Thursday, June 28, 2007

చెవిలో పువ్వులు సరిపోవు... కాలిఫ్లవర్‌ పెట్టుకోండి andhra jyothi

కేసీఆర్‌పై విరుచుకుపడ్డ ఏపీ ఎన్జీవో నేతలు
హైదరాబాద్‌, జూన్‌ 28 (ఆన్‌లైన్‌) : 'మూడుమాసాల్లో తె లంగాణ ప్రత్యేక రాష్ట్రమే వచ్చేస్తోంది. అపుడు జీవో 610 అ మలు అన్నది చాలా చిన్న విషయమని ఆరేళ్లుగా తెలంగాణ ప్రజల చెవిలో పువ్వులు పెట్టిన టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పుడు తన రాజకీయ స్వార్థం కోసం కలి సిమెలిసి పనిచేస్తున్న ఉద్యోగుల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారు. జీవో 610పై చెవిలో పువ్వుపెట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. మీకు పువ్వులు సరిపోవు, ఇదిగో కాలిఫ్లవర్‌ పెట్టుకోండి. ఆంధ్రాఉద్యోగుల పంచెలు, లుంగీలు ఊడగొడతాం అంటున్నారు. ఒక ప్రజాప్రతినిధిగా ఇదేనా మీ సంస్క­ృతి, సంస్కారం?' అని ఆంధ్రప్రదేశ్‌ నాన్‌గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ (ఏపీఎన్జీవో) సంఘం నేతలు తెరాస అధినేతపై విరుచుకుపడ్డారు.
తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు సైతం తమతో ఐక్యంగా ఉన్నారని, వారు కూడా ఉద్యోగులెవరినీ వారి సొంత ప్రాం తాలకు పంపాలని కోరుకోవడంలేదని పేర్కొన్నారు. కోస్తాం ధ్ర విద్యావంతుల వేదిక అధ్యక్షుడు చదలవాడ శ్రీనివాస్‌తో కలిసి ఎన్జీవోసంఘం అధ్యక్షుడు వి.గోపాల్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి సి.సుబ్బరాయన్‌, పీవీవీ సత్యనారాయణ, సతీష్‌కుమార్‌ తదితరులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన లుంగీ గుంజితే ఎక్కడ నకిలీ పాస్‌పోర్టులు బయటపడతాయో అన్న భయంతో ఉద్యోగులపై విరుచుకుపడుతున్నారని విమర్శలు గుప్పించారు. 30 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు ఇ క్కడే సూపర్‌న్యూమరీ పోస్టులు సృష్టించి ఉద్యోగవిరమణ చేసేంత వరకు కొనసాగనివ్వాలని డిమాండ్‌ చేశారు.
రాష్ట్రంలో భర్తీకి నోచుకోకుండా ఖాళీగా ఉన్న రెండున్నర లక్షల ఉద్యోగాలను భర్తీ చేయమని ఉమ్మడి పోరాటం చేద్దామని, అ ప్పుడు తెలంగాణ నిరుద్యోగులకు 50వేలు కాదు లక్ష ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. జీవో 610 ఆంధ్ర, రాయలసీమ ఉద్యోగులకే కాకుండా తెలంగాణ ప్రాంతానికి చెందిన 5, 6వ జోన్లలోనూ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. తమ ధర్నాలకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఐ, టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులెవరూ జీవో 610 రద్దు చేయాలని కోరలేదని తెలిపారు. విలేకరుల సమావేశంలో సంఘం నేతలు ఎస్‌ఎ బషీర్‌, విజయవాణి తదితరులు పాల్గొన్నారు.

