Monday, August 27, 2007
పాఠశాల విద్యాశాఖలో స్థానికేతరుల గుర్తింపు పూర్తి Eenadu
Friday, August 24, 2007
గోనెపై విద్యార్థుల దాడి గాజులు, పసుపు కుంకుమలు జల్లి నిరసన Eenadu

ఆర్టీసీ మాజీ ఛైర్మన్, మాజీ శాసనసభ్యుడు గోనె ప్రకాశరావుపై ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. శుక్రవారం స్థానిక ఫతేమైదాన్ క్లబ్‌లో విలేకరుల సమావేశంలో గోనె మాట్లాడుతున్నప్పుడు ఈ దాడి జరిగింది. తెలంగాణకు, తెలంగాణ బీసీ నేతలకు ఆయన వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ ఆ విద్యార్థులు ధ్వజమెత్తారు. దాడి సందర్భంగా గోనె, ఆయనతో ఉన్న కాంగ్రెస్ నేతలు గట్టిగానే ప్రతిఘటించారు. దీంతో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. ఒకరిపై మరొకరు చేయిచేసుకున్నారు. మొత్తానికి నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌పై గోనె చేసిన ఆరోపణలు ఈ దాడికి కారణమైనట్లు స్పష్టమవుతోంది. శుక్రవారం కూడా మధుయాష్కీపై ఆయన సరికొత్త ఆరోపణలు చేస్తున్న తరుణంలోనే విద్యార్థుల దాడి జరిగింది. విలేకరుల సమావేశం ముగుస్తున్న తరుణంలో వట్టికూటి రామారావు అనే విద్యార్థి వేదికపైకి వెళ్లి మొదట గోనెపై దాడికి పాల్పడ్డారు. ఈ హఠాత్‌పరిమాణం నుంచి వెంటనే తేరుకున్న గోనె, ఆయన పక్కనే ఉన్న ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్, ఎస్సీ, ఎస్టీ సెల్ కన్వీనర్ రవిబాబు, పీసీసీ కార్యదర్శి నిరంజన్‌లు ప్రతిఘటించారు. రామారావుపై ప్రతి దాడి చేశారు. ఇంతలోనే గాజుల శ్రీధర్ అనే మరో విద్యార్థి పసుపు, కుంకుమ, గాజులను తీసుకొచ్చి గోనెపై వేశారు. మూడో విద్యార్థి నాగరాజూ వారితో జతకలిశారు. తెలంగాణ బీసీ నాయకులను ఎదగనీయకుండా అడ్డుకుంటున్నారని వారు గోనెపై ఆరోపణలు చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సహించేది లేదని పెద్దఎత్తున నినాదాలు చేశారు.
ఎవరికైనా ఇదే శాస్తి యాష్కీ ఎదుగుతున్న బీసీ నాయకుడు కావడంతో ఓర్వలేకే ఆయనపై ఆరోపణల దాడికి పాల్పడుతున్నారని రామారావు ఆరోపించారు. అవకతవకలుంటే సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేయాలని.. అలా కాకుండా ఓర్వలేనితనంతో ఇలా కుట్ర పన్నడం తగదంటూ మండిపడ్డారు. బీసీ వ్యతిరేకుల దాడుల్ని ప్రతిఘటిస్తామన్నారు. మధుయాష్కీ తెలంగాణ అడుగుతుండటం కొందరికి ఆగ్రహం తెప్పిస్తోందంటూ.. ముఖ్యమంత్రికి గోనె తొత్తుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బీసీలకు, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని ఎక్కడైనా ఇలాగే ప్రతిఘటిస్తామన్నారు.
విద్యార్థుల అరెస్టు దాడికి పాల్పడిన ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి సైఫాబాద్ స్టేషన్‌కు తరలించారు. ఈలోగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్‌బాబు, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు కెం.ఎం.ప్రతాప్ అక్కడికి చేరుకొని గోనెను పరామర్శించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు మధు యాష్కీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ముగ్గురు విద్యార్థులపైనా, వారితోపాటు వచ్చిన మరికొందరు విద్యార్థులపైనా కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. వారిపై ఐపీసీ 143, 323, 341 సెక్షన్ల కింద కేసులు నమోదుచేసినట్లు వివరించారు. మరోవైపు నిందితుల్లో ఒకరైన రామారావు గోనెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై ఐపీసీ 506, 323 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇంటిపేరు మార్చి 2 పాస్‌పోర్టులు: గోనె ఇంటి పేరు మార్చి మధుయాష్కీ నిబంధనలకు విరుద్ధంగా రెండు పాస్‌పోర్టులు పొందినట్లు గోనె అంతకుముందు ఆరోపించారు. మొదట మధుసూదన్ యాష్కీ అనే పేరుతో పొందిన పాస్‌పోర్టుకు వీసా రాకపోవడంతో.. ఇంటి పేరు మార్చి మరో పాస్‌పోర్టు పొందినట్లు తెలిపారు. ఆయన సోదరులిద్దరు, సోదరి, బావమరిది కూడా నకిలీ సర్టిఫికెట్లతో హెచ్-1 వీసా పొంది, గ్రీన్‌కార్డు కూడా పొందినట్లు ఆరోపించారు. గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి పొందినట్లు చెబుతున్న ఇంజినీరింగ్ డిగ్రీలు నకిలీవని తేలాయన్నారు. వీటన్నిటిపై అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
వైఎస్‌కు యాష్కీని పరిచయం చేసిందే నేను దాడి ఘటన అనంతరం కూడా గోనె విలేకరులతో మాట్లాడారు. తాను బీసీలకు వ్యతిరేకం కాదని స్పష్టంచేశారు. దాడులకు భయపడబోనని, మధుయాష్కీకి సంబంధించి తాను వెలుగులోకి తీసుకొస్తున్న అంశాలను ఆపబోనని తేల్చిచెప్పారు. వైఎస్‌కు మధుయాష్కీని పరిచయం చేసిందే తానని ఆయన పేర్కొన్నారు. టికెట్ తనవల్లే వచ్చిందని యాష్కీనే స్వయంగా చెప్పారని తెలిపారు.
