మేమేమైనా నక్సలైట్లా... దొంగలమా? నాపై కక్ష ఉంటే నా కుటుంబ సభ్యులు ఏం చేశారు? ప్రాణాలకు ముప్పుందన్నా పోలీసులకు పట్టలేదు తెలుగుదేశం హయాంలోనూ ఇలా జరగలేదు
అన్యాయంపై ప్రజల్లోకి వెళ్తా: పీజేఆర్
''రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం హాయాంలో కూడా ఇలాంటివి జరగలేదు, నేనేమైనా నక్సలైట్‌నా? మా వాళ్లు నక్సలైట్లా? లేదంటే మేం దొంగలమా? మా వాళ్లపై లాఠీఛార్జీ చేసి వేర్వేరు జైళ్లలో పెట్టారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వమేనా? కార్యకర్తల తలలే పగలగొడుతారా?'' - పి.జనార్దనరెడ్డి
Monday, July 9, 2007
20 గంటలపాటు పోలీస్ స్టేషన్లో పీజేఆర్ andhra jyothy
(ఆన్‌లైన్, సిటీబ్యూరో) ముఖ్యమంత్రి సోదరుడు రవీంద్రనాథ్‌రెడ్డి, ఆయన కుమారుడు సుమధుర్‌రెడ్డిలతో ఆదివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో జరిగిన గొడవ అనంతరం ఖైరతాబాద్ ఎమ్మెల్యే పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి, అల్లుడు గిరిసంతోష్‌రెడ్డి లను పోలీసులు అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి 8.40గంటల సమయంలో పీజేఆర్ తన సతీమణి ఇందిరాదేవి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి అక్కడకు వచ్చారు.
ఇరుపక్షాలు కేసులు పెట్టినందున వై.ఎస్ సోదరుడిని కూడా స్టేషన్‌కు తీసుకురావాలని, అందరికీ ఒకే న్యాయం అమలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తన కు న్యాయం జరిగేంతవరకు కదలబోనని భీష్మిం చిన ఆయన అప్పటినుంచి సోమవారం సాయం త్రం ఐదు గంటల వరకు అక్కడే ఉన్నారు. తమ నాయకుడికి బాసటగా వందలాది మంది కార్యకర్తలు పీజేఆర్ వెంటే ఉన్నారు.
తెల్లవారుజామున ఇంటికెళ్లిన ఇందిరాదేవి...
పిీజేఆర్‌తోపాటు రాత్రి మొత్తం పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్న ఇందిరాదేవి ఆరోగ్యం సరిగా లేకపోవటంతో సోమవారం తెల్లవారుజామున ఇంటికి వెళ్లిపోయారు. ఆ తరువాత పశ్చిమ మండలం డీసీపీతోపాటు పలువురు పోలీసు అధికారులు పిీజేఆర్‌ను కూడా వెళ్లిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మీ ఫిర్యాదుపై కూడా తగు చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పటా నికి ప్రయత్నించారు. అయితే పిీజేఆర్ మాత్రం పోలీస్‌స్టేషన్ నుంచి కదలలేదు. సోమవారం తెల్లవా రుజామున అక్కడే బ్రష్ చేసుకున్నారు. మధుమేహం ఉన్న నేపథ్యంలో ఉదయం నాలుగు పూరీలు తిన్న ఆయన మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే చేశారు. కొన్ని పళ్లు తీసుకున్నారు.
అధిష్ఠానం నుంచి ఆదేశాలు అందాయో లేక ఎవరు నచ్చజెప్పారో గానీ సోమవారం సాయంత్రం 5.15గంటల సమయంలో పోలీస్‌స్టేషన్ నుంచి ఇంటికి బయల్దేరి వెళ్లారు. స్టేషన్ నుంచి బయలుదేరిన సమయంలో అనుచరులు ఆయన వెనుక పది వాహనాలలో వెళ్లారు. అయితే పీజేఆర్ నివాసానికి చేరుకునేసరికి ఈ వాహనాల సంఖ్య దాదాపు రెండువందలకు చేరుకుంది. దారి పొడవునా ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పీజేఆర్ అనుచరులు తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.

నేను నక్సలైట్‌నా? దోపిడీ దొంగనా?: పీజేఆర్ andhra jyothy

హైదరాబాద్, ఆన్‌లైన్ (సిటీబ్యూరో), జూలై 9: 'నేనేమన్నా నక్సలైట్‌నా? లేక దోపిడీ దొంగనా? ఇరవై నాలుగు గంటల పాటు నన్ను పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. మీరు ముఖ్యమంత్రికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. నేను స్థానిక ఎమ్మెల్యేను. అయి నా కనీస మర్యాద లేకుండా వ్యవహరించారు.' అంటూ ఖైర తాబాద్ ఎమ్మెల్యే పి.జనార్దనరెడ్డి పోలీసులపై విరుచుకు పడ్డా రు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు జూబ్లీహిల్స్ పోలీ స్‌స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లిపోతూ ఆయన విలేకరులతో మా ట్లాడారు. తాను ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నానని, ప్ర భుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వేలెత్తి చూపుతున్నందుకే ముఖ్యమంత్రి తనపై కక్ష కట్టారని ఆయన ఆరోపించారు.
'నా కూతురు ఇంట్లో శుభ కార్యం జరుగుతున్న విషయం ముఖ్య మంత్రి తమ్ముడైన రవీంద్రనాథ్ రెడ్డికి తెలుసు. ఆ ఇల్లు నాకూతురుదన్న విషయం కూడా వారికి తెలుసు. అయినా నా కుమా రుడు కారు పక్కకు జరపలేదన్న కారణంతోనే రవీంద్రనాథ్‌రెడ్డి, అతని కుమారుడు సుమధుర్‌రెడ్డిలు పచ్చిబూతులు తిట్టడంతో పాటు కొట్టడానికి వచ్చారంటే నా కుటుంబంపై వైఎస్ కుటుం బానికి ఎంత కక్ష వుందో అర్థమవుతోంది.' అని పీజేఆర్ అన్నారు. పైగా తన కుమారుడే దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.
జరిగిన గొడవను సర్దుబాటు చేశానని, చిన్న విషయం కోసం పార్టీ పరువును బజారుకీడ్చరాదని భావించానని పీజేఆర్ అన్నారు. అయినా కావాలని రవీంద్రనాథ్‌రెడ్డి తన కొడుకుపై ఫిర్యాదు చేశారని అన్నారు. పై నుంచి వచ్చిన ఒత్తిళ్లతో పోలీసులు అత్యు త్సాహం ప్రదర్శించారని ఆరోపించారు. జరిగిన సంఘటన పై రవీంద్రనాథ్‌రెడ్డి, అతని కుమారుడిని పోలీస్ స్టేషన్‌కు రప్పిం చకుండా నన్ను పోలీస్ స్టేషన్‌కు రమ్మని ఒత్తిడి చేశారని అన్నారు. తాను రానని చెప్తే చేతులీడ్చి తరలించండి అంటూ డీసీపీ మధుసూదన్‌రెడ్డి సీఐకి ఆదేశాలుజారీ చేశారని అన్నారు. తన కారును పోలీస్‌స్టేషన్‌కు తరలించి, కావాలనే సెక్షన్ 307 కింద కేసు బుక్ చేస్తారని ముందే ఊహించానని పీజే ఆర్ అన్నారు. ఈ విషయాన్ని పోలీసులకు కూడా ముందే చెప్పానని అన్నారు.
