తలు నినాదాలు చేసుకుంటూ సెక్రటేరియట్ లోపలికి వెళ్లే ప్రయ త్నం చేశారు. అక్కడ మోహరించిన పోలీసులు ఆ రెండు బృందాలను అరెస్టు చేశారు.
రోడ్లు మూసివేత
సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామని టిఆర్‌ఎస్ ముందే ప్రకటించడంతో పోలీసులు భారీ ఎత్తున బలగాలను మోహరించారు. సోమవారం ఉదయమే లోయర్ ట్యాంక్‌బండ్ రోడ్డును పోలీసులు మూసివేశారు. ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. పోలీసులు వాహనాలు, అశ్వికదళాలు, వాటర్‌కెనన్‌లను సిద్ధం చేసుకున్నారు. ఎలాంటి పరిస్థితినైనా తిప్పకొట్టే విధంగా ఆయుధాలను సిద్ధం చేసుకున్నారు. సెక్రటేరియట్ వద్ద కూడా ఇదే పరిస్థితి. ఈ ప్రాంతంలో ఘర్షణ జరగబోతుందన్న భయానక వాతావరణాన్ని పోలీసులు సృష్టించారు. టిఆర్‌ఎస్ ముట్టడికి ఎవరూ రారన్న ప్రచారాన్ని కూడా లేవదీశారు. పోలీసుల కళ్ళుగప్పి... పటిష్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ, పోలీసుల కళ్ళుగప్పి టిఆర్‌ఎస్ నాయ కులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ధర్నాచౌక్‌కు చేరుకున్నారు.
ప్రధాన నాయకులు, కార్యకర్తల ఇళ్ళ వద్ద ఆదివారం నుంచే నిఘా ఏర్పాటు చేసి, వారిని ముట్టడి ర్యాలీకి రాకుండా పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫల మయ్యాయి. సచివాలయం ముట్టడికి ఐదారువందల మంది వస్తారని పోలీసులు అంచనా వేశారు. వారి అంచనాలు తారుమారయ్యాయి. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలను సచివాలయం వరకు వెళ్ళకుండా అడ్డుకునేందుకు సెంట్రల్ జోన్ డిసిపి ఎగ్బాల్, సౌత్ జోన్ డిసిపి కమలహాసన్, చిక్కడపల్లి ఎసిపి సుమతితో పాటు ఇతర అధికారులు ఆగమేఘాల మీద భారీ పోలీసు బలగాలను రంగంలోకి దింపి ధర్నా చౌక్‌కు రెండు వైపులా మూసివేశారు.
ఆంధ్ర అధికారులు కుట్ర: నాయిని
610 జీవో సక్రమంగా అమలు కాకుండా ఉన్నత స్థాయిలో ఉన్న ఆంధ్ర అధికారులు కుట్ర పన్నుతున్నారని ముషీరాబాద్ ఎమ్మెల్యే నాయిని నర్సింహారెడ్డి ఆరోపించారు. ఆంధ్ర అధికారులంతా దొంగలని తెలంగాణ అధికారులంతా దద్దమ్మలుగా మరోసారి ఈ జీవో అమలు విషయంలో స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. జూన్ 30లోగా జీవోను కచ్చితం గా అమలు చేస్తామని అసెంబ్లీలో చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్, ఆర్థిక శాఖ మంత్రి రోశయ్యలు దాన్ని అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. వాగ్దానాలు అమలు చేయనందున టిఆర్‌ఎస్ చేపట్టిన సచివాలయం ముట్టడికి ప్రభుత్వం పోలీసులతో విఘాతం కలిగించిందన్నారు. జీవో అమలయ్యే వరకు తపోరాటం ఆగదన్నారు.