వ్యక్తిగత విమర్శలు తప్పే: కేకే గోనె మీద జరిగిన దాడిపై స్పందించేందుకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ నిరాకరించారు. మీడియా ప్రతినిధులు ఢిల్లీలో ఆయన స్పందన కోరగా.. ''నేనెందుకు పీసీసీ అధ్యక్షుడు కె.కేశవరావు ఇక్కడే ఉన్నారుగా.. ఆయనే స్పందిస్తారని'' చెప్పారు. కేకే మాట్లాడుతూ.. ఆ విషయం ఇంకా తన దృష్టికి రాలేదన్నారు. అన్ని విషయాలనూ తాను పరిశీలిస్తానని చెప్పారు. మరి మధుయాష్కీపై గోనె చేసిన ఆరోపణల సంగతేమిటని అడగ్గా.. అలా వ్యక్తిగత విమర్శలకు దిగడం తప్పేనన్నారు.
గోనె ప్రకాశరావుపై విద్యార్థుల దాడి Eenadu
Monday, August 13, 2007
త్వరలో మరికొందరు కానిస్టేబుళ్ళ బదిలీ
Saturday, August 11, 2007
నాలుగు లక్షల మంది విద్యార్థులతో ఉద్యమం

Wednesday, August 1, 2007
Thursday, July 26, 2007
'610'పై ఆంధ్ర ఎమ్మెల్యేల ఆందోళన? Andhra Jyothy
నష్టపోయేది తెలంగాణ ఒక్కటేనా...!
నష్టపోయేది తెలంగాణ ఒక్కటేనా...!ప్రభుత్వం ఇప్పటి వరకూ తెలంగాణ ప్రాంతానికే ప్రా ధాన్యతను ఇస్తోందని.. ఆంధ్ర, రాయలసీమ నేతల వాదనలు వినేందుకు సముఖతను వ్యక్తం చేయడం లేదన్న ఆగ్రహం ఆ నేతల్లో వ్యక్తమవుతోంది. ఈ ఉత్తర్వును అమ లు చేస్తున్నప్పుడు కేవలం తెలంగాణ ప్రాంతానికే అన్యా యం జరుగుతోందన్న భావం ప్రభుత్వంలోనూ, అధికారుల్లోనూ కన్పిస్తోందే తప్ప.. ఇతర ప్రాంతాలకు జరిగే నష్టాన్ని గురించి ఆలోచించడం లేదని వారంటున్నారు. 610పై తాము మాట్లాడిన ప్రతిసారీ, ఈ ఉత్తర్వు అమలుకు తాము వ్యతిరేకమన్న ప్రచారాన్ని తెలంగాణ నేతలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు.. దీన్ని అమలు చేయాలని కోరుకుంటున్నదే తా మని, అయితే.. రాష్ట్రపతి ఆదేశాలు, ఆరు సూత్రాల కార్యక్రమానికి లోబడి మాత్రమే ఇది జరగాలని వారు స్పష్టం చేస్తున్నారు.
Wednesday, July 25, 2007
610 జీవో కింద మాతృ సంస్థలకు 61 మంది ఇంజనీర్లు Andhra Jyothy
ఇదిలావుండగా 610 జీవో కింద వెనక్కి వెళ్లిన వారంతా బల్దియాలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న వారే. డిప్యుటేషన్ కాలం పూర్తయినా 143 మంది ఇంజనీర్లు ఇంకా నగరపాలక సంస్థ లోనే తిష్ట వేశారని గత మే 27న 'జీతమెందుకు.. గీతం ఉందిగా!' శీర్షికన 'ఆంధ్రజ్యోతి' వార్తను ప్రచురించింది. దీనికి స్పందించిన ప్రభుత్వం వీరిలో ఎంతమంది 610 జీవోకు భిన్నంగా బల్దియాలో పనిచేస్తున్నారో నివేదిక సమర్పించాలని ఆయా శాఖలను ఆదేశిం చింది. ఈ మేరకు డిప్యుటేషన్‌పై జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్న 59 మంది అసిస్టెంట్ ఇంజనీర్లను స్థానికేత రులుగా గుర్తించింది. వీరిని సొంత శాఖలకు తిప్పి పంపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
బల్దియాలో మరో 101 మంది...11 610 జీవో ప్రభావం 101 మంది ఉద్యోగులపై చూపనుంది. జీవోను కార్యరూపంలోకి తెస్తుండ టంతో ఈ ఉద్యోగులు దిక్కుతోచని స్థితిలో పడ్డా రు. బల్దియాలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న స్థానికేతరులను ఈ జీవో అనుసరించి మాతృసం స్థలకు తిప్పి పంపే అవకాశం ఉంది. ఇటీవల గ్రే టర్‌లో విలీనమైన 12 మున్సిపాలిటీల పరిధిలో 84 మంది, పూర్వపు ఎంసిహెచ్ పరిధిలో 17 ఇ తర శాఖలకు చెందిన ఉద్యోగులు పనిచేస్త్తున్నా రు. వీరిని బదిలీచేసే అంశంపై జీహెచ్‌ఎంసీ ఇం కా తుది నిర్ణయం తీసుకోలేదు. ఒకేసారి ఇంతమంది ఇంజనీర్లు పోతే పనుల పర్యవేక్షణ ఇబ్బ ందవుతుందని ఉన్నతాధికారులు అంటున్నారు.