అంతకు ముందు పోలీసులు తన కారును స్టేషన్‌కు తరలించాలని ప్రయత్నించారని, తాను ముందు జాగ్రత్తగానే మీడియా ముందు కారు డిక్కీ తెరిచి ఫోటోలు తీయించానని అన్నారు. తర్వాత పోలీసులు కారు తీసుకుపోవడానికి నిరాకరించారని చెప్పారు. తనపై పథకం ప్రకారమే కుట్ర జరుగుతోందని పీజేఆర్ ఆరోపించారు. తనను చంపుతామని బెదిరింపులు వస్తున్నాయని, తనకు ప్రాణహాని వుందనీ గతంలో అడిషనల్ కమిషనర్ అరవిందరావుకు, తర్వాత వ చ్చిన పోలీస్ కమిషనర్ మహంతికి, ప్రస్తుత కమిషనర్ బల్వీందర్‌సింగ్‌కు కూడా ఫిర్యాదు చేశానని ఆయన వెల్లడించారు. తనకు వస్తున్న బెదిరింపు ఫోన్‌కాల్స్ వివరాలు, నెంబర్లను పోలీసులకు ఇచ్చానని అన్నా రు. అయినా ఇప్పటి వరకూ ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.
ఆదివారం జరిగిన సంఘటనలో తన కుమారుడిని అరెస్టుచేసి 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారని మరి రవీంద్రనాథ్‌రెడ్డి, అతని కుమా రుడిని ఎందుకు అరెస్టు చేయలేదని పీజేఆర్ ప్రశ్నించారు. ఇరు వర్గాల నుంచి ఫిర్యాదు వచ్చినప్పుడు ఒకవైపు వారినే స్టేషన్‌కు తీసుకొచ్చారంటేనే పైనుంచి ఒత్తిళ్లు వస్తున్నట్టు స్పష్టమవుతోం దని అన్నారు. గొడవ జరిగినప్పుడు స్థానిక ఎమ్మెల్యేనైన నా ఇంటికి రాకుండా, ఏమీ కాని రవీంద్రనాథ్ ఇంటికి పోలీస్ కమి షనర్ వెళ్లి పరామర్శించారని, కేవలం ముఖ్యమంత్రి సోదరు డైనందుకే ఇలా జరిగిందని అన్నారు.
ప్రభుత్వంలోని అధికారుల నుంచి కానీ, పోలీసుల నుంచి తనకు న్యాయం జరగదని స్పష్టమైందని అన్నారు. సంఘటన జరిగిన తర్వాత ఏ మంత్రి కానీ తనను కనీసం పరామర్శించలేదని, పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. తన కోసం వచ్చిన వందలాది మంది కార్యకర్తలను కొట్టి పోలీస్ స్టేషన్‌లలో పెట్టారని, ప్రజల కోసం పోరాటం చేస్తున్న తనపై అక్రమకేసులు బనాయిస్తున్నారని, కుటుంబ సభ్యుల పై కేసులు పెడుతున్నా రని ఆరోపించారు. న్యాయం కోసం ప్రజల ముందుకే వెళ్తానని పీజేఆర్ స్పష్టం చేశారు. భవిష్యత్ కార్యాచరణను మంగళవారం ప్రకటిస్తానని అన్నారు.

Sunday, July 8, 2007
పోలీసులు పక్షపాతధోరణితో వ్యవహరిస్తున్నారు: పీజేఆర్ eenadu
హైదరాబాద్, జులై 9: పీజేఆర్ ఇంకా జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్నారు. రవీంద్రరెడ్డి వర్గంపై కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన అక్కడే భీష్మించుకు కూర్చున్నారు. రవీంద్రరెడ్డి, సుమధుర్‌రెడ్డిలపై పోలీసులు 143, 144, 341, 506 సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. వారిపై 307 కేసు కూడా నమోదు చేయాలని పీజేఆర్ స్టేషన్‌లోనే బైఠాయించారు. వివాదంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును పీజేఆర్ తప్పుబట్టారు. వైఎస్ సోదరుడు రవీంద్రరెడ్డి ఇంటికి వెళ్లి కమీషనర్ పరామర్శించడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేనైన తనను పోలీసు స్టేషన్‌లో నిర్భందిచారన్నారు. రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోందని ఆయన విమర్శించారు. తెదేపా హయాంలో కూడా తనను పోలీసు స్టేషన్‌లో నిర్భందించలేదని పీజేఆర్ చెప్పారు. పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. రవీంద్రరెడ్డి వర్గాన్ని అరెస్టు చేసేంతవరకు ఠాణా నుంచి కదిలేది లేదని ఆయన తెలిపారు. పీజేఆర్‌తో డీసీపీలు మధుసూదన్‌రెడ్డి, కమల్‌హాసన్ రెడ్డి మంతనాలు జరుపుతున్నారు. పీజేఆర్‌కు మద్దతుగా భారీ ఎత్తున అనుచరులు జూబ్లీహిల్స్ స్టేషన్ వద్దకు వచ్చారు. పోలీసులు వారిని అరెస్టు చేసి తరలించారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లే అన్ని రోడ్లని పోలీసులు మూసేశారు.
పోలీస్‌స్టేషన్‌లోనే పీజేఆర్ eenadu
హైదరాబాద్, జులై 9: పీజేఆర్, వైఎస్ వర్గాల ఘర్షణ కారణంగా తలెత్తిన ఉద్ధ్రిక్తత కొనసాగుతూనేఉంది. వైఎస్ సోదరుడు రవీంద్రరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి, అల్లుడు సంతోష్‌లపై ఐదు సెక్షన్ల కింద నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. సెక్షన్ 147, 307, 427, 506, 149ల కింద వారిపై కేసులు నమోదు చేశారు. వారిద్దరిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు తరలించారు. వైఎస్ సోదరుడు రవీంద్రరెడ్డి, ఆయన కుమారుడు అపోలో ఆసుపత్రిలో ఉన్నారు. మరోవైపు తనపై ఎటువంటి ఫిర్యాదు లేకున్నా పీజేఆర్ ఇంకా పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్నారు. తామిచ్చిన ఫిర్యాదు ఆధారంగా అవతలి వారిపై ఎందుకు చర్య తీసుకోలేదని ఆయన పోలీసులను ప్రశ్నిస్తున్నారు. రవీంద్రరెడ్డి వర్గంపై కూడా నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని పీజేఆర్ పోలీస్‌స్టేషన్‌లోనే కూర్చున్నారు. పీజేఆర్ అనుచరులు భారీ ఎత్తున స్టేషన్ వద్దకు చేరుతుండటంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
పీజేఆర్ కుమారుడు, అల్లుడుకి 20 వరకు రిమాండ్ eenadu
హైదరాబాద్, జులై 9: పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి, అల్లుడు సంతోష్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఈ నెల 20 వరకూ రిమాండ్‌కు ఆదేశించింది. పోలీసులు వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. అంతకుముందు పోలీసులు వారిని సికింద్రాబాద్ మారేడుపల్లిలోని మూడో అదనపు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అయితే నేరుగా కోర్టుకే తీసుకెళ్లాలని మేజిస్ట్రేట్ సూచించడంతో పోలీసులు వారిని నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు
మూసీ కంపు... సొంపవుతుందా!? andhra jyothy
(ఆన్‌లైన్ , సిటీబ్యూరో) చైనాలోని 'ప్యూ అండ్ నాన్' నది తరహాలోనే మూసీని బాగు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక లు సిద్ధం చేసింది. మూసీ నది తరహాలోనే ఆ నది సైతం కాలుష్యంతో నిండిపోయింది. చైనా ప్రభుత్వం దాన్ని శుద్ధిచేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. కలుషిత నదిని బాగుచేయడంలో చైనా ప్రభుత్వం కనబరిచిన కౌశలాన్ని ప్రపంచ పర్యావరణవేత్తలు ముక్తకంఠంతో ప్రశంసిం చారు. ప్యూ అండ్ నాన్ మాదిరిగానే భాగ్యనగర చరిత్రతో పెనవేసుకున్న 'మూసీ' నదిని మార్చాలని ప్రభుత్వం సంకల్పించింది.