ముందు ఆంధ్ర అధికారులను పంపాలి: పద్మారావు
ముందుగా ఆంధ్ర అధికారులను పంపిన తర్వాతే తెలంగాణ వారిని తమ సొంత జిల్లాలకు పంపాలని టిఆర్‌ఎస్ నగర కన్వీనర్, ఎమ్మెల్యే పద్మారావు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపుతూ జీవోను నీరుగార్చేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. పోలీస్ స్టేషన్‌లో ధర్నా సచివాలయం ముట్టడికి తరలివచ్చిన కొందరు టిఆర్‌ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దాదాపు 200మంది కార్యకర్తలు అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ధర్నా చేశారు. శాసనసభ్యులు రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ సత్యనారాయణలను కూడా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
సిటీ బస్సుల్లో పబ్లిక్ ఫోన్లు
(ఆన్‌లైన్, సిటీబ్యూరో) ఆర్టీసీ బస్సుల్లో త్వరలో పబ్లిక్ టెలిఫోన్లు రానున్నాయి. ముంబాయి తరహా బస్సుల్లో పబ్లిక్ టెలిఫోన్లు ఏర్పాటు చేసి ప్రయాణికుల మన్నలను పొందడానికి అధికారులు కసరత్తులు చేస్తున్నారు. అత్యవసర సమయంలో ఫోన్ అందుబాటులో ఉంటే ప్రయాణీకులకు సౌకర్యంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ముంబాయిలో ఇప్పటికే బస్సుల్లో పబ్లిక్ టెలిఫోన్ ఉండడంతో ఆ తరహా పద్దతిని సిటీ రీజియన్‌లో కూడా అమలు చేయాలనే దిశగా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.
ఈ మేరకు ముగ్గురు అధికారులు ముం బాయి వెళ్లి పబ్లిక్‌టెలిఫోన్ పనితీరుపై పర్యవేక్షించి ఒక నివేదికను సిటీ ఆర్‌ఎంకు సమర్పించారు. నివేదికను పరిశీలించిన తరువాత పబ్లిక్‌టెలిఫోన్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఒక నిర్ణయం తీసుకుంటామని రీజనల్ మేనేజర్ ఎస్. నాగరాజు తెలిపారు. వీరా బస్సుల్లో ప్రయోగత్మకంగా ప్రవేశపెట్టే ఆలోచనలో అధికారులున్నారు. అయితే బస్సుల్లో పబ్లిక్ టెలిఫోన్ రక్షణ... రద్దీ బస్సుల్లో పబ్లిక్ టెలిఫోన్ ఎంత వరకు సాధ్యమా ? తదితర అంశాలపై అధికారులు దృష్టి సారించారు. డ్రైవర్ వద్ద పబ్లిక్ టెలిఫోన్‌ను ఏర్పాటు చేస్తే అన్ని రకాలుగా మెరుగ్గా ఉంటుందని అధికారులు యోచిస్తున్నారు. సెల్‌ఫోన్ లేని ప్రయాణీకులు అత్యవసర సమయంలో బస్సులో ఫోన్ వినియోగించుకునే అవకాశముంటుందని ఆర్‌ఎం నాగరాజు తెలిపారు.
ఈ మేరకు ముగ్గురు అధికారులు ముం బాయి వెళ్లి పబ్లిక్‌టెలిఫోన్ పనితీరుపై పర్యవేక్షించి ఒక నివేదికను సిటీ ఆర్‌ఎంకు సమర్పించారు. నివేదికను పరిశీలించిన తరువాత పబ్లిక్‌టెలిఫోన్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఒక నిర్ణయం తీసుకుంటామని రీజనల్ మేనేజర్ ఎస్. నాగరాజు తెలిపారు. వీరా బస్సుల్లో ప్రయోగత్మకంగా ప్రవేశపెట్టే ఆలోచనలో అధికారులున్నారు. అయితే బస్సుల్లో పబ్లిక్ టెలిఫోన్ రక్షణ... రద్దీ బస్సుల్లో పబ్లిక్ టెలిఫోన్ ఎంత వరకు సాధ్యమా ? తదితర అంశాలపై అధికారులు దృష్టి సారించారు. డ్రైవర్ వద్ద పబ్లిక్ టెలిఫోన్‌ను ఏర్పాటు చేస్తే అన్ని రకాలుగా మెరుగ్గా ఉంటుందని అధికారులు యోచిస్తున్నారు. సెల్‌ఫోన్ లేని ప్రయాణీకులు అత్యవసర సమయంలో బస్సులో ఫోన్ వినియోగించుకునే అవకాశముంటుందని ఆర్‌ఎం నాగరాజు తెలిపారు.
No comments:
Post a Comment