జీవో 43పై తేల్చిన న్యాయశాఖ
తప్పదంటున్న జాక్టో
హైదరాబాద్, న్యూస్‌టుడే:
610 జీవో అమల్లో భాగంగా ఉపాధ్యాయుల స్వచ్ఛంద బదిలీలకై విడుదల చేసిన 43 జీవో వివాదం సృష్టిస్తోంది. అందులోని అంశాలు ఏకీకృత సర్వీస్‌కు విరుద్ధంగా ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. దానిని సవరించాలి లేదా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశంపై ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి కార్యాచరణ సమితి (జాక్టో) సోమవారం మంత్రి దామోదర రాజనర్సింహను కలిసింది. ప్రభుత్వం ఏకీకృతానికి కట్టుబడి ఉందా లేదా అని ప్రశ్నించింది. రద్దు చేస్తే పరువు పోతుందని, ఆ జీవోకు తాను సవరణ చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఆయన ఉన్నతాధికారులను పిలిచి సవరణల అవసరాన్ని గుర్తుచేశారు. ఎలాంటి సవరణలూ అవసరం లేదని, సంఘాలు చెబుతున్నట్లు కలెక్టర్లకు అధికారాలిస్తూ సవరణలు చేస్తే మరిన్ని వివాదాలు వస్తాయని న్యాయ శాఖ తిరస్కరించింది.
No comments:
Post a Comment