లక్ష్య సాధనలో ఇప్పటికే ఆయా శాఖలు తమ పనులు ప్రారంభించాయి. 'మూసీ ఇక కంపు కాదు... సొంపు' అంటూ అధికారులు ప్రకటనలు గుప్పించేశారు. అయితే మూసీ ప్రక్షాళనకు పరిశ్రమల కాలుష్య జలాలు పెద్ద సవాళ్లను సృష్టిస్తున్నాయి. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏమంటే ఆయా ప్రాంతాలల్లో 'సివరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్' ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి రసాయన వ్యర్ధాలు మూసీలోకి రావని వారి వాదన. అయితే వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి.
మూసీలోకి పారిశ్రామిక వ్యర్ధజలాలు వివిధ నాలాల గుండా ప్రవహించడం అటుంచితే, ఏకంగా కొన్ని పరిశ్రమల నిర్వాహకులు అత్యంతగాఢత ఉన్న యాసిడ్ అవశేషాలను అక్రమంగా మూసీలోకి కుమ్మరిస్తున్న సంఘటనలు తాజాగా కాలుష్య నియంత్రణ మండలి అధికారుల దాడులల్లో వెలుగుచూశాయి. మరో పక్క మహానగర నీటి సరఫరా, సివరేజ్ బోర్డు అత్యంత ప్రతిష్టాత్మకంగా 'సివరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు' నిర్మిస్తోంది. అయితే ఈ ప్లాంట్లు పరిశ్రమల వ్యర్ధజలాలను శుద్ధి చేసేవి కాదు. ఇటువంటి పరిస్థితిలో నిజంగా 'మూసీ సొంపు' అవుతుందా... వెచ్చిస్తున్న కోట్లరూపాయలకు ఫలితం ఉంటుందా... లేదా... అనేది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్న...
ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఇవే...
మూసీలోకి వస్తున్న మురికి నీటిని శుద్ధి చేసేందుకు గాను వాటర్ బోర్డ్ సివరేజ్ ట్రీట్‌మెంట్‌ప్లాంట్స్‌ను 340 కోట్లరుపాయలు ఖర్చు పెట్టి నిర్మిస్తోంది. అంబర్‌పేట్, నాగోల్, నల్లచెరువు, అత్తాపూర్‌లలో వీటిని నిర్మిస్తున్నారు. వీటి సామర్ధ్యం అంబర్‌పేట్‌లో 339 ఎం ఎల్‌డి(మిలియన్ లీటర్స్ ఫర్ డే) నాగోల్‌లో 172, నల్లచెరువులో 30 , అత్తాపూర్‌లో 51 ఎంఎల్‌డి ఉంది. ఇటువంటి పరిస్థితిలో పరిశ్రమల రసాయన వ్యర్ధజలాల శుద్ధికి ఇక్కడ నిర్మిస్తున్న సివరేజ్‌ట్రీట్‌మెంట్ ప్లాంట్స్ శక్తి సరిపోదు. అని శాస్త్రీయంగా మాట్లాడితే పరిశ్రమల వ్యర్ధజలాలతో గృహా వ్యర్ధాలను కలపడం ద్వారా వాటి గాఢత తగ్గిస్తాం అని పేర్కొంటున్నారు. వాస్తవానికి రసాయన వ్యర్ధజలాలో ఉండే భారీలోహాలు ఎటువంటి వ్యర్ధాలతో కలిపినా వాటి స్వరూపం మారవన్న భౌతిక శాస్త్ర నియమాన్నే కాదనే అధికారులను చూసి జాలిపడాలో .. ఇటు వంటి అధికారులు చరిత్ర ఆనవాళ్లు ఉన్న మూసీనదికి మంచి రోజులు తెస్తామంటే సంబరపడాలో అర్ధం కావడం లేదు.

610 బదులు మల్కీ కోసం డిమాండ్ vaartha
610 అమలు చేయలేకపోయిన కారణంగా ముల్కీ నిబంధనలు అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగ సంఘాలు, టిఆర్‌ఎస్ పేర్కొన్నాయి రాష్ట్రపతి ఉత్తర్వులు కాకుండా అంతకు ముందు ఉన్న ముల్కీ నిబందనలను అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
వేర్వేరు భేటీలపై గుర్రు eenadu
ఉద్యోగుల మధ్య చిచ్చుకోసమే తెలంగాణ సంఘాల ఆగ్రహం సమావేశం నుంచి సగంలో బయటకు అడిగితేనే ఇలా నిర్వహించాం మరోసారి అలా చేయం: సీఎస్
రాష్ట్రంలో 610 జీవో అమలు వ్యవహారం మరో వివాదంలో చిక్కుకుంది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్, తెలంగాణ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హరినారాయణ శనివారం వేర్వేరుగా సమావేశాలు నిర్వహించడం ఇందుకు కారణం. దీన్ని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమర్థించగా.. తెలంగాణ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించాయి. సీఎస్ ఎదుటే నిరసన తెలిపాయి. వచ్చే సమావేశాన్ని ఉమ్మడిగా నిర్వహించకుంటే తాము హాజరుకాబోమని స్పష్టంచేసి, అర్ధాంతరంగా వెళ్లిపోయాయి. విడివిడిగా చర్చలు జరిపినా, శనివారం కీలక నిర్ణయాలేమీ తీసుకోకపోవడం విశేషం.