610 అమలుపై అనుమానాలొద్దు: డీఎస్ eenadu
Tuesday, July 24, 2007
తెలంగాణ వాదులను రెచ్చగొట్టొద్దు Eenadu
న్యూఢిల్లీ, న్యూస్‌టుడే: 610 జీవో అమలును వ్యతిరేకిస్తూ ఎంపీ హరిరామజోగయ్య చేసిన వ్యాఖ్యలపై నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. జోగయ్య వ్యాఖ్యలు తెలంగాణ వాదులను రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. ఇలాంటి మాటలు మానుకోవాలని హెచ్చరించారు. మంగళవారమిక్కడి ఏపీ భవన్‌లో మధుయాష్కీ విలేకరులతో మాట్లాడారు. దిగ్విజయ్‌సింగ్ కూడా ఈ అంశంపై తెలంగాణ ఉద్యోగులు, నాయకుల వాదనలు వినాలని డిమాండు చేశారు. '610కు వ్యతిరేకంగా పోరాడాలని హరిరామజోగయ్య, హర్షకుమార్ పిలుపునిచ్చారు. అధిష్ఠానం వద్ద మాత్రం తాము 610కి వ్యతిరేకం కాదని చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారు. జయభారత్‌రెడ్డి నివేదిక ప్రకారం స్థానికేతర ఉద్యోగుల సంఖ్య 1985 నాటికే 55వేలు. తాజా ప్రభుత్వ లెక్కల ప్రకారం అది ఏడువేలకు తగ్గిపోవడం విచిత్రంగా కనిపిస్తోంది. ఇది పూర్తి అవాస్తవం. హరిరామ జోగయ్య వ్యాఖ్యలు చూస్తే శాంతియుతంగా జరుగుతున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని హింసాత్మకం చేయడానికి ఇక్కడివారిని రెచ్చగొట్టినట్లు కనిపిస్తోంది. 610 జీవోను చిత్తశుద్ధితో అమలు చేయాలనుకుంటే సరైన లెక్కలు తీయాలి. అందులో తెలంగాణ ఉద్యోగ సంఘాలనూ భాగస్వాములను చేయాలి. తెలంగాణ ఉద్యోగ సంఘాలు తమ ప్రాంతంలో కనిపించే చిన్న పార్టీ నాయకుడినీ నిలదీసి వారి ఉద్యమానికి మద్దతిచ్చేలా ఒత్తిడి తేవాలి. ఆంధ్ర ప్రాంత ఉద్యోగ సంఘాల వెంట ఉంటానని హరిరామ జోగయ్య ప్రకటించారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకుల మద్దతు తీసుకుని 610 అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నా' అని యాష్కీ పేర్కొన్నారు.
610 జీవోపై 'జానా'కు అవగాహన లేదు : చేగొండి Andhra Jyothi
1975 తర్వాత రిక్రూట్ మెంట్లు జరిగినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. 'ముందు జీవో గురించి అవగాహన చేసుకున్నాక వ్యాఖ్యలు చేయండి లేదా... అడ్వకేట్ జనరల్‌తో మాట్లాడి పూర్తిగా తెలుసుకోండి'అని జానారెడ్డికి ఆయన హితవు పలికారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో జీవో అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఆంధ్రా ప్రాంత వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, వారు చేపట్టే ఆందోళనలకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.
610 జీవోపై 'జానా'కు అవగాహన లేదు : చేగొండి Andhra Jyothi
1975 తర్వాత రిక్రూట్ మెంట్లు జరిగినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. 'ముందు జీవో గురించి అవగాహన చేసుకున్నాక వ్యాఖ్యలు చేయండి లేదా... అడ్వకేట్ జనరల్‌తో మాట్లాడి పూర్తిగా తెలుసుకోండి'అని జానారెడ్డికి ఆయన హితవు పలికారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో జీవో అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఆంధ్రా ప్రాంత వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, వారు చేపట్టే ఆందోళనలకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.
Monday, July 23, 2007
యోధులను మరచిన ప్రభుత్వం Andhra Jyothi
చిరుప్రాయంలోనే పోరుబాట పట్టిన తెలంగాణ సాయుధ పోరాట నేత నెల్లుట్ల మోహన్‌రావును అజ్ఞాతంలో ఉన్నప్పుడే వివాహం చేసుకున్నారు. ఎంతో మందికి సమరయోధుల పింఛను రావడానికి సహకరించిన మోహన్‌రావు సైతం అచ్చమాంబను విస్మరించడం విశేషం. మోహన్‌రావు మృతి అనంతరం భార్యగా వచ్చే పింఛను మాత్రమే ఆమె పొందుతున్నారు. ఆమె పోరాటానికి మాత్రం ప్రత్యేక గుర్తింపు లేకుండా పోయింది. ఇతర సమరయోధుల కంటే ఆమెకు బలమైన సాక్ష్యాధారాలున్నాయి. పిండిప్రోలులో జరిగిన గెరిల్లా శిక్షణలో భాగంగా అధునాతన ఆయుధం (గైడర్) చేతబట్టిన ఫోటో ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది.
పోరాట విరమణ అనంతరం కేరళ నుంచి ఆ ఫోటోను మోహన్‌రావు తెప్పించారని అచ్చమాంబ తెలిపారు. అలాంటిది ఆమెకు సమరయోధు రాలిగా గుర్తింపు రాకపోవడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆమెతోపాటు అజ్ఞాతంలో కలిసి పని చేసిన నేనాల కమల, లలిత, లక్ష్మిలకు సైతం సమరయోధుల పింఛను చాలాకాలం కిందటే మంజూరైంది. పింఛన్ ఎందుకు రావడం లేదని అచ్చమాంబను 'ఆన్‌లైన్' ప్రశ్నిస్తే... 'అంతా నా భర్త మోహన్‌రావు చూసుకునేవారు. నేనా విషయాలు పట్టించుకోలేద'ని బదులిచ్చారు. కమలమ్మ సైతం అచ్చమాంబకు పింఛను రావడం లేదా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
'పోరాటం గురించి తెలియని వాళ్లు సైతం నేడు సమరయోధులుగా చలామణి అవుతున్నారు. డబ్బుల కోసం కాదు, నా పోరాటానికి గుర్తింపు లేదన్న బాధ ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంద'ని అచ్చమాంబ చెప్పారు. 'భవిష్యత్తులో ఎవరో ఏదో చేస్తారన్న ఆశతో నాడు పోరాటం చేయలేదు. భూస్వా ములు, నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసం పోరాటం చేశాం. గుర్తించాల్సింది ప్రభుత్వమే. కార్యాలయాల చుట్టూ తిరిగే ఓపిక నాకు లేదు. నాలా గుర్తింపునకు నోచుకోని వారు ఇంకా ఎందరో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి, వారందరినీ ఆదుకోవలసిన అవసరం ఉంది. అయినా ఇప్పుడంతా పైరవీలమయం. నాకు న్యాయం జరుగుతుందన్న ఆశ లేదు' అని ఆవేదన వ్యక్తం చేశారు అచ్చమాంబ.