మెత్తబడ్డ ఆంధ్రా ఎమ్మెల్యేలు! eenadu

రేపటి 610 సభాసంఘం భేటీకి హాజరు
సీఎం జోక్యం, పెద్దల సూచనలే కారణం
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: 610 సభాసంఘం నుంచి వైదొలిగిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మెత్తబడినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జోక్యంతో శనివారం జరిగే సభాసంఘం సమావేశంలో పాల్గొనాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని అందులో సభ్యుడైన సీనియర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బి.వేదవ్యాస్‌ ధ్రువీకరించారు. పార్టీ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా కొనసాగడమే శ్రేయస్కరమని ముఖ్యమంత్రి వైఎస్‌, పార్టీ పెద్దలు చేసిన సూచనల మేరకు రాజీనామాలు చేసిన సభ్యులు మనసు మార్చుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాజీనామాల ఉపసంహరణపై సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేకున్నా ఎక్కువ మంది మాత్రం సీఎం, స్పీకరు సురేశ్‌రెడ్డిల సూచనలకు కట్టుబడి సభాసంఘంలో కొనసాగనున్నట్లు తెలిసింది. 610 జీవో అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నప్పుడు సభాసంఘం నుంచి వైదొలగితే.. రాద్ధాంతం చేసేందుకు ఇతర పార్టీలకు అనవసరంగా అవకాశం కల్పించినట్లవుతుందని ముఖ్యమంత్రి వారితో అన్నట్లు తెలిసింది. సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తామని, సభాసంఘంలో కొనసాగాలని స్పీకరు కూడా కోరారు. రాజీనామాల ఉపసంహరణపై సభా సంఘంలోని ఏడుగురు కోస్తా, సీమ ఎమ్మెల్యేల్లో ఏకాభిప్రాయం లేనట్లు తెలిసింది. ఒకసారి వైదొలిగాక మళ్లీ కొనసాగడం ఎంతవరకూ సబబనే అభిప్రాయాన్ని ఒక ఎమ్మెల్యే వ్యక్తం చేశారు. విదేశాల్లో ఉండడంతో సీనియర్‌ ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి శనివారం జరిగే సమావేశంలో పాల్గొనే అవకాశంలేదు. -శనివారం సభా సంఘం సమావేశంలో తాను పాల్గొంటానని వేదవ్యాస్‌ తెలిపారు. కొందరు వ్యాఖ్యలతో మసస్తాపం చెంది వైదొలిగామన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుకు లోబడి 610 జీవోను అమలు చేయాలనే అంశానికి తాము కట్టుబడి ఉన్నామని, ఇదే అంశాన్ని సభాసంఘంలో కూడా పలుమార్లు చెప్పామని, మళ్లీ మళ్లీ అదే చెబుతామని తెలిపారు. తాము సభాసంఘంలో ఉండడం వల్లనే జీవో అమలు కావడంలేదని కొందరు అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. సమావేశానికి హాజరై తమ వాదనా వినిపిస్తామన్నారు.

పోలీసుల బదిలీలపై ట్రైబ్యునల్‌ ఉత్తర్వుల పొడిగింపు
610 జీవో అమల్లో భాగంగా హైదరాబాద్‌లోని పోలీసుల్ని స్వస్థలాలకు బదిలీచేస్తూ జారీచేసిన ఉత్తర్వులపై రాష్ట్ర పరిపాలన ట్రైబ్యునల్‌ ఇచ్చిన 'యథాపూర్వ స్థితి' ఉత్తర్వులను మరో 2వారాలపాటు పొడిగించారు. బదిలీలపై ఈనెల 16న వెలువడిన ఆదేశాలను సవాలు చేస్తూ వేణుగోపాల్‌ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై ట్రైబ్యునల్‌ యథాపూర్వ స్థితిని అమలు చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. దీనిపై ప్రభుత్వం కౌంటరు దాఖలు చేయకపోవడంతోపాటు, అడ్వొకేట్‌ జనరల్‌ వాదనలకు వస్తారని, వాయిదా వేయాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోరడంతో విచారణను జులై 3వ తేదీకి వాయిదా వేసింది.