గత వారం ఉద్యోగుల సమన్వయ కమిటీ సమావేశం ముగిశాక స్టాఫ్ కౌన్సిల్ ప్రతినిధులు సీఎస్‌ను విడిగా కలిశారు. తమకు, తెలంగాణ సంఘాలకు వేర్వేరు సమావేశాలు నిర్వహించాలని కోరారు. దీంతో శనివారం ఉదయం స్టాఫ్ కౌన్సిల్ ప్రతినిధులతో సీఎస్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దీనికి ఏపీ ఎన్జీవో, టీఎన్జీవో నేతలతోపాటు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. విడి భేటీ నిర్వహించినందుకు ప్రతినిధులు సీఎస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై ఇలాగే జరపాలని సూచించారు. 610తో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా వెళ్లేందుకు ముందుకొచ్చే వారందరినీ బదిలీ చేయాలని మరోసారి కోరారు. టీఏ, డీఏలను, సీనియారిటీని అడక్కుండానే వెళ్లడానికి వారు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘంతో, సీఎంతో చర్చించాక దీనిపై నిర్ణయం తీసుకుంటానని సీఎస్ హామీ ఇచ్చారు. ప్రభుత్వరంగ సంస్థలపై మార్గదర్శకాలు లేకపోవడంవల్ల అమలు కష్టసాధ్యంగా మారిందని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పగా, త్వరలో వాటిని ఇస్తామని హరినారాయణ అన్నారు. 1975 నుంచి ఉద్యోగుల జాబితా దొరకడం అసాధ్యమని సంఘాలు చెప్పగా, అందుబాటులో ఉన్నవన్నీ సేకరించాల్సిందిగా అన్ని శాఖలను ఆదేశించామన్నారు. స్థానికేతరుల జాబితాపై అధికారులు సరైన సమాచారం ఇవ్వడం లేదని సంఘాలు ఫిర్యాదు చేయగా వారి వివరాలను త్వరలో వెబ్‌సైట్‌లో పెడతామని హామీ ఇచ్చారు.
అనంతరం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ సంఘాలతో సీఎస్ విడిగా సమావేశమయ్యారు. దీనిపై ఆ సంఘాల నేతలు తీవ్ర నిరసన తెలిపారు. ''తెలంగాణ, తెలంగాణేతర సంఘాల మధ్య చిచ్చు పెట్టేందుకే ప్రభుత్వం ఇలా చేస్తోంది. ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను ఉమ్మడిగా చర్చిస్తేనే, ఒకరి అభిప్రాయం మరొకరు తెలుసుకొని, తుదకు ఏకాభిప్రాయం, పరిష్కారం సాధించే వీలుంది. వేర్వేరు సమావేశాలు నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమిటి? జాయింట్ స్టాఫ్ కౌన్సిల్, తెలంగాణ సంఘాలతో ఉమ్మడిగా సమావేశాలు నిర్వహించాలని సాక్షాత్తూ ముఖ్యమంత్రే ఆదేశాలిచ్చారు. దానిని బేఖాతరు చేయడం మాకు అవమానకరం. దీనికి బాధపడుతున్నాం. ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తాం. స్టాఫ్ కౌన్సిల్‌లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించే సంఘాలు లేవు. దాంతో సమావేశం జరపడం వల్ల మా ప్రాంతానికి ఒరిగేదేమీ లేదు. వచ్చే సమావేశాన్ని ఉమ్మడిగా నిర్వహించకుంటే మేం హాజరుకాబోం. లేదంటే మాకూ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ హోదా కల్పించాలి'' అని ప్రతినిధులు వాదులాడారు. సంఘాలను తాము వేర్వేరుగా చూడడంలేదని సీఎస్ వివరణ ఇచ్చారు. ''స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ప్రత్యేకంగా జరపాలని దాని ప్రతినిధులు కోరడం వల్లే అందుకు అనుమతిచ్చాం. సాయంత్రం సమన్వయ కమిటీ భేటీకి హాజరు కావాలని వారికి సూచించినా ఎవరూ రాలేదు. మరోసారి ఇలా జరగనివ్వం'' అని హరినారాయణ వివరించారు. అనంతరం జీవో అమలుకు తీసుకుంటున్న చర్యల గురించి ఆయన వివరించబోగా... తెలంగాణ నేతలు మధ్యలోనే లేచి వెళ్లిపోయారు.
నేడు రౌండ్ టేబుల్ భేటీ
కాగా బదిలీలను నిషేధిస్తూ ఆర్థిక శాఖ జారీ చేసిన ఉత్తర్వుల పరిధిలోంచి 610 జీవో బదిలీలను ప్రభుత్వం మినహాయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయనుంది. అన్ని శాఖల్లో కాంట్రాక్టు నియామకాల్లో సైతం విధిగా 610ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు ముల్కీ నిబంధనల అమలు కోసం ఆదివారం ఉదయం పది గంటలకు నాంపల్లిలోని మదీనా ఎడ్యుకేషన్ సెంటర్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 610 అమలులో ప్రభుత్వం విఫలమైందని, ఆరు సూత్రాలలో అయిదింటిని ఇప్పటికీ అమలు చేయకపోవడం వల్లనే.. ముల్కీ నిబంధనలు అమలు చేసి, తెలంగాణ మొత్తాన్ని ఒక జోన్‌గా పరిగణించాలని కోరుతున్నామని చెప్పారు.

Friday, July 6, 2007
610 బదిలీలపై ఎల్లుండి హైకోర్టులో పిటిషన్ eenadu
ముల్కీ కాలం చెల్లిపోయింది రాష్ట్రపతి ఉత్తర్వులను 2007 నుంచి అమలు చేయాలి హరిరామజోగయ్య వ్యాఖ్యలు
ముల్కీ కాలం చెల్లిపోయిందని, దాన్ని 1975లోనే రద్దు చేసి ఆరు సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారని ఎంపీ హరిరామజోగయ్య వ్యాఖ్యానించారు. అసలు ముల్కీ విధానమే సరైంది కాదని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడారు. ''1975లో తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు అమలు చేయాలనడం సరికాదు. నాడు స్థానికేతరులుగా ఉద్యోగాల్లో చేరిన సిబ్బంది ఇప్పుడు స్థానికులు అయిపోయారు. అందువల్ల వారిని బదిలీ చేయాలనడం న్యాయ సమ్మతం కాదు'' అని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి ఉత్తర్వులను 2007 నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న సిబ్బందిని స్థానికేతరుల పేరుతో ప్రభుత్వం బదిలీ చేస్తోందని, దీనికి వ్యతిరేకంగా తాను, ఎంపీ హర్షకుమార్ సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని ఆయన వెల్లడించారు. ''రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల ఆంధ్ర ప్రాంత ఉద్యోగులకు అన్యాయం జరుగుతోంది. సర్కారు ఉత్తర్వులకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించడం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడం కానేకాదు. ప్రభుత్వాన్ని సరైన దారిలో నడిపించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులుగా మాపై ఉంది. ఆంధ్ర ప్రాంతంలో పార్టీని రక్షించుకునే చర్యల్లో భాగంగానే నేను జీవో అమలును వ్యతిరేకిస్తున్నాను'' అని ఆయన వివరించారు. కేవలం కొందరి ఒత్తిళ్ల వల్లే వైఎస్ 610 జీవోను అమలు చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ''బదిలీ చేస్తున్న ఉద్యోగులను ఆంధ్ర ప్రాంతంలోని ఖాళీల్లోనూ, సూపర్ న్యూమరరీ పోస్టుల్లోనూ నియమిస్తే అక్కడ మా వాళ్లకు ఉద్యోగావకాశాలు తగ్గుతాయి. అందువల్ల బదిలీ అయ్యే వారికి ఇక్కడే సూపర్ న్యూమరరీ పోస్టులు ఏర్పాటు చేయాలి. ఆంధ్ర ప్రాంతంలో ఖాళీగా ఉన్న పోస్టులను నిరుద్యోగులతో భర్తీ చేయాలి'' అని ఆయన డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఇరు ప్రాంతాల నేతలను పిలిచి దీనిపై చర్చించాల్సి ఉందని జోగయ్య అభిప్రాయపడ్డారు.