వైద్యంతో మమేకంపిండిప్రోలులో జరిగిన శిబిరంలో అచ్చమాంబ వైద్య శిక్షణ పొందారు. గాయపడిన గెరిల్లాలకు గాయాలు శుభ్రం చేయడం, కట్లు కట్టడం, ఇంజక్షన్లు ఇవ్వడంలో తర్ఫీదు ఇచ్చారు. ఇద్దరు కొరియర్లతో పాటు ఒక గన్‌మెన్‌తో ఎక్కడ దళాలకు ప్రమాదం జరిగినా ఆమె అక్కడకు వెళ్లి చికిత్స చేసేవారు. దళాలకు చేయూతనిస్తున్న గిరిజన గూడేల్లోనూ వైద్య సేవ చేయడంతో అచ్చమాంబను ఆప్యాయంగా ఓడకాయ (టాబ్లెట్స్) అక్క, ఎర్రక్క అని అక్కడి వారు పిలుచుకునేవారు. దళాలకు పోలీసులు, రజాకార్ల నుంచే కాకుండా అడవి జంతువుల నుంచి ప్రమాదాలు పొంచి ఉండేవి. చిరుత దాడితో తీవ్రంగా గాయపడిన దళ సభ్యుడికి చికిత్స చేసి రక్షించారామె.
పోలీసుల దాడి నుంచి రక్షించు కొనేందుకు అనారోగ్యంతో ఉన్న తన భర్త మోహన్ రావును ఎత్తుకొని కిలోమీటర్ల దూరం పరుగె త్తారు. దాహంతో అల్లాడుతున్న మోహన్‌రావు దప్పిక తీర్చేందుకు ఉసిరి చెట్టు ఎక్కి కాయలను చూర్ణంగా దంచి, దాహం తీర్చానని అచ్చమాంబ తెలిపారు. ఎన్నోసార్లు పోలీసులు చుట్టుముట్టినా ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టి రక్షించుకునేవారని చెప్పింది. 'మీరు పేపర్‌లో ఎంత రాసినా ప్రభుత్వం స్పందించి, న్యాయం చేస్తుందన్న ఆశ నాకు ఎంతమాత్రం నాకు లేద'ని అచ్చమాంబ చెప్పడం కొసమెరుపు.
Saturday, July 21, 2007
సర్కారుకు 'ఇరు'కాటం '610'పై భేటీని బహిష్కరించిన స్టాఫ్ కౌన్సిల్, eenadu
సచివాలయం లెక్క తేల్చాలి
Monday, July 16, 2007
కొత్త గడువు 610 అమలు జులై 31 వరకు పొడిగింపు eenadu
అసెంబ్లీలో అభాసుపాలు కాకూడదనే: రెండు గడువులో జీవో అమలు చేయకపోయిన పరిణామం... ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఏదో ఒక రోజు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అభాసుపాలు కాకుండా ఉండేందుకు కూడా ప్రభుత్వం తాజా గడువుపెంపు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
డెప్యుటేషన్లపై 'యథాతథం' eenadu
ట్రైబ్యునల్ ఉత్తర్వులు
హైదరాబాద్, న్యూస్‌టుడే:
610 జీవో అమలులో భాగంగా అన్ని డెప్యుటేషన్లనూ రద్దు చేయాలంటూ జారీ చేసిన సర్క్యులర్ అమలును రెండు వారాలపాటు యథాతథ స్థితిలో ఉంచాలంటూ సోమవారం ట్రైబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డెప్యుటేషన్లను రద్దు చేయాలంటూ జులై 2న జారీ చేసిన సర్క్యులర్‌పై ఎం.చంద్ర ఓబుళరెడ్డి తదితరులు ట్రైబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేశారు. డెప్యుటేషన్ నియామకాలకు 610 జీవోతో సంబంధం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది కృష్ణయ్య ట్రైబ్యునల్‌కు తెలిపారు. కొన్ని శాఖల్లోని పోస్టులను డెప్యుటేషన్లపైనే భర్తీ చేయాలన్న నిబంధనలున్నాయని వివరించారు. తాత్కాలిక నియామకాలకు, 610 జీవోతో సంబంధంలేదన్నారు. పిటిషనర్ల డెప్యుటేషన్లను యథాతథంగా ఉంచాలంటూ ట్రైబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
కాంగ్రెస్స్ వాళ్ళని మించిన నట చక్రవర్తులు ఈ శృష్టిలొ లేరని చెప్ప వచ్చును
అందుకే జూబిలీ పడక సీనులొ తండ్రి (రవీంద్రా రెడ్డి) కొడుకు(సుమధుర్ రెడ్డి) అద్బుతంగా నటించారు. అలా అనేకంటే జీవించారు అని చెప్పడం సబబుగా ఉంటుందేమో. మాయావి రాజశేఖర్ రెడ్డి దవాఖానల ప్రదర్శించిన పరామర్శ సీను తన గంభీర వదనంతో మరీ పండించారు. కీ.శే.వై.ఎస్స్.రాజా రెడ్డి కుటుంబానికి దాడులు చెయ్యడంలోను, శవాలను అదృశ్యం చెయ్యడలోను ఎంత ఘనమైన చరిత్ర వున్నదో అలనాటి కడప లోకసభ ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన ఒక స్వతంత్ర అభ్యర్థి హత్య అనంతరం శవం అదృశ్య ఘట్టం మనకి వాస్తవాన్ని విశదీకరిస్తుంది. ప్రస్తుతం తెలంగాణ తెర మీద వారి నటన అమొఘంగా ఉన్నా ఒన్స్ మోర్లు మరియు నీరాజనాలు మాత్రం అందుకోజాలరని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మా నాయకుల నయవంచక అశ్లీల నటనలతో మా ప్రజలు ఎప్పుడో విసిగి వేసారిపోయి ఉన్నారు గనక మీ నటన పట్ల ఆసక్తి గాని, ఆకర్షణ గాని ఏ మాత్రం లేవని మనవి. మీ సమష్యలకు మా సమష్యలకు ప్రత్యేక రాష్ట్ర మొక్కటే పరిష్కారం.తద్వార మన సకల కుటుంబాలు సుఖ శాంతులతో కలకాలం వర్థిల్ల గలవు.
నయవంచనతో కూడిన నటనకు ఏదో ఒకనాడు తెర పడక తప్పదు.
తెలివి మీరి నటిస్తే తెర మరుగు గాక తప్పదు.
జై తెలంగాణా-జై హింద్,
అనీల్ మద్దిరాల
Sunday, July 15, 2007
వై ఎస్-పీ జే ఆర్ వివాదాన్ని పరిష్కరిస్తాం andhrajyothi
హైదరాబాద్, జూలై 15(ఆన్‌లైన్): ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, సీఎల్పీ మాజీ నేత పి.జనార్దన్‌రెడ్డి కుటుంబాల మధ్య నెలకొన్న వివాదాన్ని త్వరలోనే పరిష్కరిస్తామని ఏఐసీసీ ప్రతినిధి సురేష్ చెప్పారు. ఈ వివాదం కారణంగా సోమవారం నుంచి ఆమరణ దీక్షకు దిగేందుకు సిద్ధమైన పీజేఆర్‌ను శాంతింపజేసేందుకు ఆదివారం నగరానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.
'కారు' వివాదానికి సంబంధించి పూర్తి సమాచారం సేకరించానని చెప్పారు. ప్రభుత్వ సలహాదారు కేవీపీ రామచంద్రరావు, పీజేఆర్, వైఎస్ సోదరుడు రవీంద్రనాథ్‌రెడ్డిలను కలసి పరిస్థితిని సమీక్షించానని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికల నిర్వహణలో అధిష్ఠానం తలమునకలై ఉన్నందున ఆందోళనను వాయిదా వేసుకోవాలని పీజేఆర్‌కు సూచించానని చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశాలను కూడా పీజేఆర్‌కు వివరించానని చెప్పారు. తన సూచన మేరకు దీక్షను వాయిదా వేసుకున్న పీజేఆర్‌ను ఆయన అభినందించారు.
వారం రోజుల మా శ్రమ వృథాకాదు: వీహెచ్
వైఎస్-పీజేఆర్ కుటుంబాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించరించేందుకు వారం రోజులుగా చేస్తున్న శ్రమ వృథా కాదని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు చెప్పారు. పీజేఆర్‌తో భేటీ అనంతరం ఆయన కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. క్రమశిక్షణ గల కార్యకర్తగా అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశాల మేరకు దీక్షను వాయిదా వేసుకున్న పీజేఆర్‌ను వీహెచ్ అభినందించారు.
'కారు' వివాదం పాలనకు అద్దం పడుతోంది : శశిధర్‌రెడ్డి
పీజేఆర్ తనయుడిపై, అల్లుడిపై పోలీసులు 307 సెక్షన్ కింద నమోదు చేసిన కేసులు రాష్ట్ర ప్రభుత్వ పాలనకు అద్దం పడుతున్నాయని సనత్‌నగర్ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నందునే పీజేఆర్‌పై ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. పీజేఆర్ చేస్తున్న పోరాటం వ్యక్తిగతమైనది కాదని... పార్టీ ప్రతిష్ఠను పెంచడం ద్వారా 2009లో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాం గ్రెస్ అధికారంలోకి రావడానికేనని చెప్పారు.
లెక్క తప్పీంది 610 అమలులో ప్రతిష్టంభన eenadu

610 అమలులో ప్రతిష్టంభన
స్థానికేతరుల సంఖ్య ఏడువేలకే పరిమితం
21 శాఖల్లో 828 మందికే బదిలీ ఉత్తర్వులు
ఒక్క డెప్యుటేషన్ కూడా రద్దు కాలేదు
1975 నుంచీ పరిశీలన హుళక్కే
వెబ్‌సైట్‌లో వివరాలే లేవు
సీఎం హామీలూ బేఖాతరు
హైదరాబాద్- న్యూస్‌టుడే
''ఈ నెల 15 కల్లా 610 జీవో అమలు ప్రక్రియ పూర్తవుతుంది. ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. 30 ఏళ్లుగా ఏ ప్రభుత్వమూ చేయని పనిని మేం చిత్తశుద్ధితో చేస్తున్నాం.''
- ఈ నెల 2న ముఖ్యమంత్రి వైఎస్ ప్రకటన
జూన్ నెలాఖరుకల్లా 610 జీవో అమలును పూర్తి చేస్తామని గతేడాది డిసెంబరు 12న ఇచ్చిన హామీ నెరవేరలేదు. ఆ తరవాత వెలువడిన ప్రకటన... ఈ నెల 15వ తేదీని గడువుగా పేర్కొంది. ఇదే ఆఖరు గడువని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. వారం రోజుల్లో స్వచ్ఛంద బదిలీలు పూర్తి చేయాలని, 1975 నుంచి స్థానికేతర ఉద్యోగుల లెక్కలు తీయాలని, డెప్యుటేషన్లను రద్దుచేయాలని ఆదేశించారు. కానీ... వాటిలో ఏ ఒక్కటీ నెరవేరలేదు. చిత్రమేమిటంటే సీఎం ప్రకటన తరవాత 610 అమలుపై ఊహించని ప్రతిష్టంభన ఏర్పడింది. తరవాత జైభారత్‌రెడ్డి కమిటీ నివేదిక, 1975 నుంచి ఏపీపీఎస్సీ నియామకాల రికార్డుల గల్లంతు వంటి అనేక విస్మయకరమైన అంశాలు వెలుగుచూశాయి.
అరకొర సమాచారం
610 అమలులో భాగంగా అక్రమంగా నియమితులైనట్లు ఇప్పటి వరకు గుర్తించిన ఉద్యోగులు 7,089 మందే. 3,162 మంది పోలీసులు కాగా మరో 3,927 మంది ఇతర శాఖల ఉద్యోగులు. 2002లో జారీ అయిన 124 జీవో కింద 75 శాఖల నుంచి వీరిని గుర్తించారు. దేవాదాయ శాఖలో స్థానికేతరుల లెక్క ఇప్పటికీ తేలలేదు. కొన్ని న్యాయ విభాగాల నుంచి సమాచారం రాలేదు. అయినా ఇంతకు మించి లేరంటూ సాధారణ పరిపాలన శాఖ అధికారులు సీఎంకు, మంత్రివర్గ ఉపసంఘానికి, ఉద్యోగ సంఘాలకు, శాసనసభా సంఘానికి తేల్చి చెప్పేశారు. స్థానికేతరులుగా గుర్తించిన వారిని గత నెల మూడో వారం నుంచి స్వచ్ఛందంగా బదిలీ చేసేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఈ నెల రెండో తేదీ వరకు 21 శాఖల్లో 828 మందికి ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో ఉపాధ్యాయులు, పోలీసులు పోనూ మిగిలింది 510 మందే. అదే రోజు సీఎం సమక్షంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నివేదికలను ఇవ్వగా, ఈ సంఖ్య మరీ తక్కువగా ఉందని, 15 వరకు గడువు పొడగించి మరిన్ని స్వచ్ఛంద బదిలీలు చేయాలని సీఎం ఆదేశించారు. కానీ, ఈ సంఖ్య ఏ మాత్రం పెరగలేదు. ఏ ఒక్క శాఖలోనూ స్వచ్ఛంద బదిలీలు జరగలేదు. వాస్తవానికి స్వచ్ఛంద బదిలీలకు గడువు పొడగించినా మళ్లీ దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించకపోవడం గమనార్హం. దీంతో గడువు పొడిగింపు నిష్ప్రయోజన తంతుగా మారింది. మరోవైపు స్వచ్ఛంద బదిలీలపై వెళ్లిన వారికి పోస్టింగులు ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వారి స్థానాలను భర్తీ చేయడంలోనూ శ్రద్ధ చూపడం లేదు.
-డెప్యుటేషన్ల మాటేమిటి: నియామక నిబంధనలకు విరుద్ధంగా డెప్యుటేషన్లపై చేరి విధులను నిర్వర్తిస్తున్నవారిని స్వస్థలాలకు పంపిస్తామని గత నెలారంభం నుంచి ప్రభుత్వం చెబుతున్నా ఇప్పటివరకు అలా ఒక్కరినీ పంపించలేదు. ఈ నెల 2న సమావేశం సందర్భంగా వారం రోజుల వ్యవధిలో డెప్యుటేషన్లను రద్దు చేస్తామని సీఎం ప్రకటించినా ఏ ఒక్క శాఖలోనూ అది జరగలేదు. అసలింతవరకు డెప్యుటేషన్లపై వచ్చిన వారెందరనేదే తేలలేదు. ప్రాథమికంగా 900 మంది అంటూ అంచనా వేసినా వారిని తిప్పి పంపేందుకు ఏ శాఖా చొరవ చూపడం లేదు.
1975 నుంచి లెక్కలేవీ: 1975 నుంచీ నియమితులైన స్థానికేతరుల్ని గుర్తించే ప్రక్రియ ఏమాత్రం జరగడం లేదు. వారం రోజుల్లోనే ఇది పూర్తవుతుందని, ఇప్పటివరకు గుర్తించినవి కాకుండా మరో పది శాతం వరకు స్థానికేతరుల లెక్క తేలవచ్చని సీఎం రెండో తేదీన స్వయంగా చెప్పారు. ఈ కోణంలో ఏ ఒక్క శాఖలోనూ కసరత్తు జరగడం లేదు. సాధారణ పరిపాలన శాఖ కూడా దీనిపై ఏమాత్రం ఒత్తిడి చేయకపోవడం గమనార్హం. ఈ రికార్డులు లేవని పోలీసు శాఖ మొదట్లోనే చేతులెత్తేసింది. ఏపీపీఎస్సీ అధికారులు గత రెండేళ్లు మినహాయిస్తే 75 నుంచి రికార్డులు లేవని తెలంగాణా ఉద్యోగ సంఘాల నేతలకు చెప్పేశారు. విద్యాశాఖ సైతం డీఎస్సీల వారిగా వివరాలను సేకరించడానికి ప్రయత్నం చేయడం లేదు. వాస్తవానికి 1975 అక్టోబరు నుంచి 85 అక్టోబరు వరకు నియమితులైన 58,952 మంది స్థానికేతరులు గుర్తించి... 1985 డిసెంబరు 30న జారీ అయిన 610 జీవోలో ప్రభుత్వం ఈ సంఖ్యను పేర్కొంది. లెక్కలేవీ దీనికి విరుద్ధంగా లేవని ప్రభుత్వ శాఖలు చెబుతున్నాయి. 1984లో అప్పటి ముఖ్య కార్యదర్శి జైభారతరెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఈ నివేదిక ఇచ్చింది. ఇప్పుడా నివేదిక లేదంటూ ప్రభుత్వంచేతులెత్తేయడంపై శాసనసభా సంఘం విస్మయం వ్యక్తంచేసింది. 1985 నుంచి విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో మినహాయిస్తే మిగిలిన శాఖల్లో నియామకాలు అంతంత మాత్రమే. నియామకాల ప్రక్రియకు సంబంధించిన రికార్డులు అన్ని శాఖల్లోనూ భద్రంగా ఉన్నా ఈ లెక్కలు లేవని చెప్పడం ఉద్దేశపూర్వకంగానే జీవో అమలుకు తిలోదకాలు ఇచ్చే ప్రయత్నమేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
స్థానికేతరుల వివరాలపై అనుమానాలను తొలగించేందుకు వారి వివరాలు వెబ్‌సైట్‌లో పెడతామని నెల రోజులుగా ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటి వరకు అలాంటిదేదీ లేదు. మరోవంక శాసనసభ సమావేశాల్లో 610 కీలకాంశం కాబోతుండగా... దీని అమలుపై తాజా పరిస్థితిని సమీక్షించేందుకు గత సోమవారం జరగాల్సిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేశారు. జీవో అమలుపై నిర్లక్ష్యమే దీనికి కారణమని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి.
సీఎం అసంతృప్తితో ఉంటే...: 610ని జూన్ నెలాఖరులోగా అమలు చేస్తామని తాను హామీ ఇచ్చినా జరగలేదని శుక్రవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో సీఎం అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. దీంతో అధికారులు నెలాఖరుకల్లా దీన్ని పూర్తి చేస్తామని చెప్పారు. అప్పటివరకు శాసనసభా సమావేశాలు జరుగుతాయి కనక అప్పటిలోగా అమలు కావడం అసాధ్యమైన పనే.
