Tuesday, September 18, 2007
ఎన్ని ఆటంకాలొచ్చినా భూముల అమ్మకాన్ని ఆపొద్దు Eenadu
ఆందోళనలు, ఇతరత్రా కార్యక్రమాలద్వారా ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా హైదరాబాద్‌లో భూముల అమ్మకాన్ని ఆపొద్దని, ఈ ప్రక్రియ సత్వరమే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అధికారులను ఆదేశించారు. భూముల అమ్మకం ద్వారా వచ్చే నిధులను హైదరాబాద్ అభివృద్ధికే వెచ్చిస్తున్నామంటూ విస్తృత ప్రచారం చేయడంద్వారా ప్రతిపక్షాల వాదనను తిప్పి కొట్టాలని సూచించారు. ఆర్థిక వనరుల సమీకరణపై ఆయన మంగళవారమిక్కడి సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ఆర్థిక మంత్రి రోశయ్య, పురపాలకశాఖ మంత్రి కోనేరు రంగారావు, వాణిజ్య పన్నులశాఖ మంత్రి కొణతాల రామకృష్ణ, అధికారులు ఇందులో పాల్గొన్నారు. హుడా భూముల అమ్మకాన్ని అడ్డుకునేందుకు తెరాస, ఇతర పార్టీలు చేసిన ఆందోళనను ముఖ్యమంత్రి తప్పుపట్టారు. భూముల అమ్మకంద్వారా వచ్చే ఆదాయాన్నంతా హైదరాబాద్‌కే వెచ్చిస్తున్న విషయాన్ని ఆయా పార్టీలు మరిచిపోతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. మెట్రో రైలుకు రూ.8,500 కోట్లు, ఔటర్ రింగ్‌రోడ్డుకు రూ.6,500 కోట్లు, హైదరాబాద్‌లో మురుగునీటి పారుదల వ్యవస్థకు రూ.2,500 కోట్లు, కృష్ణా నీటి సరఫరా రెండోదశకు రూ.వేయి కోట్లు, రేడియల్ రోడ్లకు రూ.2,500 కోట్లు, పీవీ నర్సింహారావు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ రహదారికి రూ.500 కోట్లు, బలహీనవర్గాల గృహ నిర్మాణానికి రూ.6వేల కోట్ల చొప్పున వచ్చే మూడేళ్లలో రూ.27,500 కోట్లు హైదరాబాద్ అభివృద్ధికి వెచ్చిస్తున్నామనే విషయాన్ని ప్రజలకు వివరించాలని అధికారులకు వైఎస్ సూచించారు. పదేళ్ల క్రితంతో పోలిస్తే హైదరాబాద్ విస్తృతంగా అభివృద్ధి చెందినందువల్లే స్థలాల ధరలు పెరిగాయనే విషయాన్ని ప్రతిపక్ష పార్టీలకు చెప్పాలని ఆదేశించారు. స్థలాల అమ్మకం ప్రక్రియను ముమ్మరం చేసి సకాలంలో లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని సూచించారు.
పన్నులు పెంచం.. కొత్తగా వేయం: రోశయ్య
బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా అభివృద్ధి పనులను చేపట్టేందుకు పన్నులు పెంచడం, కొత్తగా పన్నులు విధించడం వంటి ఆలోచనేదీ సర్కారుకు లేదని ఆర్థిక మంత్రి రోశయ్య తెలిపారు. వనరుల సమీకరణ ఆశించిన స్థాయిలో లేకున్నా... ఈనెల కాకున్నా వచ్చే నెలలోనైనా లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. సమీక్ష అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి పనులకు లోటు లేకుండా పూర్తి స్థాయిలో చేపట్టాలంటే నిధులు కావాలని, బడ్జెట్‌లో నిర్దేశించిన పన్నుల వసూలుతోపాటు కేంద్రం నుంచి వచ్చే సాయంద్వారా వనరుల సమీకరణకు ప్రయత్నిస్తున్నామని రోశయ్య వెల్లడించారు.
Sunday, September 9, 2007
ఎస్సార్సీ వద్దు వేస్తే స్వయంకృతాపరాధమే! తెలంగాణ సెంటిమెంటే బలం
రెండో ఎస్సార్సీ వద్దుగాక వద్దు.. రాష్ట్రమే కావాలి.. గడువు మించిపోతోంది.. ఇంకా ఆలస్యం చేస్తే పార్టీ తీవ్రంగా నష్టపోతుంది.. ప్రజల్లో తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉంది.. దీన్ని తక్కువ అంచనా వేసినా, ఉదాసీనంగా వ్యవహరించినా మునిగిపోవడం ఖాయం.
తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ సమన్వయ సంఘం (టీఆర్‌సీసీసీ) సమావేశంలో వెల్లడైన ఏకాభిప్రాయమిది. కాంగ్రెస్ అధిష్ఠానం రెండో ఎస్సార్సీకే కట్టుబడి ఉన్నామని విస్పష్టంగా ప్రకటించిన అనంతరం శనివారం జరిగిన టీఆర్‌సీసీసీ సమావేశం ఆద్యంతం వాడివేడిగా సాగింది. ఎస్సార్సీ వేయడం స్వయంకృతాపరాధమే అవుతుందని ఒకరిద్దరు మినహా దాదాపు సభ్యులంతా అభిప్రాయపడినట్లు తెలిసింది. ఎన్నికలు సమీపిస్తున్నా తెలంగాణపై తేల్చకుండా నాన్చితే ఎన్నికలను ఎలా ఎదుర్కొంటామని పలువురు సభ్యులు ప్రశ్నించారు. ఎస్సార్సీ, అభివృద్ధి అంశాలను కొందరు ప్రస్తావించినా ఇప్పుడు వాటి గురించి చర్చించడం వల్ల ప్రయోజనం లేదని, తెలంగాణ ఇవ్వాలని కోరడమే శ్రేయస్కరమని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. రెండో ఎస్సార్సీని బహిరంగంగా వ్యతిరేకిస్తే అధిష్ఠానం నిర్ణయాన్ని, వర్కింగ్ కమిటీ తీర్మానాన్ని వ్యతిరేకించినట్లు అవుతుందని, దీనిపై బహిరంగంగా మాట్లాడకుండా టీఆర్‌సీసీసీ సభ్యులు బృందంగా వెళ్లి సోనియా దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. నిర్ణయాన్ని మాత్రం ఆమెకే వదిలిపెట్టాలని నిశ్చయించారు.
2009 ఎన్నికల్లో తెలంగాణపై నిర్ణయం తీసుకోకుంటే పార్టీకి తీవ్ర ఇబ్బందులు తప్పవని టీఆర్‌సీసీసీ మెజారిటీ సభ్యులు తేల్చి చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా అధిష్ఠానం నిర్ణయం తీసుకుని విస్పష్టమైన ప్రకటన చేయాలని, లేకుంటే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉండదని అభిప్రాయపడ్డారు. సమావేశంలో ఇద్దరు సభ్యులు మినహా హాజరైనవారంతా ఎస్సార్సీతో నిమిత్తం లేకుండా తెలంగాణ ఇవ్వాల్సిందిగా అధిష్ఠానాన్ని కోరాలని ప్రతిపాదించారు.
సుమారు నాలుగు గంటల పాటు జరిగిన సమావేశంలో తెలంగాణకు సంబంధించి ఇతర కీలకాంశాలను చర్చించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో భూముల అమ్మకంపై ప్రభుత్వ వైఖరిని పలువురు సభ్యులు తప్పుపట్టారు. నిజాం షుగర్స్‌ను స్వాధీనం చేసుకోవడం, తెలంగాణ అభివృద్ధి, 610 జీవో అమలు, పదివేల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ వంటి అంశాలపైనా చర్చించినా.. అధిక సమయం తెలంగాణకే కేటాయించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం రెండో ఎస్సార్సీ వేస్తే తెలంగాణ రాష్ట్రం కోసం రాజ్యాంగబద్ధమైన ప్రక్రియను ప్రారంభించినట్లవుతుందని, అధిష్ఠానం నిర్ణయం కూడా ఇదే అయినపుడు వ్యతిరేకించడం భావ్యం కాదని పీసీసీ కిసాన్ సెల్ ఛైర్మన్ కోదండరెడ్డి ప్రతిపాదించారు. మెజారిటీ సభ్యులు ఆయనతో విభేదించారు. రెండో
ఎస్సార్సీ వూసే ఇప్పుడొద్దని స్పష్టంచేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో యూపీఏ ఎస్సార్సీ వేసే అవకాశాలే లేవని, బీఎస్పీ నాయకురాలు మాయావతి అసలే ఒప్పుకోరని మధు యాష్కీ వ్యాఖ్యానించారు. తెలంగాణ అంశాన్ని తేల్చకుండా ఎన్నికలకు వెళ్తే గత ఎన్నికల నాటి ఫలితాలు తారుమారవుతాయని ఎక్కువ మంది సభ్యులు అన్నారు.