610పై మరో రగడ eenadu
పాఠశాల విద్యాశాఖలో తాజా వివాదం
43ని సవరిస్తూ కొత్త జీవో
కలెక్టర్లకు పోస్టింగ్ అధికారం
కోర్టుకెక్కనున్న ప్రభుత్వ టీచర్లు
రాష్ట్రపతి దృష్టికి వివాదం
టీఆర్‌టీయూకు అందిన పిలుపు
ఏకీకృత సర్వీసుకు ఎసరు!
పాఠశాల విద్యాశాఖలో స్థానికేతర ఉపాధ్యాయుల బదిలీపై మరో వివాదం చెలరేగింది. 610 అమలు కోసం ఇచ్చిన జీవో 43లో కొన్ని సవరణలు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం జీవో 45ను జారీ చేసింది. ఇందులో డీఈవో, సీఈవోలకు బదులుగా జిల్లా కలెక్టర్లకు పోస్టింగు అధికారాలివ్వడం వివాదాస్పదమైంది. ఇది అటు తిరిగి, ఇటు తిరిగి ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసుకే ఎసరు పెట్టే ప్రమాదం కనిపిస్తోంది. తాజా జీవో హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకమని ప్రభుత్వ టీచర్ల సంఘం ఆరోపించింది. ''గతంలో జారీ చేసిన 529 జీవో ఉపాధ్యాయుల నియామక అధికారి డీఈవో అని చెప్పింది. కానీ తాజా జీవోలో ఈ అధికారాలను కలెక్టర్‌కు అప్పగించారు. ఇది సమస్యగా మారనుంది'' అని నిపుణులు అంటున్నారు. ఇదే వాదనతో పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు అప్పుడే కోర్టుకు వెళ్లే ప్రయత్నాల్లో పడ్డారు. ప్రస్తుతం 610 ప్రకారం స్వచ్ఛంద బదిలీలు మాత్రమే జరుగుతున్నాయి. ఒకవేళ భవిష్యత్తులో నిర్బంధ బదిలీలు చేసినా... కలెక్టర్లకే నియామకాల అధికారాన్ని ఇస్తూ జీవో ఇవ్వాల్సి ఉంటుంది. అలా బదిలీ అయ్యేవారు కోర్టును ఆశ్రయించే అవకాశం, ఫలితంగా 610/రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు సందిగ్ధంలో పడే వీలు కనిపిస్తున్నాయి. ఏకీకృత సర్వీసు కోసం రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వ యత్నాలకు ఇది గండికొట్టే అవకాశం ఉంది.
610 అమలుకై జారీ చేసిన జీవో 43లో పేర్కొన్న అంశాలు ఉపాధ్యాయుల వేర్వేరు సర్వీస్‌ను సూచిస్తున్నాయని, ఇది ఇన్నాళ్ల తమ పోరాటానికి గండి కొడుతుందంటూ ఉపాధ్యాయ సంఘాల సంయుక్త పోరాట సమితి (జాక్టో) ఆందోళనకు దిగింది. ముఖ్యమంత్రినీ కలిసి ఈ జీవోను సవరించాలని కోరింది. కానీ ఇలా చేస్తే మరిన్ని ఇబ్బందులు వస్తాయంటూ సంబంధిత మంత్రి దామోదర రాజనర్సింహతోపాటు న్యాయ విభాగం, ఉన్నతాధికారులు అభ్యంతరపెట్టారు. అయినా జాక్టో ఒత్తిడితో, ముఖ్యమంత్రి ఆదేశాలతో సవరణ జీవో జారీ అయింది. ఈ జీవో పట్ల న్యాయవిభాగం అసంతృప్తితో ఉంది. పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఏకీకృతానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని జాక్టో నేతలు గురువారం ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన తీరు... ఇన్నాళ్లూ కాస్తో కూస్తో సానుకూలంగా దీనికై యత్నించిన అధికార వర్గాల్నీ, మంత్రినీ తీవ్ర నిరుత్సాహంలో పడేసింది.
ఢిల్లీ పయనమూ ప్రశ్నే
ఈనెల 9న ఢిల్లీకి మూకుమ్మడిగా వెళ్లి ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు కోసం ప్రయత్నాలు చేయాలనేది ఇటీవల తీసుకున్న నిర్ణయం. కానీ కేంద్రం వ్యక్తీకరించిన సందేహాలకు ఇప్పటికీ రాష్ట్రం సమాధానాలను పంపించలేదు. ఆ ఫైల్ ఢిల్లీ చేరక ముందే వెళ్లి ఏం చేయాలనే ప్రశ్న తాజాగా తలెత్తింది. అందుకని 9న ఢిల్లీలో ఎంపీలందరూ ఉండటం లేదనే సాకుతో ప్రయాణాన్ని వాయిదా వేయనున్నట్లు తెలిసింది. కేంద్రానికి సమాధానాలు ఏమని పంపాలో అర్థం గాక ఉన్నతాధికారులు తలలు పట్టుకున్నారు. ఇంకోవైపు సుప్రీంకోర్టులో అదనపు పిటిషన్ వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం భావించినా... అది మరిన్ని చిక్కులకు దారితీయవచ్చునని న్యాయవాదులు హెచ్చరించడంతో ఆ ప్రయత్నమూ వాయిదా పడినట్లు సమాచారం. ''ఈ స్థితిలో ఢిల్లీ వెళ్లి ఏం చేస్తాం?'' అని ఓ నేత ప్రశ్నించారు.
రాష్ట్రపతి రమ్మన్నారు!
ఏకీకృత సర్వీస్ కోసం రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు తీసుకొచ్చే ప్రతిపాదన భవిష్యత్తులో తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు ప్రమాదకరం అయ్యే అవకాశాలున్నాయని వాదిస్తున్న టీఆర్‌టీయూ ఈసారి ఏకంగా రాష్ట్రపతినే కలిసి తన వాదనను వినిపించడానికి తయారవుతోంది. ఈ మేరకు రాష్ట్రపతికి అపాయింట్‌మెంట్ కోసం దరఖాస్తు పెట్టుకోగా, ఆయన ఈనెల 16న రావాలంటూ సమ్మతి తెలిపారు. ''రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలోని కనీసం అయిదు అంశాలు రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తిని నిండా ముంచేస్తాయి. అదే రాష్ట్రపతికి వివరిస్తాం'' అని టీఆర్‌టీయూ చెబుతోంది. వెరసి 610 అమలు వ్యవహారంతో ఏకీకృత వివాదం ముదిరి పాకానపడుతోంది!