610 అమలైతే అనందమే - eenadu

అంతర్‌జిల్లా బదిలీతో కొందరికి...
జీవో ముప్పు పోతోందని ఇంకొందరికి...
నగరానికి వస్తున్నామని మరికొందరికి...
విద్యాశాఖలో ఎన్ని సంతోషాలో!
మాకూ అది కావాలి: జైళ్ల సిబ్బంది
రాజధానిలో స్థానికేతరులు కొందరు స్వచ్ఛందంగా స్వస్థలాలకు వెళ్తున్నారు. ఇన్నాళ్లూ ఎంత పైరవీ చేసినా కాని అంతర్‌ జిల్లా బదిలీ ఇప్పుడు అనుకోకుండా జరుగుతోందనీ, సీనియారిటీ కూడా నష్టపోవడం లేదనీ వారి ఆనందం! *వెళ్లేవారు వెళ్లిపోతే, ఇక మిగిలే వారిలో చాలామంది 'అనుమతించ దగిన 20 శాతం కోటా'లో ఉండిపోతారు. నిర్బంధ బదిలీ ప్రమాదం ఎదుర్కొంటున్న వారికీ, స్వచ్ఛంద బదిలీ ఎంచుకున్న వారివల్ల ఆ భయం తప్పిపోతోంది. అంటే ఇక 610 భయం లేకుండా, వారు నిక్షేపంగా ఇక్కడే ఉండిపోవచ్చు. ఇదేమో వీరి సంతోషం! *పేరుకు రంగారెడ్డి జిల్లావారే అయినా అనేకమంది ఇన్నాళ్లూ నగరానికి దూరదూరంగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు స్వచ్ఛంద బదిలీతో వారూ రాజధానిలోకి వస్తున్నారు. ఇది తమకు అనుకోని అదృష్టమనేది వారి సంబరం! *రాజకీయంగా, ఇతరత్రా సాగుతున్న రగడ 610కి ఒక కోణం కాగా, పాఠశాల విద్యాశాఖలో ఇలా ఆనందం కలిగించే కోణాలూ కనిపిస్తున్నాయి. అంతేకాదు; 610 అమలు వద్దని కొందరు ఉద్యోగ నాయకులు, ప్రజా ప్రతినిధులు గళమెత్తుతుండగా, మా శాఖలోనూ దీన్ని అమలు చేయరూ అంటూ జైళ్ల సిబ్బంది కోరడం మరో విశేషం.
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
హైదరాబాద్‌ జిల్లా నుంచి 20 మంది, రంగారెడ్డి నుంచి 360 మంది స్థానికేతర ఉపాధ్యాయులు తమంతటతామే స్వస్థలాలకు వెళ్లేందుకు దరఖాస్తులు చేసుకున్నారు. వీరి బదిలీ ఉత్తర్వులు సిద్ధమయ్యాయి. ప్రభుత్వం ఆమోదముద్ర వేయగానే, శుక్రవారం ఈ ఉత్తర్వులు జారీ చేస్తారు. నిజానికి పాఠశాల విద్యాశాఖ చేసిన కసరత్తు ప్రకారం 1000 పైచిలుకు మంది స్థానికేతర ఉపాధ్యాయులు 20 శాతం గరిష్ఠ పరిమితి దాటి ఈ రెండు జిల్లాల్లో పనిచేస్తున్నారు. కానీ సాధారణ పరిపాలన విభాగం ఏ ప్రాతిపదికలను ఎంచుకుందో తెలియదు గానీ... కేవలం 596 మందిని మాత్రమే వెనక్కి వెళ్లాల్సిన స్థానికేతరులుగా గుర్తించింది. రంగారెడ్డిలో 99 మంది స్కూల్‌ అసిస్టెంట్లు, 261 మంది ఎస్‌జీటీలు, హైదరాబాద్‌లో 89 మంది స్కూల్‌ అసిస్టెంట్లు, 86 మంది ఎస్‌జీటీలు ఉన్నారనేది వారి లెక్క. నిజానికి 'అనుమతించతగిన 20 శాతం కోటా' అనేది స్థానికేతరుల రిజర్వ్‌ కోటా కాదనీ, అందులోనూ మెరిట్‌ ప్రకారం లెక్కలు చూసి, అనర్హులైన స్థానికేతరులను గుర్తించి వెనక్కి పంపాలనే డిమాండ్లను ఒకసారి పక్కకు పెట్టినా... ఈ గుర్తించిన స్థానికేతరుల లెక్కల్లోనూ అన్నీ గందరగోళాలే! 'హైదరాబాద్‌ జిల్లాలో స్థానికేతరుల జాబితా ప్రచురించారు. కానీ స్థానికుల జాబితాలు దాచిపెడుతున్నారు. ఈ జాబితాల్లోనే స్థానికేతరుల పేర్లూ ఉన్నాయని మా నమ్మకం. అదెందుకు బయటికి వెల్లడించరు?' అని ఏపీటీఎఫ్‌ హైదరాబాద్‌ శాఖ ప్రశ్నించింది. ఇవన్నీ తరువాత చూద్దామని, ముందైతే తమంతటతాము వెళ్లాలనే వారిని పంపించేద్దామని అధికారులు చెబుతున్నారు. ఇలా వెళ్లేవారినీ గరిష్ఠ పరిమితికి మించి పంపించబోమనీ అంటున్నారు. దీనితో చాలామందికి అనుకోకుండా అదృష్టం కలిసొస్తోంది. అదెలాగంటే...
ఇప్పుడు అంతర్‌ జిల్లా బదిలీలు జరగడం లేదు. అందుకని తమ స్వస్థలాలకు వెళ్లాలనుకున్నా చాలామందికి సాధ్యం కావడం లేదు. ఇప్పుడు ఎంచక్కా స్వచ్ఛంద బదిలీ పేరిట సీనియారిటీ కోల్పోకుండానే బదిలీ అవుతున్నారు. గతంలో సీనియారిటీ కోల్పోయి మరీ స్వస్థలాలకు బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకంటే ఇప్పుడు వెళ్లేవారే సీనియర్లు అవుతారు.
స్వచ్ఛందంగా కొందరు వెళ్లిపోవడం వల్ల, తప్పనిసరిగా వెళ్లాల్సిన వారికి కొంత వెసులుబాటు లభిస్తోంది. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లాలో 360 మంది పరిమితికి మించిన స్థానికేతరులు ఉన్నట్లు సాధారణ పరిపాలన విభాగం లెక్క. ఇప్పుడు అదే సంఖ్యలో స్వచ్ఛందంగా వెళ్లిపోతున్నారు. అందువల్ల ఇక 610 వల్ల నిర్బంధంగా వెళ్లిపోవాల్సిన వారికి బదిలీ భయం ఇక లేనట్లే!
610ని తు.చ. తప్పకుండా అమలు చేస్తే, ఆరో జోన్‌ అయిన హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల నుంచి చాలామంది తెలంగాణా జిల్లాల (ఐదో జోన్‌)వారు వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఇప్పుడు స్థానికేతరులు (తెలంగాణేతరులు) అధిక సంఖ్యలోనే వెళ్లిపోతున్నందున ఇక మిగతావారిని పంపించాలనే ఆందోళన పెద్దగా ఉండకపోవచ్చు. అందుకని ఆ తెలంగాణ జిల్లాల వారూ కొంత సంతోషపడుతున్నారు. అన్నింటికీ మించి రంగారెడ్డి జిల్లా నుంచి 156 మంది హైదరాబాద్‌ నగరానికి వస్తున్నారు. ఇన్నాళ్లూ జిల్లాలో ఏ మూలకో వెళ్లివచ్చేవారు ఇప్పుడిక హాయిగా నగర నడిబొడ్డున కొలువులు చేసుకోవచ్చు. వెరసి అందరికీ ఆనందమే!!
మేమూ ఆ జీవో పరిధిలోకి! 610 అమలు వద్దంటే వద్దని, దాంతో తాము అన్యాయమైపోతామని కొన్ని ఉద్యోగ సంఘాలు వాపోతుండగా, జైళ్ల శాఖ సిబ్బంది మాత్రం తమకు 610ని వర్తింపజేయాలని కోరుతున్నారు. జైళ్లశాఖలో ప్రస్తుతం 8వేల మంది వరకూ సిబ్బంది ఉండగా వారిలోదాదాపు సగం మంది వార్డర్లే. వీరి వేతనం కానిస్టేబుళ్ల కంటే తక్కువ. సాధారణంగా మిగతా శాఖల్లో నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగుల నియామకం ప్రాంతాల వారీగా జరుగుతుంది. కాని జైళ్ల శాఖలో మాత్రం రాష్ట్రం ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. ఇతర శాఖల్లో గెజిటెడ్‌ అధికార్లను మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికైనా బదిలీ చేస్తుండగా, జైళ్ల శాఖలో కిందిస్థాయి సిబ్బందికి కూడా ఇదే పద్ధతి! శాఖ ఏర్పడినప్పటి నుంచి ఇవే నిబంధనలు! దీనివల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిబ్బంది వాపోతున్నారు. తమ శాఖలోనూ 610 అమలు చేస్తే ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతానికి వెళ్లేందుకు అవకాశం చిక్కుతుందని వారు వివరిస్తున్నారు. ''అదీగాక జైల్లో ఏమి జరిగినా కిందిస్థాయి సిబ్బందిపైనే చర్య తీసుకోవడం పరిపాటిగా మారింది. సస్పెన్షన్‌తోపాటు శిక్ష కింద దూర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారు. ఆదిలాబాద్‌లో పనిచేసే ఉద్యోగిని అనంతపురం, కాదంటే శ్రీకాకుళం కూడా పంపిస్తున్నారు. కానిస్టేబుళ్ల కంటే తక్కువ జీతంతో రోజులు వెళ్లబుచ్చుతున్న తమను ఇలా సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. 610 అమలు చేస్తే బదిలీలు కూడా మా ప్రాంతానికే పరిమితమవుతాయి'' అని వారు వివరిస్తున్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఇకనైనా తమను 610 పరిధిలోకి తేవాలని జైళ్ల శాఖ కాపలా బలగం సంఘం అధ్యక్షుడు కె.వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