అభివృద్ధితో ఓట్లు సాధిద్దాం: జీవన్‌రెడ్డి
'రెండో ఎస్సార్సీతో నిమిత్తం లేకుండా తెలంగాణ ఇవ్వాలని కోరుతున్నాం.. అధిష్ఠానం తిరస్కరిస్తే మరిన్ని చిక్కుల్లో పడతాం' అని మంత్రి జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. మరేదైనా ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తే మంచిదని సూచించారు. దాని గురించి ఆలోచిస్తే ముందుకు వెళ్లలేమని, ఎలాగైనా తెలంగాణ అంశంపై అధిష్ఠానం నుంచి ప్రకటన వచ్చేందుకు కృషి చేద్దామని సభ్యులు అన్నారు. అభివృద్ధితో ఓట్లు సాధిద్దామని జీవన్‌రెడ్డి అనగా.. కరీంనగర్ ఉప ఎన్నికలో అభివృద్ధి ఏమైందని సభ్యులు ప్రశ్నించారు (ఈ ఉపఎన్నికలో జీవన్‌రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీచేసి తెరాస అధినేత కేసీఆర్ చేతిలో ఓడిపోయారు). అభివృద్ధి కంటే సెంటిమెంటు బలంగా ఉందని పలువురు అన్నారు. అభివృద్ధి అంశం చర్చకు వచ్చినపుడు జీవన్‌రెడ్డి, సీనియర్ ఎమ్మెల్యే పీజేఆర్ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. 'అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు... ఎక్కడుంది అభివృద్ధి' అని పీజేఆర్ అనగా.. తాను కరీంనగర్ గురించి మాట్లాడుతున్నానని మంత్రి సమాధానమిచ్చారు.
సెంటిమెంటును కాదంటే అంతే!
కరీంనగర్ ఉప ఎన్నిక, సింగరేణి కార్మిక సంఘ ఎన్నికలు, శాసనమండలి ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉన్న విషయాన్ని స్పష్టంగా చూశామని, దీన్ని విస్మరిస్తే ఇబ్బందుల్లో పడతామని వీహెచ్, మధు యాష్కీ సహా మరి కొందరు సభ్యులు అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆంధ్రలోను కాంగ్రెస్ గెలుస్తుందని, కేంద్రంలో సోనియాగాంధీ నేతృత్వంలో ప్రభుత్వం రావడానికి తోడ్పడుతుందని వీహెచ్ అన్నారు. తెలంగాణను కాదంటే ఈ ప్రాంతంలో గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు తారుమారై తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరుతుందన్నది గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్‌రెడ్డి, పులివీరన్న తదితరులు వ్యాఖ్యానించారు. టీఆర్‌సీసీసీలో ఉన్న మంత్రులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేరని, ఈ నేపథ్యంలో టీఆర్‌సీసీసీని పునర్‌వ్యవస్థీకరించాలని ఎంపీ సర్వే సత్యనారాయణ అన్నారు. భూముల విక్రయాల అంశాన్ని తెలంగాణ ప్రణాళిక, అభివృద్ది మండలి ఛైర్మన్ ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి లేవనెత్తగా.. ఈ అంశంపై వీహెచ్, పీజేఆర్ మాట్లాడారు. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భూముల విక్రయాల ద్వారా వచ్చే రాబడిని ఇతర ప్రాంతాల అభివృద్ధికి వినియోగించకుండా ఇక్కడే వ్యయం చేయాలని అత్యధిక సభ్యులు అభిప్రాయపడ్డారు. 'అసలు డబ్బులెక్కడ వస్తున్నాయి.. ఎకరం భూమిని ఒక రూపాయికి ఇస్తుంటే' అని పీజేఆర్ విమర్శించారు.
అందరి కంటే ముందుంటా: మీరు రాష్ట్రం మొత్తానికి పీసీసీ అధ్యక్షుడు కావడం వల్ల మీకు కొన్ని ఇబ్బందులుంటాయి అని కేశవరావును ఉద్దేశించి సర్వే సత్యనారాయణ అన్నారు. కొందరు తనను శంకిస్తుంటారని, అందరికంటే ఎక్కువగా తెలంగాణ రాష్ట్రం కావాలని కోరేవాడిని తానేనంటూ కేకే స్పందించారు. నేను కొట్లాడినపుడు మీరంతా లేరని వ్యాఖ్యానించి.. తెలంగాణ రాష్ట్రం కోసం అందరికంటే తానే ముందుంటానని చెప్పారు.