Saturday, July 14, 2007
వై ఎస్ తో అమీతుమీ ? eenadu

రౌడీలకే కాదు.. మాకూ ఆయనే సీఎం
307 కేసు పెట్టించింది కేవీపీ
నా సస్పెన్షన్‌కు 2002 తరహాలో కుట్ర: పీజేఆర్
కాంగ్రెస్‌లో సంచలనం
దిగ్విజయ్ ఫోను చర్చలు
వీహెచ్ మలివిడత రాయబారం
..అయినా పట్టువీడని జనార్దన్
నేడు అధిష్ఠాన దూతగా సురేష్ రాక
వెనక్కి తగ్గని పీజేఆర్
వీహెచ్ మలివిడత రాయబారంవ్యవహారం ముదిరి పాకానపడింది. పీజేఆర్ అమీతుమీకి సిద్ధమయ్యారు. వైఎస్‌పై మరిన్ని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన రౌడీలకు ముఖ్యమంత్రి అనే అర్థం వచ్చేలా పరోక్ష విమర్శనాస్త్రాలూ సంధించారు. అంతటితో ఆగకుండా తాజాగా కేవీపీ పేరునూ వివాదంలోకి లాగారు. దీక్ష ప్రారంభించి తీరుతానని చెప్పడం ద్వారా.. అధిష్ఠానం (ఢిల్లీ) వద్దకెళ్లడం కంటే, దీక్షకే తన ప్రాధాన్యమని కుండబద్దలు కొట్టారు. తద్వారా తాను దేనినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పకనే చెప్పారు. దీంతో పీజేఆర్ వ్యవహారం పార్టీలో పెనుసంచలనమై కూర్చుంది. అందుకే చిన్న వివాదాన్ని ఆయన అనవసరంగా పెద్దది చేస్తున్నారని అధిష్ఠానం పేర్కొంటున్నా.. గట్టిగా ముందడుగు మాత్రం వేయలేకపోతోంది. దిగ్విజయ్ శనివారం మరోమారు పీజేఆర్‌తో ఫోనులో మాట్లాడారు. ఇటు వీహెచ్ రాయబారమూ కొనసాగింది. ..అయినా ఇప్పటికైతే ఫలితం శూన్యం! గందరగోళం యథాతథం!!
హైదరాబాద్, న్యూఢిల్లీ - న్యూస్‌టుడే

తన కుటుంబంపై ముఖ్యమంత్రి వైఎస్ కక్ష సాధిస్తున్నారని ఆరోపిస్తున్న అసమ్మతి నేత పీజేఆర్ తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారా? పార్టీ అధిష్ఠానం రమ్మని పిలిచినా ఢిల్లీకి పోకుండా ఆమరణ దీక్షకు సన్నద్ధమవడం దానికి సంకేతమేనా? అవుననేదే పీజేఆర్ సన్నిహితుల సమాధానం! ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారన్నది వారు చెబుతున్న మాట. అయితే ఆయన కాంగ్రెస్ నుంచి బయటికిపోయే ప్రసక్తి ఉండదని.. పార్టీలోనే ఉంటూ వైఎస్‌పై రాజీలేని పోరు సాగిస్తారని వారు చెబుతుండటం గమనార్హం. మొత్తంమీద ఈ పరిణామాలు రాష్ట్ర కాంగ్రెస్‌లో వేడి పుట్టిస్తున్నాయి. ఇది ఎక్కడికి దారితీస్తుందోనన్న ఆందోళన పార్టీ వర్గాల్లో నెలకొంది. వైఎస్ సోదరుడితో కారు దగ్గర మొదలైన గొడవ.. ఇప్పటికే పార్టీని చాలామేరకు భ్రష్టు పట్టించిందని.. ఇక దీక్ష కూడా మొదలైతే పరిస్థితి మరింత చెయ్యి దాటిపోతుందన్నది పార్టీ నేతల విశ్లేషణ. పరిస్థితిని గమనిస్తున్న అధిష్ఠానం ఇప్పటికైతే పీజేఆర్‌కు నచ్చజెప్పేందుకే ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్రంలో పార్టీ నాయకత్వానికి ఇబ్బంది కలిగించే చర్యలకు పాల్పడొద్దని.. ఆయనకు ఒకటికి రెండుసార్లు చెబుతోంది. అదేసమయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరుపై కొంత ఆగ్రహంతోనూ ఉంది. సోనియా సన్నిహితవర్గాలు ఢిల్లీలో స్పందిస్తూ.. ''జరిగింది చిన్న వీధి గొడవ. పార్టీ ప్రతిష్ఠను పణంగాపెట్టి పీజేఆర్ దాన్ని రాజకీయం చేయడమేమిటి? అయినా అది నాయకత్వంపై పోరుకు ఎంచుకోదగిన అంశం ఎంతమాత్రం కాదు. దీని ద్వారా ఆయన ఎవరి సానుభూతీ పొందజాలరు'' అని సూటిగా చెప్పాయి. పైగా పీజేఆర్ అంత బలమైన స్థితిలో ఏమీలేడనేది గ్రహించాలని వ్యాఖ్యానించాయి. సోనియా సన్నిహితుల అభిప్రాయాలకు అనుగుణంగానే.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్‌సింగ్ శనివారం మరోమారు పీజేఆర్‌తో ఫోనులో మాట్లాడారు. సంయమనం పాటించాలని సూచించారు.
అధిష్ఠానం వైఖరి ఇలా ఉన్నా పీజేఆర్ తన మానాన తాను ముందుకు సాగడం పార్టీ రాష్ట్ర పెద్దలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వాస్తవానికి అధిష్ఠానం జోక్యంతో దీక్ష విషయంలో పీజేఆర్ వెనక్కితగ్గుతారని వారు భావించారు. కానీ దీక్ష తర్వాతే ఢిల్లీ వెళతానంటూ ఆయన ఏర్పాట్లు చేస్తుండటంతో.. ఇది ఇంతటితోపోయే విషయం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. సోమవారం నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానుండగా.. అదేరోజు ఆయన దీక్ష మొదలుపెడుతున్నారు. జరుగుతున్న పరిణామాలు.. వైఎస్‌పై శనివారం తీవ్ర పదజాలంతో విరుచుకుపడటం చూస్తే.. ముఖ్యమంత్రితో అమీతుమీ తేల్చుకునేందుకే పీజేఆర్ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు పీజేఆర్‌కు అనుకూలంగా దీక్ష వద్దకు పెద్దఎత్తున జనాన్ని తరలించేందుకు అసమ్మతి వర్గం ప్రయత్నాలు చేస్తోంది. ఎమ్మెల్యేలు మర్రి శశిధర్‌రెడ్డి, శంకరరావులు ఆయనకు మద్దతుగా నిలవటం తెలిసిందే.
అసంతృప్తి నుంచి ఆందోళనదాకా..