610పై మాట్లాడితే నే త్యాగధనులవుతారా? andhra jyothi

హైదరాబాద్‌, జూన్‌ 28 (ఆన్‌లైన్‌) : తెలంగాణ, 610 ఉత్తర్వు అమలు పై పత్రికల్లో రోజూ మాట్లాడితేనే తె లంగాణా త్యాగధనులవుతామన్న భ్రమలు మంచివికావని పార్టీ నేతలకు పీసీసీ కిసాన్‌సెల్‌ అధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి సూచించారు. రా ష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయాలని చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్న ము ఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని అభినందించాల్సిన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రతిరోజూ వీధికెక్కడం విచారకరమని గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగాఉన్న సమయంలో రాష్ట్ర ఉద్యోగుల అభ్యర్థన మేరకు, తెలంగాణ ప్రాంత ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు తీసుకువచ్చిన 610 ఉత్తర్వు అమలుకాకపోవడానికి తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ఆ పార్టీ ప్రభుత్వంలో కీలకపదవులు చేపట్టినంత కాలం 610 ఉత్తర్వును గురించి ఒక్కసారి కూడా ప్రస్తావించని కె.చంద్రశేఖరరావు పదవులు దక్కకపోవడంతో సొంత పార్టీ పెట్టుకుని రాజకీయలాభాపేక్షతో ఈ ఉత్తర్వును పదేపదే ప్రస్తావిస్తున్నారని విమర్శించారు. ఇంతకంటే రాజకీయ దిగజారుడుతనమేముంటుందని ఆయన ప్రశ్నించారు.

