Wednesday, September 19, 2007

అభివృద్ధి అవినీతిలోనే పార్టీపై 'సమాల్‌' ప్రభావం

గోనె ఆరోపణలు సీఎల్‌పీ కార్యాలయ కుట్ర

రెండో ఎస్సార్సీకి పార్టీ కట్టుబడి లేదు టీఆర్‌సీసీసీలో పదవుల యావ
'న్యూస్‌టుడే' ఇంటర్య్వూలో మధుయాష్కీ


నిజామాబాద్‌, న్యూస్‌టుడే: తెలంగాణ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానానికి రాష్ట్ర నాయకత్వం తప్పుడు సమాచారాన్ని అందిస్తోందని నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు మధుగౌడ్‌ యాష్కీ ఆరోపించారు. తెలంగాణపై కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులను నిలదీయాలని పిలుపునిచ్చిన యాష్కీతో 'న్యూస్‌టుడే' ముఖాముఖి...

ప్రశ్న: సమాల్‌ నివేదిక ప్రభావం ఎలా ఉంటుందంటారు?

జవాబు: ప్రభుత్వంలో పనిచేసిన సీనియర్‌ ఉన్నతాధికారి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రభుత్వం పైన ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉంది. ఈ ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గు తేల్చాలి. ఎదురు దాడి సరి కాదు. సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షిస్తే ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడుతుంది. ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్ళా. పార్టీపైనా దీని ప్రభావం ఉండదనుకోవడం సరికాదు.

ప్ర: పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు?
జ: తెలంగాణపై మాట్లాడితే పార్టీని వ్యతిరేకించినట్లు కాదు. తెలంగాణ విషయంలో రాష్ట్ర నాయకత్వం వాస్తవాలను దాస్తోంది. అధిష్ఠానానికి తప్పుడు సమాచారం ఇస్తోంది. ఇది సరికాదు.

ప్ర: మీ వ్యవహారశైలి పార్టీలో కొంత గందరగోళాన్ని సృష్టిస్తోంది. అసలు మీ వ్యూహం ఏమిటి?

జ: నాకు ఏ వ్యాపారాలూ లేవు. వృత్తిపరంగా నైపుణ్యం చాటుకొన్న తర్వాత ఒక నిబద్ధతతో, నా సామాజిక బాధ్యత గుర్తిస్తూ రాజకీయాల్లోకి వచ్చాను. ఆనాడు నాకు తెరాస, తెదేపా, భాజపాలు టికెట్టు ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. సోనియా స్ఫూర్తితో కాంగ్రెస్‌లో చేరా. ప్రజలను మోసంచేయడం, పార్టీకి వెన్నుపోటు పొడవడం లాంటివి నేను చేయడంలేదు. ప్రజల నిజమైన అభిప్రాయాల్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళుతున్నా.

ప్ర: పార్టీని వీడిపోతారనే ప్రచారం?

జ: కాంగ్రెస్‌లోనే కొనసాగుతా.

ప్ర: ఈసారి మీకు టికెట్టు రాదని, అందుకే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చర్చ?

జ: కుహనా విధేయుల వ్యాఖ్యలివి. పార్టీ క్రమశిక్షణకు లోబడే ఉంటున్నా. నా పనితీరు గుర్తించిన అధిష్ఠానం ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో కీలక బాధ్యతలు అప్పగించింది.

ప్ర: తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ రెండో ఎస్సార్సీకి కట్టుబడి ఉంది. మీరు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు?

జ: రెండో ఎస్సార్సీకి కట్టుబడి లేదు. కనీస ఉమ్మడి ప్రణాళిక(సి.ఎం.పి)లో చేర్చారు. రాష్ట్రపతి ప్రసంగంలో ఈ అంశాన్ని చేర్చారు. రెండో ఎస్సార్సీ అంటే ఎలా? ప్రైవేటుగా తెలంగాణా కావాలనే వారు అధిష్ఠానం దగ్గరికి వెళ్లినపుడు మాత్రం తప్పుడు సమాచారం ఇస్తున్నారు. తద్వారా ప్రధానికి తప్పుడు సంకేతాలు అందిస్తున్నారు.
ప్ర: టీఆర్‌సీసీసీ ఉన్నా ఇతర వేదికల్లో పాల్గొనడం ఎందుకు?
జ: తెరాస కన్నా ముందే టీఆర్‌సీసీ ఏర్పడింది. ఎన్నికల తర్వాత సీనియర్‌ నాయకులు తెలంగాణ అంశాన్ని విస్మరించారు. పదవుల కోసం, వ్యక్తిగత లాభాలకోసం దీన్ని పక్కన పెట్టారు. గతంలో సీఎంను తీవ్ర పదజాలంతో విమర్శించిన వారే అభివృద్ధి పేరుతో తప్పుదోవ పట్టించారు. తెలంగాణా సాధన కోసం ఏ వేదిక అయినా సరే. కలిసి పోరాడాల్సిందే.
ప్ర: తెలంగాణలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదన్న వాదన వచ్చింది కదా?
జ: అభివృద్ధి ఎక్కడ జరిగింది? అవినీతి అక్రమాల్లోనా? అధిష్ఠానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారు. నిధులెక్కడ ఇస్తున్నారు? తెలంగాణా విశ్వ విద్యాలయమే దీనికి ఉదాహరణ. అభివృద్ధి పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలకువెళ్ళాం. నిజామాబాద్‌ జిల్లాలో తెదేపా కన్నా 10 వేల ఓట్లు తక్కువగా వచ్చాయి. గతం కంటే కొంత మెరుగై ఉండవచ్చు.
ప్ర: ఆర్టీసీ మాజీ ఛైర్మన్‌ గోనె ప్రకాశ్‌రావు మీపై వ్యక్తిగత విమర్శలకు దిగారు?
జ: దీని వెనకాల తెలంగాణను వ్యతిరేకించే లాబీ ఉంది. కాంగ్రెస్‌లోని పెద్దలు, సీఎల్‌పీ కార్యాలయం, మీడియా కో-ఆర్డినేటర్‌ కుట్ర ఉంది. నా నోరు మూయించేందుకు బెదిరింపు ఇది. నా జీవితం తెరచిన పుస్తకమే. మొత్తం వెబ్‌సైట్‌లో ఉంది. దీనిపైనా అధిష్ఠానానికి మొత్తం వివరించాను.
ప్ర: ప్రజాప్రతినిధులను నిలదీయాలని పిలుపునివ్వడం పార్టీ నేతలకు ఆగ్రహం తెప్పించింది కదా?
జ: గత ఎన్నికల్లో ప్రత్యేక రాష్ట్ర అంశంతోనే గెలుపొందాం. ఏ పార్టీ వారైనా తెలంగాణాను ఏమి చేశారని ప్రశ్నించాలని చెప్పా. సామరస్యంగా శాంతియుతంగానే నిలదీయాలని పిలుపునిచ్చా. కేవలం కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులే కాదు, అందరినీ.

Tuesday, September 18, 2007

ఎన్ని ఆటంకాలొచ్చినా భూముల అమ్మకాన్ని ఆపొద్దు Eenadu

హైదరాబాద్‌ అభివృద్ధికే అధిక నిధులు ప్రతిపక్షాల వాదనను తిప్పి కొట్టాలి వనరుల సమీకరణ సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశం
ఆందోళనలు, ఇతరత్రా కార్యక్రమాలద్వారా ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా హైదరాబాద్‌లో భూముల అమ్మకాన్ని ఆపొద్దని, ఈ ప్రక్రియ సత్వరమే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి అధికారులను ఆదేశించారు. భూముల అమ్మకం ద్వారా వచ్చే నిధులను హైదరాబాద్‌ అభివృద్ధికే వెచ్చిస్తున్నామంటూ విస్తృత ప్రచారం చేయడంద్వారా ప్రతిపక్షాల వాదనను తిప్పి కొట్టాలని సూచించారు. ఆర్థిక వనరుల సమీకరణపై ఆయన మంగళవారమిక్కడి సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ఆర్థిక మంత్రి రోశయ్య, పురపాలకశాఖ మంత్రి కోనేరు రంగారావు, వాణిజ్య పన్నులశాఖ మంత్రి కొణతాల రామకృష్ణ, అధికారులు ఇందులో పాల్గొన్నారు. హుడా భూముల అమ్మకాన్ని అడ్డుకునేందుకు తెరాస, ఇతర పార్టీలు చేసిన ఆందోళనను ముఖ్యమంత్రి తప్పుపట్టారు. భూముల అమ్మకంద్వారా వచ్చే ఆదాయాన్నంతా హైదరాబాద్‌కే వెచ్చిస్తున్న విషయాన్ని ఆయా పార్టీలు మరిచిపోతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. మెట్రో రైలుకు రూ.8,500 కోట్లు, ఔటర్‌ రింగ్‌రోడ్డుకు రూ.6,500 కోట్లు, హైదరాబాద్‌లో మురుగునీటి పారుదల వ్యవస్థకు రూ.2,500 కోట్లు, కృష్ణా నీటి సరఫరా రెండోదశకు రూ.వేయి కోట్లు, రేడియల్‌ రోడ్లకు రూ.2,500 కోట్లు, పీవీ నర్సింహారావు ఎలివేటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రహదారికి రూ.500 కోట్లు, బలహీనవర్గాల గృహ నిర్మాణానికి రూ.6వేల కోట్ల చొప్పున వచ్చే మూడేళ్లలో రూ.27,500 కోట్లు హైదరాబాద్‌ అభివృద్ధికి వెచ్చిస్తున్నామనే విషయాన్ని ప్రజలకు వివరించాలని అధికారులకు వైఎస్‌ సూచించారు. పదేళ్ల క్రితంతో పోలిస్తే హైదరాబాద్‌ విస్తృతంగా అభివృద్ధి చెందినందువల్లే స్థలాల ధరలు పెరిగాయనే విషయాన్ని ప్రతిపక్ష పార్టీలకు చెప్పాలని ఆదేశించారు. స్థలాల అమ్మకం ప్రక్రియను ముమ్మరం చేసి సకాలంలో లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని సూచించారు.
పన్నులు పెంచం.. కొత్తగా వేయం: రోశయ్య
బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా అభివృద్ధి పనులను చేపట్టేందుకు పన్నులు పెంచడం, కొత్తగా పన్నులు విధించడం వంటి ఆలోచనేదీ సర్కారుకు లేదని ఆర్థిక మంత్రి రోశయ్య తెలిపారు. వనరుల సమీకరణ ఆశించిన స్థాయిలో లేకున్నా... ఈనెల కాకున్నా వచ్చే నెలలోనైనా లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. సమీక్ష అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి పనులకు లోటు లేకుండా పూర్తి స్థాయిలో చేపట్టాలంటే నిధులు కావాలని, బడ్జెట్‌లో నిర్దేశించిన పన్నుల వసూలుతోపాటు కేంద్రం నుంచి వచ్చే సాయంద్వారా వనరుల సమీకరణకు ప్రయత్నిస్తున్నామని రోశయ్య వెల్లడించారు.

Sunday, September 9, 2007

ఎస్సార్సీ వద్దు వేస్తే స్వయంకృతాపరాధమే! తెలంగాణ సెంటిమెంటే బలం

ఎన్నికల్లోపు తేల్చకుంటే మునిగిపోతాం
సోనియాను కలిసి చెబుదాం
టీఆర్‌సీసీసీలో ఏకాభిప్రాయం
హైదరాబాద్‌ భూముల ఆదాయం ఇక్కడే ఖర్చుపెట్టాలని తీర్మానం
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
రెండో ఎస్సార్సీ వద్దుగాక వద్దు.. రాష్ట్రమే కావాలి.. గడువు మించిపోతోంది.. ఇంకా ఆలస్యం చేస్తే పార్టీ తీవ్రంగా నష్టపోతుంది.. ప్రజల్లో తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉంది.. దీన్ని తక్కువ అంచనా వేసినా, ఉదాసీనంగా వ్యవహరించినా మునిగిపోవడం ఖాయం.

తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ సమన్వయ సంఘం (టీఆర్‌సీసీసీ) సమావేశంలో వెల్లడైన ఏకాభిప్రాయమిది. కాంగ్రెస్‌ అధిష్ఠానం రెండో ఎస్సార్సీకే కట్టుబడి ఉన్నామని విస్పష్టంగా ప్రకటించిన అనంతరం శనివారం జరిగిన టీఆర్‌సీసీసీ సమావేశం ఆద్యంతం వాడివేడిగా సాగింది. ఎస్సార్సీ వేయడం స్వయంకృతాపరాధమే అవుతుందని ఒకరిద్దరు మినహా దాదాపు సభ్యులంతా అభిప్రాయపడినట్లు తెలిసింది. ఎన్నికలు సమీపిస్తున్నా తెలంగాణపై తేల్చకుండా నాన్చితే ఎన్నికలను ఎలా ఎదుర్కొంటామని పలువురు సభ్యులు ప్రశ్నించారు. ఎస్సార్సీ, అభివృద్ధి అంశాలను కొందరు ప్రస్తావించినా ఇప్పుడు వాటి గురించి చర్చించడం వల్ల ప్రయోజనం లేదని, తెలంగాణ ఇవ్వాలని కోరడమే శ్రేయస్కరమని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. రెండో ఎస్సార్సీని బహిరంగంగా వ్యతిరేకిస్తే అధిష్ఠానం నిర్ణయాన్ని, వర్కింగ్‌ కమిటీ తీర్మానాన్ని వ్యతిరేకించినట్లు అవుతుందని, దీనిపై బహిరంగంగా మాట్లాడకుండా టీఆర్‌సీసీసీ సభ్యులు బృందంగా వెళ్లి సోనియా దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. నిర్ణయాన్ని మాత్రం ఆమెకే వదిలిపెట్టాలని నిశ్చయించారు.
2009 ఎన్నికల్లో తెలంగాణపై నిర్ణయం తీసుకోకుంటే పార్టీకి తీవ్ర ఇబ్బందులు తప్పవని టీఆర్‌సీసీసీ మెజారిటీ సభ్యులు తేల్చి చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా అధిష్ఠానం నిర్ణయం తీసుకుని విస్పష్టమైన ప్రకటన చేయాలని, లేకుంటే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉండదని అభిప్రాయపడ్డారు. సమావేశంలో ఇద్దరు సభ్యులు మినహా హాజరైనవారంతా ఎస్సార్సీతో నిమిత్తం లేకుండా తెలంగాణ ఇవ్వాల్సిందిగా అధిష్ఠానాన్ని కోరాలని ప్రతిపాదించారు.
సుమారు నాలుగు గంటల పాటు జరిగిన సమావేశంలో తెలంగాణకు సంబంధించి ఇతర కీలకాంశాలను చర్చించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలో భూముల అమ్మకంపై ప్రభుత్వ వైఖరిని పలువురు సభ్యులు తప్పుపట్టారు. నిజాం షుగర్స్‌ను స్వాధీనం చేసుకోవడం, తెలంగాణ అభివృద్ధి, 610 జీవో అమలు, పదివేల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ వంటి అంశాలపైనా చర్చించినా.. అధిక సమయం తెలంగాణకే కేటాయించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం రెండో ఎస్సార్సీ వేస్తే తెలంగాణ రాష్ట్రం కోసం రాజ్యాంగబద్ధమైన ప్రక్రియను ప్రారంభించినట్లవుతుందని, అధిష్ఠానం నిర్ణయం కూడా ఇదే అయినపుడు వ్యతిరేకించడం భావ్యం కాదని పీసీసీ కిసాన్‌ సెల్‌ ఛైర్మన్‌ కోదండరెడ్డి ప్రతిపాదించారు. మెజారిటీ సభ్యులు ఆయనతో విభేదించారు. రెండో
ఎస్సార్సీ వూసే ఇప్పుడొద్దని స్పష్టంచేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో యూపీఏ ఎస్సార్సీ వేసే అవకాశాలే లేవని, బీఎస్పీ నాయకురాలు మాయావతి అసలే ఒప్పుకోరని మధు యాష్కీ వ్యాఖ్యానించారు. తెలంగాణ అంశాన్ని తేల్చకుండా ఎన్నికలకు వెళ్తే గత ఎన్నికల నాటి ఫలితాలు తారుమారవుతాయని ఎక్కువ మంది సభ్యులు అన్నారు.

అభివృద్ధితో ఓట్లు సాధిద్దాం: జీవన్‌రెడ్డి

'రెండో ఎస్సార్సీతో నిమిత్తం లేకుండా తెలంగాణ ఇవ్వాలని కోరుతున్నాం.. అధిష్ఠానం తిరస్కరిస్తే మరిన్ని చిక్కుల్లో పడతాం' అని మంత్రి జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. మరేదైనా ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తే మంచిదని సూచించారు. దాని గురించి ఆలోచిస్తే ముందుకు వెళ్లలేమని, ఎలాగైనా తెలంగాణ అంశంపై అధిష్ఠానం నుంచి ప్రకటన వచ్చేందుకు కృషి చేద్దామని సభ్యులు అన్నారు. అభివృద్ధితో ఓట్లు సాధిద్దామని జీవన్‌రెడ్డి అనగా.. కరీంనగర్‌ ఉప ఎన్నికలో అభివృద్ధి ఏమైందని సభ్యులు ప్రశ్నించారు (ఈ ఉపఎన్నికలో జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌ తరపున పోటీచేసి తెరాస అధినేత కేసీఆర్‌ చేతిలో ఓడిపోయారు). అభివృద్ధి కంటే సెంటిమెంటు బలంగా ఉందని పలువురు అన్నారు. అభివృద్ధి అంశం చర్చకు వచ్చినపుడు జీవన్‌రెడ్డి, సీనియర్‌ ఎమ్మెల్యే పీజేఆర్‌ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. 'అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు... ఎక్కడుంది అభివృద్ధి' అని పీజేఆర్‌ అనగా.. తాను కరీంనగర్‌ గురించి మాట్లాడుతున్నానని మంత్రి సమాధానమిచ్చారు.