వైఎస్‌కు, పీజేఆర్‌కు మధ్య రాజకీయవైరం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పీజేఆర్‌తోపాటు గతంలో వైఎస్‌ను వ్యతిరేకించే పలువురు నేతలు మంత్రి పదవులను ఆశించారు. వారిలో కొందరు పాత వైరాన్ని మరచి వైఎస్‌తో రాజీపడ్డారు. దాంతో వారికి మంత్రి పదవులు దక్కాయి. పీజేఆర్ మాత్రం తన పంథా వీడలేదు. దాంతో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. తెదేపా హయాంలో కాంగ్రెస్ వ్యతిరేకించిన ఎమ్మార్ ప్రాపర్టీస్ వంటి కొన్ని వ్యవహారాలను అడ్డుకునేందుకు పీజేఆర్ ప్రయత్నించారు. తన నాయకత్వంలోని ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకే పీజేఆర్ అలా చేస్తున్నారని వైఎస్ భావించారు. దాంతో ఇద్దరి మధ్యా దూరం పెరగడం మొదలైంది. ఆ తర్వాత పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యం పెంపు, కృష్ణా మూడో దశ, తదితర అంశాల్లో ఆయన వైఎస్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో పీజేఆర్‌కు అవకాశమివ్వాలని అధిష్ఠానం సూచించినా.. వైఎస్ ససేమిరా అన్నారు. దీంతో ఇద్దరి మధ్యా మరింత అగాథం ఏర్పడింది. వీటన్నింటి నేపథ్యంలో చోటుచేసుకున్న జూబ్లీహిల్స్ కారు వివాదం.. ఇరువర్గాల మధ్య ఘర్షణ పూరిత వాతావరాన్ని ఏర్పరచింది. వైఎస్‌పై తీవ్రస్థాయి విమర్శలు, ఢిల్లీ రమ్మన్మా వెళ్లకపోవడం వంటి చర్యల మూలంగా.. అధిష్ఠానం వద్ద పీజేఆర్ మరింతగా ఇబ్బందుల్లో పడతారనేది సీఎం వర్గీయుల అంచనా! పీజేఆర్ మాత్రం పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తనతో మాట్లాడుతున్నారంటూ.. పరోక్షంగా తనకూ బలముందని చెప్పే ప్రయత్నం చేస్తుండం విశేషం!
పీజేఆర్‌తో వీహెచ్, ఆమోస్, మర్రి భేటీ
పీజేఆర్‌తో సీనియర్ నేత, ఎంపీ వి.హనుమంతరావు శనివారం రాత్రి మలివిడత చర్చలు జరిపారు. దీక్షను విరమించుకోవాలని, లేదంటే కనీసం రాష్ట్రపతి ఎన్నికలవరకూ వాయిదా వేసుకోవాలని ఆయన సూచించారు. సుమారు గంటకుపైగా సాగిన చర్చల్లో.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆమోస్, పీజేఆర్ సన్నిహితుడు మర్రి శశిధర్‌రెడ్డి పాల్గొన్నారు. తన డిమాండ్లను వెనక్కి తీసుకునేది లేదని వీహెచ్‌కు పీజేఆర్ స్పష్టంచేసినట్లు తెలిసింది. తమ ఫిర్యాదే తప్పంటూ, సీఎం సోదరుడిపై కేసు మూసివేయడంపైనే పీజేఆర్ ఎక్కువసేపు మాట్లాడారు. తనపట్ల ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇలా వ్యవహరిస్తోందని.. ఈ పరిస్థితుల్లో వెనకడుగువేయడం తనకు రాజకీయంగా నష్టం కలిగిస్తుందనే అభిప్రాయం వ్యక్తంచేశారు. చర్చల అనంతరం.. పీజేఆర్ వెలిబుచ్చిన అభిప్రాయాలను వీహెచ్ ఫోన్ ద్వారా అధిష్ఠానానికి(దిగ్విజయ్‌కు) తెలియజేశారు. ఆ తర్వాత వీహెచ్ విలేకరులతో మాట్లాడుతూ... చాలా అవమానం జరిగిందని పీజేఆర్ బాధపడుతున్నారని చెప్పారు. దీక్షను ఆపడానికి తన ప్రయత్నాలు కొనసాగుతాయని.. ఇంకా 48 గంటల సమయం ఉందని పేర్కొన్నారు.
శశిధర్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ... పీజేఆర్ కుటుంబంతో పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. తెలంగాణ ఉద్యమం నాడు, తెదేపా హయాంలో కూడా ఇలా వ్యవహరించలేదన్నారు.
ఇక సురేష్ వంతు
రాష్ట్రంలో రాష్ట్రపతి ఎన్నిక వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు నియమితుడైన సీనియర్ కాంగ్రెస్ నేత సురేష్ ఆదివారం హైదరాబాద్ వస్తున్నారు. శనివారం రాత్రి వీహెచ్ అందించిన సమాచారం నేపథ్యంలో సురేష్‌ను కేరళ నుంచి ఆదివారమే హైదరాబాద్ పంపాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు సమాచారం. వాస్తవానికి ఆయన సోమవారం రావాల్సి ఉంది. ఆయన వీహెచ్‌తో కలిసి వెళ్లి పీజేఆర్‌తో భేటీ అవుతారు. అధిష్ఠానం వైఖరిని ఆయనకు తెలియజెప్పి దీక్ష చేపట్టకుండా చూసేందుకు ప్రయత్నిస్తారు.
పీజేఆర్‌తో ఫోన్‌లో చర్చించిన అనంతరం దిగ్విజయ్‌సింగ్ విలేఖరులతో మాట్లాడారు. సమస్య పరిష్కారంలో పీజేఆర్ రాజకీయ విజ్ఞత ప్రదర్శిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ వివరాలను చెప్పేందుకు మాత్రం ఆయన నిరాకరించారు. జూబ్లీహిల్స్ సంఘటన రాజకీయ అంశమే కాదని, అదో చిన్నపాటి వివాదం మాత్రమేనని దిగ్విజయ్ పునరుద్ఘాటించారు. వైఎస్ సోదరుడికి వైద్య పరీక్షలు జరిపిన తర్వాతే పీజేఆర్ తనయుడిపై 307 కేసు నమోదైందని వివరించారు.
మధ్యవర్తిత్వం నెరపాలని వీహెచ్‌ను కోరలేదు: వేరే పనిలో తీరికలేకుండా ఉన్నందున పీసీసీ అధ్యక్షుడు కేకేను ఈ వ్యవహారంలో రంగంలోకి దించలేదని దిగ్విజయ్ చెప్పారు. మధ్యవర్తిత్వం నెరపాలని ఎంపీ వి.హనుమంతరావుకు పార్టీ ఎటువంటి అధికారం కట్టబెట్టలేదన్నారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా తనంత తానుగా వీహెచ్ చొరవ తీసుకున్నారన్నారు.