Tuesday, September 4, 2007
ఉద్యమానికి పునరంకితమవుదాం Eenadu

హైదరాబాద్, న్యూస్‌టుడే: త్యాగాల పునాదిపై జరిగిన ఆనాటి పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పునరంకితమవ్వాలని తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు. 'ఇడ్లీ సాంబర్ గో బ్యాక్.. నాన్
ముల్కీ గో బ్యాక్' ఉద్యమంలో అసువులు బాసిన వారి సంస్మరణార్థం హైదరాబాద్‌లోని గన్‌పార్కులో గల అమరవీరుల స్థూపం వద్ద మంగళవారం తెరాస ఏడు భారీ కొవ్వొత్తులను వెలిగించి శ్రద్ధాంజలి ఘటించింది. నాన్ ముల్కీ గో బ్యాక్.. జై తెలంగాణ లాంటి నినాదాలు ఈ సందర్భంగా మిన్నంటాయి. కేసీఆర్ ప్రసంగిస్తూ.. ఆంధ్ర ప్రాంతం మద్రాసులో అంతర్భాగంగా ఉన్నప్పటి నుంచి తెలంగాణపై వలసవాదుల దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. తెలంగాణను హేళన చేస్తూ అప్పటి మద్రాసు ప్రభుత్వ నేతలు చేసిన ప్రకటనలపై తెలంగాణ విద్యార్థులు 1949లో 'ఇడ్లీ సాంబార్ గో బ్యాక్.. నాన్ ముల్కీ గో బ్యాక్' నినాదంతో ఆందోళన ఉద్ధృతం చేశారన్నారు. ఈ సమయంలో సిటీ కాలేజీ వద్ద పోలీసులు కాల్పులు జరిపి ఏడుగురు విద్యార్థులను పొట్టన పెట్టుకున్నారని గుర్తుచేశారు. తెలంగాణ వాదులపై, ఉద్యమకారులపై అవి తొలి పోలీసు కాల్పులన్నారు. ఆ దమననీతి, మోసం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్ జోహారులు.. జోహారులు.. అమవీరులకు జోహారులంటూ గీతాలను ఆలపించి అందరి కర్తవ్యాన్నీ గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో తెరాస ఎమ్మెల్యేలు నాయిని నర్సింహ్మారెడ్డి, పద్మా దేవేందర్‌రెడ్డి, రామలింగారెడ్డి, పార్లమెంట్ సభ్యులు రవీంద్రనాథ్, ఎమ్మెల్సీలు దిలీప్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Monday, September 3, 2007
తెలంగాణ కోసమే ఎస్సార్సీ వేయాలి Eenadu

Monday, August 27, 2007
పాఠశాల విద్యాశాఖలో స్థానికేతరుల గుర్తింపు పూర్తి Eenadu
Friday, August 24, 2007
గోనెపై విద్యార్థుల దాడి గాజులు, పసుపు కుంకుమలు జల్లి నిరసన Eenadu

ఆర్టీసీ మాజీ ఛైర్మన్, మాజీ శాసనసభ్యుడు గోనె ప్రకాశరావుపై ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. శుక్రవారం స్థానిక ఫతేమైదాన్ క్లబ్‌లో విలేకరుల సమావేశంలో గోనె మాట్లాడుతున్నప్పుడు ఈ దాడి జరిగింది. తెలంగాణకు, తెలంగాణ బీసీ నేతలకు ఆయన వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ ఆ విద్యార్థులు ధ్వజమెత్తారు. దాడి సందర్భంగా గోనె, ఆయనతో ఉన్న కాంగ్రెస్ నేతలు గట్టిగానే ప్రతిఘటించారు. దీంతో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. ఒకరిపై మరొకరు చేయిచేసుకున్నారు. మొత్తానికి నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌పై గోనె చేసిన ఆరోపణలు ఈ దాడికి కారణమైనట్లు స్పష్టమవుతోంది. శుక్రవారం కూడా మధుయాష్కీపై ఆయన సరికొత్త ఆరోపణలు చేస్తున్న తరుణంలోనే విద్యార్థుల దాడి జరిగింది. విలేకరుల సమావేశం ముగుస్తున్న తరుణంలో వట్టికూటి రామారావు అనే విద్యార్థి వేదికపైకి వెళ్లి మొదట గోనెపై దాడికి పాల్పడ్డారు. ఈ హఠాత్‌పరిమాణం నుంచి వెంటనే తేరుకున్న గోనె, ఆయన పక్కనే ఉన్న ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్, ఎస్సీ, ఎస్టీ సెల్ కన్వీనర్ రవిబాబు, పీసీసీ కార్యదర్శి నిరంజన్‌లు ప్రతిఘటించారు. రామారావుపై ప్రతి దాడి చేశారు. ఇంతలోనే గాజుల శ్రీధర్ అనే మరో విద్యార్థి పసుపు, కుంకుమ, గాజులను తీసుకొచ్చి గోనెపై వేశారు. మూడో విద్యార్థి నాగరాజూ వారితో జతకలిశారు. తెలంగాణ బీసీ నాయకులను ఎదగనీయకుండా అడ్డుకుంటున్నారని వారు గోనెపై ఆరోపణలు చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సహించేది లేదని పెద్దఎత్తున నినాదాలు చేశారు.
ఎవరికైనా ఇదే శాస్తి యాష్కీ ఎదుగుతున్న బీసీ నాయకుడు కావడంతో ఓర్వలేకే ఆయనపై ఆరోపణల దాడికి పాల్పడుతున్నారని రామారావు ఆరోపించారు. అవకతవకలుంటే సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేయాలని.. అలా కాకుండా ఓర్వలేనితనంతో ఇలా కుట్ర పన్నడం తగదంటూ మండిపడ్డారు. బీసీ వ్యతిరేకుల దాడుల్ని ప్రతిఘటిస్తామన్నారు. మధుయాష్కీ తెలంగాణ అడుగుతుండటం కొందరికి ఆగ్రహం తెప్పిస్తోందంటూ.. ముఖ్యమంత్రికి గోనె తొత్తుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బీసీలకు, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని ఎక్కడైనా ఇలాగే ప్రతిఘటిస్తామన్నారు.