సెంటిమెంటును కాదంటే అంతే!

కరీంనగర్‌ ఉప ఎన్నిక, సింగరేణి కార్మిక సంఘ ఎన్నికలు, శాసనమండలి ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉన్న విషయాన్ని స్పష్టంగా చూశామని, దీన్ని విస్మరిస్తే ఇబ్బందుల్లో పడతామని వీహెచ్‌, మధు యాష్కీ సహా మరి కొందరు సభ్యులు అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆంధ్రలోను కాంగ్రెస్‌ గెలుస్తుందని, కేంద్రంలో సోనియాగాంధీ నేతృత్వంలో ప్రభుత్వం రావడానికి తోడ్పడుతుందని వీహెచ్‌ అన్నారు. తెలంగాణను కాదంటే ఈ ప్రాంతంలో గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు తారుమారై తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరుతుందన్నది గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్‌రెడ్డి, పులివీరన్న తదితరులు వ్యాఖ్యానించారు. టీఆర్‌సీసీసీలో ఉన్న మంత్రులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేరని, ఈ నేపథ్యంలో టీఆర్‌సీసీసీని పునర్‌వ్యవస్థీకరించాలని ఎంపీ సర్వే సత్యనారాయణ అన్నారు. భూముల విక్రయాల అంశాన్ని తెలంగాణ ప్రణాళిక, అభివృద్ది మండలి ఛైర్మన్‌ ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి లేవనెత్తగా.. ఈ అంశంపై వీహెచ్‌, పీజేఆర్‌ మాట్లాడారు. దీంతో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో భూముల విక్రయాల ద్వారా వచ్చే రాబడిని ఇతర ప్రాంతాల అభివృద్ధికి వినియోగించకుండా ఇక్కడే వ్యయం చేయాలని అత్యధిక సభ్యులు అభిప్రాయపడ్డారు. 'అసలు డబ్బులెక్కడ వస్తున్నాయి.. ఎకరం భూమిని ఒక రూపాయికి ఇస్తుంటే' అని పీజేఆర్‌ విమర్శించారు.

అందరి కంటే ముందుంటా: మీరు రాష్ట్రం మొత్తానికి పీసీసీ అధ్యక్షుడు కావడం వల్ల మీకు కొన్ని ఇబ్బందులుంటాయి అని కేశవరావును ఉద్దేశించి సర్వే సత్యనారాయణ అన్నారు. కొందరు తనను శంకిస్తుంటారని, అందరికంటే ఎక్కువగా తెలంగాణ రాష్ట్రం కావాలని కోరేవాడిని తానేనంటూ కేకే స్పందించారు. నేను కొట్లాడినపుడు మీరంతా లేరని వ్యాఖ్యానించి.. తెలంగాణ రాష్ట్రం కోసం అందరికంటే తానే ముందుంటానని చెప్పారు.

Tuesday, September 4, 2007

ఉద్యమానికి పునరంకితమవుదాం Eenadu

కేసీఆర్‌ పిలుపు 'గో బ్యాక్‌' అమర వీరులకు శ్రద్ధాంజలి

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: త్యాగాల పునాదిపై జరిగిన ఆనాటి పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పునరంకితమవ్వాలని తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు. 'ఇడ్లీ సాంబర్‌ గో బ్యాక్‌.. నాన్‌

ముల్కీ గో బ్యాక్‌' ఉద్యమంలో అసువులు బాసిన వారి సంస్మరణార్థం హైదరాబాద్‌లోని గన్‌పార్కులో గల అమరవీరుల స్థూపం వద్ద మంగళవారం తెరాస ఏడు భారీ కొవ్వొత్తులను వెలిగించి శ్రద్ధాంజలి ఘటించింది. నాన్‌ ముల్కీ గో బ్యాక్‌.. జై తెలంగాణ లాంటి నినాదాలు ఈ సందర్భంగా మిన్నంటాయి. కేసీఆర్‌ ప్రసంగిస్తూ.. ఆంధ్ర ప్రాంతం మద్రాసులో అంతర్భాగంగా ఉన్నప్పటి నుంచి తెలంగాణపై వలసవాదుల దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. తెలంగాణను హేళన చేస్తూ అప్పటి మద్రాసు ప్రభుత్వ నేతలు చేసిన ప్రకటనలపై తెలంగాణ విద్యార్థులు 1949లో 'ఇడ్లీ సాంబార్‌ గో బ్యాక్‌.. నాన్‌ ముల్కీ గో బ్యాక్‌' నినాదంతో ఆందోళన ఉద్ధృతం చేశారన్నారు. ఈ సమయంలో సిటీ కాలేజీ వద్ద పోలీసులు కాల్పులు జరిపి ఏడుగురు విద్యార్థులను పొట్టన పెట్టుకున్నారని గుర్తుచేశారు. తెలంగాణ వాదులపై, ఉద్యమకారులపై అవి తొలి పోలీసు కాల్పులన్నారు. ఆ దమననీతి, మోసం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్‌ జోహారులు.. జోహారులు.. అమవీరులకు జోహారులంటూ గీతాలను ఆలపించి అందరి కర్తవ్యాన్నీ గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో తెరాస ఎమ్మెల్యేలు నాయిని నర్సింహ్మారెడ్డి, పద్మా దేవేందర్‌రెడ్డి, రామలింగారెడ్డి, పార్లమెంట్‌ సభ్యులు రవీంద్రనాథ్‌, ఎమ్మెల్సీలు దిలీప్‌, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Monday, September 3, 2007

తెలంగాణ కోసమే ఎస్సార్సీ వేయాలి Eenadu

ఉప్పునూతల స్పష్టీకరణ తేలిగ్గా చూస్తే ద్రోహం చేసినట్లే: మధు యాష్కీ
తెలంగాణ అంశాన్ని పక్కనబడేసినా, దాని ప్రభావం ఎన్నికలపై ఉండదని తేలిగ్గా తీసేసినా తెలంగాణకు ద్రోహం చేసినట్లేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి, నిజామాబాద్‌ ఎంపీ మధు యాష్కీ అన్నారు. వారు సోమవారం వేర్వేరుగా న్యూస్‌టుడేతో మాట్లాడారు. తెలంగాణ అంశాన్ని రెండో ఎస్సార్సీ ద్వారానే పరిష్కరించాలనుకుంటే ప్రత్యేకంగా దాని కోసమే వేయాలని తెలంగాణ ప్రాంతీయ ప్రణాళిక, అభివృద్ధి బోర్డు ఛైర్మన్‌ అయిన ఉప్పునూతల స్పష్టంచేశారు.



కాలయాపన చేయడం కన్నా.. ఎన్నికలకు ముందే తెలంగాణపై పార్టీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాలన్నారు. తెలంగాణ ప్రభావం ఉండదని తేలిగ్గా తీసిపడేస్తే మాత్రం తెలంగాణకు ద్రోహం చేసినట్లని అన్నారు. టీఆర్‌సీసీసీ సమావేశంలో ఈ అంశాలపై మాట్లాడతానని తెలిపారు. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని, 2009 ఎన్నికల్లోపు కాంగ్రెస్‌ దీనిపై నిర్ణయం తీసుకోవాలని మధు యాష్కీ చెప్పారు. రెండో ఎస్సార్సీ కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఉన్న అంశమే అయినా ఇప్పుడు ఎస్సార్సీ ద్వారా ఫలితాలు రావడం కష్టమని తెలిపారు. ఏకాభిప్రాయం ద్వారా తెలంగాణ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని ప్రకటించిన అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. తెలంగాణ అంశాన్ని తేలిగ్గా తీసేస్తే ద్రోహం చేసిన వాళ్లవుతారని హెచ్చరించారు. టీఆర్‌సీసీసీ విశ్వసనీయత కోల్పోయిందన్నారు. 2004 ఎన్నికలకు ముందు ఏర్పాటైన టీఆర్‌సీసీసీ ఇంకా అప్పటి సభ్యులతోనే కొనసాగుతోందని ఆక్షేపించారు. ఎంపీలుగా ఆహ్వానిస్తే టీఆర్‌సీసీసీ సమావేశానికి వెళ్తానన్నారు.