610 జీఓపై అనవసర రాద్ధాంతం eenadu
హైదరాబాద్, జులై 6 : 610 జీఓపై ఆంధ్ర నాయకులు చేస్తున్న ప్రకటనలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌కు పాల్వాయి గోవర్థనరెడ్డి ఫిర్యాదు చేశారు. పీసీసీ కూడా దీనికి వంతపాడటం తెలంగాణాలి,ా్‌్X
నెలాఖర్లోగా జాబితా eenadu
20% ఓపెన్ కేటగిరిగా పరిగణించాలి
1975 నుంచీ నియామకాల పరిశీలన
సత్వరమే డెప్యుటేషన్ల రద్దు
610పై హరినారాయణ ఆదేశాలు
రికార్డుల్లేవన్న అధికారులు
మరో 70 మంది కానిస్టేబుళ్ల బదిలీ
1975 నుంచీ నియామకాల పరిశీలన
సత్వరమే డెప్యుటేషన్ల రద్దు
610పై హరినారాయణ ఆదేశాలు
రికార్డుల్లేవన్న అధికారులు
మరో 70 మంది కానిస్టేబుళ్ల బదిలీ
రాష్ట్రంలో 610 జీవో అమలు కోసం... 1975 నుంచీ జరిగిన నియామకాలను పరిశీలించి, అందులో స్థానికేతరుల జాబితాను నెలాఖరుకు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జె.హరినారాయణ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. డెప్యుటేషన్లను వెంటనే రద్దు చేసి, ఆయా అభ్యర్థులను వారి సొంత ప్రాంతాలకు పంపించాలన్నారు. 610 జీవో అమలుపై గురువారం ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అన్ని శాఖల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ''610ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యాంశంగాపరిగణిస్తోంది. దీని అమలుకు అందరూ ప్రత్యేక శ్రద్ధ చూపాలి. 1975 నుంచీ జరిగిన నియామకాల్లో జిల్లా స్థాయి పోస్టుల్లో 20 శాతాన్ని ఓపెన్ కోటా కింద పరిగణించి అవి మెరిట్ అభ్యర్థులతో భర్తీ అయ్యాయా, లేదా అనేది పరిశీలించాలి. మిగతా 80 శాతం స్థానిక అభ్యర్థులతో భర్తీ అయ్యాయా, లేదా చూడాలి. ఓపెన్ కేటగిరీ స్థానికేతరుల కేటగిరీ అనే భావన ఉంటే దానిని మీ మనసులోంచి తొలగించండి'' అంటూ ఉద్బోధించారు. జోనల్, కొన్ని గెజిటెడ్ పోస్టుల భర్తీ 30:70, 40:60 ప్రాతిపదికగా జరిగిందీ, లేనిదీ పరిశీలించాలన్నారు. ''1975 నుంచి విద్య, వైద్య, పోలీసు శాఖల్లో దాదాపు ప్రతి ఏటా నియామకాలు జరిగాయి. ఇతర శాఖల్లో 8 నుంచి 9 దఫాల నియామకాలు జరిపారు. కొన్ని నియామకాల్లో ఓపెన్ కేటగిరీని స్థానికేతరుల కోటాగా పరిగణించి నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలను భర్తీ చేశారు. అలాంటివారిని గుర్తించి సొంత జిల్లాలకు పంపాల్సిఉంది'' అని చెప్పారు.
గెజిటెడ్ కేటగిరీలో
స్థానికులకు కేటాయించిన పోస్టుల్లో ఇతర ప్రాంతాల వారిని డెప్యుటేషన్‌పై నియమించడం అక్రమమంటూ, వారిని వెంటనే వెనక్కి పంపాలని హరినారాయణ ఆదేశించారు. కొన్ని గెజిటెడ్ పోస్టుల విషయంలో సంబంధిత అధికారులు పనిచేసే పోస్టు స్థానిక కేటగిరీలోనిది అయితేనే ఈ ఆదేశాలను అమలు చేయాలని సూచించారు. ఆ పోస్టు ఓపెన్ లేదా రాష్ట్రస్థాయి కేటగిరి పరిధిలోనిది అయితే మినహాయించాలని ఆయన అన్నట్లు తెలిసింది. జీవో అమలుకు సంబంధించి మరికొన్ని మార్గదర్శకాలను మరో మూడు రోజుల్లో జారీ చేస్తామని ఆయన చెప్పారు.
రికార్డులుంటేగా?
1975 నుంచి ఉద్యోగ నియామాలకు సంబంధించి రికార్డులు అందుబాటులో లేవంటూ ఈ సందర్భంగా పలు శాఖల అధికారులు హరినారాయణకు వివరించారు. పోలీసు నియామక బోర్డు ఛైర్మన్ గౌతంకుమార్ మాట్లాడుతూ... గడిచిన నాలుగైదు దఫాలవి మినహాయిస్తే ఇతర నియామకాలకు సంబంధించిన రికార్డులు తమ వద్ద లేవని వివరించినట్లు తెలిసింది. జిల్లా స్థాయిలో జరిగిన నియామకాలకు సంబంధించి రికార్డులు సేకరించడం కష్టమని ఆయన పేర్కొన్నారు. మరికొన్ని శాఖల అధికారులు కూడా ఇదే విధమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనిపై సీఎస్ స్పందిస్తూ... అందుబాటులో ఉన్న వివరాలను పరిగణనలోనికి తీసుకొని జాబితాలు రూపొందించాలని సూచించారు.
మరిన్ని బదిలీలు
610 జీవో అమలులో భాగంగా స్వస్థలాలకు వెళ్లేందుకు సుముఖంగా ఉన్న మరో 70 మంది కానిస్టేబుళ్లను బదిలీ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ బల్వీందర్ సింగ్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కమిషనరేట్ నుంచి రెండు దఫాలుగా 248 మంది కానిస్టేబుళ్లు బదిలీ అయ్యారు.
డెప్యుటేషన్లలో ఆర్మీ, నేవీలకు మినహాయింపు
కారుణ్య పోస్టులకూ 610 వర్తింపు
కారుణ్య, మెడికల్ ఇన్‌వాలిడేషన్ (ఆరోగ్యపరమైన అనర్హత) కేటగిరీ నియామకాలకు సంబంధించి కూడా 610 జీవోను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే డెప్యుటేషన్ల రద్దులో ఆర్మీ, నేవీ ఉద్యోగులకు మాత్రం మినహాయింపు ఇవ్వాలని తీర్మానించింది. గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హరినారాయణ ఈ మేరకు సంకేతాలను అందించారు. ''దేశానికి సేవలందిస్తున్న ఆర్మీ, నేవీ ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరిస్తాం. హైదరాబాద్‌లో పనిచేస్తున్న వారి జీవిత భాగస్వాముల విషయమై ప్రత్యేక జాబితాను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలి. దానికి అనుగుణంగా తగిన ఉత్తర్వులు జారీ చేస్తాం'' అని చెప్పారు. కారుణ్య, మెడికల్ ఇన్‌వాలిడేషన్ విభాగాల్లో జరిగిన నియామకాల గురించి ప్రస్తావిస్తూ... వాటినీ స్థానిక, స్థానికేతర కేటగిరీగా విభజించి ప్రత్యేక జాబితా రూపొందించాలని ఆయన ఆదేశించారు. వాటిపైనా త్వరలోనే ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు.