610 బదిలీలు షురూ Eenadu

సంక్షేమం, మార్కెటింగుల్లో 20 మందికి ఉత్తర్వులు
స్వచ్ఛందంగా కోరుకున్నవారికే
జీఏడీ జాబితాలోంచే ఎంచుకోవాలి
సీఎస్‌ తాజా మార్గదర్శకాలు
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
610అమల్లో భాగంగా, నిబంధనలకు విరుద్ధంగా నియమితులైన స్థానికేతర ఉద్యోగుల బదిలీలు ప్రారంభమయ్యాయి. రెండు శాఖల్లో స్వచ్ఛందంగా వెళ్లిపోయేందుకు దరఖాస్తు చేసుకున్న వారి జాబితాలోంచి 20 మందిని ఎంపిక చేసి, గురువారం సొంత జోన్లకు బదిలీ చేశారు. ఈ మేరకు ఆయా విభాగాల ముఖ్య కార్యదర్శులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సాంఘిక సంక్షేమ శాఖలో 47 మంది దరఖాస్తులు ఇవ్వగా 8 మందిని, మార్కెటింగు శాఖలో 27 మందిలో 12 మందిని బదిలీ చేస్తూ జీవోలు (నంబర్లు 321, 154, 165) ఇచ్చారు. సొంత జోన్లలో ఖాళీగా ఉన్న స్థానాల్లో వీరికి పోస్టింగులు ఇచ్చారు. మార్కెటింగ్‌ శాఖ నుంచి బదిలీ అయిన వారిలో నలుగురు తెలంగాణా జిల్లాల (ఐదో జోన్‌) వారు ఉండడం గమనార్హం. 610 కింద వారం క్రితం పోలీసుశాఖ జంట నగరాల నుంచి కానిస్టేబుళ్ల బదిలీని మొదలుపెట్టింది. అయితే ప్రభుత్వ తాజా మార్గదర్శకాలను ఆచరణలో పెడుతూ, స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారిని పంపడం ఇదే ప్రథమం. రెండు శాఖల్లో 20 మంది ఉద్యోగులను బదిలీ చేసినట్లు సాధారణ పరిపాలన శాఖ ప్రభుత్వానికి నివేదించింది. పోలీసు శాఖలో జరిగిన 159 కానిస్టేబుళ్ల బదిలీలను కూడా అది తన నివేదికలో పేర్కొనడం విశేషం. ఇందులో పది మంది రిలీవ్‌ అయ్యారని, కొంత మంది ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారని పేర్కొన్నారు.
610 అమలు తక్షణం ప్రారంభం కావాలని, సిద్ధంగా ఉన్న జాబితాల ఆధారంగా ఉత్తర్వులు ఇవ్వాలనీ ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో 99 శాఖలు స్థానికేతరుల జాబితాను సమర్పించిన సంగతి తెలిసిందే. గురువారం నుంచే బదిలీలు జరగాలని సీఎం అన్ని శాఖలకు స్పష్టంచేయగా, రెండు మాత్రమే దాన్ని పాటించాయి. మిగతావి శుక్ర, శనివారాల్లో ఉత్తర్వులిస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ స్థానికేతరుల వివరాలు సమర్పించని మూడు శాఖల అధికారులు ఉన్నతాధికారులను సంప్రదించారు. తమ జాబితాను శుక్రవారం ఇస్తామని దేవాదాయ శాఖ తెలిపింది. జిల్లా కోర్టులకు సంబంధించిన ఉద్యోగుల వివరాలను రెండుమూడు రోజుల్లో సమర్పిస్తామని న్యాయ విభాగం తెలిపింది. హైదరాబాద్‌లోని భూ ఆక్రమణ కేసుల పరిష్కార విభాగం తమ శాఖలో జిల్లా యూనిట్లేమీ లేవని సమాచారం పంపింది.
ఆ జాబితానే పాటించాలి: హరినారాయణ
మరోవైపు తాజా బదిలీల కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హరినారాయణ మరో సర్క్యులర్‌ జారీ చేశారు. పాత మార్గదర్శకాలను పునరుద్ఘాటిస్తూనే, కొన్ని వివరణలు, ఆదేశాలు కూడా ఇందులో పేర్కొన్నారు. సాధారణ పరిపాలన శాఖ పంపించిన స్థానికేతరుల జాబితా నుంచే, అందులో పేర్కొన్న సంఖ్యకు లోబడే బదిలీలు చేయాలని ఆయన ఆదేశించారు. పాఠశాల విద్యాశాఖ రూపొందించిన జాబితాలో స్థానికేతరుల సంఖ్య వెయ్యికి పైచిలుకు ఉండగా, జీఏడీ పంపిన జాబితాలో 596 మాత్రమే ఉంది. ఇలా కొన్ని శాఖల్లో బదిలీ కోసం ఏ జాబితాను పరిగణనలోనికి తీసుకోవాలనే దానిపై సందిగ్ధం ఏర్పడింది. మరోవైపు కొన్ని విభాగాల్లో స్వచ్ఛంద బదిలీలకు గిరాకీ పెరిగింది. ఈ నేపథ్యంలో, పరిమితికి మించి బదిలీలు జరిగే అవకాశం ఉందనే అనుమానంతో హరినారాయణ తాజా వివరణ ఇచ్చినట్టు భావిస్తున్నారు. గతంలో జారీ చేసిన సర్య్కులర్‌లో పరిమితి మేరకే బదిలీలు జరగాలనే పదం అభ్యంతకరంగా ఉండడంతో దాన్ని తొలగించేందుకు సాధారణ పరిపాలన శాఖ వద్దనున్న గణాంకాల గురించి పేర్కొన్నట్లు చెబుతున్నారు. కానీ, దీనిపైనా తెలంగాణా ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. సాధారణ పరిపాలన శాఖ పరిమితిని సూచించి శాఖల నుంచి సమాచారం సేకరించిందని, దీనిపై తాము అభ్యంతరాలు వ్యక్తంచేయగా, అదే సమాచారాన్ని తిరిగి పంపి అమలు చేయాలని సూచించడం డొంక తిరుగుడు వ్యవహారమని తెలంగాణా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్‌ విమర్శించారు. తెలంగాణా ఉద్యోగుల బదిలీ కోసమే ఇలాంటి ఉత్తర్వులు జారీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బదిలీ ఉత్తర్వులు సంబంధిత శాఖ కార్యదర్శి మాత్రమే విడుదల చేయాలని కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టంచేశారు. ''అన్ని శాఖల వారూ దీన్ని తప్పక పాటించాలి. శాఖాధిపతులతో పాటు ఇతర కిందిస్థాయి అధికారులకు ఈ అధికారాన్ని బదలాయించ కూడదు'' అని కూడా ఆయన తెలిపారు. కొందరు కార్యదర్శులు జీవో అమలుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, కిందిస్థాయి అధికారులపై బాధ్యతలు మోపుతున్నారనే సమాచారం మేరకే ఆయన ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.