Monday, August 27, 2007

పాఠశాల విద్యాశాఖలో స్థానికేతరుల గుర్తింపు పూర్తి Eenadu

హైదరాబాద్‌, ఆగస్టు 27 : 610 జీఓ అమలుపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘంతో ముఖ్యమంత్రి ఈరోజు భేటీ అయ్యారు. అనంతరం వివరాలను మంత్రివర్గ ఉప సంఘం అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ తెలిపారు. పాఠశాల విద్యాశాఖలో స్థానికేతరుల గుర్తింపు పూర్తయిందని అయితే వారి పూర్తి వివరాలు పొందుపరచవలసి ఉందని చెప్పారు. 1975 నుంచి నియామకాల పరిశీలన పూర్తయితే స్థానికేతరుల సంఖ్య మరో రెండు వేలవరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మిగతా శాఖల్లో 610 జీఓకు సంబంధించి స్థానికేతరుల గుర్తింపు ఈ నెలాఖరుకు పూర్తవుతుందని తెలిపారు.

Friday, August 24, 2007

గోనెపై విద్యార్థుల దాడి గాజులు, పసుపు కుంకుమలు జల్లి నిరసన Eenadu

యాష్కీపై ఆరోపణలకు ఖండన

ఎదుగుదల చూసి ఓర్వలేకపోతున్నారని ధ్వజం

ప్రతిఘటించిన ప్రకాశరావు; ఎదురుదాడి

న్యూస్‌టుడే


ఆర్టీసీ మాజీ ఛైర్మన్‌, మాజీ శాసనసభ్యుడు గోనె ప్రకాశరావుపై ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. శుక్రవారం స్థానిక ఫతేమైదాన్‌ క్లబ్‌లో విలేకరుల సమావేశంలో గోనె మాట్లాడుతున్నప్పుడు ఈ దాడి జరిగింది. తెలంగాణకు, తెలంగాణ బీసీ నేతలకు ఆయన వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ ఆ విద్యార్థులు ధ్వజమెత్తారు. దాడి సందర్భంగా గోనె, ఆయనతో ఉన్న కాంగ్రెస్‌ నేతలు గట్టిగానే ప్రతిఘటించారు. దీంతో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. ఒకరిపై మరొకరు చేయిచేసుకున్నారు. మొత్తానికి నిజామాబాద్‌ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌పై గోనె చేసిన ఆరోపణలు ఈ దాడికి కారణమైనట్లు స్పష్టమవుతోంది. శుక్రవారం కూడా మధుయాష్కీపై ఆయన సరికొత్త ఆరోపణలు చేస్తున్న తరుణంలోనే విద్యార్థుల దాడి జరిగింది. విలేకరుల సమావేశం ముగుస్తున్న తరుణంలో వట్టికూటి రామారావు అనే విద్యార్థి వేదికపైకి వెళ్లి మొదట గోనెపై దాడికి పాల్పడ్డారు. ఈ హఠాత్‌పరిమాణం నుంచి వెంటనే తేరుకున్న గోనె, ఆయన పక్కనే ఉన్న ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌, ఎస్సీ, ఎస్టీ సెల్‌ కన్వీనర్‌ రవిబాబు, పీసీసీ కార్యదర్శి నిరంజన్‌లు ప్రతిఘటించారు. రామారావుపై ప్రతి దాడి చేశారు. ఇంతలోనే గాజుల శ్రీధర్‌ అనే మరో విద్యార్థి పసుపు, కుంకుమ, గాజులను తీసుకొచ్చి గోనెపై వేశారు. మూడో విద్యార్థి నాగరాజూ వారితో జతకలిశారు. తెలంగాణ బీసీ నాయకులను ఎదగనీయకుండా అడ్డుకుంటున్నారని వారు గోనెపై ఆరోపణలు చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సహించేది లేదని పెద్దఎత్తున నినాదాలు చేశారు.

ఎవరికైనా ఇదే శాస్తి యాష్కీ ఎదుగుతున్న బీసీ నాయకుడు కావడంతో ఓర్వలేకే ఆయనపై ఆరోపణల దాడికి పాల్పడుతున్నారని రామారావు ఆరోపించారు. అవకతవకలుంటే సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేయాలని.. అలా కాకుండా ఓర్వలేనితనంతో ఇలా కుట్ర పన్నడం తగదంటూ మండిపడ్డారు. బీసీ వ్యతిరేకుల దాడుల్ని ప్రతిఘటిస్తామన్నారు. మధుయాష్కీ తెలంగాణ అడుగుతుండటం కొందరికి ఆగ్రహం తెప్పిస్తోందంటూ.. ముఖ్యమంత్రికి గోనె తొత్తుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బీసీలకు, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని ఎక్కడైనా ఇలాగే ప్రతిఘటిస్తామన్నారు.

విద్యార్థుల అరెస్టు దాడికి పాల్పడిన ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి సైఫాబాద్‌ స్టేషన్‌కు తరలించారు. ఈలోగా యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్‌బాబు, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు కెం.ఎం.ప్రతాప్‌ అక్కడికి చేరుకొని గోనెను పరామర్శించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు మధు యాష్కీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ముగ్గురు విద్యార్థులపైనా, వారితోపాటు వచ్చిన మరికొందరు విద్యార్థులపైనా కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. వారిపై ఐపీసీ 143, 323, 341 సెక్షన్ల కింద కేసులు నమోదుచేసినట్లు వివరించారు. మరోవైపు నిందితుల్లో ఒకరైన రామారావు గోనెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై ఐపీసీ 506, 323 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇంటిపేరు మార్చి 2 పాస్‌పోర్టులు: గోనె ఇంటి పేరు మార్చి మధుయాష్కీ నిబంధనలకు విరుద్ధంగా రెండు పాస్‌పోర్టులు పొందినట్లు గోనె అంతకుముందు ఆరోపించారు. మొదట మధుసూదన్‌ యాష్కీ అనే పేరుతో పొందిన పాస్‌పోర్టుకు వీసా రాకపోవడంతో.. ఇంటి పేరు మార్చి మరో పాస్‌పోర్టు పొందినట్లు తెలిపారు. ఆయన సోదరులిద్దరు, సోదరి, బావమరిది కూడా నకిలీ సర్టిఫికెట్లతో హెచ్‌-1 వీసా పొంది, గ్రీన్‌కార్డు కూడా పొందినట్లు ఆరోపించారు. గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి పొందినట్లు చెబుతున్న ఇంజినీరింగ్‌ డిగ్రీలు నకిలీవని తేలాయన్నారు. వీటన్నిటిపై అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

వైఎస్‌కు యాష్కీని పరిచయం చేసిందే నేను దాడి ఘటన అనంతరం కూడా గోనె విలేకరులతో మాట్లాడారు. తాను బీసీలకు వ్యతిరేకం కాదని స్పష్టంచేశారు. దాడులకు భయపడబోనని, మధుయాష్కీకి సంబంధించి తాను వెలుగులోకి తీసుకొస్తున్న అంశాలను ఆపబోనని తేల్చిచెప్పారు. వైఎస్‌కు మధుయాష్కీని పరిచయం చేసిందే తానని ఆయన పేర్కొన్నారు. టికెట్‌ తనవల్లే వచ్చిందని యాష్కీనే స్వయంగా చెప్పారని తెలిపారు.

వ్యక్తిగత విమర్శలు తప్పే: కేకే గోనె మీద జరిగిన దాడిపై స్పందించేందుకు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దిగ్విజయ్‌ సింగ్‌ నిరాకరించారు. మీడియా ప్రతినిధులు ఢిల్లీలో ఆయన స్పందన కోరగా.. ''నేనెందుకు పీసీసీ అధ్యక్షుడు కె.కేశవరావు ఇక్కడే ఉన్నారుగా.. ఆయనే స్పందిస్తారని'' చెప్పారు. కేకే మాట్లాడుతూ.. ఆ విషయం ఇంకా తన దృష్టికి రాలేదన్నారు. అన్ని విషయాలనూ తాను పరిశీలిస్తానని చెప్పారు. మరి మధుయాష్కీపై గోనె చేసిన ఆరోపణల సంగతేమిటని అడగ్గా.. అలా వ్యక్తిగత విమర్శలకు దిగడం తప్పేనన్నారు.

గోనె ప్రకాశరావుపై విద్యార్థుల దాడి Eenadu

హైదరాబాద్‌: బీసీలకు, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ ఆర్టీసీ మాజీ ఛైర్మన్‌ గోనె ప్రకాశరావుపై కొంతమంది ఓయూ విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ఫతేమైదాన్‌లో మీడియా సమావేశం జరుగుతుండగా విద్యార్థులు దూసుకువచి ప్రకాశరావుపై చేయి చేసుకున్నారు. దీంతో గోనెకు, విద్యార్థులకు మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. ప్రకాశరావు కూడా విద్యార్థులపై ఎదురుదాడికి దిగారు. మధుయాష్కీ తెలుగుదేశం పార్టీ ఏజెంటు అంటూ నిన్న ప్రకాశరావు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ దాడి జరిగిందని తెలుస్తోంది. తనపై దాడి వెనుక కారకులెవరో తెలుసునని గోనె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఉన్న మధుయాష్కీ దీనిపై స్పందిస్తూ, తనకు గోనె ప్రకాశరావుకు మధ్య ఎలాంటి విబేధాలు లేవని అన్నారు.