విద్యార్థుల అరెస్టు దాడికి పాల్పడిన ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి సైఫాబాద్ స్టేషన్‌కు తరలించారు. ఈలోగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్‌బాబు, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు కెం.ఎం.ప్రతాప్ అక్కడికి చేరుకొని గోనెను పరామర్శించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు మధు యాష్కీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ముగ్గురు విద్యార్థులపైనా, వారితోపాటు వచ్చిన మరికొందరు విద్యార్థులపైనా కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. వారిపై ఐపీసీ 143, 323, 341 సెక్షన్ల కింద కేసులు నమోదుచేసినట్లు వివరించారు. మరోవైపు నిందితుల్లో ఒకరైన రామారావు గోనెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై ఐపీసీ 506, 323 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇంటిపేరు మార్చి 2 పాస్‌పోర్టులు: గోనె ఇంటి పేరు మార్చి మధుయాష్కీ నిబంధనలకు విరుద్ధంగా రెండు పాస్‌పోర్టులు పొందినట్లు గోనె అంతకుముందు ఆరోపించారు. మొదట మధుసూదన్ యాష్కీ అనే పేరుతో పొందిన పాస్‌పోర్టుకు వీసా రాకపోవడంతో.. ఇంటి పేరు మార్చి మరో పాస్‌పోర్టు పొందినట్లు తెలిపారు. ఆయన సోదరులిద్దరు, సోదరి, బావమరిది కూడా నకిలీ సర్టిఫికెట్లతో హెచ్-1 వీసా పొంది, గ్రీన్‌కార్డు కూడా పొందినట్లు ఆరోపించారు. గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి పొందినట్లు చెబుతున్న ఇంజినీరింగ్ డిగ్రీలు నకిలీవని తేలాయన్నారు. వీటన్నిటిపై అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
వైఎస్‌కు యాష్కీని పరిచయం చేసిందే నేను దాడి ఘటన అనంతరం కూడా గోనె విలేకరులతో మాట్లాడారు. తాను బీసీలకు వ్యతిరేకం కాదని స్పష్టంచేశారు. దాడులకు భయపడబోనని, మధుయాష్కీకి సంబంధించి తాను వెలుగులోకి తీసుకొస్తున్న అంశాలను ఆపబోనని తేల్చిచెప్పారు. వైఎస్‌కు మధుయాష్కీని పరిచయం చేసిందే తానని ఆయన పేర్కొన్నారు. టికెట్ తనవల్లే వచ్చిందని యాష్కీనే స్వయంగా చెప్పారని తెలిపారు.
వ్యక్తిగత విమర్శలు తప్పే: కేకే గోనె మీద జరిగిన దాడిపై స్పందించేందుకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ నిరాకరించారు. మీడియా ప్రతినిధులు ఢిల్లీలో ఆయన స్పందన కోరగా.. ''నేనెందుకు పీసీసీ అధ్యక్షుడు కె.కేశవరావు ఇక్కడే ఉన్నారుగా.. ఆయనే స్పందిస్తారని'' చెప్పారు. కేకే మాట్లాడుతూ.. ఆ విషయం ఇంకా తన దృష్టికి రాలేదన్నారు. అన్ని విషయాలనూ తాను పరిశీలిస్తానని చెప్పారు. మరి మధుయాష్కీపై గోనె చేసిన ఆరోపణల సంగతేమిటని అడగ్గా.. అలా వ్యక్తిగత విమర్శలకు దిగడం తప్పేనన్నారు.
గోనె ప్రకాశరావుపై విద్యార్థుల దాడి Eenadu
Monday, August 13, 2007
త్వరలో మరికొందరు కానిస్టేబుళ్ళ బదిలీ
Saturday, August 11, 2007
నాలుగు లక్షల మంది విద్యార్థులతో ఉద్యమం

Wednesday, August 1, 2007
Thursday, July 26, 2007
'610'పై ఆంధ్ర ఎమ్మెల్యేల ఆందోళన? Andhra Jyothy
నష్టపోయేది తెలంగాణ ఒక్కటేనా...!