లగడపాటీ.. ప్రేలాపనలాపు! Eenadu

రెచ్చగొట్టే వ్యాఖ్యలొద్దు
తెరాస నేతలు వినోద్‌కుమార్‌, హరీశ్‌ ధ్వజం
610పై చర్చకు రావాలని సవాల్‌
న్యూఢిల్లీ, హైదరాబాద్‌, న్యూస్‌టుడే: కేసీఆర్‌ను తెలంగాణ ఉద్యోగులే అక్కణ్నుంచి తరిమికొడతారన్న కాంగ్రెస్‌ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ వ్యాఖ్యలపై తెరాస ఎంపీ వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే హరీశ్‌లు మండిపడ్డారు. నోటిని అదుపుచేసుకోవాలని సలహా ఇచ్చారు. ఢిల్లీ, హైదరాబాద్‌లలో వేర్వేరు విలేకరుల సమావేశాల్లో వారు మాట్లాడారు. 610 జీవో అమలుపై హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో బహిరంగచర్చకు రావాలని లగడపాటి రాజగోపాల్‌కు వినోద్‌ కుమార్‌ సవాల్‌ విసిరారు. ''610 జీవోకు లోబడి స్వస్థలాలకు వెళ్లడానికి సుముఖంగా ఉన్నట్లు ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు, టీచర్లు తెరాస ఆఫీసుకొచ్చి చెప్పారు. కానీ ఆ ప్రాంత రాజకీయ నాయకులు, ఉద్యోగసంఘాల ప్రతినిధులు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారు. లగడపాటి రాజగోపాల్‌కు 610 అమలుపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో చర్చకు రావాలి. 610వెనుకున్న స్ఫూర్తి ఏమిటో... రాజ్యాంగం తెలంగాణ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హక్కులేమిటో సవివరంగా చర్చిద్దాం. 610 జీవో అమలుచేస్తే తెలంగాణ నాయకులనే తరమికొడతారన్నట్లు లగడపాటి మాట్లాడుతున్నారు. ఈయన తెలంగాణ అంశంపై చరిత్రను వక్రీకరిస్తూ గతంలో ఎంపీలకు లేఖలు రాశారు. ఫజల్‌అలీ కమిషన్‌ తెలంగాణ వద్దని చెప్పినట్లు వాదన లేవనెత్తారు. అంటే తెలంగాణ వాళ్లకు భాషరాదనా ఆయన ఉద్దేశం. లేదంటే వెర్రివాళ్లనుకున్నారా. దానిపైన కూడా చర్చిద్దాం రండి. లేదంటే ఇలాంటి పనికిమాలిన మాటలు ఇంకెప్పుడూ మాట్లాడకుండా రాజకీయ నాయకుడిలా సొంత నియోజకవర్గం కోసం పనిచేసుకుంటే బాగుంటుంది'' అని వినోద్‌కుమార్‌ ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఉన్న 610 అమలును లగడపాటి ఎందుకు అడ్డుకుంటున్నారని తెరాస ఎమ్మెల్యే హరీశ్‌ హైదరాబాద్‌లో ప్రశ్నించారు. హైదరాబాద్‌లో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ ముందు జరిగిన పరాభవాన్ని లగడపాటి మర్చిపోయినట్టుందంటూ ఎద్దేవా చేశారు. 'ఆరోజు తిన్న తన్నులూ దెబ్బలూ గుర్తు లేవా? ఈ పిచ్చి ప్రేలాపనలు మానుకో' అని తీవ్రంగా హెచ్చరించారు. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి అటు ఎన్డీయేకానీ, ఇటు యూపీఏ కానీ అధికారికంగా ఎవ్వరూ తమను సంప్రదించలేదని వినోద్‌కుమార్‌ తెలిపారు.
610 నీటిపారుదల శాఖకే
610 జీవో కేవలం నీటిపారుదల (ఇరిగేషన్‌) శాఖలోని ఉద్యోగులకోసం ఉద్దేశించింది మాత్రమేనని తెరాస ఎంపీ వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. అది చాలా చిన్న అంశమని, అయితే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రపతి ఉత్తర్వులు అమలుచేయాలని తాము కోరుతున్నట్లు చెప్పారు. ఏ జోన్లో ఆ ప్రాంత ఉద్యోగులుండాలని రాష్ట్రపతి ఉత్తర్వులు చెబుతున్నాయని, 610 జీవో స్ఫూర్తిని మిగతా శాఖల్లోనూ అమలుచేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