Monday, August 13, 2007

త్వరలో మరికొందరు కానిస్టేబుళ్ళ బదిలీ

కొత్త గడువు సెప్టెంబరు: జానారెడ్డి
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: పోలీసుశాఖలో 610 జీవో అమలులో భాగంగా త్వరలో మరికొందరు కానిస్టేబుళ్ళను స్వస్థలాలకు పంపుతున్నట్లు హోంమంత్రి జానారెడ్డి తెలిపారు. కొత్తగా ఎంపికైన సుమారు 2700 మంది కానిస్టేబుళ్ళను ఈ నెలఖారులోపు నియమించే అవకాశం ఉన్నందున ఆమేరకు స్థానికేతరులను బదిలీ చేస్తామన్నారు. 610 జీవోపై సోమవారం ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. ఇందులో జానారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నిశాఖల్లో కలిపి 8718 మంది స్థానికేతరులు ఉన్నట్లు గుర్తించగా వారిలో 958 మందిని ఇప్పటికే స్వస్థలాలకు పంపామని చెప్పారు. సెప్టెంబరు చివరినాటికి అన్నిశాఖల్లోనూ స్థానికేతరుల బదిలీ ప్రక్రియ పూర్తిచేస్తామని తెలిపారు. ముందు బదిలీ చేసి అవసరమైతే మళ్ళీ డిప్యూటేషన్లపై తీసుకుంటామని, కొత్తవారు చేరగానే ఈ డిప్యుటేషన్లు రద్దు చేస్తామని హోంమంత్రి జానారెడ్డి వివరించారు

Saturday, August 11, 2007

నాలుగు లక్షల మంది విద్యార్థులతో ఉద్యమం

తెలంగాణ వచ్చేదాకా పోరు ఆగదు శిక్షణ శిబిరంలో కేసీఆర్‌ ఉద్ఘాటన
నాలుగు లక్షల మంది విద్యార్థులతో పటిష్టమైన విద్యార్థి విభాగాన్ని రూపొందించుకుని ప్రత్యేక తెలంగాణ సాధన కోసం పోరాడతామని తెరాస అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. శనివారం ఇక్కడి తెలంగాణ భవన్లో తెరాస విద్యార్థి విభాగం సభ్యుల తొలిదశ శిక్షణ శిబిరంలో ఆయన ప్రసంగించారు. ఇప్పటికే 15,000 మంది విద్యార్థులు తమ విభాగంలో చేరారని, వీరికి ఆర్నెల్ల పాటు శిక్షణ ఇస్తామని చెప్పారు. అనంతరం మరో 15,000 మంది విద్యార్థినులకు డివిజన్‌ స్థాయిలో శిక్షణ ఇస్తామన్నారు. హింసకు దిగడమే ఉద్యమం కాదని, ప్రజాస్వామ్యయుతంగా బలీయమైన రాజకీయ శక్తిగా ఎదిగి తెలంగాణను సాధించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. 'ఈ దఫా తెలంగాణ వచ్చేదాకా పోరు జరిగి తీరుతుంది. తెలంగాణకు అనాదిగా అన్యాయం జరుగుతోంది. నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఇచ్చిన 36 జీవోకు వ్యతిరేకంగా మంత్రి దామోదరం సంజీవయ్యే కోర్టుకెక్కారు. ఇప్పుడు 610పై కాంగ్రెస్‌ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య కోర్టుకు వెళ్లారు. అనాదిగా తెలంగాణకు ఇదే అన్యాయం జరుగుతోంది. వీటినుంచి బయట పడాలంటే ప్రత్యేక రాష్ట్రమే శరణ్యం. ఈ విద్యార్థులు ఏడాదికి 15 రోజుల పాటు ముఖ్యమైన రోజుల్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు' అని కేసీఆర్‌ వివరించారు. ఈ శిబిరంలో సూర్యాపేట (నల్గొండ), గద్వాల (మహబూబ్‌నగర్‌), కమలాపురం (కరీంనగర్‌) నియోజకవర్గాల నుంచి 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సాగునీటి రంగంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గురించి వారికి కేసీఆర్‌ వివరించారు. అనంతరం దేశిపతి శ్రీనివాస్‌, విద్యాసాగరరావు, ప్రకాశ్‌, ఇతర తెలంగాణ మేధావులు వివిధ రంగాల్లో తెలంగాణ పట్ల ప్రభుత్వం చూపుతున్న వివక్ష గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ విభాగాల నేతలు పాల్గొన్నారు.

Thursday, July 26, 2007

'610'పై ఆంధ్ర ఎమ్మెల్యేల ఆందోళన? Andhra Jyothy

హైదరాబాద్‌, జూలై 26 (ఆన్‌లైన్‌): 610 ఉత్తర్వును అమలు చేయాలంటూ ఇప్పటివరకూ తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తూ వస్తే.. ఇప్పుడు ఆంధ్ర-రాయలసీమ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళనకు సమయాత్తమవుతున్నారు. ఈ జీవో విషయంలో ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలపై పార్లమెంటు సభ్యుడు చేగొండి హరిరామజోగయ్య, సీనియర్‌ శాసనసభ్యుడు గాదె వెంకటరెడ్డి, తదితర నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతానికి చెందిన 60 మంది ఎమ్మెల్యేల సంతకాలను వీరు సేకరించారు. మరికొందరి సంతకాలను సేకరిస్తున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఈ ప్రాంత ఎమ్మెల్యేలు సమావేశమై ఈ జీవో విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై చర్చించి, తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి తెలపనున్నారు.

నష్టపోయేది తెలంగాణ ఒక్కటేనా...!
నష్టపోయేది తెలంగాణ ఒక్కటేనా...!ప్రభుత్వం ఇప్పటి వరకూ తెలంగాణ ప్రాంతానికే ప్రా ధాన్యతను ఇస్తోందని.. ఆంధ్ర, రాయలసీమ నేతల వాదనలు వినేందుకు సముఖతను వ్యక్తం చేయడం లేదన్న ఆగ్రహం ఆ నేతల్లో వ్యక్తమవుతోంది. ఈ ఉత్తర్వును అమ లు చేస్తున్నప్పుడు కేవలం తెలంగాణ ప్రాంతానికే అన్యా యం జరుగుతోందన్న భావం ప్రభుత్వంలోనూ, అధికారుల్లోనూ కన్పిస్తోందే తప్ప.. ఇతర ప్రాంతాలకు జరిగే నష్టాన్ని గురించి ఆలోచించడం లేదని వారంటున్నారు. 610పై తాము మాట్లాడిన ప్రతిసారీ, ఈ ఉత్తర్వు అమలుకు తాము వ్యతిరేకమన్న ప్రచారాన్ని తెలంగాణ నేతలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు.. దీన్ని అమలు చేయాలని కోరుకుంటున్నదే తా మని, అయితే.. రాష్ట్రపతి ఆదేశాలు, ఆరు సూత్రాల కార్యక్రమానికి లోబడి మాత్రమే ఇది జరగాలని వారు స్పష్టం చేస్తున్నారు.

Wednesday, July 25, 2007

610 జీవో కింద మాతృ సంస్థలకు 61 మంది ఇంజనీర్లు Andhra Jyothy

(ఆన్‌లైన్‌, సిటీబ్యూరో) మహా నగరపాలక సంస్థలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న 61 మంది అధి కారులను మాతృసంస్థలకు పంపారు. ప్రజారోగ్యం, పంచాయ తీరాజ్‌, గ్రామీణ నీటి సరఫరా, నీటి పారుదల, సాంఘిక సంక్షేమశాఖలకు చెందిన 59 మంది ఇంజనీర్లను, ఇద్దరు డిప్యూటీ ప్రాజెక్టు అధికా రులను వెనక్కి పంపుతూ గ్రేటర్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 610జీవో కింద స్థానికేతరులుగా గుర్తించిన ఇంజనీర్లను మాతృ శాఖలకు అప్పగించారు. కాగా 610 ప్రభావంతో వెనక్కివెళుతున్న ఇంజనీర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించి 'స్టే' పొందారు. 40 మంది ఇంజనీర్లు బదిలీని వ్యతిరేకిస్తూ కోర్టుకెక్కడంతో న్యాయస్థానం స్టే మంజూరు చేసింది.