నష్టపోయేది తెలంగాణ ఒక్కటేనా...!ప్రభుత్వం ఇప్పటి వరకూ తెలంగాణ ప్రాంతానికే ప్రా ధాన్యతను ఇస్తోందని.. ఆంధ్ర, రాయలసీమ నేతల వాదనలు వినేందుకు సముఖతను వ్యక్తం చేయడం లేదన్న ఆగ్రహం ఆ నేతల్లో వ్యక్తమవుతోంది. ఈ ఉత్తర్వును అమ లు చేస్తున్నప్పుడు కేవలం తెలంగాణ ప్రాంతానికే అన్యా యం జరుగుతోందన్న భావం ప్రభుత్వంలోనూ, అధికారుల్లోనూ కన్పిస్తోందే తప్ప.. ఇతర ప్రాంతాలకు జరిగే నష్టాన్ని గురించి ఆలోచించడం లేదని వారంటున్నారు. 610పై తాము మాట్లాడిన ప్రతిసారీ, ఈ ఉత్తర్వు అమలుకు తాము వ్యతిరేకమన్న ప్రచారాన్ని తెలంగాణ నేతలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు.. దీన్ని అమలు చేయాలని కోరుకుంటున్నదే తా మని, అయితే.. రాష్ట్రపతి ఆదేశాలు, ఆరు సూత్రాల కార్యక్రమానికి లోబడి మాత్రమే ఇది జరగాలని వారు స్పష్టం చేస్తున్నారు.
Wednesday, July 25, 2007
610 జీవో కింద మాతృ సంస్థలకు 61 మంది ఇంజనీర్లు Andhra Jyothy
ఇదిలావుండగా 610 జీవో కింద వెనక్కి వెళ్లిన వారంతా బల్దియాలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న వారే. డిప్యుటేషన్ కాలం పూర్తయినా 143 మంది ఇంజనీర్లు ఇంకా నగరపాలక సంస్థ లోనే తిష్ట వేశారని గత మే 27న 'జీతమెందుకు.. గీతం ఉందిగా!' శీర్షికన 'ఆంధ్రజ్యోతి' వార్తను ప్రచురించింది. దీనికి స్పందించిన ప్రభుత్వం వీరిలో ఎంతమంది 610 జీవోకు భిన్నంగా బల్దియాలో పనిచేస్తున్నారో నివేదిక సమర్పించాలని ఆయా శాఖలను ఆదేశిం చింది. ఈ మేరకు డిప్యుటేషన్‌పై జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్న 59 మంది అసిస్టెంట్ ఇంజనీర్లను స్థానికేత రులుగా గుర్తించింది. వీరిని సొంత శాఖలకు తిప్పి పంపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
బల్దియాలో మరో 101 మంది...11 610 జీవో ప్రభావం 101 మంది ఉద్యోగులపై చూపనుంది. జీవోను కార్యరూపంలోకి తెస్తుండ టంతో ఈ ఉద్యోగులు దిక్కుతోచని స్థితిలో పడ్డా రు. బల్దియాలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న స్థానికేతరులను ఈ జీవో అనుసరించి మాతృసం స్థలకు తిప్పి పంపే అవకాశం ఉంది. ఇటీవల గ్రే టర్‌లో విలీనమైన 12 మున్సిపాలిటీల పరిధిలో 84 మంది, పూర్వపు ఎంసిహెచ్ పరిధిలో 17 ఇ తర శాఖలకు చెందిన ఉద్యోగులు పనిచేస్త్తున్నా రు. వీరిని బదిలీచేసే అంశంపై జీహెచ్‌ఎంసీ ఇం కా తుది నిర్ణయం తీసుకోలేదు. ఒకేసారి ఇంతమంది ఇంజనీర్లు పోతే పనుల పర్యవేక్షణ ఇబ్బ ందవుతుందని ఉన్నతాధికారులు అంటున్నారు.
610 అమలుపై అనుమానాలొద్దు: డీఎస్ eenadu
Tuesday, July 24, 2007
తెలంగాణ వాదులను రెచ్చగొట్టొద్దు Eenadu
న్యూఢిల్లీ, న్యూస్‌టుడే: 610 జీవో అమలును వ్యతిరేకిస్తూ ఎంపీ హరిరామజోగయ్య చేసిన వ్యాఖ్యలపై నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. జోగయ్య వ్యాఖ్యలు తెలంగాణ వాదులను రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. ఇలాంటి మాటలు మానుకోవాలని హెచ్చరించారు. మంగళవారమిక్కడి ఏపీ భవన్‌లో మధుయాష్కీ విలేకరులతో మాట్లాడారు. దిగ్విజయ్‌సింగ్ కూడా ఈ అంశంపై తెలంగాణ ఉద్యోగులు, నాయకుల వాదనలు వినాలని డిమాండు చేశారు. '610కు వ్యతిరేకంగా పోరాడాలని హరిరామజోగయ్య, హర్షకుమార్ పిలుపునిచ్చారు. అధిష్ఠానం వద్ద మాత్రం తాము 610కి వ్యతిరేకం కాదని చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారు. జయభారత్‌రెడ్డి నివేదిక ప్రకారం స్థానికేతర ఉద్యోగుల సంఖ్య 1985 నాటికే 55వేలు. తాజా ప్రభుత్వ లెక్కల ప్రకారం అది ఏడువేలకు తగ్గిపోవడం విచిత్రంగా కనిపిస్తోంది. ఇది పూర్తి అవాస్తవం. హరిరామ జోగయ్య వ్యాఖ్యలు చూస్తే శాంతియుతంగా జరుగుతున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని హింసాత్మకం చేయడానికి ఇక్కడివారిని రెచ్చగొట్టినట్లు కనిపిస్తోంది. 610 జీవోను చిత్తశుద్ధితో అమలు చేయాలనుకుంటే సరైన లెక్కలు తీయాలి. అందులో తెలంగాణ ఉద్యోగ సంఘాలనూ భాగస్వాములను చేయాలి. తెలంగాణ ఉద్యోగ సంఘాలు తమ ప్రాంతంలో కనిపించే చిన్న పార్టీ నాయకుడినీ నిలదీసి వారి ఉద్యమానికి మద్దతిచ్చేలా ఒత్తిడి తేవాలి. ఆంధ్ర ప్రాంత ఉద్యోగ సంఘాల వెంట ఉంటానని హరిరామ జోగయ్య ప్రకటించారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకుల మద్దతు తీసుకుని 610 అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నా' అని యాష్కీ పేర్కొన్నారు.