Wednesday, July 4, 2007
నా వ్యాఖ్యాల్ని వక్రీకరిస్తున్నారు: లగడపాటి andhra jyothi
విజయవాడ, జూలై 4 (ఆన్‌లైన్): రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయ లబ్ధ్దికోసం ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య విద్వేషా లను పెంచడానికి ప్రయత్నిస్తుండడం సబబుకాదని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. 610 జీవో అమలు విషయంలో ఇటీవల రాజ గోపాల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తెలంగాణ నాయకులు రాజగోపాల్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపధ్యంలో బుధవారం ఆయన ఒక ప్రకటన చేస్తూ, తనపై వ్యాఖ్యలు చేస్తున్న నాయకులను తీవ్రంగా విమర్శించారు.
వివిధ జిల్లాలోని ప్రజలను రెచ్చగొడుతూ, ఈ సమస్యను ఇండియా-పాకిస్థాన్ మధ్య ఉన్న సమస్య లా చీత్రీకరించడం తగదన్న ఉద్దేశంతోనే తాను కొన్ని వ్యా ఖ్యలు చేసినట్లు తెలిపారు. అయితే కొందరు ఉద్దేశపూర్వ కంగా వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. మనదేశ సంస్కృతి, తెలుగు సంస్కృతికి విరుద్ధంగా విధి విధానాలకు దూరంగా ప్రజలను తీసుకువెళ్లి, వారిని రెచ్చ గొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడం ఎంతవరకు సబబో చెప్పాలన్నారు. ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తులు ఇంకొక ప్రాంతానికి చెందిన వ్యక్తులను దూషించడం తగదని చెప్పారు.
ఆంధ్రా-తెలంగాణ ప్రాంతాలను పాకిస్థాన్- భారత్ సమస్యతో పోల్చడాన్ని దయచేసి వక్రీకరించవద్దని రాజగోపాల్ విజ్ఞప్తి చేశారు. శాంతికి, సహజీవనానికి భం గం కలిగించకూడదన్నదే తన తపన అన్నారు. కొంతమం ది రాజకీయ నాయకులు ప్రజల మధ్య లేనిపోని అపోహ లు సృష్టించి అవగాహన లేమితో మాట్లాడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. కొన్ని జిల్లాలలో స్థానికేతరులలో కూడా ముఖ్యంగా టీచర్లు 20 శాతం మంది సొంత ప్రాం తాలకు వెళ్ళేందుకు దరఖాస్తు చేసుకున్నారని, వీరంతా వెళ్ళిపోతే ప్రభుత్వం కొత్తగా సిబ్బందిని నియమించుకో వాల్సి వస్తుందన్నారు.
సిబ్బందిని కొత్తగా నియమించడానికి కనీసం ఒక ఏడాది పడితే ఈ లోపల విద్యార్థుల భవి ష్యత్ ఏమిటన్న ఉద్దేశంతోనే తాను మాట్లాడినట్లు స్పష్టం చేశారు. తెలంగాణలో చదువు చెప్పేవారు దొరకరని అన డం వాస్తవం కాదన్నారు. కొంతమంది నేతలు తాను అహంకారంతో మాట్లాడానని వక్రీకరించడం విచారకర మని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ ఏ ప్రాంతానికి, ఏ వర్గానికి వ్యతిరేకం కాదన్నారు. కుల, మత, ప్రాంతీయ విభేదాలకు వ్యతిరేకినని స్పష్టం చేశారు. తెలుగు సంస్కృ తి, దేశ సంస్కృతిని కాపాడడంతో బాటు సంస్కారం, సభ్యతలను పాటిస్తూ ర్రాష్టాన్ని, దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలన్నదే తన అభిమతమని చెప్పారు.

జీవో 43ను రద్దు చేయాలి andhrajyothy
హైదరాబాద్, జూలై 4 (ఆన్‌లైన్): స్థానికేతర టీచర్లను సొంత జిల్లాలకు పంపించే ప్రక్రియలో భాగంగా పాఠశాల విద్యా శాఖ జారీ చేసిన జీవో 43ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పీఆర్‌టీయూ నేతలు బుధవారంనాడిక్కడ పాఠశాల విద్యా డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయ సిబ్బంది లోపలికి వెళ్ళకుండా అడ్డుకొని,పాఠశాల విద్యా డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యాన్ని ఘెరావ్ చేశారు. దీంతో పోలీసులు ఎంఎల్‌సీలు మోహన్‌రెడ్డి, సుధాకరరెడ్డి, శ్రీనివాసులు నాయుడు, పీఆర్‌టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకట రెడ్డి, రవికిరణ్‌లతో సహా పలువురిని అరెస్టు చేసి తర్వాత సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు.
అంతకు ముందు మోహన్‌రెడ్డి, వెంకటరెడ్డిలు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయానికి వెళ్ళి ధర్నా నిర్వహించారు. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల విడుదలకోసం పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి సీబీ ఎస్ వెంకటరమణ, డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం అక్కడకు వస్తారని ఉపాధ్యాయ నేతలు భావించారు. అయితే, ఉన్నతాధికారులిద్దరూ పాఠ్య పుస్తకాల సరఫరాపై డీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే పేరిట పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల విడుదల కార్యక్రమానికి హాజరు కాలేదు.
దీంతో నేతలంతా పాఠశాల విద్యా డైరెక్టరేట్ చేరుకొని, అక్కడ డైరెక్టర్‌ను ఘెరావ్ చేయడంతో అరెస్టులు జరిగాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలనుంచి సొంత జిల్లాలకు బదిలీ అయినవారిలో పంచాయతీరాజ్ టీచర్లకు జిల్లా పరిషత్ సీఈఓలు, ప్రభుత్వ టీచర్లకు డీఈఓలు పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వాలని జీవో 43లో నిర్దేశించడం వివాదాస్పదమైంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) ఈ నెల 17వ తేదీన చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

స్వచ్ఛందానికి స్పందన కరవు eenadu
20 శాఖల్లో 802 మంది బదిలీ
55 శాఖల్లో ఒక్క ఉత్తర్వూ జారీ కాలేదు
రాష్ట్రంలో 610 జీవో అమల్లో భాగంగా స్వచ్ఛంద బదిలీలకు గడువు పెంచినా ఆశించిన స్పందన లేదు. 7వేల మందికి పైగా స్థానికేతరులను గుర్తించినప్పటికీ ఇప్పటిదాకా 802 మందికే ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరోవైపు 1975 నుంచీ ఉన్న స్థానికేతర ఉద్యోగుల జాబితా గుర్తింపు ప్రక్రియపై సవాలక్ష సందేహాలు తలెత్తటంతో ఏ ఒక్క శాఖలోనూ దీన్ని ప్రారంభించలేదు. పదిహేను రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినా నత్తనడకన సాగుగుతోంది. చాలా శాఖలు పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం... గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించింది.