ఇదిలావుండగా 610 జీవో కింద వెనక్కి వెళ్లిన వారంతా బల్దియాలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న వారే. డిప్యుటేషన్‌ కాలం పూర్తయినా 143 మంది ఇంజనీర్లు ఇంకా నగరపాలక సంస్థ లోనే తిష్ట వేశారని గత మే 27న 'జీతమెందుకు.. గీతం ఉందిగా!' శీర్షికన 'ఆంధ్రజ్యోతి' వార్తను ప్రచురించింది. దీనికి స్పందించిన ప్రభుత్వం వీరిలో ఎంతమంది 610 జీవోకు భిన్నంగా బల్దియాలో పనిచేస్తున్నారో నివేదిక సమర్పించాలని ఆయా శాఖలను ఆదేశిం చింది. ఈ మేరకు డిప్యుటేషన్‌పై జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్న 59 మంది అసిస్టెంట్‌ ఇంజనీర్లను స్థానికేత రులుగా గుర్తించింది. వీరిని సొంత శాఖలకు తిప్పి పంపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
బల్దియాలో మరో 101 మంది...11 610 జీవో ప్రభావం 101 మంది ఉద్యోగులపై చూపనుంది. జీవోను కార్యరూపంలోకి తెస్తుండ టంతో ఈ ఉద్యోగులు దిక్కుతోచని స్థితిలో పడ్డా రు. బల్దియాలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న స్థానికేతరులను ఈ జీవో అనుసరించి మాతృసం స్థలకు తిప్పి పంపే అవకాశం ఉంది. ఇటీవల గ్రే టర్‌లో విలీనమైన 12 మున్సిపాలిటీల పరిధిలో 84 మంది, పూర్వపు ఎంసిహెచ్‌ పరిధిలో 17 ఇ తర శాఖలకు చెందిన ఉద్యోగులు పనిచేస్త్తున్నా రు. వీరిని బదిలీచేసే అంశంపై జీహెచ్‌ఎంసీ ఇం కా తుది నిర్ణయం తీసుకోలేదు. ఒకేసారి ఇంతమంది ఇంజనీర్లు పోతే పనుల పర్యవేక్షణ ఇబ్బ ందవుతుందని ఉన్నతాధికారులు అంటున్నారు.

610 అమలుపై అనుమానాలొద్దు: డీఎస్‌ eenadu

610 జీవో అమలు ప్రక్రియ మొదలైందని ఇందులో ఎటువంటి అనుమానాలకు తావులేదని మంత్రి డి.శ్రీనివాస్‌ తెలిపారు. బుధవారం శాసనసభ ప్రారంభం కాగానే ముల్కీ నిబంధనలు, 610 అమలుపై తెరాస వాయిదా తీర్మానాలను ఇచ్చింది. చర్చ జరగాలని పట్టుబట్టింది. ప్లకార్డులను ప్రదర్శించింది. దీనిపై జోక్యం చేసుకున్న డీఎస్‌ మాట్లాడుతూ జీవో అమలులో పొరపాట్లు జరిగి ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.

Tuesday, July 24, 2007

తెలంగాణ వాదులను రెచ్చగొట్టొద్దు Eenadu

జోగయ్యకు మధుయాష్కీ హెచ్చరిక
న్యూఢిల్లీ, న్యూస్‌టుడే: 610 జీవో అమలును వ్యతిరేకిస్తూ ఎంపీ హరిరామజోగయ్య చేసిన వ్యాఖ్యలపై నిజామాబాద్‌ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ తీవ్రంగా మండిపడ్డారు. జోగయ్య వ్యాఖ్యలు తెలంగాణ వాదులను రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. ఇలాంటి మాటలు మానుకోవాలని హెచ్చరించారు. మంగళవారమిక్కడి ఏపీ భవన్‌లో మధుయాష్కీ విలేకరులతో మాట్లాడారు. దిగ్విజయ్‌సింగ్‌ కూడా ఈ అంశంపై తెలంగాణ ఉద్యోగులు, నాయకుల వాదనలు వినాలని డిమాండు చేశారు. '610కు వ్యతిరేకంగా పోరాడాలని హరిరామజోగయ్య, హర్షకుమార్‌ పిలుపునిచ్చారు. అధిష్ఠానం వద్ద మాత్రం తాము 610కి వ్యతిరేకం కాదని చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారు. జయభారత్‌రెడ్డి నివేదిక ప్రకారం స్థానికేతర ఉద్యోగుల సంఖ్య 1985 నాటికే 55వేలు. తాజా ప్రభుత్వ లెక్కల ప్రకారం అది ఏడువేలకు తగ్గిపోవడం విచిత్రంగా కనిపిస్తోంది. ఇది పూర్తి అవాస్తవం. హరిరామ జోగయ్య వ్యాఖ్యలు చూస్తే శాంతియుతంగా జరుగుతున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని హింసాత్మకం చేయడానికి ఇక్కడివారిని రెచ్చగొట్టినట్లు కనిపిస్తోంది. 610 జీవోను చిత్తశుద్ధితో అమలు చేయాలనుకుంటే సరైన లెక్కలు తీయాలి. అందులో తెలంగాణ ఉద్యోగ సంఘాలనూ భాగస్వాములను చేయాలి. తెలంగాణ ఉద్యోగ సంఘాలు తమ ప్రాంతంలో కనిపించే చిన్న పార్టీ నాయకుడినీ నిలదీసి వారి ఉద్యమానికి మద్దతిచ్చేలా ఒత్తిడి తేవాలి. ఆంధ్ర ప్రాంత ఉద్యోగ సంఘాల వెంట ఉంటానని హరిరామ జోగయ్య ప్రకటించారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకుల మద్దతు తీసుకుని 610 అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నా' అని యాష్కీ పేర్కొన్నారు.

610 జీవోపై 'జానా'కు అవగాహన లేదు : చేగొండి Andhra Jyothi

హైదరాబాద్‌, జూలై 24 (ఆన్‌లైన్‌): హోం మంత్రి జానారెడ్డికి 610 జీవోపై సరైన అవగాహన లేదని , అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ ఎంపి చేగొండి హరిరామజోగయ్య ధ్వజమెత్తారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 1975 నగర పోలీసు చట్టం ప్రకారం ఎలాంటి రిక్రూట్‌ మెంట్లు జరగలేదని జానారెడ్డి ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయనకు జీవోపై సరైన అవగాహన లేదని, అందుకే తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర పోలీసులు 610 జీవో పరిధిలోకి రారని, అక్రమంగా వారిని బదిలీ చేస్తున్నారని మండి పడ్డారు.
1975 తర్వాత రిక్రూట్‌ మెంట్లు జరిగినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. 'ముందు జీవో గురించి అవగాహన చేసుకున్నాక వ్యాఖ్యలు చేయండి లేదా... అడ్వకేట్‌ జనరల్‌తో మాట్లాడి పూర్తిగా తెలుసుకోండి'అని జానారెడ్డికి ఆయన హితవు పలికారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో జీవో అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఆంధ్రా ప్రాంత వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, వారు చేపట్టే ఆందోళనలకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.

610 జీవోపై 'జానా'కు అవగాహన లేదు : చేగొండి Andhra Jyothi

హైదరాబాద్‌, జూలై 24 (ఆన్‌లైన్‌): హోం మంత్రి జానారెడ్డికి 610 జీవోపై సరైన అవగాహన లేదని , అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ ఎంపి చేగొండి హరిరామజోగయ్య ధ్వజమెత్తారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 1975 నగర పోలీసు చట్టం ప్రకారం ఎలాంటి రిక్రూట్‌ మెంట్లు జరగలేదని జానారెడ్డి ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయనకు జీవోపై సరైన అవగాహన లేదని, అందుకే తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర పోలీసులు 610 జీవో పరిధిలోకి రారని, అక్రమంగా వారిని బదిలీ చేస్తున్నారని మండి పడ్డారు.
1975 తర్వాత రిక్రూట్‌ మెంట్లు జరిగినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. 'ముందు జీవో గురించి అవగాహన చేసుకున్నాక వ్యాఖ్యలు చేయండి లేదా... అడ్వకేట్‌ జనరల్‌తో మాట్లాడి పూర్తిగా తెలుసుకోండి'అని జానారెడ్డికి ఆయన హితవు పలికారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో జీవో అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఆంధ్రా ప్రాంత వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, వారు చేపట్టే ఆందోళనలకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.