స్థానికేతరులు 4500 మంది - eenadu

స్థానికేతరులు 4500 మంది ప్రభుత్వానికి 99 శాఖల సమాచారం స్పందించని మూడు విభాగాలు జాబితాలపై తెలంగాణ సంఘాల అసంతృప్తి 75 నుంచి వివరాల సేకరణ కష్టమంటున్న అధికారులు నేటి నుంచి బదిలీలు హైదరాబాద్‌- న్యూస్‌టుడే610 అమల్లో భాగంగా ఇప్పటికి 99 శాఖలు స్థానికేతర ఉద్యోగుల్ని గుర్తించాయి. వారి జాబితాను ప్రభుత్వానికి సమర్పించాయి. గత శనివారం వరకు 63 శాఖలకు చెందిన 3,114 మందితో మాత్రమే జాబితా తయారు కావడం, దీనిపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేయడం తెలిసిందే. దీంతో సాధారణ పరిపాలన అధికారులు మిగతా అన్ని శాఖలను అప్రమత్తం చేశారు. ఫలితంగా సోమవారం నుంచి బుధవారం వరకు, మరో 36 శాఖలు తమ పరిధిలోని సుమారు 1400 మంది ఉద్యోగుల వివరాలను పంపించాయి. వెరసి బుధవారం వరకు గుర్తించిన స్థానికేతరుల సంఖ్య సుమారు నాలుగున్నర వేలకు చేరింది. 610 అమలుకు గుర్తించిన మొత్తం 102 శాఖల్లో, దేవాదాయ, న్యాయ, భూ ఆక్రమణల కోర్టు విభాగాలు మాత్రమే ఇప్పటివరకు స్పందించలేదు. గురువారం వరకు వాటి నుంచి కూడా సమాచారం అందుతుందని భావిస్తున్నారు. మరోవైపు పోలీసు శాఖ నుంచి పూర్తి (కానిస్టేబుళ్లు, తదితరుల) వివరాలు అందలేదు. అక్కడ బదిలీల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కావడంతో, ఒకటి రెండు రోజుల్లో సమగ్ర సమాచారం అందుతుందని చెబుతున్నారు. గుర్తించిన స్థానికేతరుల్లో స్వచ్ఛంద బదిలీ కోరుకునే వారికి, 28 నుంచి ఉత్తర్వులు అందజేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశం మేరకు, గురువారం నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఉద్యోగుల పేర్లతోనే జీవోలివ్వాలని సాధారణ పరిపాలన అధికారులు అన్ని శాఖల వారికి నిర్దేశించారు. శాఖల వారీగా రెండేసి జీవోలు ఇస్తారు. పోస్టులు ఖాళీలున్న చోట్లకు బదిలీ చేస్తూ ఒకటి, పోస్టులు ఖాళీ లేని చోట్లకు డిప్యుటేషన్‌, కాల పరిమితితో బదిలీలతో మరోటి ఉంటాయి.
సర్కారు రూపొందించిన స్థానికేతరుల జాబితాపై తెలంగాణ ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్న నేపథ్యంలో, ముందుజాగ్రత్తగా ప్రభుత్వం ఉద్యోగ నాయకుల్ని బుధవారం అత్యవసరంగా చర్చలకు పిలిచింది. తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్‌, కార్యదర్శి గోపాల్‌రెడ్డి, గెజిడెట్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌, ఉపాధ్యాయ సంఘం నేత ప్రభాకర్‌, ఇంజినీరింగ్‌ ఎక్సైజ్‌ సంఘాల శ్రీధర్‌ దేశ్‌పాండే, శ్రీనివాస్‌రావులతో సాధారణ పరిపాలన శాఖ సేవా విభాగం ముఖ్య కార్యదర్శి కృష్ణయ్య సమావేశమయ్యారు. ప్రభుత్వం తయారు చేసిన జాబితాను పరిగణనలోకి తీసుకోకుండా, స్వచ్ఛందంగా ముందుకొచ్చిన ఉద్యోగులందరినీ సొంతజోన్లకు పంపాలని, డిప్యుటేషన్లన్నింటినీ రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. స్థానికేతర ఉద్యోగుల జాబితా తప్పులతడకగా ఉందని అభ్యంతరం తెలిపారు. వివాదాస్పద 415, 399 జీవోల ఆధారంగానే అది రూపొందిందని, ఇది రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమని విమర్శించారు. ఎక్కువగా తెలంగాణా ఉద్యోగులనే స్థానికేతరులుగా గుర్తించారంటూ ఎక్సైజ్‌, ఇంజినీరింగ్‌ ఉద్యోగుల జాబితాలను ఉదహరించారు. ఈ జాబితాతో 610 అమలు సమస్యాత్మకంగా మారుతుందని, ఇది తెలంగాణా ఉద్యోగుల్లో చిచ్చు పెడుతుందని తెలిపారు. 1975 నుంచి జరిగిన నియామకాల ఆధారంగా స్థానికేతరులను గుర్తించాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి పట్టుదలగా ఉన్నందున, తమకు అందుబాటులో ఉన్న సమాచారం జాబితా ఆధారంగా మొదటి దశ బదిలీలు చేపట్టామని కృష్ణయ్య తెలిపారు. 1975 నుంచి వివరాలు సేకరించడం కష్టసాధ్యమని ఆయా శాఖలు చెబుతున్నట్టు వెల్లడించారు. ఉద్యోగ నేతలు ఈ వాదనను తోసిపుచ్చారు. ఏపీపీఎస్సీ, డీఎస్సీ, ఇతర బోర్డుల నుంచి సమాచారం సేకరిస్తే అన్ని వివరాలు సులభంగా అందుతాయని సూచించారు. (వారి అభ్యంతరాలను ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చిన కృష్ణయ్య, వెంటనే వెళ్లి ప్రధాన కార్యదర్శిని కలిశారు.) పరిమితికి లోబడి స్వచ్ఛంద బదిలీలపై వెళ్లేవారికే సీనియారిటీ వర్తిస్తుందని, ఇంకా ఎవరైనా వెళితే వారికి సీనియారిటీ వర్తింపజేయడం సాధ్యం కాదని ఆయన స్పష్టంచేసినట్లు తెలిసింది. ఉద్యోగ సంఘాల నేతలతో శనివారం మరోదఫా చర్చలు జరిపి సలహాలు సేకరిస్తామని తెలిపారు. కాగా న్యాయ సలహా అవసరం లేకుండానే ఉపాధ్యాయుల బదిలీలకు అనుమతి ఇవ్వాలని ఉద్యోగ నేతలు కోరారు.