స్వచ్ఛంద బదిలీలకు దరఖాస్తుల స్వీకరణ గతనెల రెండో వారం నుంచి మొదలయింది. 27 నుంచి ఉత్తర్వులివ్వడం మొదలుపెట్టారు. బుధవారం వరకూ 20 శాఖల నుంచే బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పోలీసు, విద్యా శాఖలు జారీ చేసిన ఉత్తర్వులపై వివాదాలు నెలకొని బదిలీలు నిలిచిపోయాయి. సాంఘిక సంక్షేమ, వ్యవసాయ, పశు సంవర్థక, నీటిపారుదల, రెవెన్యూ, రవాణా- రోడ్లు- భవనాలు, యువజన సంక్షేమం, పరిశ్రమలు, కార్మిక, ఉన్నత విద్య, ఆర్థిక, ఇంధన, పురపాలక, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పౌర సరఫరాలు, జీఏడీ, ప్రణాళిక శాఖల నుంచి 573 మందికే ఉత్తర్వులిచ్చారు. స్వచ్ఛంద బదిలీలకు ఈ నెల 16 వరకే గడువును నిర్దేశిస్తూ మూడురోజుల క్రితం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాత కేవలం నాలుగు శాఖల నుంచే ఉత్తర్వులు ఇచ్చారు. మొత్తం 75 శాఖలకు గాను ఇంకా 55 శాఖల నుంచి ఒక్క ఉత్తర్వు జారీ గాకపోవడం సాధారణ పరిపాలన వర్గాల్లో విస్మయం కలిగించింది. సీఎం నిర్దేశించిన గడువుకు మరో పది రోజులే ఉండగా ఈ లోపే అన్ని శాఖల నుంచి ఉత్తర్వులు జారీ చేయించాలనే ఉద్దేశంతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణకు పూనుకున్నారు. మరోవైపు 1975 నుంచి స్థానికేతరుల గుర్తింపు ప్రక్రియకు ఉత్తర్వులు ఇచ్చినా ఇది ఎక్కడా జరగలేదు. కొన్ని శాఖలు తమ వద్ద జాబితాలు లేవని చెప్పగా, మరికొందరు మార్గదర్శకాలపై సందేహాలు వ్యక్తంచేశారు.
ముల్కీ నిబంధనల్ని పునరుద్ధరించాలి : ఆరు సూత్రాల పథకంలో మొదటి ఐదు నిర్వీర్యమయినందున చివరి సూత్రంలో చెప్పినట్లు ముల్కీ నిబంధనల్ని పునరుద్ధరించి, తెలంగాణ ప్రాంతం మొత్తాన్ని ఒకే జోన్‌గా పరిగణించాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది.
Tuesday, July 3, 2007
లగడపాటి ఆ సభలో పాల్గొనాల్సింది కాదు eenadu
కోమటిరెడ్డి
హైదరాబాద్, న్యూస్‌టుడే: ప్రభుత్వం 610 జీవో అమలుకు అన్ని చర్యలు తీసుకుంటోందని, ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కొందరు వ్యవహరిస్తున్న తీరు బాగోలేదని నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆంధ్రా ప్రాంత ఉద్యోగులు నిర్వహించిన సభలో పాల్గొనకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. రాజగోపాల్ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఆయన మంగళవారమిక్కడ 'న్యూస్‌టుడే'కు తెలిపారు. తెలంగాణను పాకిస్థాన్ సమస్యతో పోల్చడం ఎంత మాత్రం తగదని, ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌లోని వారే ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడడం తగదని, ఈ జీవో అమలుకు అందరూ కట్టుబడి ఉండాలని సూచించారు.
పీసీసీ చర్చించాలి: ఎమ్మెల్యే వేదవ్యాస్
610 జీవో అమలు నేపథ్యంలో కాంగ్రెస్ నేతలే ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడటంపై పీసీసీ చర్చించాలని ఆ పార్టీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. పార్టీ నేతలు ఆవేశపడటం, తొందరపడి మాట్లాడటం మంచిది కాదన్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడవద్దని ఆయన కోరారు. 610 జీవో అమలుతో బదిలీ కావాల్సిన వారు ఏడెనిమిది వేల మందికి మించి ఉండరని చెప్పారు.
సిటీ పోలీసు బదిలీలు 610కి విరుద్ధం: దారా eenadiuu
ఒంగోలు, న్యూస్‌టుడే:
హైదరాబాద్ సిటీ పోలీసులుగా పని చేస్తోన్న 1428 మంది కానిస్టేబుళ్లను స్థానికేతరులుగా పేర్కొంటూ బదిలీ చేయటం 610 జి.ఒ.కి విరుద్ధమని ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే, 610 జి.ఒ. సభా సంఘం సభ్యుడు దారా సాంబయ్య పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన 'న్యూస్‌టుడే'తో మాట్లాడారు. 610 జి.ఒ. పేరిట హైదరాబాద్ సిటీ పోలీసులను బదిలీ చేయటం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు. వీరిని బదిలీ చేయాలంటే రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాల్సి ఉంటుందన్నారు. హైదరాబాద్ సిటీ పోలీసులు స్పెషల్ జోన్ పరిధిలో ఉంటారని చెప్పారు. ఈ అంశాలన్నీ తెలిసినప్పటికీ కొందరు ఉన్నతాధికారులు ప్రభుత్వాధినేతలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం బదిలీ అయిన కానిస్టేబుళ్లలో ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే బదిలీలు నిలిచిపోతాయన్నారు. అప్పుడు ప్రభుత్వం అప్రదిష్ట పాలవుతుందన్నారు. తెలంగాణా నేతలు 610పై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.

610పై రేపు కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ eenadu
మరో 17 మందికి బదిలీ ఉత్తర్వులు
610 జీవో అమలును వేగవంతం చేసేలా గురువారం జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) హరినారాయణ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మరోవైపు స్వచ్ఛంద బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న 17 మంది స్థానికేతరులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో మంగళవారం వరకు మొత్తం బదిలీల సంఖ్య 20 శాఖల్లో 777కి చేరింది. స్వచ్ఛంద బదిలీల కొనసాగింపు, 1975 నుంచి స్థానికేతరుల గుర్తింపు, డిప్యుటేషన్ల రద్దుకు సోమవారం హరినారాయణ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీటిపై చాలా శాఖల నుంచి సందేహాలు వ్యక్తమయ్యాయి. సాధారణ పరిపాలన శాఖాధికారులు వీటన్నింటిని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కలెక్టర్లతో, అన్ని శాఖల అధిపతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ఈ సందేహాలను నివృత్తి చేయాలని సీఎస్ నిర్ణయించారు.

పోలీసుల బదిలీలపై మరో 2 వారాలు యథాతథ స్థితి eenadu
పరిపాలన ట్రైబ్యునల్ ఆదేశం
610 జీవో అమలులో భాగంగా పోలీసుల బదిలీకి జారీచేసిన ఉత్తర్వుల అమలుకు పరిపాలన ట్రైబ్యునల్ బ్రేకులు వేసింది. వారి బదిలీలపై యథాతథ స్థితిని మరో రెండు వారాలపాటు కొనసాగించాలని ఆదేశించింది. పోలీసు శాఖ ఉత్తర్వులను సవాలు చేస్తూ గత వారం సుమారు 60 మంది దాకా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా, యథాతథ స్థితిని అమలు చేయాలని ఆదేశించిన విషయం విదితమే. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి కౌంటరూ దాఖలు చేయలేదు. మంగళవారం ఆ శాఖ ఉత్తర్వులపై మరో 800 మంది దాకా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. వీటిపై కూడా యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

Subscribe to:
Posts (Atom)