Monday, July 23, 2007

యోధులను మరచిన ప్రభుత్వం Andhra Jyothi

తెలంగాణ సాయుధ గెరిల్లా అచ్చమాంబకు అందని సాయం
చిరుప్రాయంలోనే పోరుబాట పట్టిన తెలంగాణ సాయుధ పోరాట నేత నెల్లుట్ల మోహన్‌రావును అజ్ఞాతంలో ఉన్నప్పుడే వివాహం చేసుకున్నారు. ఎంతో మందికి సమరయోధుల పింఛను రావడానికి సహకరించిన మోహన్‌రావు సైతం అచ్చమాంబను విస్మరించడం విశేషం. మోహన్‌రావు మృతి అనంతరం భార్యగా వచ్చే పింఛను మాత్రమే ఆమె పొందుతున్నారు. ఆమె పోరాటానికి మాత్రం ప్రత్యేక గుర్తింపు లేకుండా పోయింది. ఇతర సమరయోధుల కంటే ఆమెకు బలమైన సాక్ష్యాధారాలున్నాయి. పిండిప్రోలులో జరిగిన గెరిల్లా శిక్షణలో భాగంగా అధునాతన ఆయుధం (గైడర్‌) చేతబట్టిన ఫోటో ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది.
పోరాట విరమణ అనంతరం కేరళ నుంచి ఆ ఫోటోను మోహన్‌రావు తెప్పించారని అచ్చమాంబ తెలిపారు. అలాంటిది ఆమెకు సమరయోధు రాలిగా గుర్తింపు రాకపోవడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆమెతోపాటు అజ్ఞాతంలో కలిసి పని చేసిన నేనాల కమల, లలిత, లక్ష్మిలకు సైతం సమరయోధుల పింఛను చాలాకాలం కిందటే మంజూరైంది. పింఛన్‌ ఎందుకు రావడం లేదని అచ్చమాంబను 'ఆన్‌లైన్‌' ప్రశ్నిస్తే... 'అంతా నా భర్త మోహన్‌రావు చూసుకునేవారు. నేనా విషయాలు పట్టించుకోలేద'ని బదులిచ్చారు. కమలమ్మ సైతం అచ్చమాంబకు పింఛను రావడం లేదా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
'పోరాటం గురించి తెలియని వాళ్లు సైతం నేడు సమరయోధులుగా చలామణి అవుతున్నారు. డబ్బుల కోసం కాదు, నా పోరాటానికి గుర్తింపు లేదన్న బాధ ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంద'ని అచ్చమాంబ చెప్పారు. 'భవిష్యత్తులో ఎవరో ఏదో చేస్తారన్న ఆశతో నాడు పోరాటం చేయలేదు. భూస్వా ములు, నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసం పోరాటం చేశాం. గుర్తించాల్సింది ప్రభుత్వమే. కార్యాలయాల చుట్టూ తిరిగే ఓపిక నాకు లేదు. నాలా గుర్తింపునకు నోచుకోని వారు ఇంకా ఎందరో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి, వారందరినీ ఆదుకోవలసిన అవసరం ఉంది. అయినా ఇప్పుడంతా పైరవీలమయం. నాకు న్యాయం జరుగుతుందన్న ఆశ లేదు' అని ఆవేదన వ్యక్తం చేశారు అచ్చమాంబ.
వైద్యంతో మమేకంపిండిప్రోలులో జరిగిన శిబిరంలో అచ్చమాంబ వైద్య శిక్షణ పొందారు. గాయపడిన గెరిల్లాలకు గాయాలు శుభ్రం చేయడం, కట్లు కట్టడం, ఇంజక్షన్లు ఇవ్వడంలో తర్ఫీదు ఇచ్చారు. ఇద్దరు కొరియర్లతో పాటు ఒక గన్‌మెన్‌తో ఎక్కడ దళాలకు ప్రమాదం జరిగినా ఆమె అక్కడకు వెళ్లి చికిత్స చేసేవారు. దళాలకు చేయూతనిస్తున్న గిరిజన గూడేల్లోనూ వైద్య సేవ చేయడంతో అచ్చమాంబను ఆప్యాయంగా ఓడకాయ (టాబ్లెట్స్‌) అక్క, ఎర్రక్క అని అక్కడి వారు పిలుచుకునేవారు. దళాలకు పోలీసులు, రజాకార్ల నుంచే కాకుండా అడవి జంతువుల నుంచి ప్రమాదాలు పొంచి ఉండేవి. చిరుత దాడితో తీవ్రంగా గాయపడిన దళ సభ్యుడికి చికిత్స చేసి రక్షించారామె.
పోలీసుల దాడి నుంచి రక్షించు కొనేందుకు అనారోగ్యంతో ఉన్న తన భర్త మోహన్‌ రావును ఎత్తుకొని కిలోమీటర్ల దూరం పరుగె త్తారు. దాహంతో అల్లాడుతున్న మోహన్‌రావు దప్పిక తీర్చేందుకు ఉసిరి చెట్టు ఎక్కి కాయలను చూర్ణంగా దంచి, దాహం తీర్చానని అచ్చమాంబ తెలిపారు. ఎన్నోసార్లు పోలీసులు చుట్టుముట్టినా ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టి రక్షించుకునేవారని చెప్పింది. 'మీరు పేపర్‌లో ఎంత రాసినా ప్రభుత్వం స్పందించి, న్యాయం చేస్తుందన్న ఆశ నాకు ఎంతమాత్రం నాకు లేద'ని అచ్చమాంబ చెప్పడం కొసమెరుపు.

Saturday, July 21, 2007

సర్కారుకు 'ఇరు'కాటం '610'పై భేటీని బహిష్కరించిన స్టాఫ్‌ కౌన్సిల్‌, eenadu

తెలంగాణ సంఘాలు వాళ్లు రావద్దని ఒకరు... వీళ్లెందుకు రాలేదని ఇంకొకరు... ముఖ్యమంత్రి సమక్షానికి వివాదం!
610 వ్యవహారంపై ఉద్యోగ సంఘాలు రెండుగా చీలిపోయాయి. ఈ జీవో అమలుపై ప్రభుత్వం శనివారం ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశానికి ఏపీఎన్జీవోలు, టీఎన్జీవోలు, పీఆర్‌టీయూ, ఎస్టీయూ తదితర ప్రధాన సంఘాలతో కూడిన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ గైర్హాజరు కాగా, దీన్ని నిరసిస్తూ తెలంగాణా ఉద్యోగ సంఘాలు సమావేశాన్ని బహిష్కరించాయి. ఈ రెండు వర్గాలను సముదాయించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హరినారాయణ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రెండు వారాల క్రితం జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌కు, తెలంగాణా సంఘాలకు వేర్వేరు సమావేశాలు ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది. దీంతో ఈ వారం అన్ని సంఘాలకు ఉమ్మడిగా సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. శనివారం సాయంత్రం అయిదు గంటలకు ఈ భేటీ ఉన్నట్లు స్టాఫ్‌ కౌన్సిల్‌ సభ్య సంఘాలతో పాటు, ఏడు తెలంగాణా ఉద్యోగ సంఘాల నాయకులకూ సమాచారం పంపారు. తమకు విడిగా గాకుండా ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేయడంపై కౌన్సిల్‌ నేతలు కినుక వహించారు. సాయంత్రం 4.30కి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆయన కార్యాలయంలో విడిగా కలిశారు. గతంలో వేర్వేరుగా సమావేశం ఏర్పాటు చేసి, మళ్లీ ఇప్పుడు ఉమ్మడి భేటీ ఏర్పాటు చేయడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ''వేర్వేరు సమావేశాలపై తెలంగాణా సంఘాల నేతలు అభ్యంతరం తెలిపారు. దీంతో మంత్రివర్గ ఉపసంఘం కూడా ఉమ్మడి భేటీయే జరపాలని ఆదేశించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం'' అని హరినారాయణ తెలిపారు. ''ఉమ్మడిగా జరిపే సమావేశంలో మాకు విలువ ఉండడం లేదు. చిన్నాచితక సంఘాలు ముందు వరుసలో కూర్చుంటుంటే మేం మూలగా కూర్చోవాల్సి వస్తోంది. ఎజెండాలో ఎన్నో ముఖ్యాంశాలున్నా ఒక్క 610 మీద చర్చించడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. మా సూచనలేవీ అమలు కావడం లేదు'' అని వారు అన్నారు. ''610ని నిజమైన స్ఫూర్తితో అమలు చేయాలనీ, స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారందరినీ స్వస్థలాలకు పంపించాలని మేం కోరినా పట్టించుకోవడం లేదు. ఇకనైనా దీన్ని అమలు చేయాలి. ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయాలి'' అని వారు సూచించారు. వీటిపై హరినారాయణ ఎలాంటి హామీ ఇవ్వలేదు. సమన్వయ కమిటీ సమావేశానికి రావాలనీ, అక్కడ వీటిని చర్చిద్దామని సూచించారు. ఇందుకు స్టాఫ్‌ కౌన్సిల్‌ ప్రతినిధులు నిరాకరించారు. రాలేమంటూ లేచి బయటికి వెళ్లిపోయారు. వీరిలో టీఎన్జీవో నేత సుధాకర్‌తో పాటు, గతంలో తెలంగాణా సంఘాలకు ప్రాతినిధ్యం వహించిన స్వామిగౌడ్‌ సైతం ఉండడం విశేషం. అనంతరం స్టాఫ్‌ కౌన్సిల్‌ ప్రతినిధులు సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణా సంఘాలతో సంబంధం లేకుండా తమతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయించాలంటూ మంగళవారం ముఖ్యమంత్రిని కలసి కోరాలని నిర్ణయించారు.
సాయంత్రం ఐదున్నరకు సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభంకాగా, ఏడు తెలంగాణా సంఘాలే దానికి హాజరయ్యాయి. 610 జీవో అమలు ప్రగతిని హరినారాయణ వివరిస్తుండగా, తెలంగాణా సంఘాల నేతలు లేచి స్టాఫ్‌ కౌన్సిల్‌ ప్రతినిధులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తాము వారికి కూడా ఆహ్వానం పంపామని సీఎస్‌ చెప్పారు. అయినా వారు సమావేశానికి రాకుండా, సీఎస్‌ను కలిసి వెళ్లిపోవడం తమను అవమానించినట్లేనని తెలంగాణా సంఘాల నేతలు శ్రీనివాస్‌గౌడ్‌, గోపాల్‌రెడ్డి, ప్రభాకర్‌ విమర్శించారు. ''గతంలో స్టాఫ్‌ కౌన్సిల్‌ చేసిన ఏకపక్ష సూచనల మేరకు జీవోలు తేవడం వివాదాస్పదమైంది. ఈ సమయంలో సీఎం జోక్యం చేసుకొని కౌన్సిల్‌లో మాకు ప్రాతినిధ్యం కల్పించాలని సూచించారు. అయినా అధికారులు ఇప్పటి వరకు దాన్ని పాటించలేదు. చివరికి సమన్వయ కమిటీకీ స్టాఫ్‌ కౌన్సిల్‌ ప్రతినిధులు హాజరుకావడం లేదు. మేం సహకరిస్తున్నా, వారు మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు. వారు గైర్హాజరు కావడం తెలంగాణా సంఘాల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడమే. దీనికి నిరసనగా మేం సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం. ఈవిషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తాం'' అంటూ వారు తమ స్థానాల్లోంచి లేచారు. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణయ్య వారిని సముదాయించేందుకు ప్రయత్నించినా వారు విన్లేదు. 610 అమలుపై తమ డిమాండ్ల పత్రాన్ని హరినారాయణకు ఇచ్చి వెళ్లిపోయారు.