610 జీవోపై 'జానా'కు అవగాహన లేదు : చేగొండి Andhra Jyothi
1975 తర్వాత రిక్రూట్ మెంట్లు జరిగినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. 'ముందు జీవో గురించి అవగాహన చేసుకున్నాక వ్యాఖ్యలు చేయండి లేదా... అడ్వకేట్ జనరల్‌తో మాట్లాడి పూర్తిగా తెలుసుకోండి'అని జానారెడ్డికి ఆయన హితవు పలికారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో జీవో అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఆంధ్రా ప్రాంత వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, వారు చేపట్టే ఆందోళనలకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.
610 జీవోపై 'జానా'కు అవగాహన లేదు : చేగొండి Andhra Jyothi
1975 తర్వాత రిక్రూట్ మెంట్లు జరిగినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. 'ముందు జీవో గురించి అవగాహన చేసుకున్నాక వ్యాఖ్యలు చేయండి లేదా... అడ్వకేట్ జనరల్‌తో మాట్లాడి పూర్తిగా తెలుసుకోండి'అని జానారెడ్డికి ఆయన హితవు పలికారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో జీవో అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఆంధ్రా ప్రాంత వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, వారు చేపట్టే ఆందోళనలకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.
Monday, July 23, 2007
యోధులను మరచిన ప్రభుత్వం Andhra Jyothi
చిరుప్రాయంలోనే పోరుబాట పట్టిన తెలంగాణ సాయుధ పోరాట నేత నెల్లుట్ల మోహన్‌రావును అజ్ఞాతంలో ఉన్నప్పుడే వివాహం చేసుకున్నారు. ఎంతో మందికి సమరయోధుల పింఛను రావడానికి సహకరించిన మోహన్‌రావు సైతం అచ్చమాంబను విస్మరించడం విశేషం. మోహన్‌రావు మృతి అనంతరం భార్యగా వచ్చే పింఛను మాత్రమే ఆమె పొందుతున్నారు. ఆమె పోరాటానికి మాత్రం ప్రత్యేక గుర్తింపు లేకుండా పోయింది. ఇతర సమరయోధుల కంటే ఆమెకు బలమైన సాక్ష్యాధారాలున్నాయి. పిండిప్రోలులో జరిగిన గెరిల్లా శిక్షణలో భాగంగా అధునాతన ఆయుధం (గైడర్) చేతబట్టిన ఫోటో ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది.
పోరాట విరమణ అనంతరం కేరళ నుంచి ఆ ఫోటోను మోహన్‌రావు తెప్పించారని అచ్చమాంబ తెలిపారు. అలాంటిది ఆమెకు సమరయోధు రాలిగా గుర్తింపు రాకపోవడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆమెతోపాటు అజ్ఞాతంలో కలిసి పని చేసిన నేనాల కమల, లలిత, లక్ష్మిలకు సైతం సమరయోధుల పింఛను చాలాకాలం కిందటే మంజూరైంది. పింఛన్ ఎందుకు రావడం లేదని అచ్చమాంబను 'ఆన్‌లైన్' ప్రశ్నిస్తే... 'అంతా నా భర్త మోహన్‌రావు చూసుకునేవారు. నేనా విషయాలు పట్టించుకోలేద'ని బదులిచ్చారు. కమలమ్మ సైతం అచ్చమాంబకు పింఛను రావడం లేదా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
'పోరాటం గురించి తెలియని వాళ్లు సైతం నేడు సమరయోధులుగా చలామణి అవుతున్నారు. డబ్బుల కోసం కాదు, నా పోరాటానికి గుర్తింపు లేదన్న బాధ ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంద'ని అచ్చమాంబ చెప్పారు. 'భవిష్యత్తులో ఎవరో ఏదో చేస్తారన్న ఆశతో నాడు పోరాటం చేయలేదు. భూస్వా ములు, నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసం పోరాటం చేశాం. గుర్తించాల్సింది ప్రభుత్వమే. కార్యాలయాల చుట్టూ తిరిగే ఓపిక నాకు లేదు. నాలా గుర్తింపునకు నోచుకోని వారు ఇంకా ఎందరో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి, వారందరినీ ఆదుకోవలసిన అవసరం ఉంది. అయినా ఇప్పుడంతా పైరవీలమయం. నాకు న్యాయం జరుగుతుందన్న ఆశ లేదు' అని ఆవేదన వ్యక్తం చేశారు అచ్చమాంబ.