ఇవేం బదిలీలు? - vaartha

జిఎడి కార్యదర్శిని ప్రశ్నించిన టిజెఎసి హైదరాబాద్‌, జూన్‌ 27, ప్రభాతవార్త రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా 610 జీవోను అమలు చేస్తామని చెపుతున్న ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వులకు భిన్నంగా పనిచేస్తుందని తెలంగాణ జెఎసి సెక్రెటరీ జనరల్‌ సి.విఠల్‌, కో-ఛైర్మన్‌ ప్రభాకర్‌, కార్యదర్శులు శ్రీధర్‌ దేశ్‌పాండే, గోపాల్‌రెడ్డి,శ్రీనివాసరావు, పద్మాచారి,శ్రీనివాస్‌గౌడ్‌లు విమర్శించారు. బుధవారం జిఎడి కార్యదర్శితో వారు సమావేశమయ్యారు.399,415 జీవోలను రద్దు చేసినా కూడా అందులో ఉన్న విధంగానే బదిలీలు చేస్తున్నారని వారు పేర్కొన్నారు. దీనిపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశారు. 1975 నుంచి స్థానికేతరులను గుర్తించకుండా సీలింగ్‌ విధించడాన్ని వారు ప్రశ్నించారు.బదిలీకోసం రూపొందించిన లిస్టులో కూడా తెలంగాణవారినేచేర్చి, ఆంధ్రవారిని ఇక్కడే ఉంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు విమర్శించారు. సచివాలయంలో ఫేర్‌షేర్‌ ఇవ్వాలని 42 శాతం తెలంగాణ ప్రాంత ఉద్యోగులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అయితే దీనిపై జిఎడి కార్యదర్శి సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వం జీవో అమలుకు చిత్తశుద్దితో ఉందన్నారు. ఇప్పుడు గుర్తించిన వారిని బదిలీచేసిన తరువాత 1975 నుంచి వివరాలు సేకరిస్తుందని చెప్పారు. మేము అంగీకరించం : ఎపిఎన్జీఓలుప్రభుత్వం ప్రస్థుతం జారీచేయాలను కుంటున్న బదిలీ ఉత్తర్వులను అంగీకరించబోమని ఎపి ఎన్జీఓల సంఘం నాయకులు పేర్కొంటున్నారు. స్థానికేతరులను గుర్తించి ముందుగా వారి జాబితాను అందజేస్తామని చెప్పిన ప్రభుత్వం జాబితా ఇవ్వకుండానే బదిలీ ఉత్తర్వులు ఇస్తామని చెప్పడం సరికాదని వారంటున్నారు. అలాగే ఎపిఎన్జీఓల నాయకులపై టిఆర్‌ఎస్‌ పార్టీ చేస్తున్న విమర్శలపై కూడా వారు మండిపడుతున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా 610ని అమలు చేయాలనే తాము కోరుతున్నామని వారు పేర్కొంటున్నారు.