సచివాలయం లెక్క తేల్చాలి
సచివాలయం లెక్క తేల్చాలి సచివాలయంలో 53 శాతం తెలంగాణా ఉద్యోగులే ఉన్నారంటూ మంత్రి డి.శ్రీనివాస్‌ శుక్రవారం శాసన మండలిలో చేసిన ప్రకటనను తాము తిరస్కరిస్తున్నామని తెలంగాణ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. కిందిస్థాయి ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్‌ ద్వారా నియమితులైన ఇతర ప్రాంతాల వారిని కలిపి 53 శాతం అధికారులు చూపించారని ఈ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు విఠల్‌, గోపాల్‌రెడ్డి, ఇతర ప్రతినిధులు శ్రీనివాస్‌గౌడ్‌, శ్రీధరరావు దేశ్‌పాండే, పద్మాచారి విమర్శించారు. నిజానికి అనేక సెక్షన్లలో నాలుగు శాతం వరకే తెలంగాణా ఉద్యోగులున్నారని వారు తెలిపారు.

Monday, July 16, 2007

కొత్త గడువు 610 అమలు జులై 31 వరకు పొడిగింపు eenadu

ఆన్‌లైన్‌లో స్థానికేతరుల నమోదు
మంత్రులకు సమీక్ష బాధ్యతలు
మరోసారి గడువు పెంచనివ్వొద్దని ముఖ్యమంత్రి
హెచ్చరిక
జీవో 610 అమలుపై రెండుసార్లు గడువు ప్రకటించి అమలు ప్రక్రియ పూర్తి చేయలేకపోయిన సర్కారు... మరోసారి గడువు పొడిగించింది. తాజా గడువు జులై 31. సోమవారం ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.
సోమవారం ఈ భేటీ తన షెడ్యూలులో లేనప్పటికీ, శాసనసభ వాయిదా పడిన వెంటనే ముఖ్యమంత్రి తన కార్యాలయానికి వచ్చి 610పై అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రివర్గ ఉపసంఘం అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, సభ్యులైన ఇతర మంత్రులు జానారెడ్డి, కోనేరు రంగారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) హరినారాయణ, ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... వీలైనంత ఎక్కువ మందిని స్వస్థలాలకు పంపేందుకు వీలుగా స్వచ్ఛంద బదిలీలు కొనసాగించాలని, డిప్యుటేషన్లను రద్దు చేయాలని ఆదేశించారు. ఇందుకు మరో పదిహేను రోజులపాటు (ఈ నెలాఖరు వరకు) గడువు తీసుకోవాలని చెప్పారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జీవో అమలు తీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ''నేను మొదటిసారిగా జూన్‌ 30న పూర్తి చేస్తానన్నాను. రెండోసారి ఈ నెల 15 వరకు గడువు చెప్పాను. మీరు మాత్రం పని పూర్తి చేయడం లేదు. ఎలాంటి సమస్య లేకున్నా ఎందుకు జాప్యం చేస్తున్నారు. జాప్యం చేస్తే ప్రభుత్వం ఏమీ చేయలేదనుకుంటున్నారు. మరోసారి గడువు పొడిగించే పరిస్థితి తీసుకురావద్దు'' అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ... ఇప్పటి వరకు ఏడు వేల మంది స్థానికేతరులను గుర్తించామని, 957 మందికి బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు. శాఖాధిపతుల కార్యాలయాల గుర్తింపు, ఉద్యోగుల కేటగిరి విషయమై సమస్యలు ఏర్పడుతున్నాయని వివరించారు. కొన్ని ప్రాజెక్టుల ప్రధాన కార్యాలయాలు హైదరాబాద్‌లో ఉండగా వాటిని దేని కింద పరిగణించాలనే విషయమై సందిగ్ధం ఏర్పడిందని తెలిపారు. దీనిపై సీఎం మాట్లాడుతూ... ప్రాజెక్టులున్న చోటనే కార్యాలయాలు పనిచేస్తున్నట్లుగా గుర్తించాలని, హైదరాబాద్‌లో ఉన్న వాటిని క్యాంపు కార్యాలయాలుగా పరిగణించాలని ఆదేశించారు. 1975లో నాన్‌గెజిటెడ్‌గా ఉన్న పోస్టులను ఆ తర్వాత గెజిటెడ్‌గా మార్చడంతో వారిని ఏ కేటగిరిలో చేర్చాలనే విషయమై సమస్య ఏర్పడిందని సీఎస్‌ చెప్పగా, ఆయా పోస్టులను నాన్‌గెజిడెట్‌ కేటగిరి కిందనే చూడాలని సీఎం సూచించారు. మానవతా దృక్పథంతో బదిలీలు సాగాలని, ఎవరికి ఎలాంటి సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు.
అధికారులమీదే వదిలేయవద్దు
జీవో అమలు బాధ్యత అధికారులపైనే వదిలివేయకుండా మంత్రులు దీనిపై శ్రద్ధ చూపాలని వైఎస్‌ సూచించారు. వెంటనే శాఖల వారీగా కార్యదర్శులు, శాఖాధిపతులతో సమావేశమై స్థానికేతరుల బదిలీలు జరిగాయా, డిప్యుటేషన్లు రద్దయ్యాయా అనే అంశాలను సత్వరమే సమీక్షించాలని ఆదేశించారు. నెలాఖరు వరకు స్వచ్ఛంద బదిలీలకు అనుమతించాలన్నారు. ఆ తర్వాత, మిగిలిన వారి విషయంలో ఎలాంటి విధానం అవలంబించాలనే అంశంపై ఉద్యోగ సంఘాలతో శనివారం చర్చించాలని సీఎం ఆదేశించారు. 1975 నుంచి స్థానికేతర గుర్తింపు విషయం ఈ సమావేశంలో చర్చకు రాగా... బదిలీలు, డిప్యుటేషన్లు పూర్తయిన తర్వాత దాన్ని పరిశీలించాలని నిర్ణయించారు. స్థానికేతరుల వివరాలు ఆన్‌లైన్‌లో ఎందుకు నమోదు చేయలేదని ముఖ్యమంత్రి ప్రశ్నించగా... ఈ బాధ్యతను రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్‌ (ఏపీటీఎస్‌)కు అప్పగించామని, 3 రోజుల్లో ఇది పూర్తవుతుందని సీఎస్‌ చెప్పారు.
గడువును అధికారికంగా ప్రకటించొద్దు:ఇప్పటికే రెండుసార్లు గడువు ప్రకటించి, అమలు చేయలేకపోవడంతో విమర్శలు వస్తున్నాయని, తాజాగా నెలాఖరు వరకు గడువు పొడగిస్తున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించవద్దని మంత్రి డి.శ్రీనివాస్‌ సీఎంను కోరారు. దీనికి సీఎం అంగీకరించినట్లు తెలిసింది. సమావేశం ముగిసిన తర్వాత మంత్రులెవరూ మాట్లాడకుండానే వెళ్లిపోయారు.
అసెంబ్లీలో అభాసుపాలు కాకూడదనే: రెండు గడువులో జీవో అమలు చేయకపోయిన పరిణామం... ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఏదో ఒక రోజు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అభాసుపాలు కాకుండా ఉండేందుకు కూడా ప్రభుత్వం తాజా గడువుపెంపు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.