వైద్యంతో మమేకంపిండిప్రోలులో జరిగిన శిబిరంలో అచ్చమాంబ వైద్య శిక్షణ పొందారు. గాయపడిన గెరిల్లాలకు గాయాలు శుభ్రం చేయడం, కట్లు కట్టడం, ఇంజక్షన్లు ఇవ్వడంలో తర్ఫీదు ఇచ్చారు. ఇద్దరు కొరియర్లతో పాటు ఒక గన్‌మెన్‌తో ఎక్కడ దళాలకు ప్రమాదం జరిగినా ఆమె అక్కడకు వెళ్లి చికిత్స చేసేవారు. దళాలకు చేయూతనిస్తున్న గిరిజన గూడేల్లోనూ వైద్య సేవ చేయడంతో అచ్చమాంబను ఆప్యాయంగా ఓడకాయ (టాబ్లెట్స్) అక్క, ఎర్రక్క అని అక్కడి వారు పిలుచుకునేవారు. దళాలకు పోలీసులు, రజాకార్ల నుంచే కాకుండా అడవి జంతువుల నుంచి ప్రమాదాలు పొంచి ఉండేవి. చిరుత దాడితో తీవ్రంగా గాయపడిన దళ సభ్యుడికి చికిత్స చేసి రక్షించారామె.
పోలీసుల దాడి నుంచి రక్షించు కొనేందుకు అనారోగ్యంతో ఉన్న తన భర్త మోహన్ రావును ఎత్తుకొని కిలోమీటర్ల దూరం పరుగె త్తారు. దాహంతో అల్లాడుతున్న మోహన్‌రావు దప్పిక తీర్చేందుకు ఉసిరి చెట్టు ఎక్కి కాయలను చూర్ణంగా దంచి, దాహం తీర్చానని అచ్చమాంబ తెలిపారు. ఎన్నోసార్లు పోలీసులు చుట్టుముట్టినా ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టి రక్షించుకునేవారని చెప్పింది. 'మీరు పేపర్‌లో ఎంత రాసినా ప్రభుత్వం స్పందించి, న్యాయం చేస్తుందన్న ఆశ నాకు ఎంతమాత్రం నాకు లేద'ని అచ్చమాంబ చెప్పడం కొసమెరుపు.
Saturday, July 21, 2007
సర్కారుకు 'ఇరు'కాటం '610'పై భేటీని బహిష్కరించిన స్టాఫ్ కౌన్సిల్, eenadu
సచివాలయం లెక్క తేల్చాలి
Monday, July 16, 2007
కొత్త గడువు 610 అమలు జులై 31 వరకు పొడిగింపు eenadu
అసెంబ్లీలో అభాసుపాలు కాకూడదనే: రెండు గడువులో జీవో అమలు చేయకపోయిన పరిణామం... ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఏదో ఒక రోజు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అభాసుపాలు కాకుండా ఉండేందుకు కూడా ప్రభుత్వం తాజా గడువుపెంపు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
డెప్యుటేషన్లపై 'యథాతథం' eenadu
ట్రైబ్యునల్ ఉత్తర్వులు
హైదరాబాద్, న్యూస్‌టుడే:
610 జీవో అమలులో భాగంగా అన్ని డెప్యుటేషన్లనూ రద్దు చేయాలంటూ జారీ చేసిన సర్క్యులర్ అమలును రెండు వారాలపాటు యథాతథ స్థితిలో ఉంచాలంటూ సోమవారం ట్రైబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డెప్యుటేషన్లను రద్దు చేయాలంటూ జులై 2న జారీ చేసిన సర్క్యులర్‌పై ఎం.చంద్ర ఓబుళరెడ్డి తదితరులు ట్రైబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేశారు. డెప్యుటేషన్ నియామకాలకు 610 జీవోతో సంబంధం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది కృష్ణయ్య ట్రైబ్యునల్‌కు తెలిపారు. కొన్ని శాఖల్లోని పోస్టులను డెప్యుటేషన్లపైనే భర్తీ చేయాలన్న నిబంధనలున్నాయని వివరించారు. తాత్కాలిక నియామకాలకు, 610 జీవోతో సంబంధంలేదన్నారు. పిటిషనర్ల డెప్యుటేషన్లను యథాతథంగా ఉంచాలంటూ ట్రైబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.