Sunday, October 21, 2007

ఢిల్లీని అలరించనున్న బతుకమ్మ Andhra Jyothy

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 20 (ఆన్‌లైన్‌): ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూ ర్తిని ప్రతిబింబిస్తూ, ఆ ప్రాంత ప్రజలు తొలిసారి దేశ రాజధానిలో ఆదివారం పెద్దఎత్తున బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. న్యా యవాది నిరూప్‌ రెడ్డి నేతృత్వాన ఇక్కడ ఏర్పాటైన 'ఢిల్లీ తెలంగాణ సంఘం' తమవైన ఇతర కళారూపాలను కూడా ప్రదర్శించనుంది. 'మా భూమి' ఫేమ్‌ సంధ్యతోబాటు గట్టయ్య, దర్రోజు శ్రీనివాస్‌, ప్రహ్లాద్‌ తదితర కళాకారులు సాంస్క­ృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నకిరేకల్‌, కరీంనగర్‌ల నుంచి ఒగ్గు కళాకారులు, పాశం యాదగిరి నేతృత్వంలో తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి ప్రతినిధులు ఢిల్లీ చేరుకున్నారు. అమెరికాలోని తెలంగాణ వాసులు అక్కడ తమ సంస్క­ృతిని చాటుతున్నప్పుడు ఢిల్లీలో మాత్రం ఎందుకు నిర్వహించకూడదని భావించామని నిరూప్‌ చెప్పారు.

No comments: